Search
  • Follow NativePlanet
Share
» »22 ఎకారల్లో 22 ఏళ్లలో 22 బురుజులు శత్రు దుర్భేధ్యం ఈ జంజీర కోట

22 ఎకారల్లో 22 ఏళ్లలో 22 బురుజులు శత్రు దుర్భేధ్యం ఈ జంజీర కోట

అరేబియా సముద్రంలో ఉన్న జంజీర కోట గురించి కథనం.

అలనాటి రాచరిక వైభవానికి, యుద్ధ తంత్రానికి ప్రత్యక్ష నిదర్శనాల్లో కోటలు ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తాయి. అటువంటి కోటల్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోటలు భారత దేశంలో ఎన్నో ఉన్నాయి. వాటిలో ముంబై నుంచి 158 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రం అంచున ఉన్న జంజీర కోట విశిష్టమైనది. శతాబ్దాలుగా అలల తాకిడిని తట్టుకొంటూ ఈ కోట చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి పూణే వరకూ రైలులో వెళ్లి అక్కడి నుంచి జంజీర కోటను చూడటానికి చాలా మంది తెలుగు రాష్ట్రాల పర్యాటకులు వెలుతుంటారు. ఈ నేపథ్యంలో ఆ కోటకు సంబంధించిన వివరాలు మీ కోసం...

అరేబియా సముద్రం

అరేబియా సముద్రం

P.C: You Tube

అరబిక్ సముద్రం అంచున ఉన్న చారిత్రాత్మక ప్రదేశాల్లో మురుద్ ఒకటి. అక్కడే జంజీరా కోట ఉంది. శతాబ్దాలుగా సముద్ర అలలు దాడి చేస్తున్నా చెక్కుచెదరకుండా ఉన్న ఈ కోట ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. అలనాటి సిద్ధి జాతీయుల ధీరత్వానికి యుద్ధ తంత్ర నైపుణ్యానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ కోట.

సిద్దీ జాతీయులు

సిద్దీ జాతీయులు

P.C: You Tube

శతాబ్దాల కిందట ఆఫ్రికా ఖండం నుంచి సిద్ధీ జాతికి చెందిన వేలాది మంది భారత దేశానికి వలసవచ్చారు. అటు పై వారు అంచెలంచెలుగా ఎదిగి రాజ్యాలను ఏర్పాటు చేసుకొన్నారు. వారు నమ్మకానికి, వీరత్వానికి ప్రతీక. అందుకే అహ్మద్ నగర్ ను పాలిస్తున్న నిజాంషాహీ ప్రభువు సిద్ధీలను స్వయం ప్రతిపత్తి కలిగిన రాజులుగా గుర్తించాడు. అలా 17వ శతాబ్దంలో జంజీరా ప్రాంతానికి సిద్ధీ మాలిక్ అంబర్ కొన్నాళ్లు ప్రధానిగా ఉన్నాడు. ఆయన హయాంలోనే కోట నిర్మాణం మొదలయ్యింది.

1948 లో భారత్ లో విలీనం

1948 లో భారత్ లో విలీనం

P.C: You Tube

ఆ తర్వాత సిద్దీ సురల్ ఖాన్ రాజుగా ఉన్నప్పుడు కోట నిర్మాణం పూర్తయ్యింది.భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొన్ని రోజుల వరకూ జంజీరా స్వతంత్ర రాజ్యంగానే ఉండేది. అటు పై అంటే 1948లో ఈ జంజీరా కోట భారత్ లో విలీనమై పోయింది. ఈ కోట లోపల వింతలూ ఎన్నో ఉన్నాయి. కోట లోపల రాజ ప్రాసాదాలు దర్భార్ హాల్, ధాన్యాగారం ఇలా అన్ని రకాల వసతులు ఉండేవి.

22 ఎకరాలు

22 ఎకరాలు

P.C: You Tube

వీటిలో చాలా వరకూ మనం ఇప్పటికీ చూడవచ్చు. 22 ఎకరాల్లో దీర్ఘవ`త్తాకారంలో ఉన్న ఈ కోట చుట్టూ 22 బురుజులు ఉన్నాయి. కోట పై 557 ఫిరంగులు కూడా ఉండేవి. ప్రస్తుతం ఈ ఫిరంగుల సంఖ్యను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. వీటిలో కలాల్ బాంగ్ డీ ఫిరంగి ప్రత్యేకమైనది. మన దేశంలోనే రెండో అతిపెద్ద ఫిరంగిగా పేరున్న దీని పొడవు 18 అడుగులు. బరువు 20 టన్నులకు పైగానే ఉంటుంది. ఇంకా కోటలో సురల్ ఖాన్ ప్యాలెస్, మంచినీళ్ల బావి, సీస్ మహల్, మసీదు చూడదగినవి.

సూర్యాస్తమయంలో

సూర్యాస్తమయంలో

P.C: You Tube

కోట గోడల నిర్మాణంలో రాళ్లమధ్య పాదరసం, సీసం, బెల్లం మిశ్రమాన్ని వినియోగించారు. అందుకే శతాబ్దాలుగా కడలి కెరటాల దాడి చేస్తున్నా ఈ కోట గోడలకు బీటలు రాలేదని చెబుతారు. సూర్యాస్తమయం వేళ మరింత అందంగా కనిపించే ఈ కోటను చూస్తూ పర్యాటకులు పడవల్లో తిరుగు ప్రయాణమవుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X