Search
  • Follow NativePlanet
Share
» »విభూతి తో అభిషేకం - తిరుచందూర్ !

విభూతి తో అభిషేకం - తిరుచందూర్ !

By Mohammad

తిరుచెందూర్ దక్షిణ భారతదేశంలోని ఆనందమైన కోస్తా తీర పట్టణం. తమిళనాడులోని తూతుకుడి జిల్లాలో కలదు. తమిళనాడులోని తిరునల్వేలికి 60 కి.మీ. దూరం లో సముద్రపు అంచున తిరుచందూర్ వుంది. ఇక్కడ సుబ్రహ్మన్యేశ్వర స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది.

ఆ పేరెలా వచ్చింది ?

తిరుచెందూర్ ను గతంలో 'కాపాడపురం' అనే వారు. తర్వాతి కాలంలో తిరుచేన్ చెందిలూర్ అని మరియు తర్వాత తిరుచెన్ - చెందిలూర్ అని ఆతర్వాత తిరుచెందూర్ అని పిలిచారు. తిరుచెందూర్ ను అనేక రాజ వంశాలు పాలించాయి. వారిలో చెరలు, పంద్యాలు మొదలైన వారు కలరు.

ఇది కూడా చదవండి : ట్రిచి - అరుదైన దేవాలయాల సమూహం !

తిరుచెందూర్ చుట్టూ తీర ప్రాంత అడవులు, తాటిచెట్లు, జీడిపప్పు మొక్కలు మొదలైనవి ఉన్నాయి. పురాణాల మేరకు మురుగన్ తిరుచెందూర్ లో సురపద్మన్ అనే రాక్షసుడిని వధించాడు. అప్పటి నుండి ఈ ప్రదేశం మురుగన్ పవిత్ర స్థలంగా భావిస్తూ వస్తుంది.

తిరుచెందూర్ మురుగన్ ఆలయం విశిష్టత

తిరుచెందూర్ మురుగన్ ఆలయం విశిష్టత

తిరుచెందూర్ లో సుబ్రహ్మన్యేశ్వర స్వామి అత్యంత సంపన్నుడు . తారకాసుర సంహారం తర్వాత అతని తమ్ముడు శూర పద్ముడు పారి పొతే కుమార స్వామి వెంబడిస్తే, అతను మామిడి చెట్టు గా మారిపోయాడు. స్వామి, బల్లెం తో చెట్టు నుంచి చీల్చి వాణ్ని చంపేశాడు. అప్పుడు ఆ చెట్టు లో ఒక భాగం నెమలి గా, రెండో భాగం కోడిగా మారాయి.

చిత్ర కృప : Aravind Sivaraj

తిరుచెందూర్ మురుగన్ ఆలయం విశిష్టత

తిరుచెందూర్ మురుగన్ ఆలయం విశిష్టత

ఆ రెండిటిని కుమార స్వామి వాహనాలుగా చేసుకొన్నాడు. ఆయన ఆయుధమైన బల్లెం, ఆయనకు చిహ్నం గా పూజలందు కొంటుంది ఇక్కడ. ఇక్కడి శరవణ భవుడైన కుమార స్వామికి ఉదయం పది గంటలకు, సాయంత్రం ఆరు గంటలకు విభూతితో అభిషేకం రెండు సార్లు జరగటం విశేషం. సముద్రపు ఒడ్డున ఒక బావిలో తియ్యని నీరు లభించటం మరో గొప్ప విచిత్రం.

చిత్ర కృప : raj munisami

తిరుచెందూర్ మురుగన్ ఆలయం విశిష్టత

తిరుచెందూర్ మురుగన్ ఆలయం విశిష్టత

తిరుచెందూర్ మురుగన్ ఆలయంలో మురుగన్ భార్యలైన వల్లి మరియు దేవసేన విగ్రహాలు ఉంటాయి. వేదకాలం నుండి ఉన్న ఈ ఆలయంలో శివుడు, విష్ణువు విగ్రహాలతో పాటు ప్రాచీన గ్రంధాలు కలవు.

చిత్ర కృప : Raja Ravi Varma

వనతిరుపతి ఆలయం

వనతిరుపతి ఆలయం

పున్నైనగర్ లోని వనతిరుపతి ఆలయాన్ని తప్పక సందర్శించాలి. ఇది తిరుచెందూర్ నుండి 20 KM ల దూరంలో కాచనవలి స్టేషన్ వద్ద కలదు.

చిత్ర కృప : KAMALAKANNAN.K

మేలపుతుకూది ఆలయం

మేలపుతుకూది ఆలయం

మేలపుతుకూది గ్రామంలోని అయ్యనార్ ఆలయం తిరుచెందూర్ కు 10 KM ల దూరంలో కలదు. ఈ గ్రామం చుట్టూ అందమైన నీటి కొలనులు , వాటి మధ్యలో అయ్యనార్ ఆలయం చుట్టూ తోటలు ఉన్నాయి. ఇది తమిళనాడులోని అందమైన ప్రదేశాలలో ఒకటి.

చిత్ర కృప : venkat_lvh

వల్లి గుహలు

వల్లి గుహలు

వల్లి గుహలు తిరుచెందూర్ మురుగన్ ఆలయానికి సమీపంలో ఉన్న సముద్ర తీర ప్రాంతంలో కలదు. ఇక్కడి నుండి సముద్ర అందాలను వీక్షించవచ్చు . ఈ వల్లి గుహలను దత్తాత్రేయ గుహలు అని కూడా పిలుస్తారు. గుహలో మురుగన్, వల్లి, దత్తాత్రేయ విగ్రహాలు ఉంటాయి. అలాగే వివిధ దేవుళ్ళ చిత్రాలు, పెయింటింగ్ లు చూడవచ్చు.

చిత్ర కృప : எஸ்ஸார்

కుదిరి మొజి తేరి

కుదిరి మొజి తేరి

కుదిరి మొజి తేరి అనేది ఒక అందమైన పిక్నిక్ స్పాట్. ఇది తిరుచెందూర్ కు 12 KM ల దూరంలో కలదు. ఇక్కడి సహజ ఆకర్షణ నీటి బుగ్గ.

కట్టబొమ్మాన్ మెమోరియల్ ఫోర్ట్

కట్టబొమ్మాన్ మెమోరియల్ ఫోర్ట్

దీనిని మొదట పంచాలంకురిచి కోట అనేవారు. దీనిని పంచాలంకురిచి వంశానికి చెందిన రాజు వీర పాండ్య కట్టబొమ్మన్ నిర్మించాడు. ఇందులో వారి కులదేవత అయిన జక్కమ్మ గుడి కలదు. ప్రస్తుతం ఆర్కియలాజికల్ వారు ఈ కట్టడాన్ని నిర్వహిస్తున్నారు.

చిత్ర కృప : Nellai S S Mani

తిరుచెందూర్ ఎలా చేరుకోవాలి ?

తిరుచెందూర్ ఎలా చేరుకోవాలి ?

బస్సు/ రోడ్డు ద్వారా : చెన్నై, మధురై, తిరునల్వేలి, త్రివేండ్రం మరియు కన్యాకుమారి తదితర ప్రాంతాల నుండి తిరుచెందూర్ కు ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు కలవు.

రైలు ద్వారా : తిరుచందూర్ కు సమీపాన 60 km ల దూరంలో తిరునల్వేలి జంక్షన్, 27 km ల దూరంలో ట్యుటికోరన్ ఎయిర్ పోర్ట్ కలదు.

విమానం ద్వారా : సమీపాన 27 km ల దూరంలో ట్యుటికోరన్ ఎయిర్ పోర్ట్ కలదు. అలాగే 150 km ల దూరంలో త్రివేండ్రం అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ కూడా కలదు.

చిత్ర కృప : Paulshutter

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X