Search
  • Follow NativePlanet
Share
» »పాండవులకు చిక్కకుండా పరమేశ్వరుడు దాక్కొన్న ప్రదేశం తెలుసా

పాండవులకు చిక్కకుండా పరమేశ్వరుడు దాక్కొన్న ప్రదేశం తెలుసా

ఉత్తరాఖండ్ లోని గుప్తకాశీకి సంబంధించిన కథనం.

కాశీ తర్వాత పరమేశ్వరుడు కొలువై ఉన్న ప్రాంతం గుప్తకాశీ. ఇది హిందువుల పరమ పుణ్యక్షేత్రంగా మారింది. ఛార్ ధామ్ యాత్రలో భాగంగా ఈ పుణ్యక్షేత్రాన్ని హిందువులు సందర్శిస్తూ ఉంటారు. పాండువులకు దర్శనమివ్వడానికి ఇష్టంలేని పరమేశ్వరుడు ఇక్కడ రహస్యంగా ఉండిపోయాడని చెబుతారు.

అందువల్లే దీనికి గుప్తకాశీ అని పేరు వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఈ కథనంలో తెలుసుకొందాం. అదే విధంగా ఇక హిమాలయాల రాష్ట్రంగా పేరుగాంచిన ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ జిల్లాల్లో సముద్ర మట్టానికి దాదాపు 4,327 అడుగుల ఎత్తులో ఈ గుప్తకాశీ ఉంటుంది. రిషికేష్ నుంచి 178 కిలోమీటర్ల రోడ్డు పై ప్రయాణం ద్వారా గుప్తకాశీని చేరుకోవచ్చు.

మహాభారత యుద్ధం తర్వాత

మహాభారత యుద్ధం తర్వాత

P.C: You Tube

మహాభారత యుద్దం తర్వాత తమకు అంటిన బ్రహ్మహత్యాపాతం, గోత్ర హత్యా పాతకాన్ని నివారించడం కోసం శివుడిని సేవించడం తప్ప మరో మార్గం లేదని పాండవులు శ్రీ క`ష్ణుడి ద్వారా తెలుసుకొంటారు. దీంతో పరమేశ్వరుడు కాశీ లో కొలువై ఉన్న పరమేశ్వరుడిని సందర్శించి ఆయన్ను పూజించడానికి బయలు దేరుతాడు.

ఇష్టంలేని పరమేశ్వరుడు

ఇష్టంలేని పరమేశ్వరుడు

P.C: You Tube

అయితే లక్షల మంది ప్రజల ప్రాణాలను హరించిన పాండువులకు దర్శనభాగ్యం కల్పించడానికి ఇష్టంలేని పరమేశ్వరుడు ఉత్తరాఖండ్ లోని గుప్తకాశీలోకి వెలుతాడు. విషయం తెలుసుకున్న పాండువులు హడావుడిగా గుప్తకాశీకి చేరుకొంటాడు. అయితే అక్కడ కూడా వారికి దర్శనమివ్వడానికి ఇష్టపడని పరమేశ్వరుడు నంది రూపంలో పాతాళంలోకి వెళ్లడానికి సిద్ధమవుతాడు.

భీముడు

భీముడు

P.C: You Tube

దీంతో భీముడు ఆ నంది కాళ్లకు గట్టిగా పట్టుకొని పైకి లాగుతాడు. దీంతో ఆ నంది ఐదు ఖండాలుగా ఖండించబడి గుప్త కాశీ చుట్టు పక్కల ఐదు భాగాల్లో పడిందని చెబుతారు. ఆ ఐదు ప్రాంతాలే పంచ కేదారాలుగా మారాయని కథనం. ముందు కాళ్లు పడ్డ ప్రదేశం తుంగనాథ్ పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకొంది.

పంచ కేదారాలు

పంచ కేదారాలు

P.C: You Tube

అదే విధంగా మూపురం పడడ్డ ప్రదేశం కేదర్ నాథ్ గా, పొట్ట పడిన ప్రదేశం మథ్య మహేశ్వర్ గా, వెనుక కాళ్లు పడ్డ ప్రదేశ్ రుద్రనాథ్ గా తల పడ్డ ప్రదేశం కల్పేశ్వర్ గా మార్పు చెందాయి. వీటినే పంచ కేదారాలుగా పిలుస్తారు. భీముడి చర్యకు కోపగించుకున్న పరమేశ్వరుడు పాండువులకు దర్శనమివ్వకుండా కైలాసానికి వెలుతాడు.

పార్వతి గురించి

పార్వతి గురించి

P.C: You Tube

అటు పై పాండువలు క`ష్ణుడి సూచనమేరకు పార్వతి గురించి తపస్సు చేసి ఆమె ద్వారా పరమేశ్వరుడి అనుగ్రహం పొందుతారు. చివరికి వారికి పరమేశ్వరుడు అర్థనారీశ్వరుడి రూపంలో గుప్తకాశీలో దర్శనమిస్తాడు. అందువల్లే గుప్తకాశీలో మనకు ప్రధాన కాశీ విశ్వేశ్వరుడి దేవాలయం పక్కనే అర్థనారీశ్వరుడి దేవాలయం కూడా కనిపిస్తుంది.

రెండు నందులు

రెండు నందులు

P.C: You Tube

ఇక ఈ దేవాలయం ముందు రెండు నందుల నోటి నుంచి నిత్యం నీటి ధార వస్తూ ఉంటుంది. అందులో ఒకటి గంగ నది కాగా, మరొకటి యమునా నది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందన్న విషయం పై బ్రిటీషు వారి నుంచి ప్రస్తుత శాస్త్రవేత్తల వరక ఎన్నో పరిశోధనలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X