Search
  • Follow NativePlanet
Share
» »కొన్ని వేల సంవత్సరాల క్రితం శ్రీనివాసుడు దాగి వున్న పుట్ట తిరుమలలో ఎక్కడుంది ?

కొన్ని వేల సంవత్సరాల క్రితం శ్రీనివాసుడు దాగి వున్న పుట్ట తిరుమలలో ఎక్కడుంది ?

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు మనం ముందుగా వెండివాకిలి దాటి తరువాత బంగారు వాకిలి గుండా వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటూవుంటాం.

By Venkatakarunasri

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు మనం ముందుగా వెండివాకిలి దాటి తరువాత బంగారు వాకిలి గుండా వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటూవుంటాం. ఈ వెండివాకిలి గోపురం యొక్క ప్రాకారానికి,బయట మహాద్వార ప్రాకారానికి మధ్యగల సుమారు 30అడుగులు వున్న ప్రదక్షిణా మార్గాన్ని సంపెంగ ప్రదక్షిణం అనిఅంటారు.ఆలయంలో మనం ప్రవేశించిన మొదటి ప్రదక్షిణామార్గమే ఈ సంపంగి ప్రదక్షిణ మార్గం.

ఎక్కడ ఉంది?

ఎక్కడ ఉంది?

చాలా కాలం క్రిందట ఈ సంపెంగిఆవరణంలోని మహాద్వారానికి దగ్గరగా ఒక పెద్ద చింతచెట్టు వుండేదట. దానికి కొమ్మలు, రెమ్మలు శాఖోపశాఖలుగా పెరిగి అతి విశాలంగా వ్యాపించి ఆ చెట్టునీడ ఎటూతిరగక ఆ వృక్షం మూలంలోనే స్థిరంగా వుండేది.

pc:youtube

తిరుమలలో శ్రీనివాసుడు దాగిన పుట్ట ఎక్కడ ఉంది?

తిరుమలలో శ్రీనివాసుడు దాగిన పుట్ట ఎక్కడ ఉంది?

అందువల్ల అది నీడతిరుగని చింత చెట్టుగా ప్రసిద్ధిచెందింది. అంతమాత్రమే కాదు అది నిద్రపోని చింతచెట్టుగా కూడా పేర్కొనబడినది. దాని శాఖలు కొన్ని చిగురించగా, మరి కొన్ని శాఖలు
పుష్పించగా, ఇంకొన్ని శాఖలు కాయలు, పండ్లు కాస్తుండేవి.

pc:youtube

తిరుమలలో శ్రీనివాసుడు దాగిన పుట్ట ఎక్కడ ఉంది?

తిరుమలలో శ్రీనివాసుడు దాగిన పుట్ట ఎక్కడ ఉంది?

ఇలా అన్ని కాలాలు విశ్రాంతి ఎరుగక ఆ చెట్టు నిరంతరం చిగురించటం, పుష్పించటం, ఫలించటం వల్ల అది నిద్రపోని చెంత చెట్టుగా పిలవబడుతుంది. ఈ చెట్టు క్రింద పుట్టలో శ్రీనివాసుడు కొంతకాలం దాగివున్నాడు.

pc:youtube

తిరుమలలో శ్రీనివాసుడు దాగిన పుట్ట ఎక్కడ ఉంది?

తిరుమలలో శ్రీనివాసుడు దాగిన పుట్ట ఎక్కడ ఉంది?

ఆ తరువాత స్వామివారు విగ్రహ మూర్తిగా స్వయంభూ యై వెలసి పుట్టలో నిక్షిప్తమై వున్నాడు.ఆ నీడ తిరుగని, నిద్రే ఎరుగని చింత చెట్టు సాక్షాత్తూ వాసుదేవుడననీ, ఆదిశేషుడని, ఆ చెట్టుక్రింద పుట్ట దేవకీదేవి అని పురాణాలు పేర్కొంటున్నాయి.

pc:youtube

తిరుమలలో శ్రీనివాసుడు దాగిన పుట్ట ఎక్కడ ఉంది?

తిరుమలలో శ్రీనివాసుడు దాగిన పుట్ట ఎక్కడ ఉంది?

అట్టి సమయంలో మొట్టమొదట గోపీ నాథుడనే వైఖానసుడు ఈ క్షేత్రానికి వచ్చి పుష్కరిణీ దక్షిణతీరంలో చింతచెట్టు క్రింద పుట్టలో వున్న వేంకటేశ్వరుని దర్శించి పుట్టలోని ఆ స్వామి వారి పుష్కరిణీ పశ్చిమతీరంలో అంటే ప్రస్తుతం శ్రీవారు వున్న చోటు ప్రతిష్టించి ఆనాటి నుండి అక్కడే ఉంటూ ఆ స్వామికి అర్చనాదిపూజాదిక్రమములు చేస్తూ వున్నాడు.

pc:youtube

తిరుమలలో శ్రీనివాసుడు దాగిన పుట్ట ఎక్కడ ఉంది?

తిరుమలలో శ్రీనివాసుడు దాగిన పుట్ట ఎక్కడ ఉంది?

ఆ తరువాత రంగదాసుడు అనే భక్తుడు కూడా ఆ ప్రాంతానికి వచ్చి ఒక బావిత్రవ్వి సంపెంగి, చేమంతి మున్నగు చెట్లను పెంచి శ్రీ స్వామి వారి పూజకవసరమైన పూలను, పండ్లను సమర్పిస్తూ అర్చకుడైన గోపీనాధుడుకి సహాయంగా ఉండేవాడు.

pc:youtube

తిరుమలలో శ్రీనివాసుడు దాగిన పుట్ట ఎక్కడ ఉంది?

తిరుమలలో శ్రీనివాసుడు దాగిన పుట్ట ఎక్కడ ఉంది?

ఈ రంగాదాసే ఈ జన్మలో తొండమాన్ రాజుగా జన్మించి శ్రీనివాస స్వామికి గోపురప్రాకారాదులు నిర్మించాడట. ఆ సందర్భంలో తనకి ప్రీతిపాత్రమైన ఆ చింతచెట్టును ఆ చింత చెట్టుకు కొద్ది దూరంలోనే వుంటూ లక్ష్మీదేవికి ఆవాసస్థానమై,అత్యంత ప్రియమై ఎల్లప్పుడూ పుష్పించే చంపకవృక్షాన్ని మాత్రం రక్షించి,ఇక మిగిలిన చెట్లను తొలగించి ఆలయప్రాకారాదులు నిర్మించవలసిందన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆదేశాలని తొండమానుడు నిర్వర్తించాడని వేంకటాచలమహాత్య గ్రంధం తెలుపుతుంది.

pc:youtube

తిరుమలలో శ్రీనివాసుడు దాగిన పుట్ట ఎక్కడ ఉంది?

తిరుమలలో శ్రీనివాసుడు దాగిన పుట్ట ఎక్కడ ఉంది?

శ్రీ వేంకటేశ్వరుని కంటే ప్రాచీనమైన, వెలుగొందిన ఈ నీడ తిరుగని చింత చెట్టు, చంపక వృక్షాలు నేడు కానరావు.కాని ఇటీవలకాలంలో అంటే భగవద్ద్రామానుజుల కాలం 11వ శతాబ్దంలో కూడా ఈ చెంత చెట్టును దర్శించినట్టుగా పరమయోగివిలాసం అనే గ్రంధంలో రాయబడ్డది.

pc:youtube

తిరుమలలో శ్రీనివాసుడు దాగిన పుట్ట ఎక్కడ ఉంది?

తిరుమలలో శ్రీనివాసుడు దాగిన పుట్ట ఎక్కడ ఉంది?

అంతే కాదు ఈ చెట్లను దర్శించి శ్రీరామానుజులు నిత్యం వాటికి పూజాదిక్రమములు కూడా నిర్వహించే ఏర్పాట్లను కూడా గావించినట్లుగా శ్రీ వేంకటాచల ఇతిహాసం అనే గ్రంధంలో పేర్కొనబడుతుంది.

pc:youtube

తిరుమలలో శ్రీనివాసుడు దాగిన పుట్ట ఎక్కడ ఉంది?

తిరుమలలో శ్రీనివాసుడు దాగిన పుట్ట ఎక్కడ ఉంది?

పిదప 15వ శతాబ్దంలో తాళ్ళపాక అన్నమాచార్యులు కూడా తొలిసారిగా వేంకటాచల యాత్ర చేసిన సందర్భంలో నీడ తిరుగని చింత చెట్టును దర్శించి సేవించినట్లుగా చిన్నన్న రాసిన అన్నమాచార్య జీవిత చరిత్ర వలన తెలుస్తుంది.

pc:youtube

తిరుమలలో శ్రీనివాసుడు దాగిన పుట్ట ఎక్కడ ఉంది?

తిరుమలలో శ్రీనివాసుడు దాగిన పుట్ట ఎక్కడ ఉంది?

పూర్వం ఈ సంపెంగి ఆవరణనుండే నేరుగా పుష్కరిణికి వెళ్ళటానికి వీలుగా వుండేదని అంటే ఆలయ మహాప్రాకారం వుండేది కాదని తెలుస్తుంది. తరువాత కాలంలో మహాప్రాకారం ఆ మహాప్రాకారానికి ఆనుకుని లోపల సంపెంగి ప్రదక్షిణమార్గంలో సుమారు 18అడుగుల వెడల్పుతో వున్న మండపాలు ఇంకా ఇతర నిర్మాణాలు చోటుచేసుకున్నాయి.ప్రస్తుతం ఈ ఆవరణమార్గంలో కళ్యాణమండపంలో తప్ప మిగిలిన చోట్ల యాత్రికులకు ప్రవేశం లేదు.

pc:youtube

తిరుపతికి ఎలా వెళ్ళాలి?

తిరుపతికి ఎలా వెళ్ళాలి?

విమాన మార్గం

తిరుపతి కి సమీపంలో ఉన్న విమానాశ్రయం రేణిగుంట దేశీయ విమానాశ్రయం. ఇది తిరుపతి కి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ విమానాశ్రయం దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో అనుసంధానించబడింది. ఇక్కడి నుండి క్యాబ్ లో, సిటీ బస్సుల్లో, ప్రేవేట్ వాహనాల్లో ప్రయాణించి తిరుపతి చేరుకోవచ్చు.

pc:youtube

రైలు మార్గం

రైలు మార్గం

ప్రముఖ పుణ్య క్షేత్రమైన తిరుపతి లో రైల్వే స్టేషన్ కలిగి ఉంది. ఈ రైల్వే స్టేషన్ లో దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు వెళ్లే రైళ్ళన్నీ ఆగుతాయి. ఇక్కడి నుంచి ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై వంటి నగరాలకు సులభంగా ప్రయాణించవచ్చు.

చిత్ర కృప : Karthik Iyer (R.I)

రోడ్డు మార్గం

రోడ్డు మార్గం

తిరుపతి కి ఆర్టీసి వారి బస్సులు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల నుండి తిరుగుతుంటాయి. అలిపిరి బస్ స్టాప్ నుండి తిరుపతికి ప్రతి రెండు నిమిషాలకు బస్సులు నడుస్తాయి. ఈ నగరంలో అంతర్గత రవాణా వ్యవస్థ బాగా అభివృద్ది చెందడం వల్ల ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

pc:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X