Search
  • Follow NativePlanet
Share
» »సంద‌ర్శ‌కుల‌ను మంత్ర‌ముగ్ధుల‌ను చేసే తిమ్మ‌మ్మ మ‌ర్రిమాను..

సంద‌ర్శ‌కుల‌ను మంత్ర‌ముగ్ధుల‌ను చేసే తిమ్మ‌మ్మ మ‌ర్రిమాను..

సంద‌ర్శ‌కుల‌ను మంత్ర‌ముగ్ధుల‌ను చేసే తిమ్మ‌మ్మ మ‌ర్రిమాను..

సీజన్ ఏదైనా ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించిన ఊడలు అక్కడ సేద దీరేందుకు సందర్శకులకు సాయపడతాయి. ప్రకృతి ప్రేమికులకు ప్రశాంతమైన వాతావరణాన్ని చేరువ చేస్తుంది ఆ మహావృక్షం. గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించి ప్రపంచఖ్యాతిని సొంతం చేసుకున్న తిమ్మమ్మ మర్రిమాను దగ్గర సేదదీరుదాం రండి!

అనంతపురం జిల్లా కేంద్రానికి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో, కదిరి పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది తిమ్మమ్మ మర్రిమాను. ఇది గూటిబయలు అనే చిన్న గ్రామంలో ఉంది. దక్షిణ భారతదేశంలో అతి పెద్ద వృక్షంగా పేరు పొందింది. ఈ మర్రి చెట్టు దాదాపు ఐదు చదరపు ఎకరాల కన్నా ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి ఉంటుంది. ఈ చెట్టుకు తిమ్మమ్మ అనే మహిళ గుర్తుగా పేరు పెట్టారు. 1989 లో తిమ్మమ్మ మర్రిమాను గిన్నీస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌ లో స్థానం పొందింది.

స్థానికుల విశ్వాసం

స్థానికుల విశ్వాసం

ఈ చెట్టు కింద తిమ్మమ్మ గుర్తుగా చిన్న గుడిని ఏర్పాటు చేశారు. అక్కడున్న శిలా ఫలకం మీద తిమ్మమ్మ 1394లో శెట్టి బలిజ శెన్నాక్క వెంకటప్ప, మంగమ్మలకు జన్మించింది. 1434లో సతీ సహగమనం చేసింది అని చెక్కబడి ఉంటుంది. 14వ శతాబ్ధంలో కొక్కంటి తుమ్మల, ఎద్దులోల్ల బురుజు లాంటి ప్రాంతాలు సామంతరాజుల పరిపాలనలో ఉండేవి. ఎద్దులోల్ల బురుజు బలిజకులం సంస్థానాదీసుల కోడలు తిమ్మమ్మ ఆమెకు బాలవీరయ్యతో వివాహం జరిగింది.

కొన్ని సంవత్సరాలకు ఆయనకు కుష్టువ్యాధిసోకి మరణించాడు. రాజరికపు పౌరుషాన్ని కాపాడుకోవాలని తలంపుతో, తన పతివ్రతా ప్రాశస్యతను గుర్తించి భర్తతో పాటు తానుకూడా చనిపోవాలని తిమ్మమ్మ నిశ్చయించుకుందట! ఈ క్రమంలో ఆమె సతీసహగమనం చేసింది. ఆమె ఆహుతి అయిన చోట నాలుగు దిక్కుల నాలుగు మర్రికొమ్మలు నాటారు. ఆ కొమ్మల్లో ఈశాన్యం వైపున నాటిన మర్రికొమ్మె నేడు తిమ్మమ్మ మర్రిమానుగా వ్యాపించిందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఏటా శివరాత్రి సందర్భంగా మూడురోజుల పాటు మర్రిచెట్టు దగ్గర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను తిలకించడానికి ప్రాంతాలనుంచి సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తారు.

రిగ్రేట్ కృషి ఫలితంగా!

రిగ్రేట్ కృషి ఫలితంగా!

మహావృక్షంగా మారిన ఈ మర్రి చెట్టు గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించింది. ప్రస్తుతం ఈ మర్రిచెట్టు ఏడు ఎకరాలలో 1,680 ఊడలతో విస్తరించి ఉంది. కర్నాటక ప్రాంతానికి చెందిన ప్రీలాన్స్ జర్నలిస్టు రిగ్రేట్ ఆయ్సర్ తిమ్మమ్మ మర్రిమానుకు గిన్నిస్ పుస్తకంలో చోటు కల్పించడానికి కృషి చేశారు. ఆయన కృషి ఫలితంగా నేడు తిమ్మమ్మ మర్రిమాను ప్రపంచానికి తెలిసి పర్యాటక కేంద్రంగా రూపాంతరం చెందింది. ఈశ్వరమలై అటవీప్రాంతానికి సమీపంలో ఉన్న ఈ తిమ్మమ్మ మర్రిమాను చుట్టూ అందమైన కొండలు, పచ్చని చెట్లు పర్యాటకులకు కలిగించే వాతావరణాన్ని అందిస్తాయి.

పర్యాటకుల సౌకర్యార్థం ఈ ప్రాంతంలో విశ్రాంతి కుటీరాలు, భవనాలు నిర్మించారు. తిమ్మమాంబ ఘాట్‌లో నిర్మించిన గదులు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వాటిని పొందుపరచే గిన్నిస్ బుక్ స్థానం సంపాదించిన తిమ్మమ్మ మర్రిమాను నేడు పర్యాటక కేంద్రంగా యాత్రికులు సందర్శిస్తున్నారు. ఈ వృక్షాన్ని నిత్యం రాష్ట్ర ప్రజలే కాకుండా కర్నాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలతో పాటు విదేశీయులు చూసేందుకు వస్తుంటారు.

అరకోరా సౌకర్యాలు

అరకోరా సౌకర్యాలు

ఈ ప్రాంతంలో అనేక వైవిధ్యభరితమైన అంశాలు దాగి ఉన్నాయి. మర్రిమాను వృక్షంపై ఏ పక్షి మల విసర్జన చెయ్యదని చెపుతారు. అంతే కాదు, సాయంత్రం ఆరు దాటాక పక్షులేవీ ఈ చెట్టుపై ఉండవు. ప్రస్తుతం ఈ వృక్షం మొదలువద్ద మరొక మొక్క మొదలయ్యింది. అంతటా ఈ ప్రాంతం ప్రసిద్ధిగాంచినా అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. మౌలిక వసతుల ఏర్పాటులో అలసత్వం కారణంగా ఇక్కడికి వచ్చే పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ ప్రాంతానికి వెళ్లడానికి ఆర్టీసీ బస్సుల సదుపాయం కూడా అంతంత మాత్రంగానే ఉంది. బస్సులు లేకపోవడంతో ఆటోలో వెళ్లాల్సి ఉంది. మర్రిమాను అభివృద్ధి బాధ్యత అటవీశాఖాధికారులకు అప్పజెప్పడంతో ఈ ప్రాంతంలో ఓ అతిథి గృహం ఏర్పాటు చేశారు. అది అరకొర సౌకర్యాలకే పరిమితమయింది.

Read more about: thimmamma marrimanu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X