Search
  • Follow NativePlanet
Share
» »తీర్థన్ వాలీ - 'సీక్రెట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్' !

తీర్థన్ వాలీ - 'సీక్రెట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్' !

By Mohammad

భారతదేశంలో మీరు ఎన్నో ప్రదేశాలను చూసి ఉంటారు అవునా ? కానీ వాటిలో ప్రసిద్ధిచెందిన ప్రదేశాలను చూడటానికి మాత్రమే ఎక్కువ మంది దేశ, విదేశీ పర్యాటకులు మొగ్గుచూపుతుంటారు. ఇండియాలో కేవలం అవే కాదండీ ..! బయటి ప్రపంచానికి తెలియని ప్రదేశాలు కూడా ఉన్నాయి. వీటి గురించి సరైన సమాచారం లేకపోవడంతో ఇక్కడికి పర్యాటకులు ఎక్కువగా రారు. ఇది మనకు ఒక రకంగా ప్లస్ పాయింట్. కేవలం మనము, మన కుటుంబసభ్యులు లేదా మనతోటివారు మాత్రమే అక్కడ హాయిగా సేదతీరవచ్చు, విశ్రాంతిని పొందవచ్చు. మరి అటువంటి ప్రదేశాలు ఏవి ? ఎక్కడ ఉన్నాయి?

తీర్థన్ వాలీ ... దీని గురించి అంతగా ఎవరికీ తెలీదు. ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కలదు. ఈ భూమిని ఇంకా ఎవరూ టచ్ చేసిలేకుంటారు కాబట్టి ప్రకృతి ప్రేమికులకు, అడ్వెంచర్ లవర్స్ కు ఈ ప్రాంతం ఇప్పుడే పుట్టిందా ? అన్నట్టు ఉంటుంది. ఇది గ్రేట్ హిమాలయాన్ నేషనల్ పార్క్ కు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో కలదు.

తీర్థన్ లోయ ముఖచిత్రం

తీర్థన్ వాలీ అందమైన దృశ్యం

చిత్రకృప : Ramwik

ఇది కూడా చదవండి : ది గ్రేట్ హిమాలయాన్ నేషనల్ పార్క్ అద్భుత దృశ్యాలు !

ఇక్కడ ఏమి చేయాలి ?

అడ్వెంచర్ కోరుకునేవారు తీర్థన్ వాలీ లో ఎన్నో ప్రదేశాలను అన్వేషించవచ్చు. తెల్లగా మెరుస్తూ ఉండే నీటి ప్రవాహాలు,రమణీయ ప్రకృతి దృశ్యాలు, కోమలమైన వాతావరణం తప్పక అనుభవించాలి. వాలీ అంచుల వద్ద నిలబడి గట్టిగా శ్వాస పీల్చడం, వదలటం సూపర్బ్.

స్వర్గానికి దగ్గరి పోలికలు ఉండే తీర్థన్ వాలీ, సముద్రమట్టానికి 1600 అడుగుల ఎత్తులో కులు జిల్లాలో కలదు. నగర జీవితం నుండి ఎటైనా దూరంగా పారిపోవాలి అని అంటుంటారు చూడండీ అటువంటివారికి ఈ ప్రదేశం సరిగ్గా సరిపోతుంది. మీరు ఇక్కడ ఎన్నో మరుపురాని కొత్త కొత్త అనుభూతులను చవిచూస్తారు. సాహస క్రీడల్లో భాగంగా ఫిషింగ్, క్యాంపైనింగ్, ట్రెక్కింగ్ మరియు హైకింగ్ మొదలగునవి చేపట్టవచ్చు.

తీర్థన్ నది ప్రవాహాన్ని ఆస్వాదిస్తున్న పర్యాటకుడు

తీర్థన్ నది ప్రవాహాన్ని ఆస్వాదిస్తున్న పర్యాటకుడు

చిత్రకృప : Ankitwadhwa10

ఫోటో లు తీసుకోవటానికి తీర్థన్ వాలీ సరైన ప్రదేశం. ఫోటోగ్రఫీ మీద ఆసక్తి గలవారు అందమైన దృశ్యాలను కెమెరాలలో బంధించవచ్చు. పైగా ఇక్కడ పర్యాటకులకు తక్కువ మంది వస్తుంటారు కాబట్టి మీ ఫోటోలకు అడ్డురారు.

ఇది కూడా చదవండి : హిమాచల్ ప్రదేశ్ - ప్రశాంత హిల్ స్టేషన్ ల నిలయం !

తీర్థన్ వాలీ ట్రెక్ లో భాగంగా మీరు వాలీ అందాలనే కాక, జలపాతాలను అదనంగా మరికొన్ని ఆకర్షణీయ ప్రదేశాలను చూడవచ్చు. అవి- ది గ్రేట్ హిమాలయాన్ నేషనల్ పార్క్, జరోలి పాస్ మరియు సెర్లోస్కర్ లేక్.

తీర్థన్ వాలీ లో ఎక్కడ స్టే చేయాలి ?

తీర్థన్ వాలీ లో వసతి సదుపాయాలు తక్కువగా ఉన్నాయి. ఇక్కడ మీరు గెస్ట్ హౌస్ లు, బడ్జెట్ కు తగ్గ హోటళ్లలో విశ్రాంతిని పొందవచ్చు.

తీర్థన్ వాలీ స్పైసీ ఫుడ్

తీర్థన్ వాలీ స్పైసీ ఫుడ్

చిత్రకృప :Kaynatkazi

తీర్థన్ వాలీ లో ఎక్కడ తినాలి?

ఈ ప్రదేశం గురించి పెద్దగా ఎవ్వరికీ తెలీదు కనుక స్టాల్స్, రెస్టారెంట్ లు ఇక్కడ కనపడవు. మీరు ఎంతవరకూ 'స్టే' చేసిన హోటళ్లల్లోనే తినేసిరావాలి. వాలీకి కొద్ది దూరంలో గల 'బంజర్' అనే ప్రాంతంలో రెస్టారెంట్ లు ఉన్నాయి. వీలైతే ట్రెక్ చేస్తూ అక్కడికి వెళ్లి తినేసిరండి.

తీర్థన్ వాలీ ని ఎప్పుడు సందర్శించాలి?

తీర్థన్ వాలీ ని సందర్శించటానికి ఉత్తమ సమయం మార్చ్ - జూన్ మరియు అక్టోబర్ - నవంబర్. ఈ సమయాలలో ట్రెక్కింగ్, క్యాంపైనింగ్ సూచించదగినది. చేపలు పట్టటానికి వేసవి కాలం సూచించదగినది. ఇక్కడ డిసెంబర్ - మార్చ్ వరకు చలి అధికంగా ఉంటుంది. ఆ సమయంలో వెచ్చని దుస్తులు, స్వెటర్లు ధరించాలి.

ట్రెక్కింగ్ బ్రిడ్జి

ట్రెక్కింగ్ బ్రిడ్జి

చిత్రకృప : Ankitwadhwa10

గుర్తించుకోవలసిన కొన్ని టిప్స్ :

  • వసతి ఇక్కడ అంతంత మాత్రమే. కనుక ముందుగానే గదులు రిజర్వ్ చేసుకోండి.
  • వాలీ లో ఎక్కువ భాగం నడవటమే, కనుక మరో జత షూ లు తీసుకెళ్లండి
  • తినేందుకై ఎటువంటి స్టాల్స్, రెస్టారెంట్లు ఉండవు కనుక దారి మధ్యలో నడిచేటప్పుడు ఆకలేస్తే తినేందుకై ఆహారపొట్లాలను, ఇతర తినుబండారాలను వెంట తీసుకెళ్లండి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X