Search
  • Follow NativePlanet
Share
» »బారెన్ అందాలు చూసొద్దాం?

బారెన్ అందాలు చూసొద్దాం?

బారెన్ ద్వీపం ఎలా చేరుకోవాలన్న విషయంతో పాటు అక్కడి పర్యాటక విశేషాలు మీ కోసం.

ఈ విశాల భారత దేశంలో భౌగోళిక స్వరూపం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందువల్లే ఆ ప్రకతి అందాలను ఆస్వాధించడానికి విదేశాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వేల సంఖ్యలో వస్తుంటారు. ఒక చోట పచ్చటి మైదాన, పర్వాత ప్రాంతాలు వారికి ఆహ్వీనం పలికితే మరో చోట సముద్ర తీర ప్రాంతాలు రారమ్మని పిలుస్తుంటాయి. అయితే భారతదేశంలో పర్యాటకపరంగా అంతగా ప్రాచూర్యంలోకి రాని ఎన్నో ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి కోవకు చెందినదే బారెన్ ద్వీపం. ఈ ద్వీపానికి సంబంధించిన వివరాలన్నీ మీ కోసం...

బారెన్ ద్వీపం

బారెన్ ద్వీపం

P.C: You Tube

అండమాన్ దీవుల్లో ఒక దీవే బారెన్ ద్వీపం. ఇది పోర్ట్ బ్లెయిర్‌కు సుమారు 138 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ క్రియాశీలంగా ఉండే అగ్నిపర్వతం ఉంది. దక్షిణ ఆసియాలో క్రియాశీలంగా ఉండే అగ్నిపర్వతం ఇక్కడ మాత్రమే ఉంటుంది.

బారెన్ ద్వీపం

బారెన్ ద్వీపం

P.C: You Tube

ఇక్కడ పర్యటకులు ముఖ్యంగా ఫొటోగ్రఫీ అంటే ఇష్టపడేవారు ఎక్కువగా వస్తుంటారు. అదేవిధంగా సాహస క్రీడలను ఎంతగానో ఇష్టపడేవారు ఈ బరెన్ ద్వీపానికి వస్తుంటారు. ముఖ్యంగా అత్యంత స్వచ్చమైన సముద్రపు నీటితో కూడి ఉండటం వల్ల ఇక్కడ స్కూబా డైవింగ్‌కు అత్యంత అనుకూలంగా ఉంటుంది.

బారెన్ ద్వీపం

బారెన్ ద్వీపం

P.C: You Tube

అందువల్లే ఇక్కడకు వచ్చేవారు ఎక్కువగా స్కూబా డైవింగ్ కోసమే ఇక్కడికి వస్తుంటారు. స్కూబా డైవింగ్ వల్ల సముద్రపులోపల ఉన్న జలచరాలతో కలిసి మనం ఈతకూడ కొట్టవచ్చు. అంతేకాకుండా పగడపు దీవుల అందాలను కూడా మనం ఆస్వాధించవచ్చు.

బారెన్ ద్వీపం

బారెన్ ద్వీపం

P.C: You Tube

ఇది అగ్నిపర్వత ప్రాంతమైనందువల్ల ఇక్కడ జీవవైవిద్యం కొంత తక్కువగానే ఉంటుంది. ఎటువంటి చెట్లు మనకు కనిపించవు. అయితే కఠిన పరిస్థితులను కూడా తట్టుకొని నిలబడే కొన్ని రకాల ఎలుకలు, నక్కలతో పాటు అత్యంత అరుదైన పక్షులు ఇక్కడ మనకు కనిపిస్తాయి.

బారెన్ ద్వీపం

బారెన్ ద్వీపం

P.C: You Tube

అందువల్లే ఇక్కడకు శాస్త్రవేత్తలు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడ కనిపించే మేకల పై ఎక్కువ పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. పర్యాటక పరంగా ఇది అంత ఆధారణ పొందకున్నా ఇప్పుడిప్పుడే స్కూబా డైవింగ్ కోసం వచ్చే వారి సంఖ్య ఇక్కడ పెరుగూతూ వస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X