Search
  • Follow NativePlanet
Share
» »శివుడు తాండవం ఆడే స్థలం : చిదంబరం !

శివుడు తాండవం ఆడే స్థలం : చిదంబరం !

తమిళనాడులో శివాలయాలకు కొదువలేదు. దీనికి కారణం అప్పటి పాండ్య, చోళ రాజులే. వారికి శివుని మీద ఎంత భక్తి ఉందో అక్కడి దేవాలయాలను చూస్తే ఇట్టే అర్థమవ్వుతుంది.

By Mohammad

శివుడు తాండవం చేసిన ప్రదేశం .. ఆ తాండవ నృత్యాన్ని చూసి విష్ణుమూర్తి పులకించి పోయిన ప్రదేశం ... తమిళనాడు లోని చిదంబరం. ఇది సముద్ర తీరానికి 11 కి. మి. దూరంలో మరియు చెన్నై కు దక్షిణంగా 250 కి. మి. దూరంలో కలదు.

ఇది కూడా చదవండి : తమిళనాడు - దేవాలయ గోపురాలు !

తమిళనాడులో శివాలయాలకు కొదువలేదు. దీనికి కారణం అప్పటి పాండ్య, చోళ రాజులే. వారికి శివుని మీద ఎంత భక్తి ఉందో అక్కడి దేవాలయాలను చూస్తే ఇట్టే అర్థమవ్వుతుంది. ఆ ఆలయాలలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది నటరాజ ఆలయం(చిదంబర ఆలయం). ఇది పంచభూత క్షేత్రాలలో ఒకటైన చిదంబరంలో కలదు (భూమి - కాంచీపురం, గాలి - శ్రీకాళహస్తి, నీరు- ట్రిచీ, అగ్ని - తిరువన్ణమలై, ఆకాశం - చిదంబరం).

నటరాజ ఆలయం

నటరాజ ఆలయం

పరమ శివుడు ఆనంద తాండవం చేస్తూ 'నటరాజు' గా వెలసిన చిదంబర ఆలయం (కోయిల్, తిల్లయ్ వగైరా వగైరా పేర్లు) 40 ఎకరాల సముదాయం లో, ఊరి నడిబొడ్డున ఉన్నది. ఈ దేవాలయానికి 9 ద్వారాలు, నాలుగు పెద్ద పురాతన గోపురాలు ఉన్నాయి.

చిత్ర కృప : Sankar

ఐదు సభలు లేక వేదికలు

ఐదు సభలు లేక వేదికలు

చిత్సబై - గర్భ గుడి
కనకసబై - నిత్య పూజలు జరిగే వేదిక
నాట్య సబై లేదా నృత్య సబై - శివుడు కాళి తో నాట్యమాడిన ప్రదేశం
రాజ్యసబై - భగవంతుని ఆధిపత్యాన్ని చాటి చెప్పిన సభ
దేవసబై - పంచమూర్తులు కొలువైన సభ

చిత్ర కృప : Min Tang

చిన్న చిన్న ఆలయాలు

చిన్న చిన్న ఆలయాలు

తిరుమూల తనేశ్వరర్, పార్వతి ఆలయం, శివగామి ఆలయం, గణేష్ ఆలయం, పాండియ నాయకం ఆలయం, గోవింద రాజ పెరుమాళ్ ఆలయం, పుండరీగవల్లి తాయార్ ఆలయాలతో పాటు చిదంబర ఆలయ ప్రాంగణంలో ఇంకా చిన్న చిన్న ఆలయాలు అనేకం ఉన్నాయి.

చిత్ర కృప : meg williams2009

ఆలయ రహస్యాలు

ఆలయ రహస్యాలు

చిదంబర ఆలయం, కాళహస్తి ఆలయం, కంచి లోని ఏకాంబరేశ్వరుని ఆలయం ఒకే రేఖాంశం మీద ఉన్నాయి. అవునండీ ..! కావాలంటే మీరే మ్యాప్ తీసి చూడండి. ఈ మూడు ఆలయాలు 71 డిగ్రీల 41 నిమిషాల రేఖాంశం మీద కనిపిస్తాయి . ఇది ఆశ్చర్యం కాదూ ...!

చిత్ర కృప : Christian Lagat

చిదంబర ఆలయం - మానవ శరీర భౌతిక ధర్మ శస్త్ర పోలికలు

చిదంబర ఆలయం - మానవ శరీర భౌతిక ధర్మ శస్త్ర పోలికలు

01) మానవులలోని నవ రంధ్రాలకు సూచనగా చిదంబరం ఆలయంలో 9 ద్వారాలు ఉంటాయి.
02) ఆలయ పైకప్పు 21600 బంగారు పలుకలు కలిగి, ఒక రోజులో ఓక్ వ్యక్తి తీసే శ్వాసల సంఖ్యను సూచిస్తుంది.
03) పలకలను చెక్కతో చేసిన పైకప్పుకి బిగించుటకు 72000 మేకులను ఉపయోగించారు ... ఇది మానవ శరీర నాడులను తెలియజేస్తుంది.
04) శరీరంలో గుండె ఏ విధంగైతే ఎడమవైపు ఉంటుందో, ఆలయంలోని గర్భగుడి ఎడమవైపు ఉంటుంది.

చిత్ర కృప : Dr.M.Mahender

చిదంబర ఆలయం - ప్రతికాత్మకత

చిదంబర ఆలయం - ప్రతికాత్మకత

01) చిత్స బై మీద ఉన్న 9 కలశాలు - 9 శక్తులను
02) కప్పు పై ఉన్న 64 అడ్డ దూలాలు - 64 కళలను
03) అర్ధ మండపంలోని 6 స్తంభాలు - 6 శాస్త్రాలను
04) పక్కనున్న మరో మండపంలోని 18 స్థంబాలు - 18 పురాణాలను
05) కనక సభ నుండి చిత్ సభ కు దారితీయు 5 మెట్లు - 5 అక్షరాల పంచాక్షర మంత్రం ను (నమః శివాయ)
06) చిత్ సభ పై కప్పుకు ఊతమిచ్చే నాలుగు స్తంభాలను - నాలుగు వేదాలకు ప్రతీకలుగా
07) గర్భ గుడి లోని 28 స్తంభాలు - 28 శైవ ఆగమాల ను సూచిస్తుంది

చిత్ర కృప : FabIndia

ఆలయ రహస్యాలు

ఆలయ రహస్యాలు

పాశ్చాత్య సైంటిస్ట్ ల 8 సంవత్సరాల పరిశోధన ల పుణ్యమా అని తెలిసిందేమిటంటే .. చిదంబర నటరాజ స్వామి విగ్రహం ఉన్న స్థలం భూమి యొక్క అయస్కాంత క్షేత్ర మధ్యలో ఉన్నదట .. అయితే ఇదే విషయాన్ని తిరుమూలన్ అనే ప్రాచీన పరిశోధకుడు 5 వేల ఏళ్ల క్రితమే చెప్పాడు.

చిత్ర కృప : Christian Lagat

అసలు రహస్యం

అసలు రహస్యం

నటరాజ స్వామి కి కుడివైపున ఒక ద్వారం ఉంటుంది. అక్కడ గోడ పై యంత్రం బిగించబడి ఉంటుంది. యంత్రం పై భాగాన దట్టమైన చందనం అద్దబడి ఉంటుంది. యంత్ర స్థలాన్ని భక్తులు కిటికీ గుండా కొద్ది క్షణాలు మాత్రమే వీక్షించాలి.

చిత్ర కృప : Christian Lagat

అసలు రహస్యం

అసలు రహస్యం

పూజ అయిపోయిన తరువాత పూజారి హారతి ఇచ్చి, ఆ వెలుగులో యంత్రం మీద ఉన్న తెర తొలగించి చూడమంటాడు. యంత్రంపై బంగారు బిల్వ పత్రాల మాల హారతి వెలుగులో కనిపిస్తుంది. తెర ఎత్తగానే ఒక అపురూపమైన దివ్య తేజం కనుల ముందు సాక్ష్యాత్కరిస్తుంది. అదే దేవుని ఉనికిని తెలియజేస్తుంది. అదే చిదంబర రహస్యం.

చిత్ర కృప : niledream

ఆలయం చుట్టుప్రక్కల ఉన్న జలాశయాలు/ కోనేరులు/తీర్థాలు

ఆలయం చుట్టుప్రక్కల ఉన్న జలాశయాలు/ కోనేరులు/తీర్థాలు

ఆలయం ప్రాంగణంలోని కోనేరు - శివ గంగ
ఆలయానికి తూర్పు వైపున - పరమానంద కూభం అనే బావి
ఆలయానికి ఈశాన్యాన - కుయ్య తీర్థం
ఆలయానికి దక్షిణాన - పులిమాడు
ఆలయానికి పడమర దిక్కున - వ్యాఘ్ర పథ తీర్థం, అనంత తీర్థం (దీనికి పడమర నాగసేరి కోనేరు)
ఆలయానికి వాయువ్యాన - బ్రహ్మ తీర్థం
ఆలయానికి ఉత్తరాన - శివ పిరియై కోనేరు
ఆలయానికి ఆగ్నేయాన - తిరుపర్కదాల్ కోనేరు

చిత్ర కృప : FabIndia

అచల్పురం ఆలయం

అచల్పురం ఆలయం

అచల్పురం చిదంబరం ఆలయానికి 25 కి. మీ. ల దూరంలో కలదు. ఆలయంలో శివుడు ప్రధాన దైవం. నాగ పాము చుట్టుకొని ఉన్న శివ లింగం రూపంలో విగ్రహం ఉంటుంది. పక్కనే పార్వతి దేవి కూడా దర్శనమిస్తుంది.

చిత్ర కృప : Adiyapatham Sundaresan

తిల్లై కాళీ అమ్మవారి ఆలయం

తిల్లై కాళీ అమ్మవారి ఆలయం

తిల్లై కాళీ అమ్మవారి ఆలయంలో కాళీ దేవత కొలువై ఉంటుంది. దేవత 4 ముఖాలు కలిగి అద్భుతమైన తేజస్సు తో వెలిగిపోతుంటుంది. ఒకనాడు శివుడు, పార్వతి మధ్య ఏదో అంశం మీద చర్చజరుగుతుంది. అనంతరం పార్వతి కోపానికి గురై కాళీ రూపాన్ని ధరిస్తుంది. శివుడు ఆమె కోపాన్ని తగ్గించటానికి బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు ఈ ప్రదేశంలో. సమీపంలోనే చాతపురినతార్ ఆలయం సందర్శించవచ్చు.

చిత్ర కృప : Manfred Sommer

పాశుపతేశ్వర ఆలయం

పాశుపతేశ్వర ఆలయం

శివుడు అర్జునునికి పాశుపతాస్త్రాన్ని ఇచ్చిన ప్రదేశం గా చెప్పవచ్చు. ఇక్కడ శివున్ని వేటగాని రూపంలో ప్రతిష్టించారు. ఇక్కడి అమ్మవారు నల్లనాయకి. సమీపంలో 1500 ఎకరాల్లో విస్తరించిన అన్నామలై విశ్వవిద్యాలయం, తిరువేత్కాలం కూడా చూడవచ్చు.

చిత్ర కృప : Arunshariharan

తిరునెల్వయిల్

తిరునెల్వయిల్

ఇదొక శివ స్థలం. ఇక్కడ రెండు విగ్రహాలు ఉంటాయి మరియు ప్రాంగణం అద్భుతమైన ప్రాచీన నిర్మాణ తమిళ కళ తో ఉట్టిపడుతుంది. నటరాజ, శివకామి వంటి పరమేశ్వరుని చిత్రాలతో కూడిన మరో ఆలయం ఇక్కడ ఉంది.

చిత్ర కృప : Nagappan Ramanathan

పిచ్చవరం

పిచ్చవరం

చిదంబరానికి 15 కి. మి. ల దూరంలో ఉన్న పిచ్చవరం టూరిస్ట్ స్పాట్. ఇక్కడి ప్రకృతి అందాలు, బ్యాక్ వాటర్ లో బోటు షికారు తప్పనిసరి.

చిత్ర కృప : raja sekaran

రూం, భోజనాలు

రూం, భోజనాలు

వసతి విషయానికి వస్తే, ఆలయానికి సమీపంలో చాలానే హోటళ్లు ఉన్నాయి అయితే రూం సర్వీస్ లు అంతగా బాగుండవు. భోజనానికి గుడి సమీపంలోని హోటళ్ళలోకి వెళితే లభిస్తుంది.

చిత్ర కృప : meg williams2009

చిదంబరం ఎలా చేరుకోవాలి ?

చిదంబరం ఎలా చేరుకోవాలి ?

సమీప విమానాశ్రయం - చెన్నై (250 కి. మీ)

రైలు మార్గం

చిదంబరం లో రైల్వే స్టేషన్ ఉన్నది. ఇది తిరుచ్చి - చెన్నై మార్గంలో కలదు. చెన్నై నుండి ఇక్కడికి ప్రతి రోజూ రైళ్ళు రాకపోకలు సాగిస్తుంటాయి.

రోడ్డు మార్గం

చెన్నై - పాండిచ్చేరి మార్గం లో చిదంబరం కలదు. ప్రవేట్, ప్రభుత్వ బస్సులు తరచూ ఈ మార్గం గుండా వెళుతుంటాయి.

చిత్ర కృప : Christian Lagat

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X