Search
  • Follow NativePlanet
Share
» »తలకోనకు ఎందుకు ఆ పేరు వచ్చింది...ఇది మంచి ట్రెక్కింగ్ స్పాట్

తలకోనకు ఎందుకు ఆ పేరు వచ్చింది...ఇది మంచి ట్రెక్కింగ్ స్పాట్

తలకోన గురించిన కథనం

By Beldaru Sajjendrakishore

తలకోన చిత్తూరు జిల్లా యెర్రావారిపాలెం మండలంలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఇది ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. చుట్టూ ఎత్తైన కొండలతో, దట్టమైన అరణ్యప్రాంతం మధ్యలో వెలసిన ఈ జలపాతం నిత్యం పర్యాటకుల రద్దీతో కళకళలాడుతుంటుంది. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ జలపాత ప్రదేశం అత్యంత రమణీయ ప్రకృతి ప్రదేశాల్లో ఒకటిగా చెప్పవచ్చు.

మేజిక్ కొలనుల అంతు చూడండి.... అరుదైన మత్స్యావతార మూర్తిని దర్శించండిమేజిక్ కొలనుల అంతు చూడండి.... అరుదైన మత్స్యావతార మూర్తిని దర్శించండి

ఈ ప్రాంతంలో అనేక ఔషధ మొక్కలున్నాయి. తలకొన జలపాతం ఉన్న కొండ క్రింద ప్రాంతంలో మరొక జలపాతం ఉంది.దాని పేరు నెలకొన,ఇక్కడ దొంగల బండి లాంటి తెలుగు సినిమా షూటింగ్ కూడా జరిగింది. ఇక ఇక్కడ అడవి కోళ్లు, నెమళ్లు,, దేవాంగ పిల్లి, ఎలుగులు, ముచ్చు కోతులు వంటి జంతు జాలం ఉంది. ఇది ట్రెక్కింగ్ కు కూడా అనుకూలమైనది.

1. అందుకే ఆ పేరు వచ్చింది

1. అందుకే ఆ పేరు వచ్చింది

Image source:


తలకోన శేషాచల కొండల వరుసలో తల బాగంలో వున్నందున దీన్ని తలకోన అంటారు. ఇక్కడున్న జలపాతం ఎత్తు సుమారు మూడు వందల అడుగులు. ఈ జలపాత దృశ్యం నయనానంద కరంగా వుంటుంది. ఇక్కడ చేరగానే మొదట మనం కనుగొనేది సిద్దేశ్వరాలయము మరియు అమ్మవారు, విఘ్నేశ్వరుడు, సుబ్రమణ్యస్వామి ఆలయాలు. అలయానికి అతిసమీపముగా వాగు ఒకటి ఎల్లపుడూ ప్రవహిస్తూంటుంది.

2. ఎవరూ కనుగొనలేదు

2. ఎవరూ కనుగొనలేదు

Image source:


ఇందులోని నీరు చాల తేటగాను చాల చల్లగాను ఉంటాయి. సిద్దేశ్వరాలయము నుండి కొంత ముందుకు సాగిన నెలకోన, దిగువ ఝరి, ఎగువ ఝరి లకు వళ్ళవచ్చు. ఈ మూడింటికి చాల ప్రాముఖ్యత ఉంది. నెలకోన అన్నది దట్టమైన కొండల మధ్య ఉంది. ఇక్కడి రెండు కొండల నడుమ ఒక నీటి ప్రవాహము వచ్చి ఒక కొలనులో దూకుతూ ఉంటుంది. ఈ కొలను యొక్క లోతు ఎవరూ కనుగొనలేదు. అంత సాహసము ఎవరూ చేయలేదు.

3. పెద్ద గుండు రాయి

3. పెద్ద గుండు రాయి

Image source:


ఇక్కడ చెప్పుకోదగ్గ ఇంకొక అంశము రెండు కొండల నడుమ ఉండే పెద్ద గుండు రాయి. ఇది ఎప్పడు మీద పడుతందో అని అనిపిస్తుంటుంది. ఇక నెల కోన ఆ జలపాతం పైనుండి కొంత దూరంలో పాపనాసం అనే తీర్థం ఉంది. ఇక్కడ గిల్లితీగ అనే తీగ ఉంది. ఈ తీగలు పొడవు కొన్ని కిలోమీటర్ల పొడవు వుంటాయి. దీని కాయలు కూడా చింత కాయల వలె వుండి వాటికన్న చాల పెద్దవిగా వుంటాయి.

4. అనేక వ్యాధులకు

4. అనేక వ్యాధులకు

Image source:


స్థానికులు ఈ తీగలని అన్ని బాగాలను కాయలు, దాని గింజలను మందులుగా వాడుతారు. చర్మ వ్యాదులకు, జ్వరానికి, తలనెప్పికి ఇలా అనేక వ్యాధులకు వాడుతారు. ఇవేకాక ఈ ప్రాంతంలో అనేక ఔషధ మొక్కలున్నాయి. తలకొన జలపాతం ఉన్న కొండ క్రింద ప్రాంతంలో మరొక జలపాతం ఉంది.దాని పేరు నెలకొన,ఇక్కడ దొంగల బండి లాంటి తెలుగు సినిమా షూటింగ్ కూడా జరిగింది.

5. రామలక్ష్మణుల మామిడి వృక్షాలు

5. రామలక్ష్మణుల మామిడి వృక్షాలు

Image source:


తలకోన శిరోద్రోణి తీర్థం (వాటర్ పాల్స్, ఝరి)కి వెళ్లే దారిలో రామలక్ష్మణుల మామిడి వృక్షాలు ఉన్నాయి. ఒకే పొడవుతో ఉన్న ఈ వృక్షాలను భక్తులు రామలక్ష్మణ వృక్షాలుగా పిలుస్తారు. వారు ఈ పర్వతాలపై సంచరించారనడానికి గుర్తుగా ఈ వృక్షాలు ఉన్నట్లు భక్తుల నమ్మకం. ఈ అటవీ ప్రాంతంలో అనేక రకాల వృక్షాలు అనగా మద్ది, చందనం ఎర్ర చందనం వంటి వృక్షాలు అధికంగా ఉన్నాయి.

6. అనేక జంతువులు

6. అనేక జంతువులు

Image source:


అడవి కోళ్లు, నెమళ్లు,, దేవాంగ పిల్లి, ఎలుగులు, ముచ్చు కోతులు వంటి జంతు జాలం ఉంది. వృక్షాలకు వాటి పేర్లు రాసిన పలకలు వాటికి తగిలించి ఉన్నారు. ఇక్కడి ప్రకృతి అందాలకు మురిసి అనేక సినిమాలు తీశారు.ఇక్కడికి కొంత మంది ఔత్సాహికులు ట్రెక్కింగు కొరకు కూడా వస్తుంటారు. ప్రకృతిని పక్షులను జంతువులను చూడడానికి అటవీ శాఖవారు ఇక్కడ ఎత్తైన వాచ్ టవర్లను నిర్మించారు. వాటి పైకెక్కి చూడ వచ్చు.

7. శివరాత్రి పర్వదినాన

7. శివరాత్రి పర్వదినాన

Image source:


శివరాత్రి పర్వ దినాన ఇక్కడ పెద్ద ఉత్సవాలు జరుగుతాయి. తలకోన తిరుపతి సుమారు యాబై కిలో మీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుండి ప్రతి గంటకు బస్సులుంటాయి. తలకోనకు తిరుపతి, పీలేరు నుండి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. పీలేరు నుంచి 50 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 49 కిలోమీటర్ల దూరంలో ఉంది.తిరుపతి బస్ స్టాండ్ నుండి ప్రతి రోజు ఉదయం 7 గంటలకు నేరుగా తలకోనకు బస్సు సౌకర్యం ఉంది.

8. తిరుగు ప్రయాణం ఇలా...

8. తిరుగు ప్రయాణం ఇలా...

Image source:


మరల తలకోన నుండి తిరుపతికి సాయింత్రం 4 గంటలకు ఇదే బస్సు ఉంది.ఇదికాక తిరుపతి నుండి పీలేరు వెళ్ళే బస్ ఎక్కి భాకరాపేట దిగవలెను. అక్కడి నుంచి 26 కిలోమీటర్లు ఆటో ద్వారా నెరబైలు మార్గంలో ప్రయాణం చేస్తే తలకోన చేరుకోవచ్చు. భాకరాపేట నుంచి తలకోనకు నిత్యం ప్రయివేట్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. సాయంత్రం 4:30 తర్వాత జలపాతానికి అనుమతి లేదు.

9. ఇక్కడ వసతి ఇలా ఉంటుంది.

9. ఇక్కడ వసతి ఇలా ఉంటుంది.

Image source:


తలకోనలో టీటీడీ ఆధ్వర్యంలో రెండు అతిథి గృహాలు ఉన్నాయి. ఇందులో 12 గదులు ఉన్నాయి. డీలక్స్ గది అద్దె రూ. 500. అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వసతి గృహాలు, డార్మెంటరీలు ఉన్నా యి. 4 లాట్లు ఉండగా ఇందులో 6 గదులతో పాటు డార్మెంటరీ, సామూహిక బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే శాకాహార, మాంసాహార భోజన సౌకర్యాన్ని అట వీశాఖ అందిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X