Search
  • Follow NativePlanet
Share
» »మేఘాల్లో తేలిపోవాలంటే మేఘమలై ఉందిగా

మేఘాల్లో తేలిపోవాలంటే మేఘమలై ఉందిగా

మేఘమలై పర్యాటక ప్రాంతానికి సంబంధించిన కథనం.

తమిళనాడులోని తేణి జిల్లాలో జిల్లాకేంద్రం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్వత ప్రాంతమే మేఘమలై. సముద్రమట్టం నుంచి దాదాపు 1,500 మీటర్ల ఎత్తైన ఈ ప్రదేశంలో ప్రకతిలోని అందాలన్నీ దాగిఉన్నాయి. చుట్టూ కనుచూపు మేర పచ్చటి మైదానం, అందంగా జాలువారే జలపాతాలకు ఇక్కడ కొదువులేదు. బర్డ్ వాచర్స్ కు ఇది స్వర్గధామం. ఇక అనేక వన్యప్రాణాలకు నిలయమైన ఈ మేఘమలై పర్యాటక ప్రాంతానికి సంబంధించిన వివరాలు మీ కోసం...

76 కిలోమీటర్లు

76 కిలోమీటర్లు

P.C: You Tube

తేణి నుంచి మేఘమలై కు 76 కిలోమీటర్ల దూరం కాగా, తమిళనాడులోని మరో ముఖ్యపర్యాటక కేంద్రమైన మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో తణి ఉంటుంది. మధురై నుంచి నిత్యం ఇక్కడకు అనేక బస్సులు ఉంటారు.

రవాణా సౌకర్యాలు

రవాణా సౌకర్యాలు

P.C: You Tube

మధురైకు తమిళనాడుతో పాటు దేశంలోని వివిధ నగరాల నుంచి రైలు, విమానసేవలు అందుబాటులో ఉంటాయి. ఇక బెంగళూరు నుంచి మేఘమలైకు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవాలంటే 501 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది.

వసతి ఇలా

వసతి ఇలా

P.C: You Tube

మేఘమలైలో వసతి కొంత కష్టంతో కూడుకున్నదే. ఇక్కడికి రావడానికి ముందే హోటల్స్ రూమ్ ను రిజర్వ్ చేసుకోవడం ఉత్తమం. సెప్టెంబర్ నుంచి మే మధ్య ఇక్కడ ప్రక`తి అందాలను చూడటానికి ఎక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు.

మేఘమలై అభయారణ్యం

మేఘమలై అభయారణ్యం

P.C: You Tube

ఇక్కడ ముఖ్యంగా చూడదగిన ప్రాంతాల్లో 600 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మేఘమలై అభయారణ్యం ముఖ్యమైనది. ముఖ్యంగా వీకెండ్ సమయంలో ఈ ప్రాంతం పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న జలపాతాల్లోకెల్లా మేఘమలై జలపాతం ప్రత్యేకమైనది. దాదాపు 190 అడుగుల ఎత్తు నుంచి ఈ జలపాతం కిందికి దుముకుతూ ఉంటుంది.

ఆకర్షించే టీ తోటలు

ఆకర్షించే టీ తోటలు

P.C: You Tube

ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన ఆకర్షణీయ స్థలాల్లో టీ, సుగంధ ద్రవ్యాల తోటలది ప్రత్యేక స్థానం. ఈ తోటల వెంబడి నడుచుకుని వెలుతూ ఉంటే సమయం ఇట్టే గడిచిపోతుంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న సురులి పాల్స్, మనలార్ డ్యాం తదితర ఎన్నో ప్రాతాలు పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తూ ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X