Search
  • Follow NativePlanet
Share
» » ఇక్కడికే వెళితే మోక్షం, అదృష్టం ఉంటే అనంత చోళ సంపద మీ చెంతకు

ఇక్కడికే వెళితే మోక్షం, అదృష్టం ఉంటే అనంత చోళ సంపద మీ చెంతకు

త్యాగరాజ దేవాలయానికి సంబంధించిన కథనం.

భారత దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాల నిర్మాణం అప్పటి రాజుల వైభవానికి ప్రతీకలు. అంతేకాకుండా ఇప్పటి కాలంతో పోలిస్తే అప్పట్లో ఆ దేవాలయాలు సామాజిక కార్యక్రమాలను నిర్వహణ కేంద్రాలుగా ఉండేవి. అంతేకాకుండా బ్యాంకులుగా కూడా పనిచేసేవి. అశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఆయా ప్రాంత రాజులు ఎందరో తమ వద్ద ఉన్న సంపదను ఆ ఆలయాల్లో నిల్వ చేసేవారు. ఇందుకు కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం ప్రత్యక్ష ఉదాహరణ. అటు వంటి దేవాలయాలు భారత దేశంలో ఎన్నో ఉన్నాయి. అటువంటి ఓ దేవాలయానికి సంబంధించిన వివరాలు మీ కోసం...

ఇక్కడ పురుషులు మహిళలైతే మాత్రమే మంచి ఉద్యోగం దొరుకుతుందిఇక్కడ పురుషులు మహిళలైతే మాత్రమే మంచి ఉద్యోగం దొరుకుతుంది

శ్రీరాముడు నిర్మించిన ఈ తీర్థంలో స్నానం చేస్తే సర్వ రోగాలు బలాదూర్శ్రీరాముడు నిర్మించిన ఈ తీర్థంలో స్నానం చేస్తే సర్వ రోగాలు బలాదూర్

దక్షయాగం జరిగిన ప్రదేశం ఏడాదికి నాలుగు నెలలు మాత్రమే సందర్శనకు అనుమతిదక్షయాగం జరిగిన ప్రదేశం ఏడాదికి నాలుగు నెలలు మాత్రమే సందర్శనకు అనుమతి

చోళరాజులు

చోళరాజులు

P.C: You Tube

భారత దేశ చరిత్రలో చోళులది ప్రత్యేక స్థానం. వీరు పాలనతో పాటు ఆధ్యాత్మిక, ధార్మిక విషయాలకు అంతే ప్రాధాన్యత కల్పించారు. ముఖ్యంగా అనేక దేవాలయాలు కట్టించారు.

కృష్ణుడి నిర్యాణం జరిగిన ప్రాంతం ఓ పెద్ద పుణ్యక్షేత్రం మీకు తెలుసా?కృష్ణుడి నిర్యాణం జరిగిన ప్రాంతం ఓ పెద్ద పుణ్యక్షేత్రం మీకు తెలుసా?

త్యాగరాజ దేవాలయం

త్యాగరాజ దేవాలయం

P.C: You Tube

అలా చోళులు కట్టించిన దేవాలయాల్లో త్యాగరాజ దేవాలయం కూడా ఒకటి. ఇందులో వజ్ర, వైడూర్య, బంగారంతో తయారు చేయబడిన ఎన్నో ఆభరణాలు రహస్యంగా దాచి పెట్టారని చెబుతారు.

తిరువరూరు జిల్లా

తిరువరూరు జిల్లా

P.C: You Tube

తంజావూరు, నాగపట్టినం మధ్యలో తిరువరూరు జిల్లా ఉంది. ఈ జిల్లాలో అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో త్యాగరాజ దేవాలయం కూడా ఒకటి. ఇక్కడ ప్రధాన దైవం శివుడు.

శివుడిని

శివుడిని

P.C: You Tube

ఈ శివుడిని ఇక్కడ త్యాగరాజ పేరుతో కొలుస్తారు. ఇక్కడ పరమశివుడు స్వయంభువు. కావేరి దక్షిణ భాగంలో ఉన్న ఈ దేవాలయంలోని మూలవిరాట్టు చూడటానికి విలక్షణంగా ఉంటుంది.

9 రాజగోపురాలు

9 రాజగోపురాలు

P.C: You Tube

భారతీయ వాస్తుకళకు ఈ దేవాలయం ప్రతీక. 9 రాజగోపురాలు, 12 ప్రాకారాలతో పాటు 15 బావులను మనం ఈ దేవాలయం ప్రాంగణంలో చూడవచ్చు. ఈ దేవాలయం ప్రాంగణంలో మొత్తం 365 లింగాలు ఉంటాయి.

80 వినాయక విగ్రహాలు

80 వినాయక విగ్రహాలు

P.C: You Tube

ఈ దేవాలయంలో 80 మునుల, వినాయక విగ్రహాలు ఉన్నాయి. ఈ దేవాలయం చూడటానికి ఒక రోజు మొత్తం సరిపోదనడం అతిశయోక్తి కాదు. అంతే కాకుండా ఈ దేవాలయం చుట్టు పక్కల కూడా ఎన్నో పర్యాటక కేంద్రాలు ఉన్నాయి.

రథోత్సవం

రథోత్సవం

P.C: You Tube

త్యాగరాజ స్వామి దేవస్థానం రథోత్సవాన్ని ఏప్రిల్ - మే నెలల్లో ఆచరిస్తారు. ఈ రథం సుమారు 300 టన్నుల బరువు ఉంటుంది. 90 అడుగుల ఎత్తు ఉన్న ఈ రథాన్ని ముందుకు లాగడానికి భక్తులు పోటీ పడుతారు.

లక్షల మంది భక్తులు

లక్షల మంది భక్తులు

P.C: You Tube

ఈ ఉత్సవంలోపాల్గొనడానికి తమిళనాడు నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. ఆ సమయంలో దేవాలయ ప్రాంగణం మొత్తం ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారు.

గర్భగుడిలో

గర్భగుడిలో

P.C: You Tube

త్యాగరాజ దేవాలయం గర్భగుడిలో, రెండో ప్రకారలో అనంత ఐశ్వర్యం కలిగిన రెండు రహస్య గదులు ఉన్నాయని చెబుతారు. వీటి ద్వారాలను మనం ఇప్పటికీ చూడవచ్చు. అయితే వాటిని శాశ్వతంగా మూసివేశారు.

పతనమయ్యే సమయంలో

పతనమయ్యే సమయంలో

P.C: You Tube

చోళ రాజ్యం పతనమయ్యే సమయంలో అప్పటి రాజులు తమ వద్ద ఉన్న ధనరాసులు, వజ్రాలు వైడ్యూర్యాలు ఇక్కడ దాచారని చెబుతారు. అప్పడుడప్పుడు ఈ దేవాలయం చుట్టు పక్కల కొంతమందికి సదరు వజ్రాలు, బంగారు, వెండి నాణ్యాలు దొరికాయని చెబుతారు. ఇందులో పర్యాటకులు కూడా ఉన్నారు.

పతనమయ్యే సమయంలో

పతనమయ్యే సమయంలో

P.C: You Tube

చోళ రాజ్యం పతనమయ్యే సమయంలో అప్పటి రాజులు తమ వద్ద ఉన్న ధనరాసులు, వజ్రాలు వైడ్యూర్యాలు ఇక్కడ దాచారని చెబుతారు. అప్పడుడప్పుడు ఈ దేవాలయం చుట్టు పక్కల కొంతమందికి సదరు వజ్రాలు, బంగారు, వెండి నాణ్యాలు దొరికాయని చెబుతారు. ఇందులో పర్యాటకులు కూడా ఉన్నారు.

జలకంటేశ్వరాలయం

జలకంటేశ్వరాలయం

P.C: You Tube

ఈ దేవాలయమే కాకుండా రాయ వేలూరు కోటలో ఉన్న జలకంఠేశ్వరాలయం. ఇది అతి పురాతనమైనది. ఈ దేవాలయాలయాన్ని శ్రీ క`ష్ణ దేవరాయలు కట్టించారు.

సదాశివరాయులు

సదాశివరాయులు

P.C: You Tube

విజయనగర సామ్రాజ్యాధినేత సదాశివరాయుల కాలంలో ఈ దేవాలయం కట్టబడింది. విజయ నగర పతనం సమయంలో విజయనగర రాజులు తమ సంపదలో కొంత భాగన్ని ఆంధ్రప్రదేశ్ లోని పెనుగొండ, తిరుపతి దగ్గర్లో ఉన్న చంద్రగిరి కోటతో పాటు ఈ దేవాలయంలో దాచారని చెబుతారు.

అనేకమంది

అనేకమంది

P.C: You Tube

ఈ వేలూరు కోట లో ఉన్న జలకంటేశ్వరుడి దేవాలయంలోని సంపదను దోచుకోవడానికి అర్కాడు నవాబుల నుంచి బ్రిటీష్ పాలకులు ఎన్నో సార్లు విఫల యత్నం చేశారు. ముఖ్యంగా ఈ దేవాలయంలోని శివలింగం కింద సంపదలు ఉన్నాయని భావించి ఆ శివలింగాలను పెకిలించి వేశారు.

అగడ్తలో

అగడ్తలో

P.C: You Tube

వాటిని దేవలయం చుట్టూ ఉన్న అగడ్తలో వేశారు. ఇప్పటికీ అక్కడ అగడ్తలో అక్కడక్కడ మనకు శివలింగాలు కనిపించడం ఇందుకు నిదర్శనంగా చెబుతారు. ఇక ఈ ఆలయంలోని కళ్యాణ మంటపంలోని శిల్పకళా రీతి మరంత అద్భుతంగా ఉంటుంది.

శిల్పాల్లో

శిల్పాల్లో

P.C: You Tube

ఇక్కడి శిల్పాల్లో ఒక రకమైన వెలుగు కనబడుతూ ఉంటుంది. ఇందుకు ఆ శిల్పాల లోపల వజ్రాలు, వైడూర్యాలు ఉండటమే ప్రధాన కారణమని చెబుతుంటారు.

కళ్యాణ మంటపం

కళ్యాణ మంటపం

P.C: You Tube

ముఖ్యంగా ఈ శివాలయం లోపల ఉన్నటువంటి కళ్యాణ మంటపం శిల్పాల గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఈ కళ్యాణ మంటపంలోని శిల్పకళా రీతులకు ముగ్దులైన బ్రిటీషువారు దానిని ఏ కీలుకు ఆ కీలు జాగ్రత్తగా విడదీసి సముద్రాలు దాటించి లండన్ లో తిరి పున:ప్రతిష్టించాలని భావించారు.

స్టీమరు కూడా

స్టీమరు కూడా

P.C: You Tube

దానికి తగిన ఏర్పాట్లు కూడా చేసుకొన్నారు. దీని కొరకు లండన్ నుంచి ఒక స్టీమరు కూడా బయలు దేరింది. అయితే ఆ స్టీమరు మార్గ మధ్యలో మునిగి పోయింది. దీంతో ఇక్కడ మనకు ఈ కళ్యాణ మంటపం ఉండిపోయింది.

పురావస్తు శాఖ

పురావస్తు శాఖ

P.C: You Tube

అటు పై క్రీస్తుశకం 1921లో రాయ వేలూరు కోటను అందులో ఉన్న జలకంఠేశ్వరాలయాన్ని జాతీయ సంపదగా గుర్తించి దాని పరిరక్షణ బాధ్యతలను పురావస్తుశాఖకు అప్పగిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

పోరాటాల అనంతరం

పోరాటాల అనంతరం

P.C: You Tube

అటు పై ఈ జలకంటేశ్వరాలయం కొన్ని శతాబ్దాల పాటు నిత్య ధూప, దీప, నైవేద్యాలకు నోచుకోక ముసి ఉన్న కోట గోడల మధ్య ఉండిపోయింది. భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్థానికులు ఎన్నో పోరాటాలు చేసి ఈ దేవాలయాన్ని తిరిగి వాడుకలోకి తీసుకువచ్చారు.

ఇప్పటికీ

ఇప్పటికీ

P.C: You Tube

ముఖ్యంగా క్రీస్తుశకం 1981 నుంచి ఇక్కడ నిత్య ధూప, దీప నైవేద్యాలు జరుగుతున్నాయి. ఈ ఆలయాన్ని నిత్యం వేలాది మంది సందర్శించుకొంటున్నారు. కనీసం ఏడాదికి ఇద్దరికైనా ఇక్కడ ఆ దాచిన నిధుల్లో బంగారపు నాణ్యం దొరుకుతుందని చెబుతుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X