Search
  • Follow NativePlanet
Share
» »ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని పట్టణం తిరుపతి. ఈ పట్టణాన్ని ఆనుకొని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న వూరు తిరుమల. ఈ రెండింటినీ కలిపి "తిరుమల తిరుపతి" అని వ్యవహరిస్తూ ఉంటారు.

By Venkatakarunasri

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని పట్టణం తిరుపతి. ఈ పట్టణాన్ని ఆనుకొని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న వూరు తిరుమల. ఈ రెండింటినీ కలిపి "తిరుమల తిరుపతి" అని వ్యవహరిస్తూ ఉంటారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రతిదినం లక్ష నుండి రెండు లక్షల వరకు భక్తులు సందర్శిస్తుంటారు. ప్రత్యేక దినాలలో 5 లక్షలమంది వరకూ దర్శనం చేసుకొంటారు. ఈ యాత్రాస్థలం శ్రీవైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్యదేశాలలో ఒకటి. తిరుమల కలియుగ వైకుంఠం అని భక్తుల విశ్వాసం. కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలో స్వయంభువుగా అవతరించాడని భవిష్యోత్తరపురాణం లోని శ్రీ వేంకటాచల మహత్యం కథనం. తిరుమల వేంకటేశ్వరుని శ్రీనివాసుడు, బాలాజీ అని కూడా పిలుస్తారు. శ్రీవారు అని కూడా అంటారు.

ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

మొట్ట మొదటగా, వైఖానస అర్చకుడు శ్రీ మాన్ గోపీనాథ దీక్షితుల వారు (శ్రీ వేంకటాచల మహాత్యం అనుసరించి), శ్రీవారి మూర్తిని స్వామి పుష్కరిణి చెంత, చింత చెట్టు క్రింది చీమల పుట్టలో కనుగొని, శ్రీవారి మూర్తిని ప్రస్తుతం వున్న ప్రదేశంలో ప్రతిష్ఠించి, అర్చించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి.

PC: youtube

ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

అప్పటి నుండి శ్రీ గోపీనాథ దీక్షితుల యొక్క వంశీయులే పరంపరగా స్వామి వారి పూజా కైంకర్యాల నిర్వహణ చేస్తున్నారు. తిరుమల ఆలయం లోని మొదటి ప్రాకారం (విమాన ప్రాకారం), ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు.

PC: youtube

ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వేంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాభ్దానికి చెందిన చోళులు (తంజావురు) పాండ్య రాజులు (మదురై), 13-14 శతాభ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెప్తున్నాయి.

PC: youtube

ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది, ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతులైన శ్రీ కృష్ణదేవ రాయలు, రాజా తోడరమల్లు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. కలియుగప్రత్యక్షదైవం తిరుమలవేంకటేశ్వరుడి గురించి ఎంత చెప్పినా తక్కువే.ముక్కోటిదేవతలతో పూజలందుకునే దేవదేవుడు కొలువైన సప్తగిరుల గురించి తెలుసుకోవలసినది ఎంతోవుంది.

PC: youtube

ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

శ్రీమహావిష్ణువు స్వయంభూవుడై అవతరించిన నిత్యకళ్యాణం,పచ్చతోరణంతో అలరాడే తిరుమలనాథుని దేవతలు రహస్యంగా దర్శించి ప్రత్యేకపూజలు చేసి వెళుతుంటారని నమ్ముతాం.ఇదే విషయం గురించి ఆలయాలప్రధానార్చకులు రమణ దీక్షితులు వ్యాఖ్యలు చేసారు.తిరుమలపై ఒక టివిఛానల్ రూపొందించిన కార్యక్రమంలో భక్తులవూహకందని విషయాలను ఆయన వెల్లడించాడు.

PC: youtube

ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

తిరుమల గిరులపై శ్వేతదీపం వుందని ఇక్కడ యోగులు, సిద్దులతో పాటు,దవళవస్త్రధారులైన దేవతలు నివసిస్తారని అన్నారు.శ్వేతదీపం నుంచి స్వామివారి ఆలయంలోకి ఓ రహస్యమార్గం వుందనిదాని గుండా దేవతలు వచ్చివెళుతుంటారని పురాణాల్లో వుందని అన్నారు.

PC: youtube

ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

పవళింపుసేవ తర్వాత సుప్రభాత సేవకు ముందు స్వామివారిని సేవించటానికి అసంఖ్యాకంగా దేవతలు వస్తారు. సుప్రభాతం ముగిసినపిమ్మట గర్భాలయంలోకి అర్చకులు ప్రవేశించేవేళ వారి భుజాలను తాకుతూ దేవతలు బైటకు వెళ్లిపోతారని తెలిపారు.అష్టాదశపురాణాలసారమైనవేంకటాచల మహత్యంలో ఈ వివరాలన్నీ వున్నాయని పేర్కొన్నారు.

PC: youtube

ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

శ్వేతదీపానికి చేరుకోటానికి ప్రపంచవ్యాప్తంగా కొన్నిస్థలాలలో రహస్యమార్గాలున్నాయి.సిద్ధులు, యోగులు,దేవతలు వీటిద్వారా రాకపోకలు సాగించి బాహ్య ప్రపంచంలోకి వచ్చి లోకకళ్యాణం కోసం కొన్ని కార్యాలునిర్వహిస్తారని వెల్లడించారు.వుత్తరఈశాన్యప్రాంతంలోని దట్టమైన అడవుల్లో వుండే ఓ గుహ ముఖద్వారమే శ్వేతదీపానికి శేషాచలంకొండల నుంచి రహస్య మార్గమని సూచనగా పేర్కొంటారని రమణదీక్షితులు అన్నారు.

PC: youtube

ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

ఈ శ్వేతదీపంపై వుండే రత్నఖచితసింహాసనంపై వుండే మహాపురుషుడు ఆసీనుడై ఇరువైపులా దేవేరులతో కొలువుంటారని పేర్కొన్నారు. ద్వాపర యుగంలో శ్రీమహావిష్ణువు దర్శనార్ధం వాయు దేవుడు, వైకుంఠానికి వస్తే ఆదిశేషువు వాయుదేవుడిని అడ్డగించి, మహావిష్ణువు మహాలక్ష్మితో పాటు శయనించి ఉన్నాడని చెప్తాడు. అడ్డగించిన ఆదిశేషువుకు వాయుదేవుడికి యుద్ధం జరుగుతుంది.

PC: youtube

ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

అప్పుడు శ్రీమహావిష్ణువు అక్కడకు వస్తే ఇద్దరు వాళ్ళవాళ్ళ గొప్పతనం చెప్పుకొంటారు. మహావిష్ణువు వారికి పరీక్షగా మేరు పర్వతం ఉత్తర భాగంలో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషుని గట్టిగా చుట్టి పట్టుకొమని చెప్పి, వాయుదేవుడిని ఆ పర్వతాన్ని తన బలంతో అక్కడ నుండి కదిలించమని పరీక్షపెడతాడు.

PC: youtube

ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

ఆ పరీక్షకు సమస్త బ్రహ్మాండంలో అల్లకల్లోలం నెలకొనగా చతుర్ముఖబ్రహ్మ, ఇంద్రాది దేవతల కోరికమేరకు ఆదిశేషువు ఆనందపర్వతం మీద తన పట్టు సడలించి పరీక్షనుంచి విరమిస్తాడు.దాని ఫలితంగా ఆనంద పర్వతం వాయువు ప్రభావం వల్ల అక్కడనుండి వెళ్ళి స్వర్ణముఖీ నది ఒడ్డున పడుతుంది. ఇది తెలుసుకొని ఆదిశేషువు బాధ పడతాడు.

PC: youtube

ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

ఆ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ ఆదిశేషువుని వేంకటాద్రితో విలీనం చేస్తాను అక్కడ మహావిష్ణువు వెలస్తాడు అని చెబుతాడు. ఆదిశేషువు వేంకటాద్రి పర్వతంలో విలీనం అయి ఆదిశేషువు పడగ భాగంలో (శేషాద్రి) శ్రీమహావిష్ణువు వెలశారు, శేషువు మధ్య భాగంలో అహోబిలంలో శ్రీ నారసింహమూర్తి, తోక భాగంలో శ్రీశైల క్షేత్రములో మల్లికార్జునస్వామిగా వెలశారు.

PC: youtube

ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి గురించి మీకు తెలుసా! శ్రీ వారి గర్భగుడిలో ఒక పిల్లి అనుచానంగా నివసిస్తు వస్తోంది. మాములుగా శ్రీ వారి ఆలయం బంగారు వాకిలి తలుపులు తెల్లవారు జామున 3 గంటలకు సుప్రభాత సేవ సమయంలో అర్చకుల చే తెరువబడుతాయి.

PC: youtube

ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

.ఆ సమయంలో బంగారు వాకిలి లోపలికి అర్చకులు, జీయంగారు స్వామి, ఏకాంగితో పాటుగా 'సన్నిధి గొల్ల' అనబడే ఒక యాదవుడూ మాత్రమే ప్రవేశిస్తారు. కాని అదే సమయంలో అశ్చర్యకరంగా ఒక దైవీకమైన పిల్లి క్రమం తప్పకుండా వీరితో పాటుగా బంగారు వాకిలిలో ప్రవేశిస్తుంది. ఇది శ్రీ వారి లీల మాత్రమే గాని మరియొకటి కాదు.

PC: youtube

ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

ఈ పిల్లి (లేక పిల్లులు)సుమారుగా 100 సంవత్సరముల(ఈ గుడితో సంబధం ఉన్నటువంటి పూర్వికుల నుండి గ్రహించిన సమాచారం మేరకు) నుండి శ్రీ వారి గర్భాలయంలో వున్నట్టు తెలుస్తోంది. మాములుగా రాత్రి శ్రీ వారి ఏకాంత సేవ సమయంలో తలుపులు మూసి వేస్తారు. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలు శ్రీ వారిని అర్చిస్తారని ప్రతీతి.

PC: youtube

ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

ఆ సమయంలో గర్భాలయం ఎట్టి పరిస్థితుల్లోను లోపల ఎవ్వరు ఉండకుడదు. ఇది అనుచానంగా శ్రీ వారి ఆలయంలో వస్తున్న సంప్రదాయం. ఆశ్చర్యకరంగా ఈ పిల్లి కూడా ఈ నిబంధనను క్రమంతప్పక పాటిస్తుంది. ఆ తర్వాత తిరిగి సుప్రభాత సమయంలో నే అర్చకులతో పాటు ఈ పిల్లి లోనికి ప్రవేశిస్తుంది.

PC: youtube

ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

ఈ పిల్లి శ్రీ వారికి నివేదించిన తర్వాత మాత్రమే ప్రసాదం స్వీకరిస్తుంది అది కూడా అర్చకులు పిల్లి చేసే సంజ్ఞలను గుర్తించి ప్రసాదాన్ని పిల్లి కోసం పెట్టినప్పుడు మాత్రమే అది స్వీకరిస్తుంది.అలాగే రాత్రి ఏకాంత సేవ సమయంలో శ్రీ వారికి నివేదించబడిన పాలు అర్చకులు ఇవ్వగా స్వీకరిస్తుంది.

PC: youtube

ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !

శ్రీ వారికి నివేదించని ప్రసాదాన్ని ఇది స్వీకరించదు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. మరొక విషయమేంటంటే ఈ పిల్లి ఆయుర్దాయం తీరిన వెంటనే ఆ స్థానంలో మరొక పిల్లి శ్రీ వారి కైంకర్యం చేయడానికి సిద్ధంగా వుంటుంది. ఈవిధంగా శ్రీ వారు మనుష్యులతో పాటు జంతువులను కుడా కటాక్షిస్తున్నారు!

PC: youtube

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

రోడ్డు ద్వారా

తిరుపతి రాష్ట్రంలో అతిపెద్ద బస్సు టర్మినల్స్ కలిగి ఉంది. అన్ని ప్రధాన పట్టణాలూ, నగరాలూ లేదా దక్షిణ భారతదేశం నుండి నేరుగా బస్సులు ఉన్నాయి. అలిపిరి బస్ స్టాప్ నుండి తిరుపతికి ప్రతి రెండు నిమిషాలకు బస్సులు నడుస్తాయి. ఈ నగరం అంతర్గతరవాణా వ్యవస్థ బాగా అభివృద్ది చెందడం వల్ల ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

రైలు మార్గం ద్వారా

దేశవ్యాప్తంగా నడుపుతున్న రైళ్లకు తిరుపతి ఒక ప్రధాన రైల్వే స్టేషన్. తిరుపతి నుండి రేణిగుంట జంక్షన్ కి ప్రయాణం 10 నిమిషాల దూరంలో ఉంది. తిరుపతి నుండి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న గూడూర్ జంక్షన్ కూడా యాత్రీకుల అవసరాలు తీరుస్తుంది.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

వాయు మార్గం ద్వారా

తిరుపతి విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించబడింది, కానీ ఇప్పటికీ అంతర్జాతీయ విమానాలు నడవడం లేదు. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, వైజాగ్, కోయంబత్తూర్, కోలకతా, ముంబైకి విమానాలు ఉన్నాయి. ఈ విమానాశ్రయం నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నై దీనికి సమీప విమానాశ్రయం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X