Search
  • Follow NativePlanet
Share
» »సిక్కీం పర్యాటకానికి వెల్దామా?

సిక్కీం పర్యాటకానికి వెల్దామా?

సిక్కింలో చూడదగిన పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన కథనం.

చైనా, నేపాల్ మరియు భూటాన్ సరిహద్దులుగా ఉన్న రాష్ట్రం సిక్కిం. హిమాలయ పర్వత పంక్తుల్లో భాగమైన సిక్కిం భారతదేశంలో సందర్శించడానికి అత్యంత ప్రాచుర్యం పొందింది. సిక్కింలో పర్వత సౌందర్యం మరియు పురాతన టిబెట్ బౌద్ధ సంస్కృతి కి చెందిన అనేక కట్టడాలు ఆకర్షిస్తాయి. అదే విధంగా పర్వత, పూల లోయల సొగసులు ఏ వయస్సు వారినైనా ఇట్టే ఆకట్టుకొంటాయి. ఇక్కడి పర్యాటక ప్రాంతాల మధ్య దూరం చాలా తక్కువగానే ఉన్నా వాటిని చేరుకోవడానికి ఎక్కవ సమయం పడుతుంది. పర్వత మయమైన మార్గాలే ఇందుకు కారణం. అయినా అక్కడికి చేరుకొన్నాక మనం పడిన అలసటలన్నింటినీ మరిచిపోతాం. ఈ నేపథ్యంలో సిక్కింలో చూడదగిన పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన కథనం మీ కోసం...

గ్యాంగ్ టక్

గ్యాంగ్ టక్

P.C: You Tube

గ్యాంగ్ టక్ సముద్రమట్టానికి 5,500 అడుగుల ఎత్తులో ఉన్న ఒక చిన్న పట్టణం. ఇక్కడికి దగ్గర్లో ఉన్న కాంచన్ జంగా పర్వత శిఖరాన్ని చూడటం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. గ్యాంగ్ టక్ చేరుకోవడానికి విమాన సౌకర్యం లేదు. పశ్చిమబెంగాల్ లోని సిలిగురి నుంచి నాలుగుగంటల రోడ్డు మార్గం ద్వారానే ప్రయాణించాలి.

మఠాలు

మఠాలు

P.C: You Tube

మెడిటేషన్ అంటే ధ్యానం పై ఆసక్తి ఉన్నవారికి ఈ సిక్కిం బాగా నచ్చుతుంది. సిక్కింలో దాదాపు 200 మఠాలు పర్వత శిఖరాల పై భాగాన ఉంటాయి. ఇందులో గ్యాంగ్ టక్ కు దగ్గరగా ఉన్న రూమ్ టెక్, పెమయాంగ్ సే, టాషింగ్ డింగ్ లను ఎక్కువ మంది పర్యాటకలు సందర్శిస్తూ ఉంటారు.

నాతు లా సరస్సు

నాతు లా సరస్సు

P.C: You Tube

గ్యాంగ్ టక్ నుంచి దాదాపు 3 గంటల ప్రయాణం తర్వాత నాతు లా సరస్సును చేరుకోవచ్చు. ఇది చైనా సరిహద్దులో ఉంటుంది. బుధ వారం నుంచి ఆదివారం వరకూ మాత్రమే ఈ సరస్సు అందాలను చూడటానికి వీలవుతుంది. ఇందుకు ప్రత్యేక అనుమతి కూడా అవసరం. నాతు లా సరస్సుకు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోమ్ గో సరస్సు కూడా చూడదగినదే

గాలిలో బువ్వ తినాలాగాలిలో బువ్వ తినాలా

అభయారణ్యాలు

అభయారణ్యాలు

P.C: You Tube

సిక్కిం అభయారణ్యాలకు నిలయం. అంతరించే స్థితికి చేరుకుంటున్న అనేక జంతు, పక్షులను ఈ అభయారణ్యాల్లో సంరక్షిస్తున్నారు. సింగ్ బా అభయారణ్యం, వార్ సే అభయారణ్యాలతో పాటు జవహర్ లాల్ నెహ్రూ బొటానికల్ గార్డెన్ కూడా చూడదగినది.

యుక్ సోం

యుక్ సోం

P.C: You Tube

ట్రెక్కర్స్ కు స్వర్గధామం సిక్కిం. ఈ రాష్ట్రంలో ట్రెక్కింగ్ కు అనువుగా ఉన్నన్ని మార్గాలు మరెక్కడా కనిపించవేమో. అందులోనూ యుక్ సోం మార్గం లో ఒక్కసారైనా వెళ్లాలని ట్రెక్కర్స్ కలలు కంటఉంటారు. ఈ మార్గం ద్వారా ప్రయాణం చేస్తూ కాంచన్ జంగా పర్వత శిఖరాన్ని, రతోంగ్ సరస్సు వంటి ఎన్న పర్యాటక కేంద్రాలను పలకరిస్తూ ముందుకు సాగవచ్చు.

సతీదేవి మరణించిన ప్రాంతం ఇప్పుడు ఎక్కడుందో తెలుసా?సతీదేవి మరణించిన ప్రాంతం ఇప్పుడు ఎక్కడుందో తెలుసా?

యుమ్ తాంగ్ వ్యాలీ

యుమ్ తాంగ్ వ్యాలీ

P.C: You Tube

భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందమైన పర్వత లోయ ప్రాంతాల్లో యుమ్ తాంగ్ వ్యాలీ కూడా ఒకటి. సముద్ర మట్టానికి దాదాపు 9 వేల అడుగుల ఎత్తులో ఈ వ్యాలీ ఉంటుంది. ఇక్కడికి దగ్గర్లోనే చైనా, టిబెట్ సరిహద్దులు ఉంటాయి. ఇక్కడికి దగ్గర్లోనే జీరో పాయింట్ కూడా ఉంటుంది. ఇక్కడికి వెళ్లడానికి ప్రత్యేక అనుమతి అవసరం. ఈ అనుమతులన్నీ ప్రభుత్వంచేత గుర్తింపు పొందింన పర్యాటక సంస్థలే అందజేస్తాయి.

మైసూరు దసరాకు వెలుతున్నారామైసూరు దసరాకు వెలుతున్నారా

పెల్లింగ్

పెల్లింగ్

P.C: You Tube

గ్యాంగ్ టక్ నుంచి మూడు నుంచి నాలుగు గంటల ప్రయాణంతో పెల్లింగ్ ను చేరుకోవచ్చు. ఇక్కడ చుట్టు పక్కల పరిసరాలు చాలా అందంగా ఉంటాయి. ఉండటానికి హోం స్టేలు కూడా అందుబాటులో ఉంటాయి. చుట్టు పక్కల అనేక మఠాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా అందమైన సరస్సులు ఇక్కడ చూడదగిన ప్రాంతాలు. ఈ పర్యాటక ప్రాంతాలన్నింటినీ చూడటానికి స్థానికంగా జీపులు అద్దెకు దొరుకుతాయి.

రవన్ గ్లా

రవన్ గ్లా

P.C: You Tube

గ్యాంగ్ టక్ నుంచి పెల్లింగ్ కు వెళ్లే మార్గంలో చూడదగిన పర్యాటక ప్రాంతాల్లో రవన్ గ్లా ఒకటి. ఇక్కడ అనేక అందమైన ఉద్యానవనాలు ఉంటాయి. సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండటం వల్ల ఇక్కడ వాతావరణం ఏ కాలంలో అయినా చాలా చల్లగా ఉంటుంది.

నామ్ చీ

నామ్ చీ

P.C: You Tube

ఇక్కడ బ`హదాకారంలో ఉన్న విగ్రహాలను చూడటానికే చాలా మంది పర్యాటకులు నామ్ చీకు వస్తుంటారు. సముద్ర మట్టానికి దాదాపు ఏడువేల అడుగుల ఎత్తులో ఉన్న పర్వత శిఖరాల పై దాదాపు 100 అడుగుల ఎత్తైన విగ్రహాలను చూడటం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందుకే పర్యాటకులు ఈ విగ్రహాలను చూడటానికే నామ్ చీకు వెలుతుంటారు.

ఇక్కడ మీరు వివాహం చేసుకోవాలన్నా చేసుకోలేరుఇక్కడ మీరు వివాహం చేసుకోవాలన్నా చేసుకోలేరు

రివర్ రాఫ్టింగ్

రివర్ రాఫ్టింగ్

P.C: You Tube

సాహస యాత్రలను ఇష్టపడేవారు తప్పకుండా తీస్తా నదీ తీరానికి చేరుకొంటారు. ఇక్కడ రివర్ రాఫ్టింగ్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అందువల్లే కేవలం రివర్ ర్యాప్టింగ్ కోసమే ఇక్కడికి వస్తుంటారు. గ్రేడ్ 2, 4 రివర్ రాఫ్టింగ్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. మహా-సిర్వానీ-బర్డాంగ్-రోంగ్ పో మార్గం రివార్ రాఫ్టింగ్ కు స్వర్గధామంగా పేర్కొంటారు.

నగ్న యక్షిణి అందాలు ఇక్కడే?నగ్న యక్షిణి అందాలు ఇక్కడే?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X