Search
  • Follow NativePlanet
Share
» »ఇండియాలో మొదటి ఎకో టూరిజం - తేన్మల !!

ఇండియాలో మొదటి ఎకో టూరిజం - తేన్మల !!

తేన్మల ను సందర్శించే పర్యాటకులు ఇక్కడా దొరికే లేదా లభించే తేనెను తప్పక రుచి చూడాలి. అందుకే దీనిని హిల్ ఆఫ్ హానీ అని అంటారు. ఈ తేనెలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతారు.

By Mohammad

తేన్మల ప్రసిద్ధిగాంచిన ఒక పర్యావరణ పర్యాటక ప్రదేశం. ఇది కొల్లం జిల్లాలో కలదు. దీనిని హిల్ అఫ్ హనీ అని అంటారు. ఈ ప్రదేశం తేనె కు ప్రసిద్ధి. ఈ తేనెలో చాల ఔషద గుణాలు ఉన్నాయని చెపుతారు. ఈ ప్రదేశం కేరళ రాజధాని నగరం, త్రివేండ్రం నుండి సుమారు 70 కి. మీ. దూరంలో కలదు.

తేన్మలలో ఇండియా లోని మొట్టమొదటి పర్యావరణ పర్యాటక ప్రాజెక్ట్ ప్రణాళిక చేసారు. పర్యావరణ పర్యాటక ప్రాజెక్ట్ లో భాగంగా ఈ ప్రాంతం 5 ప్రధాన జోన్స్ గా విభజించారు.అవి కల్చరల్ జోన్, అడ్వెంచర్ జోన్, విశ్రాంతి జోన్, డీర్ సంరక్షణ శాఖ మరియు బోటింగ్ జోన్ లుగా కలవు.

పచ్చటి అడవులలో అనేక ఎకరాలలో వ్యాపించిన తేన్మల లక్షలాది పర్యాటకులను దేశంలోనూ మరియు విదేశాలనుండి ఆకర్షిస్తోంది. ఈ పర్యావరణ పర్యాటక ప్రదేశం వివిధ రకాల మొక్కలకు మరియు వన్య జీవులకు నిలయంగా వుంది. ఈ పర్వత ప్రాంతం అనేక సాహస క్రీడలకు వినోదాలకు అంటే బోటింగ్, రోప్ బ్రిడ్జి, ట్రెక్కింగ్, పర్వతారోహణ, బైకింగ్, మరియు ఒక మ్యూజికల్ ఫౌంటెన్ వంటివి కూడా అందించి పర్యాటకులను ఆనందింప చేస్తుంది.

ఎకో టూరిజం ప్రాజెక్ట్

ఎకో టూరిజం ప్రాజెక్ట్

ఇది ఇండియా లో మొదటి పర్యావరణ పర్యాటక ప్రాజెక్ట్. ఈ ప్రదేశాన్నిప్రకృతి ప్రియులకు మరియు సహస క్రీడాకారులకు కలిపి 5 భాగాలుగా విభజించారు. కల్చర్ జోన్ లో స్థానిక మహిలాలి దుకాణాలు నడుపుతారు మూజికల్ డాన్స్ ఫౌంటేను కలదు.

చిత్రకృప : Sailesh

సందర్శన సమయం

సందర్శన సమయం

సాహస క్రీడల జోన్ లో పాత్ వేస్ వివిధ రకాల క్రీడలకు సంబంధిన అంశాలు ఎకో టూరిజం లో భాగంగా వుంటాయి. ఇది ఉదయం 9 గం. నుండి సాయంత్రం 5 గం. వరకు తెరాచి వుంటుంది.

చిత్రకృప : Pratheepps

ఆనందాలు

ఆనందాలు

లేళ్ళ పార్కు లో పిల్లలకు ఎన్నో ఆనందాలు దొరకుతాయి. పర్యాటకులు అక్కడి సిబ్బందిచే చక్కని సమాచారం ఇవ్వబడతారు ఎన్నో రకాల సౌకర్యాలు, ఆనందాలు ఉండటంతో చక్కగా ఆనందించవచ్చు.

చిత్రకృప : Kerala Tourism

పాలరువి జలపాతాలు

పాలరువి జలపాతాలు

పాలరువి జలపాతాలు కేరళ - తమిళనాడు సరిహద్దులలో వుంటాయి. పాలరువి అంటే పాల ధార అని అర్ధం చెపుతారు. నురగలు కక్కే ప్రవాహాలు వెండి రంగులో చల్లని ధారలతో చూచే వారికి ఒక అద్భు తంగా అనిపిస్తుంది.

చిత్రకృప : REPhotography06

పచ్చటి ప్రాంతం

పచ్చటి ప్రాంతం

పాలరువి కొల్లం కు 75 కి.మీ. దూరంలో ఉంటుంది. ఈ నీటి స్వర్గాన్ని చేరాలంటే 4 కి.మీ. దూరం ట్రెక్కింగ్ చేయాలి. తేన్మలై సందర్శకులకు ఇది ఒక ప్రత్యెక ఆకర్షణ. చుట్టూ ఉండే జలపాతాలు అడవులును ఎల్లప్పుడూ పచ్చటి ప్రాంతంగా ఉంచుతాయి.

చిత్రకృప : Haravinth rajan

ఫోటోగ్రాఫులు

ఫోటోగ్రాఫులు

ఈ ౩౦౦ అడుగుల జలపాతాలకి స్థానికులు నిర్వహించే టూర్లు కలవు. ఇక్కడి డివిజనల్ ఫారెస్ట్ నుండి మ్యాపులు, ఫోటోగ్రాఫులు పొందవచ్చు. ఎంతో ఆకర్షణీయమైన ఈ ప్రదేశం యువకులకు, జంటలకు మరియు కుటుంబాలకు తగిన విహార ప్రదేశం.

చిత్రకృప : Akhilan

ట్రెక్కింగ్

ట్రెక్కింగ్

ఆనందోత్సాహాలతో వుండే వారికి సాహస ప్రియులకు ట్రెక్కింగ్ మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక్కడ 3 రోజుల ట్రెక్కింగ్ టూర్లు కలవు. ఇక్కడ నిర్వహించే ట్రెక్కింగ్ టూర్లు ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. చెండురూనీ అభయారణ్యంలో పక్షి సందర్శకులకు పక్షులను సందర్శించే అవకాశం కలదు.

చిత్రకృప : Fotokannan

వీక్షణం

వీక్షణం

పర్యాటకులు పక్షి సందర్శనను కూడా బాగా ఆనందించగలరు. తేన్మల నేషనల్ ఎడ్వంచర్ ఫౌండేషన్ నిర్వహించే ట్రెక్కింగ్ లో కూడా పర్యాటకులు పాల్గొనవచ్చు. ఇది ఎకో టూరిజం లో ఒక భాగంగా ఉంటుంది. పర్యాటకులు వివిధ ట్రెక్కింగ్ ప్రోగ్రాములు ఎంచుకొనవచ్చు.

చిత్రకృప : Varkey Parakkal

కులతుపూజ

కులతుపూజ

కులతుపూజ కొల్లం జిల్లలో ఒక అందమైన గ్రామం. తేన్మలై పర్వత ప్రాంతానికి ఇది సమీపంలో ఉంటుంది. తిరువంతపురం - శేన్కోట్టాయి మార్గంలో కలదు. తిరువనంతపురం కు 62 కి.మీ. మరియు కొల్లం కు 64 కి.మీ. దూరంలో ఉంటుంది.

చిత్రకృప : Arunvrparavur

ప్రధాన పండుగ

ప్రధాన పండుగ

కులుతుపూజ దాని శాస్త దేవాలయానికి ప్రసిద్ధి. ఇక్కడ బాల శాస్త దేవి అంటే హరిహర ప్రియ ప్రధాన దైవం. కల్లాడ నది ఒడ్డున కల ఈ దేవాలయం సందర్శకులకు ఎంతో ప్రశాంతతని ఇస్తుంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో నిర్వహించే ప్రధాన పండుగ విష్ణు మహోత్సవం భక్తులను మరియు పర్యాటకులను ఒకే రకంగా ఆకర్షిస్తుంది.

చిత్రకృప : Binupotti

ఆర్యంకావు

ఆర్యంకావు

ఆర్యంకావు ప్రదేశాన్ని వ్యాలీ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ రేంజ్ అంటారు. కొల్లం జిల్లా కు తూర్పు దిశగా 75 కి.మీ. దూరంలో కలదు. తేన్మలై కు సమీపంలో కల ఆర్యంకావు గ్రామం జిల్లాలోని ప్రదాన ఆకర్షణలలో ఒకటి. ఆర్యంకావు లోని ప్రధాన ఆకర్షణ పాలరువి జలపాతాలు. ఈ క్షేత్రం లేడి సెయింట్ మేరీస్ రోమన్ కేథలిక్ చర్చి మరియు జార్జ్ మలంకర కాథలిక్ చర్చి భక్తులను ఆహ్వానిస్తుంది.

చిత్రకృప : Zacharias D'Cruz

తేన్మల ఎలా చేరుకోవాలి ?

తేన్మల ఎలా చేరుకోవాలి ?

రోడ్డు మార్గంలో

తేన్మలై కు తిరువనంతపురం మరియు కొల్లం ల నుండి ప్రభుత్వ లేదా ప్రైవేటు బస్సులలో చేరవచ్చు. రోడ్డు మార్గంలో టాక్సీ మరియు ఇతర వాహనాలలో కూడా చేరవచ్చు.

రైలు మార్గంలో

తేన్మలైకు 66 కి.మీ. దూరంలో కల కొల్లం లో రైలు స్టేషన్ కలదు. ఇక్కడకు దేశంలోని అన్ని ప్రాంతాలనుండి రైళ్ళు నడుస్తాయి. రైలు స్టేషన్ నుండి టాక్సీలలో తేన్మలై కు చేరుకోవచ్చు. టాక్సీ చార్జీలు కి.మీ. కు సుమారు రూ. 7 నుండి రూ. 11 వరకు ఉంటాయి.

వాయు మార్గంలో

తేన్మలై కు సమీపంలో సుమారు 72 కి.మీ. దూరంలో తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. ఇక్కడి నుండి ఇండియా లోని ప్రధాన నగరాలకు విమాన ప్రయాణ సదుపాయాలు కలవు. విమానాశ్రయం నుండి టాక్సీ లలో తేన్మలై చేరుకోవచ్చు.

చిత్రకృప : Jayeshj

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X