Search
  • Follow NativePlanet
Share
» »పర్యటనలకు వెళ్ళే ముందు...

పర్యటనలకు వెళ్ళే ముందు...

సామాన్యంగా పర్యటన కు వెళ్ళడం అంటే అందరకూ సంతోషమే. ఎందుకంటే, పుట్టినప్పటి నుండి ఒకే ప్రదేశంలో తిరుగుతుతాము కనుక మన మనస్సు ఇతర ప్రదేశాల ఆనందాలు, జీవన శైలి కూడా కోరుకొంటుంది. పర్యటన లకు వెళ్ళాలనే ఉత్సాహం ఎంత ఉన్నప్పటికీ, అక్కడకు వెళ్ళాలంటే , కొన్ని చర్యలు చేపట్టాలి. కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకొనడం తప్పని సరి.

మన ప్రదేశంలోని జీవన శైలికి, పరిస్థితులకు అలవాటు పడిన మనం, ఒక్కసారిగా కొత్త మొహాల మధ్య, కొత్త నియమ నిబంధనల మధ్య, అక్కడి వాతావరణం కు తగినట్లు మనం వ్యవహరించుకోనవలసి వస్తుంది. ఒక్కొక్కపుడు విదేశాలకు లేదా కొత్త ప్రదేశాలు వెళ్లేవారికి ఆ దేశాలలో బంధువులు లేదా స్నేహితులు వుండటం వలన కొంత మేరకు అసౌకర్యాలు సర్దుబాటు అవుతాయి.

పర్యటన ఒక మధురానుభవంగా కూడా వుంటుంది. అయినప్పటికీ పర్యటనలు చేయాలనుకునే వారు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకొనవలసి వస్తుంది. మరి పర్యటన అతి సులువుగా చేసే గరిష్టంగా ఆనందం పొందాలంటే ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ? అనేది పరిశీలించండి.

కనిష్ట పర్యటన...గరిష్ట ఆనందం !

పర్యటనలో పదనిసలు !

పర్యటనలో పదనిసలు !

పర్యటనకు వెళ్లేముందు అసలు ఏ దేశానికి వెళ్ళాలి అనేది నిర్ణయం చేసి కోనండి. ఈ నిర్ణయం మీకు అక్కడి వాతావరణం పట్ల అవగాహన ఏర్పరుస్తుంది. ఏ సమయంలో అక్కడకు వెళ్ళాలి ? అనేది తెలియ చేస్తుంది.

పర్యటనలో పదనిసలు !

పర్యటనలో పదనిసలు !

మీరు వెళ్ళే ప్రదేశంలో బస్సు లు, రైళ్ళ లభ్యత గురించి తెలుసుకోనండి. దీని వలన చివరి క్షణాల తొందర వుండదు. అంతే కాదు, మీకు గల సమయం పొదుపై మీరు ఎక్కువ ప్రదేశాలు ఆనందించేలా చేస్తుంది.

పర్యటనలో పదనిసలు !

పర్యటనలో పదనిసలు !

ఆ ప్రదేశానికి వెళ్ళే ముందే టికెట్ లు అడ్వాన్సు బుకింగ్ చేసుకొనండి. ఆ సౌకర్యం లేకుంటే, కొంత సమయం వెచ్చించి ఆ ప్రదేశానికి చేరవలసి వుంటుంది. టికెట్ ముందుగా కొనలేదన్న విచారం కూడా లేకుండా వుంటుంది.

పర్యటనలో పదనిసలు !

పర్యటనలో పదనిసలు !

పర్యటనకు ముందే, సాధ్యం అయితే, ఆ ప్ర దేశంలోని మీ స్థానిక చిరునామా, టెలిఫోన్ నెంబర్, వంటి వివరాలు ఒక కాగితంపై వ్రాసి వాటిని మీ పిల్లల బ్యాగులలో వుంచండి. ఈ చర్య కొన్ని అవాంచనీయ పరిస్తితులనుండి తప్పిస్తుంది.
చిత్ర కృప : ian munroe

పర్యటనలో పదనిసలు !

పర్యటనలో పదనిసలు !

పర్యటనకు ముందే, విలువైన వస్తువులను ఇంటివద్దే వుంచండి. మీరు వెళ్ళే ది పర్యటనకు గాని, వివాహానికి లేదా వడుగుకి కాదని గుర్తుంచుకొనండి.

పర్యటనలో పదనిసలు !

పర్యటనలో పదనిసలు !

పర్యటనలో ధరించే దుస్తులు, మీకు తేలికగా అనిపించాలి. అసౌకర్యంగా వుండే పట్టు, ఇతర సిల్క్ దుస్తులు విడనాడండి. ఈ చర్య మీ ప్రయాణ బ్యాగు భారాన్ని కూడా తగ్గిస్తుంది.

పర్యటనలో పదనిసలు !

పర్యటనలో పదనిసలు !

విదేశాలకు వెళ్ళే ముందు అక్కడ కల హోటళ్ళు , ఇతర పర్యటనా సౌకర్యాల గురించిన సమాచారం, ఇంటర్నెట్ నుండి సేకరించండి. దీని వలన అక్కడకు వెళ్ళిన తర్వాత వసతి దొరకలేదు అనే విచారం వుండదు.

పర్యటనలో పదనిసలు !

పర్యటనలో పదనిసలు !

కొత్త ప్రదేశాలకు వెళ్ళినపుడు, అక్కడ మన పిల్లలు కోరే వస్తువులు దొరక క పోవచ్చు. అందుకని, పిల్లలకు ముందుగా ఈ పరిస్థితి వివరించండి. అవసరం అనుకున్న అలవాటైన వస్తువులను బ్యాగులలో వుంచుకోనండి.

పర్యటనలో పదనిసలు !

పర్యటనలో పదనిసలు !

పర్యటనకు ముందు, ఒక కెమెరా, ఒక చిన్న నోట్ ప్యాడ్ అందుబాటులో వుంచుకోనండి. మీరు వెళుతున్న ఆ ప్రదేశంలో కల వింతలు, విశేషాలను ఫోటోలు తీయండి, విశేషాలు నోట్ చేసుకొనండి. అవసరం అనుకుంటే, ఆ ప్రదేశం గురించిన వివరాలు పిల్లలకు ముందుగా తెలియ చేస్తే, వారి జ్ఞానం ప్రదేశం చూసిన తర్వాత మరింత పెరుగుతుంది.
చిత్ర కృప : mjtmail (tiggy)

పర్యటనలో పదనిసలు !

పర్యటనలో పదనిసలు !

పర్యటనలకు వెళ్ళినపుడు, అక్కడ ఆకర్షణీయంగా కనపడే వీధి ఆహారాలను తినకండి. సమయానికి తినే అల్పాహారం వంటివి హోటల్లు, రెస్టారెంట్ లలో మాత్రమే తినండి. తాగు నీరు పట్ల అత్యంత జాగ్రత్త వహించటం తప్పని సరి. ఇది మిమ్ములను అనారోగ్యాల బారి నుండి తప్పిస్తుంది.

పర్యటనలో పదనిసలు !

పర్యటనలో పదనిసలు !

కొంతమందికి, స్థలం మార్పు జరిగే సరికి, దగ్గు, జలుబు, తలనొప్పి, లైట్ గా జ్వరం వంటివి రావటం జరుగుతుంది. కనుక ఈ సామాన్య అనారోగ్యాలకు అవసరమైన ప్రధమ చికిత్సా మందులు తప్పక బ్యాగులో వుంచుకోనండి. ప్రత్యేకించి పిల్లల ఆరోగ్య రక్షణలో ఇది సహకరిస్తుంది.

పర్యటనలో పదనిసలు !

పర్యటనలో పదనిసలు !

మీరు వెళ్ళే ప్రదేశపు ప్లాను ఒకటి వుంచుకొని మీ కదలికలు, లేదా పర్యటన ముందుగా నిర్నయిన్చుకోనండి. ఈ చర్య మీ సమయాన్ని పొదుపు చేస్తుంది. తక్కువ సమయంలో అధిక పర్యాటన చేయించి ఆనందింప చేస్తుంది.

పర్యటనలో పదనిసలు !

పర్యటనలో పదనిసలు !

మీరు వెళ్ళే ప్రదేశం గురించి వివరాలు గతంలో అక్కడకు వెళ్ళిన మీ స్నేహితుల నడిగి తెలుసుకోనండి.
చిత్ర కృప : Open Knowledge Foundation

పర్యటనలో పదనిసలు !

పర్యటనలో పదనిసలు !

మీది అధిక సంఖ్యుల కుటుంబం అయితే, ప్రతి ప్రదేశంలోనూ అందరూ కలసి తిరగండి. ఈ చర్య ఎవరూ తప్పిపోకుండా లేదా వెతికే సమయం వారు దొరకరేమో అనే భయం ఆదా చేస్తుంది.

పర్యటనలో పదనిసలు !

పర్యటనలో పదనిసలు !

ముందుగానే ఆలోచించి ఖర్చులకి కొంత చిల్లర నాణెములు రెడీ గా వుంచుకోనటం మంచిది. ప్రయాణంలో వీలైనంత వరకు తక్కువ డినామినేషన్ కల సొమ్ము గా మార్చి వుంచుకోనండి. లేదంటే, 100, 500,1000 రూపాయల నోట్లు ఇచ్చి చిల్లర కొరకై వేచి ఉండవలసి వస్తుంది.

పర్యటనలో పదనిసలు !

పర్యటనలో పదనిసలు !

మీ ఈ పర్యటనలో పార్క్ లు , గార్డెన్ లు తిరిగేటపుడు, మీకు ఇష్టమైన వారితో కలసి కూర్చొని హెచ్చు సమయం ఆనందించండి. మరల మీరు ఉద్యోగానికి వెళ్ళినపుడు ఈ సౌలభ్యం ఉండదని గ్రహించండి.

పర్యటనలో పదనిసలు !

పర్యటనలో పదనిసలు !

మీరు పర్యటించే ప్రదేశాలలో ప్రత్యేకించి కొన్ని వస్తువులు కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతాయి. అవి వేరే ప్రదేశాలలో దొరకవు. కనుక, మీరు అభిలషిస్తే, వాటిని అక్కడే తప్పక కొనుగోలు చేయండి. ఆ ప్రదేశం దాటిన తర్వాత కొనలేదని విచారించకండి.

పర్యటనలో పదనిసలు !

పర్యటనలో పదనిసలు !

ఈ రకంగా కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రణాలికా బద్ధంగా చేసే కుటుంబ సభ్యులతో కూడిన పర్యటన ఏదైనప్పటికీ, మీకు జీవితంలో ఎప్పటికీ మరువలేని అనుభూతులు అందిస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X