Search
  • Follow NativePlanet
Share
» »రాజమండ్రిలో ప్రపంచంలోనే అతి ఎత్తైన అక్షర గాయత్రి శ్రీ చక్ర పీఠం దర్శిస్తే..

రాజమండ్రిలో ప్రపంచంలోనే అతి ఎత్తైన అక్షర గాయత్రి శ్రీ చక్ర పీఠం దర్శిస్తే..

వేద స్వరూపిణిగా త్రిసంధ్యా సమయంలో జపించే మంత్రాధిష్టాన దేవతగా గాయత్రీ దేవిని కొలుస్తారు. గాయిత్రీ దేవి శ్రీ శక్తి స్వరూపిణిగా పంచముఖాలతో మహా శ్రీచక్ర మేరువుపైన కొలువైన క్షేత్రం రాజమహేంద్రవరంలోని అక్షర

వేద స్వరూపిణిగా త్రిసంధ్యా సమయంలో జపించే మంత్రాధిష్టాన దేవతగా గాయత్రీ దేవిని కొలుస్తారు. గాయిత్రీ దేవి శ్రీ శక్తి స్వరూపిణిగా పంచముఖాలతో మహా శ్రీచక్ర మేరువుపైన కొలువైన క్షేత్రం రాజమహేంద్రవరంలోని అక్షరకోటి గాయిత్రీ పీఠం. ఇక్కడ అమ్మవారు గాయిత్రీ మంత్రంలోని బీజాక్షరాలకు ప్రతీకలుగా ఇరవైనాలుగు రూపాల్లో పూజలు అందుకుంటున్నారు.

రుగ్వేదంలో మొదటగా లిఖించిన మంత్రంగా గాయత్రీ మంత్రాన్నీ చెబుతారు. న గాయత్య్రా: పరంమంత్రం నమాతు: పరదూవతమ్ అనేది పురాణవచనం. తల్లిని మించిన దైవం లేదు, గాయిత్రి మాతను మించిన మంత్రం లేదని దీని అర్థం. గాయిత్రి అన్న పదమునకు గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ అని ఆదిశంకరాచుర్యలు భాష్యం చెప్పారు. అంటే...ప్రాణాలను రక్షించే మంత్రం గాయత్రీ మంత్రమని భావన.

అలాగే వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమేనని పేర్కొంటారు. ఈ మహా మంత్రానికి వ్యాఖ్యాన రూపంమే రామాయణ మహాకావ్వ రచన జరిగిందని చెబుతారు. అటువంటి వేద స్వరూపిణికి నెలవైన ఆలయం రాజమండ్రిలోని అక్షరకోటి గాయత్రీ పీఠం. ఈ క్షేత్ర విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం...

 ఎత్తైన గాయిత్రీ శక్తిపీఠాల్లో ఒకటిగా

ఎత్తైన గాయిత్రీ శక్తిపీఠాల్లో ఒకటిగా

ఈ క్షేత్రం ఎత్తైన గాయిత్రీ శక్తిపీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. ఈ క్షేత్రం గోదావరీ తీరంలో కొలువుదీరి ఉంది.

PC: youtube

ఈ శక్తిపీఠం యొక్క ఆలయ గోపురం నిర్మాణం ఆకాశాన్ని తాకుతోందా

ఈ శక్తిపీఠం యొక్క ఆలయ గోపురం నిర్మాణం ఆకాశాన్ని తాకుతోందా

ఈ శక్తిపీఠం యొక్క ఆలయ గోపురం నిర్మాణం ఆకాశాన్ని తాకుతోందా అన్నట్లుగా ఆద్యాంతం ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. షడ్చక్రారంలో మొదటి ఆరు అంతస్తులూ, వాల్మీకి రామాయణంలోని ఆరు కాండలకు ప్రతీకలుగా మిగిలిన ఆరు అంతస్తులూ నిర్మించారు.

శ్రీచక్రాలతో మహాశ్రీచక్ర మేరువును

శ్రీచక్రాలతో మహాశ్రీచక్ర మేరువును

ఆలయం క్రింద భాగంలో సుమారు వెయ్యి శ్రీచక్రాలతో మహాశ్రీచక్ర మేరువును ఏర్పాటు చేశారు. ఈ ఆలయ ఆవరణలోనే సహస్రలింగేశ్వరుడి విగ్రహాలు, నవగ్రహాలు ఉన్నాయి.

ఆలయానికి క్షేత్రపాలకులుగా

ఆలయానికి క్షేత్రపాలకులుగా

ఈ ఆలయానికి క్షేత్రపాలకులుగా ఉన్న ఇరవై నాలుగు అడుగుల కార్తికేయుడు, పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహాలు పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

మొదటి అంతస్తుని

మొదటి అంతస్తుని

మొదటి అంతస్తుని మూలాధార చక్రంగా, రెండవ అంతస్తులో అయిదు శిరస్సులతో బ్రాహ్మి అవతారంలో గాయిత్రీ దేవి కొలువుదీరి దర్శనమిస్తుంది.
మూడవ అంతస్తును మణిపురగా పిలుస్తారు.

గాయిత్రీ మంత్రంలోని మొదటి పాదంలోని

గాయిత్రీ మంత్రంలోని మొదటి పాదంలోని

ఇందులో గాయిత్రీ మంత్రంలోని మొదటి పాదంలోని ఎనిమిది అక్షరాలకు ప్రతీకలుగా అష్టలక్ష్ముల రూపాలను ప్రతిష్టించారు. ఆ పై అంతుస్తులో గాయిత్రీ దేవి మంత్రంలోని రెండో పాదంలో ఉండే ఎనిమిది అక్షరాలకు ప్రతీకలుగా మరో ఎనిమిది శక్తిస్వరూపాలను ఏర్పాటు చేశారు. ఆరో అంతస్తులో తుర్య గాయిత్రీ మంత్రం ప్రకారంగా ఆజ్ఝాచక్రంలో చతుర్వేద మాతలను ప్రతిష్టించారు.

వాల్మీకి రామాయణంలోని

వాల్మీకి రామాయణంలోని

వాల్మీకి రామాయణంలోని ఆరుకాండలకు సంకేతంగా ఆలయంలోని మొదటి ఆరు అంతస్తులను తీర్చిదిద్దారు. ఏడు, ఎనిమిది అంతస్తుల్లో అష్టాదశ శక్తిపీఠాలను ప్రతిష్టించగా తొమ్మిదో అంతస్తులో నవ దుర్గలు, పదిలో దశ మహావిద్యలు, 11వ అంతస్తులో శ్రీరామ పట్టాభిషేకానికి సంబంధించిన దృశ్యాలు, 12వ అంతస్తులో ధ్యానమందిరంను నిర్మించారు. 144 అడుగుల ఎత్తులో నిర్మించిన ఆలయ శిఖరం అత్యంత రమణీయంగా తీర్చిదిద్దారు.

ఎలా వెళ్లాలి:

ఎలా వెళ్లాలి:

గోదావరి తీరంలో ఉన్న గాయత్రీ క్షేత్రాన్ని చేరుకోవడానికి రైలు, రోడ్డు, విమాన మార్గాలున్నాయి. రోడ్డు మార్గంలో వచ్చేవారు రాజమండ్రి బస్ స్టేషన్ కి చేరుకుని అక్కడ నుండి లోకల్ బస్సులు, లోకల్ వెహికల్స్ లో వెళ్లొచ్చు. దేశంలో వివిధ ప్రదేశాల నుండి కూడా రాజమండ్రికి రైలు సదుపాయం కలదు. రైల్వే స్టేషన్ కు సమీపంలో ఉన్న ఈ క్షేత్రానికి నడిచి వెళ్ళవచ్చు. ఈ క్షేత్రం రాజమండ్రి విమానాశ్రయానికి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుండి రైలు మార్గం గుండా ప్రయాణించి గాయత్రీ శక్తిపీఠంను దర్శనం చేసుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X