Search
  • Follow NativePlanet
Share
» »పచ్చని అడవుల మధ్య అద్భుత ప్రాంతం.. చుంచనకట్టె!

పచ్చని అడవుల మధ్య అద్భుత ప్రాంతం.. చుంచనకట్టె!

చుంచనకట్టే పర్యాటక ప్రాంతానికి సంబంధించిన కథనం.

By Karthik Pavan

అంతులేని విస్తీర్ణం..అతిపెద్ద కోస్తాతీరం. పచ్చని అడవులు.. కొండకోనల్లో ప్రకృతి హొయలు. దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ తర్వాత పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తున్నది కర్నాకట. ఏడాది పొడవునా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.

కానీ.. ఇప్పటికీ భూలోక స్వర్గాలను తలపించే చాలా ప్రాంతాలు పర్యాటకులకు తెలియవు. అలాంటి వాటిలో ఒక ప్రాంతమే చుంచనకట్టె. వేలకిలోమీటర్లు విస్తరించిన పశ్చిమ కనుమల్లో పచ్చని కొండల నడుమ ఉన్న ఒక గ్రామమే చుంచనకట్టె. ప్రకృతి ప్రేమికులకు, ఫోటోగ్రాఫర్స్‌కు అనువైన ప్రాంతం. వారం మొత్తం పని ఒత్తిడిలో ఉండేవాళ్లకు మంచి వీకెండ్‌ రిలాక్సింగ్‌ ప్లేస్‌ కూడా.!

కావేరీ నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతానికి పురాణ నేపధ్యమూ ఉంది. వనవాసం సమయంలో రాముడు ఇక్కడకు వచ్చాడని, ఆయనకు చుంచ, చుంచి అనే గిరిజన దంపతులు స్వాగతం పలికారని, ఆ కారణంగానే చుంచెనకట్టె పేరు వచ్చినట్టు చెప్తారు. ఓపిక ఉండాలే కానీ.. చుంచనకట్టెలో అన్నీ చూడచక్కని ప్రదేశాలే.!

ఎందుకు ప్రత్యేకం

ఎందుకు ప్రత్యేకం

P.C: You Tube

ఎండాకాలంలో చక్కటి వాతావరణం ఎంజాయ్‌ చేయాలనుకునేవాళ్లు చుంచనకట్టెకు వెళితే ఖచ్చితంగా రిలాక్స్‌ అవచ్చు. అక్కడి వాతావరణం ఖచ్చితంగా కట్టిపడేస్తుంది. 60 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకే జలపాతాలు కనువిందు చేస్తాయి. మనసుకు ప్రశాంతత దొరుకుతుంది. ఆధ్యాత్మికంగానూ ఇదో మంచి ప్లేస్‌. ఇక్కడికి దగ్గర్లోని కొదండరామాలయాన్ని వందల ఏళ్లక్రితం నిర్మించారని చెప్తారు.

పచ్చటి అడువుల మధ్య

పచ్చటి అడువుల మధ్య

P.C: You Tube

పచ్చని అడవుల మధ్య కొండకోనల్లో ఉన్న ఆ శ్రీరామచంద్రుడిని దర్శించుకుంటే కోరిన కోర్కెలూ తీరుతాయని స్ధానికుల నమ్మకం. చుట్టూ ఎత్తైన కొండలు, కనుచూపుమేర పచ్చని చెట్లు ఉండటంతో ఏడాది పొడవునా పక్షుల కిలకిలారావాలతో చెంచనకట్టె భూలోకస్వర్గాన్ని తలపిస్తుంటుంది. జలపాతాలు కూడా ఆకర్షిస్తాయి. అందుకే.. రకరకాల పక్షులను చూడ్డానికి బర్డ్‌ లవర్స్‌ ఇక్కడకు వస్తుంటారు.

ఏ సమయంలో వెళ్లాలి

ఏ సమయంలో వెళ్లాలి

P.C: You Tube

కొండప్రాంతం కావడంతో ఏడాది పొడవునా ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణమే ఉంటుంది. అందుకే.. ఏ టైంలో అయినా చుంచనకట్టెను చూడటానికి చేయచ్చు. అయితే, పూర్తిస్ధాయిలో కొండలు, అక్కడి ప్రాంతాలు, అడవులను చూడాలంటే మాత్రం అక్టోబర్‌ నుంచి మార్చి వరకు సరైన సమయం.

ఎలా చేరుకోవాలి?

ఎలా చేరుకోవాలి?

P.C: You Tube

విమానంలో అయితే మైసూరు దగ్గరి ఎయిర్‌పోర్ట్‌. అక్కడి నుంచి 70కిలోమీటర్లు ప్రయాణం. క్యాబ్‌ తీసుకుని వెళితే గంటన్నరలో చేరుకోవచ్చు. చుంచెనకట్టెకు డైరక్ట్‌ ట్రైన్‌ ఫెసిలిటీ లేదు. మైసూర్‌ జంక్షన్‌ అతిదగ్గర రైల్వేస్టేషన్‌. ఇక రోడ్డుమార్గంలో ఇలాంటి ప్లేస్‌లకు వెళ్లడంకంటే ధ్రిల్ ఏముంటుంది? బెంగుళూరు నుంచి 180కిలోమీటర్లు వెళితే చుంచెనట్టే ఈజీగా చేరుకోవచ్చు. మలుపులు తిరిగే రోడ్లు, ఇరువైపులా పచ్చని చెట్లు మీ ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X