Search
  • Follow NativePlanet
Share
» »తిరుపతి వేంకటేశ్వరుడిని ఆ సమయంలో మీరు ప్రత్యక దర్శనం చేసుకోలేరు

తిరుపతి వేంకటేశ్వరుడిని ఆ సమయంలో మీరు ప్రత్యక దర్శనం చేసుకోలేరు

2018 ఏడాదికి సంబంధించి తిరుమల తిరుపతి బ్రహోత్సవాల షెడ్యూల్

కేవలం తెలుగు రాష్ట్రాలవారే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తిరుమల వేంకటేశ్వరుడి భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్న బ్రహోత్సవాలకు ముహుర్తం ఖరారయ్యింది. సాలకట్ల బ్రహోత్సవాలతో పాటు నవరాత్రి ఉత్సవాలకు సంబంధించ ముఖ్యమైన నిర్ణయాలను తీసుకున్నారు.

వాటిని పక్కగా అమలు చేయాడనికి సంబంధించిన ప్రణాళికలు రచించడమే కాకుండా ఇప్పటికే వాటి అమలును కూడా నిర్వాహకులు మొదలుపెట్టారు. ఈ బ్రహోత్సవాలను చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు విచ్చేస్తారు. ఈ నేపథ్యంలో బ్రహోత్సవాలతో పాటు శ్రీవారి దర్శనానికి ఇబ్బంది కలగకుండా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని ఇక్కడ వివరిస్తున్నాం. మీరు బ్రహోత్సవాలకు వెళ్లేవారైతే ఈ వివరాలను అనుసరించి మీ షెడ్యూల్ ను ప్లాన్ చేసుకోండి.

తిరుమల బ్రహోత్సవాలు

తిరుమల బ్రహోత్సవాలు

తిరుమల బ్రహోత్సవాలను ప్రతి ఏడాది తిరమల కొండ పై ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. శతాబ్దాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది.

తిరుమల బ్రహోత్సవాలు

తిరుమల బ్రహోత్సవాలు

ఇందుకు సంబంధించిన వివరాలను ప్రస్తుత తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటి తీసుకుంది.

తిరుమల బ్రహోత్సవాలు

తిరుమల బ్రహోత్సవాలు

ఈ ఏడాది సెప్టెంబర్ 13 నుంచి 21 వరకూ శ్రీవారి సాలకట్ల బ్రహోత్సవాలు జరగనున్నాయి.అ దే విధంగా అక్టోబర్ 10 నుంచి 18 వరకూ శ్రీవారి నవరాత్రి బ్రహోత్సవాలు నిర్వహించనున్నారు.

తిరుమల బ్రహోత్సవాలు

తిరుమల బ్రహోత్సవాలు

ఇక సాలకట్ల బ్రహోత్సవాల్లో అతి ముఖ్యమైన గరుడ వాహనం, స్వర్ణరథం, రథోత్సవం చక్రస్నానం, ధ్వజారోహణాలను వరుసగా సెప్టెంబర్ 17, 18, 20, 21 తేదీల్లో నిర్వహిస్తారు.

తిరుమల బ్రహోత్సవాలు

తిరుమల బ్రహోత్సవాలు

అదే విధంగా నవరాత్రి బ్రహోత్సవాల్లో ముఖ్యంగా అక్టోబరు 10న ధ్వజారోహణం, 14న గరుడవాహనం, 17న స్వర్ణరథం, 18న చక్రస్నానం నిర్వహిస్తారు.

తిరుమల బ్రహోత్సవాలు

తిరుమల బ్రహోత్సవాలు

సెప్టెంబర్ 13న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

తిరుమల బ్రహోత్సవాలు

తిరుమల బ్రహోత్సవాలు

ఈ సమయంలో శ్రీవారి దర్శనం విషయంలో కొన్ని ఆంక్షలు ఉంటాయి. అదే విధంగా ఈ ఏడాది నుంచి శ్రీవారి వాహన సేవల్లో మార్పులను తీసుకువచ్చారు.

తిరుమల బ్రహోత్సవాలు

తిరుమల బ్రహోత్సవాలు

ప్రతి రోజూ వాహన సేవలను రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకూ నిర్వహిస్తారు. గరుడసేవ మాత్రం రాత్రి 7 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకూ నిర్వహించనున్నారు.

తిరుమల బ్రహోత్సవాలు

తిరుమల బ్రహోత్సవాలు

మిగిలిన సేవలతో పోలిస్తే గరుడసేవ రోజున భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ రోజున ఘాట్ రోడ్లలో ద్విచక్రవాహనాల రాకపోకలను రద్దు చేస్తారు.

తిరుమల బ్రహోత్సవాలు

తిరుమల బ్రహోత్సవాలు

అందువల్ల మీరు ద్విచక్రవాహనంలో తిరుమల పైకి వెళ్లాలనుకొంటే మాత్రం మీ ఆలోచనను విరమించుకోండి.

తిరుమల బ్రహోత్సవాలు

తిరుమల బ్రహోత్సవాలు

ఇక బ్రహోత్సవాల సమయంలో ప్రోటోకాల్ కలిగిన వీవీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనాలు ఉంటాయి. సెప్టెంబర్ 17, అక్టోబర్ 14 తేదీల్లో నిర్వహించే గరుడసేవనాడు బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు చేస్తారు.

తిరుమల బ్రహోత్సవాలు

తిరుమల బ్రహోత్సవాలు

బ్రహోత్సవాలకు వచ్చే భక్తుల కోసం సాధారణం కంటే 7 లక్షల లడ్డూలను రిజర్వ్ లో ఉంచుతారు.

తిరుమల బ్రహోత్సవాలు

తిరుమల బ్రహోత్సవాలు

ఇక ఉత్సవాల సందర్భంగా ఆర్టీసీ 165 కొత్త బస్సులను, ఏర్పాటు చేస్తుంది. అందువల్ల భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొండ పైకి సులభంగా చేరుకోవచ్చనది నిర్వాహకుల అభిప్రాయం.

తిరుమల బ్రహోత్సవాలు

తిరుమల బ్రహోత్సవాలు

ముఖ్యంగా గరుడసేవరోజున భక్తులను కొండ పైకి చేరవేసేందుకు 6,500 ట్రిప్పుల సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తారు.

తిరుమల బ్రహోత్సవాలు

తిరుమల బ్రహోత్సవాలు

12 అంబులెన్స్ లు, పారామెడికల్ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X