Search
  • Follow NativePlanet
Share
» »చెడు కలల నుంచి విముక్తిని ఇచ్చే దేవాలయం ఇదే

చెడు కలల నుంచి విముక్తిని ఇచ్చే దేవాలయం ఇదే

కలవర పరిచే కలల నుంచి విముక్తి కోసం కేరళ ప్రజలు ఎక్కువగా వెలుతున్న భగవతి అమ్మాన్ దేవాలయానికి సంబంధించిన కథనం

By Beldru Sajjendrakishore

ప్రతి ఒక్కరికి కలలు వస్తుంటాయి. వాటిలో మనస్సును సంతోషపెట్టేవి కొనైతే మరికొన్ని కలవర పరుస్తుంటాయి. సంతోషపెట్టే కలలు మళ్లీ మళ్లీ రావాలని కోరుకుంటాం. అయితే కలవర పరిచే కలలు వచ్చిన తర్వాత ఏ పని చేయబుద్ధి కాదు. ఒక్కొక్కసారి సదరు కలలు మనలను చెడుపనులకు కూడా ప్రోత్రహింస్తుంటాయి. ఈ విషయాలన్నీ చాలా మందికి అనుభవ పూరకమే. కలలు ఎందుకొస్తాయి అన్న విషయాన్ని పక్కనపెడితే కలవర పరిచే కలలు రాకుండా చేయగలమా. ఏ క్షేత్రానికి వెలితే ఇందుకు పరిహారం దొరుకుతుంది తదితర విషయాలకు సంబంధించిన కథనం...

1. పరిహారం

1. పరిహారం


Image source

కలవరే పరిచే కలలు వస్తుంటే మన:శాంతి కరువవుతుంది. దీంతో ఏ తదుపరి క్షణం ఏమి జరుగుతుందో అన్న ఆలోచన మనలను స్థిమితంగా ఒకచోట ఉండనివ్వదు. ఇందుకు పరిహారం కనుగొనాల్సిందే.

2. నెట్టూరు భగవతి అమ్మన్

2. నెట్టూరు భగవతి అమ్మన్


P.C Aruna

ఇందు కోసం కేరళలోని నెట్టూరు భగవతి అమ్మన్ దేవాలయానికి ఒకసారి వెళ్లాల్సిందే. ఈ దేవాలయాన్ని కొడుంగళూరు భగవతీ అమ్మాన్ దేవాలయం అని కూడా అంటారు. ఇక్కడకు వెళితే చెడు కలల నుంచి విముక్తి లభిస్తుందనేది స్థానికుల ప్రగాడ విశ్వాసం

3. పాముల కలలు వస్తూ ఉంటే

3. పాముల కలలు వస్తూ ఉంటే

P.C Aruna


ముఖ్యంగా కలలో పదే పదే పాములు రావడం, ఆ కలలు వచ్చిన తర్వాత ఇంట్లో అనుకోని ఉపద్రవాలు జరుగడం తదిర ఆపదల నుంచి కాపాడాల్సిందిగా చాలా మంది ఈ దేవాలయానికి వస్తుంటారు.

4. ఐదు శిరస్సుల పాము

4. ఐదు శిరస్సుల పాము

P.C Aruna


ఇక్కడ ప్రధానంగా ఐదు శిరస్సుల పాము విగ్రహం ఉంటుంది. దీనికి పుష్పాంజలి సేవ చేయడం వల్ల సదరు కలవర పరిచే కలల నుంచి విముక్తి లభిస్తుందని పూజారులు చెబుతారు.

5. శివుడికి కూడా

5. శివుడికి కూడా

P.C Aruna


ఇదే దేవాలయంలో శివుడు గణపతితో పాటు నవగ్రహాలకు కూడా భక్తులు పూజలు చేస్తారు. భూత గణాలకు శివుడు అధిపతి కారణంతో పుష్పాంజలి పూజ తర్వాత ఆయనకు విధిగా పూజలు చేయాలనేది ఇక్కడ ఆచారం.

6. ఇక్కడ ఉంది

6. ఇక్కడ ఉంది


P.C Sujithvv

చెన్నై నుంచి 690 కిలోమీటర్ల దూరంలో కొయంబత్తూరు నుంచి 264 కిలోమీటర్ల దూరంలో అలపుళ అనే చిన్న పట్టణంలో ఈ భగవతి అమ్మన్ దేవాలయం ఉంటుంది.

7. ప్రయాణ సౌకర్యాలు

7. ప్రయాణ సౌకర్యాలు

Image source:

చెన్నైకు హైదరాబాద్, బెంగళూరు నుంచి నేరుగా విమానయాన సర్వీసులు ఉన్న విషయం తెలిసిందే. అదే విధంగా రైలు సౌకర్యం కూడా ఉంది. చెన్నై నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం చేసి అలపుళను చేరుకోవచ్చు.

8. ఇతర పర్యాటక కేంద్రాలు

8. ఇతర పర్యాటక కేంద్రాలు

Image source:

అలప్పీ బోట్ హౌస్, మున్నార్, కోవలం తదితర పర్యాటక ప్రాంతాలు ఈ దేవాలయానికి దగ్గరగా ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X