Search
  • Follow NativePlanet
Share
» »ఏడు మోక్షపురాల్లో ఒకటైన ఈ పుణ్యక్షేత్రంలో పర్యాటక ప్రాంతాలన్నీ చూశారా?

ఏడు మోక్షపురాల్లో ఒకటైన ఈ పుణ్యక్షేత్రంలో పర్యాటక ప్రాంతాలన్నీ చూశారా?

అయోధ్య గురించిన కథనం.

భారతీయ హిందూ పురాణాలను అనుసరించి మన దేశంలో ఏడు మోక్షనగరాలు ఉన్నాయి. అందులో అత్యంత పురాతనమైన నగరం అయోధ్య. ప్రస్తుత ఉత్తర ప్రదేశ్ లోని ఫైజాబాద్ కు దగ్గర్లోని సరయూ నది ఒడ్డున అయోధ్య ఉంది. ఈ అయోధ్య పేరు చెప్పిన తక్షణం మనకు గుర్తుకు వచ్చేది శ్రీరాముడు, రామాయణం.

అయితే ఈ అయోధ్య కేవం హిందువులకే కాకుండా బౌద్దులకు, జైనులకు కూడా పరమ పవిత్రమైన నగరం. ఇక ముస్లీం సోదరులు పవిత్ర పార్థనా స్థలాల్లో ఒకటైన బాబ్రీ మసీదు కూడా అయోధ్య పేరు చెప్పిన తక్షణం మనకు గుర్తుకు వస్తుంది. ఈ నేపథ్యంలోనే అనేక మంది పర్యాటకులు ఈ పవిత్ర నగరాన్ని నిత్యం సందర్శిస్తూ ఉంటారు.

దాదాపు తొమ్మిదివేల సంవత్సరాల క్రితం నిర్మించినట్లు చెబుతునన ఈ నగరంలో అనేక చూడదగిన ప్రాంతాలు ఉన్నాయి. అందులో రామ్ కి మందిర్, సీతాకి రసోయి వంటి ముఖ్యమైనవి. వీటితో పాటు ఇక్కడ ఉన్న పర్యాటక స్థలాల వివరాలు మీ కోసం

పురాతన నగరాల్లో ఒకటి

పురాతన నగరాల్లో ఒకటి

P.C: You Tube

భారత దేశంలో అతి పురాతన నగరాల్లో అయోధ్య ఒకటి. అంతేకాకుండా ఏడు మోక్షనగరాల్లో అయోధ్య ఒకటని హిందువుల నమ్మకం. రామాయణ మహాకావ్యానికి అయోధ్య మొదటి మెట్టుగా చెప్పవచ్చు.

తొమ్మిది వేల ఏళ్ల పూర్వం

తొమ్మిది వేల ఏళ్ల పూర్వం

P.C: You Tube

రాయాయణాన్ని అనుసరించి ఈ నగరం 9వేల సంవత్సరాలకు పూర్వం నిర్మించారు. హిందూ పురాణాలను అనుసరించి భూమి పై జన్మించిన మొదటి మానవుడు మనువు ఈ నగర నిర్మాణ కర్త అని చెబుగారు.

కోశల రాజ్యానికి రాజధాని

కోశల రాజ్యానికి రాజధాని

P.C: You Tube

మరికొన్ని పురాణాలను అనుసరించి అయోధ్య ను సూర్య వంశరాజైన ఆయుధ్ నిర్మించారని చెబుతారు. కోశల రాజ్యానికి రాజధాని అయిన ఈ అయోధ్యలోనే శ్రీరాముడు జన్మించాడని రామాయణం చెబుతోంది.

అదర్వణ వేదంలో

అదర్వణ వేదంలో

P.C: You Tube

నాలుగు వేదాల్లో ఒకటైన అదర్వణ వేదంలో కూడా అయోద్య ప్రస్తావన ఉంది. ఈ అయోధ్య నగరం దైవ నిర్మితమని అధర్వణ వేదంలో పేర్కొన్నారు. ఈ నగరాన్ని మొదట ఇక్ష్వాకు వంశంవారు రాజధానిగా చేసుకొని పరిపాలించార చెబుతారు.

దశరథ మహారాజు

దశరథ మహారాజు

P.C: You Tube

ఆ వంశంలోని రఘు మహారాజు ప్రజారంజకంగా పాలించిన తర్వాత ఆ వంశం పేరు రఘ వంశంగా మారిందని తెలుస్తుంది. ఆ రఘుమహారాజు మనుమడే దశరథుడు. ఆయన కుమారుడే రామచంద్రుడు.

వివిధ మతాల వారికి

వివిధ మతాల వారికి

P.C: You Tube

ఈ అయోధ్య కేవలం హిందూ మతానికే కాకుండా జైన, బౌద్ధమతాలకు కూడా ఆరాధన నగరం. జైన మత గురువులైన పంచ తీర్థాంకరులైన అధినాథ్, అజిత్నాథ్, అభినందనాథ్, సుమతీనాథ్, అనంతనాథ్ లు ఇక్కడే జన్మించారని చెబుతారు.

మౌర్యుల కాలంలో

మౌర్యుల కాలంలో

P.C: You Tube

అంతేకాకుండా జైన మతానికి ఆధ్యుడైన రిషబ దేవుడు ఇకూడా ఇక్కడే జన్మించినట్లు తెలుస్తుంది. ఇక్కడ మౌర్యచక్రవర్తుల కాలంలో నిర్మింబడిన పలు బౌద్ధలయాలు, స్మారకాలు ఎన్నో ఉన్నాయి.

బాబ్రీ మసీదు

బాబ్రీ మసీదు

P.C: You Tube

గౌతమ బుద్ధుడు కూడా ఈ నగరాన్ని అనేకసార్లు సందర్శించినట్లు చెబుతారు. అదే విధంగా ముస్లీంలకు కూడా ఈ నగరం చాలా పవిత్రమైనది. మొఘల్ వంశానికి ఆధ్యుడైన బాబర్ ఇక్కడ బాబ్రీ మసీదును నిర్మించారు.

రామ్ జన్మభూమి

రామ్ జన్మభూమి

P.C: You Tube

అయోధ్య నగరంలో చూడటానికి ఎన్నో పర్యాటక స్థలాలు ఉన్నాయి. ముఖ్యంగా రామ్ జన్మభూమి. ఇక్కడే రాముడు జన్మించాడని హిందువుల నమ్మకం. ఇక్కడ పూర్వం రాముడి దేవాలయం ఉండేదని చెబుతారు.

వేర్వేరు ప్రార్థనా మందిరాలు

వేర్వేరు ప్రార్థనా మందిరాలు

P.C: You Tube

అయితే మొఘల్ చక్రవర్తి బాబర్ ఈ ప్రదేశంలోని ఆలయాన్ని కూల్చివేసి మసీదును నిర్మించాడని చెబుతారు. అయితే 1992లో ఈ మసీదును కొంతమంది కూల్చడానికి ప్రయత్నించడంతో ఈ ప్రాంతం వివాదాస్పదమయ్యింది. ఇప్పుడు ఇక్కడ హిందు, ముస్లీంలకు వేర్వేరు ప్రార్థనా మందిరాలు ఉన్నాయి.

కౌసల్యాదేవి మందిరం.

కౌసల్యాదేవి మందిరం.

P.C: You Tube

శ్రీరామునికి జన్మనిచ్చిన కౌశల్యాదేవికి భారత దేశంలో ఇక్కడ మాత్రమే దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో కౌశల్యాదేవి, దశరథ మహారాజులతో పాటు రామచంద్రుడు ఉండటం విశేషం. ఆలయ పరిసర ప్రాంతాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి.

హనుమాన్ మందిరం.

హనుమాన్ మందిరం.

P.C: You Tube

అయోధ్యంలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే పర్యాటక స్థలాల్లో హనుమాన్ మందిరం కూడా ఒకటి. ఒక చిన్న గుట్ట పై ఉన్న ఈ దేవాలయం చేరుకోవడానికి దాదాపు 80 మెట్లను ఎక్కవలసి ఉంటుంది.

గుహాలయం

గుహాలయం

P.C: You Tube

ఇది ఒక గుహాలయం. గర్భగుడిలో అంజలీదేవి బాల హనుమంతుడిని తన ఒడిలో ఉంచుకున్న ప్రతిమను చూడవచ్చు. ఈ ఆలయాన్ని సందర్శిస్తే తమ చిరకాల కోరికలు తీరుతాయని భక్తుల నమ్మం. అందువల్ల ఏడాది పొడుగునా ఇక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.

సరయూ ఘాట్.

సరయూ ఘాట్.

P.C: You Tube

శ్రీరామ చంద్రుడు నిర్యాణం చెందిన సరయూ నదిలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. అందువల్లే అయోధ్యను సందర్శించిన వారు తప్పక నదీ తీరంలో స్నానం చేస్తారు. ఇందుకు ప్రత్యేకమైన వ్యవస్థను స్థానిక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనినే సరయూ ఘాట్ అని అంటారు.

వాల్మీకీ మందిరం

వాల్మీకీ మందిరం

P.C: You Tube

అయోధ్యలో హనుమాన్ మందిరం త్వరాత ఎక్కువ మంది సందర్శించే పర్యటక స్థలాల్లో వాల్మీకీ మందిరం ఒకటి. ఇక్కడ వాల్మీకీ మహర్షి విగ్రహంతో పాటు లవకుశల విగ్రహాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా పాలరాతితో నిర్మించిన ఈ దేవాలయం గోడల పై 24 వేల రామాయణ శ్లోకాలు చెక్కబడి ఉండటం విశేషం.

 కనక మహల్

కనక మహల్

P.C: You Tube

వివాహం అనంతరం అయోధ్యలో ప్రవేశించిన సీతారాములకు దశరథ మహారాజు వివాహ కానుకగా ఈ కనక మహల్ ను అందజేశాడని చెబుతారు. ఈ మహల్ చూడటానికి ఎంతో బాగుంటుంది. ఇక్కడ సీతారాముల విగ్రహాలు కూడా ఉన్నాయి.

సీతాకి రసోయి

సీతాకి రసోయి

P.C: You Tube

ఇది వంటగది. అయోధ్య లోని రామకోట్ లోని రామజన్మభూమికి వాయువ్య దిశలో ఈ వంటగది ఉంది. అయితే దీనిని ప్రస్తుతం ఓ దేవాలయంగా భక్తులు భావిస్తారు. ఇక్కడ సీతాదేవితో పాటు లక్ష్మణ, భరత, శత్రుఘ్నల భార్యలైన ఊర్మిళ, మాండవి, శ్రుతికీర్తి విగ్రహాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే ఆకలిబాధలు తప్పుతాయని భక్తుల నమ్మకం.

తులసీ స్మారక్ భవన్

తులసీ స్మారక్ భవన్

P.C: You Tube

రామాయణాన్ని హిందిలో రచించిన తులసీదాస్ స్మారకంగా నిర్మించిన భవనమే తులసీ స్మారక్ భవన్. ఇక్కడ పురాణ, ఇతిహాసాలకు సంబంధించిన అనేక గ్రంథాలను చూడవచ్చు. రామాయణం, శ్రీరాముడికి చెందిన అనేక వస్తువులను కూడా ఇక్కడ చూడవచ్చు.

చక్ర హర్జి విష్ణు టెంపుల్

చక్ర హర్జి విష్ణు టెంపుల్

P.C: You Tube

ఇక్కడ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని కలిగిన విగ్రహం ఉంటుంది. అంతేకాకుండా శ్రీరాముని పాదముద్రలు కూడా ఇక్కడ చూడవచ్చు. సరయూ నది ఒడ్డున ఉన్న ఈ దేవాలయాన్ని కూడా ఎక్కవు సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు.

నాగేశ్వరనాథ్ టెంపుల్

నాగేశ్వరనాథ్ టెంపుల్

P.C: You Tube

ఈ దేవాలయాన్ని కుశుడు నిర్మించాడని చెబుతాడు. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటని భక్తుల నమ్మకం. ఈ దేవాలయాన్ని సందర్శించడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుందని నమ్ముతారు.

మణి పర్వతం

మణి పర్వతం

P.C: You Tube

హనుమంతుడు సంజీవిని పర్వతం తీసుకువచ్చే సమయంలో కొంత భాగం అయోధ్యలో పడిందని చెబుతారు. అదే మణి పర్వతం. అయోధ్య శివారులో ఈ పర్వతం ఉంటుంది. ఈ పర్వతం పై అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ పర్వత శిఖరం పైనే గౌతమ బుద్దుడు ఆరేళ్లపాటు ఉండి ప్రబోధాలు ఇచ్చాడని చెబుతారు.

ఎలా చేరుకోవాలి

ఎలా చేరుకోవాలి

P.C: You Tube

అయోధ్యను చేరుకోవడానిక రోడ్డు, వాయు, రైలు మార్గాలు ఉన్నాయి. అయోధ్యకు సమీపంలో అంటే 150 కిలోమీటర్ల దూరంలో లక్కో విమానాశ్రయం ఉంది. ఢిల్లీ, వారణాసి, అలహాబాద్ నగరాల నుంచి అయోధ్యకు రైలు మార్గాలు ఉన్నాయి. అదే విధంగా ఉత్తర భారత దేశంలో ప్రధాన పట్టణాల నుంచి ఇక్కడకు నిత్యం బస్సు సర్వీసులు ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X