Search
  • Follow NativePlanet
Share
» » ఈసారి దసరా కు మైసూరు వెళుతున్నారా? ఈ విషయాలన్నీ మీకు తెలుసా

ఈసారి దసరా కు మైసూరు వెళుతున్నారా? ఈ విషయాలన్నీ మీకు తెలుసా

మైసూరు దసరా సందర్భంగా కథనం.

కర్నాటకలోని మైసూరు దసరా భారత దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో జరిగే దసరాలతో పోలిస్తే విభిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఉత్సవాలు అలనాటి రాచరిక వైభవాన్ని గుర్తుకు తెస్తాయి. ఒక వైపు సంప్రదాయాన్ని పాటిస్తూనే మరోవైపు అధునిక సంగీత, నాట్యాల మేళవింపుగా ఈ ఉత్సవాలు సాగుతాయి. ఈ ఉత్సవాలను తిలకించడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ప్రపంచంలోని నలువైపుల నుంచి కూడా పర్యాటకులు మైసూరుకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మైసూరులో ఉత్సవాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ జరుగుతాయి, అక్కడ ఉత్సవాల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర వివరాలన్నీ మీ కోసం....

మైసూరు దసరా

మైసూరు దసరా

P.C: You Tube

మైసూరులో దసరా ఉత్సవాలను క్రీస్తుశకం 1610లో రాజా వడయార్-1 ఈ ఉత్సవాలను ప్రారంభించారు. చాముండి హిల్స్ పై ఉన్న దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేయడం ద్వారా ఈ ఉత్సవాలను మొదలు పెట్టారు.

మైసూరు దసరా

మైసూరు దసరా

P.C: You Tube
అటు పై క్రీస్తుశకం 1805లో క`ష్ణరాజ వడయార్ -3 ప్రజాదర్బర్ ను ఈ ఉత్సవాల సందర్భంగా నిర్వహించడం ప్రారంభించారు. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సాధారణంగా భారత దేశం మొత్తం మీద దసరా ఉత్సవాలు ఒకటి నుంచి మూడు రోజులు మాత్రమే జరుగుతాయి.

మైసూరు దసరా

మైసూరు దసరా

P.C: You Tube
అయితే మైసూరు దసరా ఉత్సవాలు మాత్రం పది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అంటే అక్టోబర్ 10 నుంచి 19 వరకూ ఈ ఉత్సవాలను జరుపుతారు. రాచనగరి మైసూరులో చాముండి హిల్స్ మొదలుకొని ఆడిటోరియం, మైసూరు ప్యాలెస్, ఎగ్జిబిషన్ గ్రౌండ్ తదితర అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయి.

మైసూరు దసరా

మైసూరు దసరా

P.C: You Tube
ఈ ఉత్సవాల సందర్భంగా మైసూరు ప్యాలెస్ ను లక్షబల్బులతో అలంకరణ చేస్తారు. రాత్రి 7 గంటల నుంచి మొదలు 10 గంటల వరకూ ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ దసరా ఉత్సవాల సందర్భంగా అప్పటి వరకూ భద్రపరిచిన బంగారు సింహాసనాన్ని బయటికి తీస్తారు.

మైసూరు దసరా

మైసూరు దసరా

P.C: You Tube
దీని పై మైసూరు రాజకుటుంబానికి చెందిన రాజు ప్రజాదర్భార్ ను నిర్వహిస్తారు. కేవలం దసరా ఉత్సవాల సందర్భంగా మాత్రమే చూడటానికి వీలవుతుంది. ఇక మైసూరు దసరా ఉత్సవాల సందర్భంగా ప్రధాన ఆకర్షణ జంబూసవారి.

మైసూరు దసరా

మైసూరు దసరా

P.C: You Tube
ఇధి ఉత్సవాల చివరి రోజున జరుగుతుంది. జంబూసవారి మైసూరు ప్యాలెస్ నుంచి బన్ని మంటపం వరకూ సాగుతుంది. ఈ సందర్భంగా చాముండి మాతను అందంగా అలంకరించిన ఏనుగు పై ఊరేగిస్తారు.

మైసూరు దసరా

మైసూరు దసరా

P.C: You Tube
అంతేకాకుండా నాట్యాలు, సంగీత కచేరీలతో ఆ ప్రాంతం మొత్తం కొత్త కాంతులను సంతరించుకొంటుంది. ఇక చివరిగా టార్చ్ లైట్ పెరెడ్ (దీనిని పంజిన కవాయితు)తో కాగడాలు పట్టుకొని చేసే విన్యాసాలను చూడాల్సిందే.

మైసూరు దసరా

మైసూరు దసరా

P.C: You Tube
అదే విధంగా మోటార్ సైకిల్ స్టంట్స్, లేజర్ షో కూడా ప్రత్యక్ష ఆకర్షణ. ఇక యువ దసరా కూడా ప్రధాన ఆకర్షణ. ఇక ఈ ఉత్సవాల కోసం కర్నాటక రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.

మైసూరు దసరా

మైసూరు దసరా

P.C: You Tube
ప్యాలెస్ ఆణ్ వీల్స్ పేరుతో ఒక రోజు మొత్తం పర్యాటకానికి రూ.999 వసూలు చేస్తుంది. లలిత్ మహల్ ప్యాలెస్ లోనే భోజన సదుపాయం కూడా ఉంటుంది. ఇక ఏరియల్ వివ్యూ కోసం హెలిక్యాప్టర్ కూడా సిద్ధంగా ఉంటుంది.

మైసూరు దసరా

మైసూరు దసరా

P.C: You Tube
10 నిమిషాల పర్యటక కోసం రూ.2,300 వసూలు చేస్తారు. గోల్డెన్ చారియట్ కూడా ఈసారి అందుబాటులోకి తీసుకువచ్చారు. భారతీయులకు టికెట్ ధర రూ.25వేలు కాగా, విదేశీయులకు రూ.40 వేలు.

మైసూరు దసరా

మైసూరు దసరా

P.C: You Tube
ఇందులోనే సైట్ సీయింగ్ తో పాటు భోజన ఖర్చులు కూడా ఉంటాయి. జంబూసవారి తో సహా అన్ని ఉత్సవాలను తిలకించడానికి గోల్డెన్ పాస్ తీసుకుంటే సరి.

మైసూరు దసరా

మైసూరు దసరా

P.C: You Tube
మన బడ్జెట్ హోటల్స్ నుంచి స్టార్ హోటల్స్ వరకూ మనకు ఇక్కడ ఉండటానికి వసతి ఉంటుంది. ఇక చుట్టు పక్కల తిరగడానికి ట్రిన్ ట్రిన్ సైకిల్ అందుబాటులో ఉంటుంది. ఒక్కొక్క రోజుకు రూ.50 వారానికి రూ.150 అద్దె వసూలు చేస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X