Search
  • Follow NativePlanet
Share
» »గడ్డి మోపులెత్తుకొని నడిచే పల్లెపడుచుల నడుమోంపువలే....ఎంత సక్కగున్నాయో

గడ్డి మోపులెత్తుకొని నడిచే పల్లెపడుచుల నడుమోంపువలే....ఎంత సక్కగున్నాయో

భారత దేశంలోని అతి ముఖ్యమైన వంతెనల గురించి కథనం.

By Kishore

కొత్తగా చలా'మని'లోకి వచ్చి నోట్ల బొమ్మల పై మీ నాలెడ్జ్ ఎంత?కొత్తగా చలా'మని'లోకి వచ్చి నోట్ల బొమ్మల పై మీ నాలెడ్జ్ ఎంత?

ఈ ప్రాంతాలకు వెళితే టైం మిషన్ లో అప్పటి కాలానికి వెలుతారు?ఈ ప్రాంతాలకు వెళితే టైం మిషన్ లో అప్పటి కాలానికి వెలుతారు?

పల్లెపడుచు 'తానాలాడే' పొద్దు ప్రియుడు తొంగిచూస్తున్నప్పుడు ఆమె మొహం పై కనబడే చిరుకోపం... ఎంత అందంగా ఉంటుందో ఈ వంతెనల పై నిలబడి చూస్తే చుట్టూ ఉన్న ప్రకృతి అంత అందంగా కనిపిస్తుంది. ఇక దూరం నుంచి ఈ వంతెనలు చూస్తే అదే పల్లెపడుచు ముద్దబంతి పూల గంపను 'నెత్తినెట్టుకొని' వయ్యారంగా నడుచుకొంటూ తనను మనువాడే వాడి దగ్గరికి వెలుతుంటే కనీ కనబడక కదిలే నడుమోంపులు ఎంత ముచ్చట గొలుపుతాయో పొద్దు గూకే వేళ ఈ వంతెన అందాలు అంత కంటే అందంగా కనిపిస్తాయి. అందుకే ఈ వంతెనలు కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇక ఈ వంతెనలు ఇంజనీరింగ్ ప్రతిభకు నిలువుటద్దాలు. అందువల్లే ఇవి అటు మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేవిగానే కాకుండా ఇటు విజ్జానాన్ని పంచేవిగాను ఉన్నాయి. ఇటు వంటి వంతెనలను చూడటానికి కేవలం భారత దేశంలోని వారే కాకుండా విదేశీయులు కూడా ఆసక్తిని చూపిస్తున్నారు. అటువంటి వంతెనల వివరాలు మీ కోసం...

1. కోలియా బ్రిడ్జ్

1. కోలియా బ్రిడ్జ్

Image Source:

బ్రహ్మపుత్ర నది పై ఈ బ్రిడ్జిని నిర్మించారు. అస్సాంలోని బ్రహ్మపుత్ర నది కి అడ్డంగా నిర్మించిన ఈ బ్రిడ్జ్ నదికి ఉత్తరం వైపున ఉన్నసోనితపూర్ ను దక్షిణ భాగంలో ఉన్న నగావ్ ను కలుపుతుంది. సాయంత్రం సమయంలో ఈ బ్రిడ్జ్ అందాలు ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ద్వీపాలతో ద్విగుణీక`తమవుతుంది.

2. గోదావరి బ్రిడ్జ్

2. గోదావరి బ్రిడ్జ్

Image Source:

దక్షిణ భారత దేశంలో అతి పొడవైన నదిగా గోదావారికి పేరుంది. ఈ గోదావరి పై రైల్ కం రోడ్ విధానంలో నిర్మించిన బ్రిడ్జ్ ను చూసి తీరాల్సిందే. ఇది కొవ్వూరు రాజమండ్రిల మధ్య ఉంది. గోదావరి బ్రిడ్జ్ పొడవు 4.1 కిలోమీటర్లు. ఇది ఆసియా ఖండంలోనే మూడో అతి పొడవైన రైల్వే కం రోడ్ బ్రిడ్జ్.

3. యమునా బ్రిడ్జ్

3. యమునా బ్రిడ్జ్

Image Source:

భారత దేశంలో అతి పొడవైనే ఊగే వంతన. భారత దేశంలోని అలహాబాద్ నగరంలో 2004లో ఈ బ్రిడ్జ్ ను నిర్మించారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడమే ప్రధాన ఉద్దేశంగా ఈ బ్రిడ్జ్ ను ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జ్ అలహాబాద్, నైని మధ్య నిర్మించబడింది.

4. బాంద్రా వర్లీ సీ లింక్

4. బాంద్రా వర్లీ సీ లింక్

Image Source:

మహారాష్ర్టలోని ఈ బ్రిడ్జ్ ను అధికారికంగా రాజీవ్ గాంధీ సీ లింక్ అని పిలుస్తారు. ముంబై పశ్చిమ భాగంలోని బంద్రా ప్రదేశాన్ని దక్షిణ ముంబైలోని వర్లీతో ఈ బ్రిడ్జ్ కలుపుతుంది. దాదాపు రూ.1,600 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ వంతెన పొడవు 5.6 కిలోమీటర్లు.

6. నివేదిత బ్రిడ్జ్

6. నివేదిత బ్రిడ్జ్

Image Source:

పశ్చిమ బంగ్లాలోని హుగ్లీ నది పైనే దీనిని కూడా నిర్మించారు. వివేకానంద బ్రిడ్జికి సమాంతరంగా కొద్ది దూరంలో ఉన్న ఈ బ్రిడ్జ్ 1932 నుంచే ప్రజలకు సేవ అందిస్తోంది. సిస్టర్ నివేదిత గౌరవార్థం ఈ బ్రిడ్జ్ కు ఆ పేరు పెట్టారు. ప్రతి రోజు దాదాపు 50 వేల వాహనాలు ఈ బ్రిడ్జ్ పై రాకపోకలు కొనసాగిస్తాయి.

7. శరావతి రైల్వే బ్రిడ్జ్

7. శరావతి రైల్వే బ్రిడ్జ్

Image Source:

కర్నాటకలోని హొన్నావరకు దక్షిణంగా ఈ బ్రిడ్జ్ ను నిర్మించారు. శరావతి నదికి అడ్డంగా నిర్మించిన ఈ వంతెన ద్వారా కొంకణ ప్రాంతానికి రైలు సౌకర్యం ఏర్పడింది. దాదాపు 2060 మీటర్లు ఉన్న ఈ రైలు కర్నాటకలో అతి పొడవైన వంతెనల విషయంలో మొదటి స్థానంలో ఉంది.

8. హౌరా బ్రిడ్జ్

8. హౌరా బ్రిడ్జ్

Image Source:

పశ్చిమ బెంగాల్ లేదా కలకత్తా అంటే వెంటనే గుర్తుకు వచ్చేది హౌరా బ్రిడ్జ్. ఈ వంతెనను కూడా హుగ్లీ నదికి అడ్డంగా నిర్మించారు. ప్రతి రోజూ కనీసం లక్ష వాహనాలే కాకుండా దాదాపు లక్షన్నర మంది ప్రజలు దీని పై రాకపోకలు కొనసాగిస్తారు. ప్రపంచంలో పొడవైన బ్రిడ్జ్ లలో ఇది కూడా ఒకటి.

9. వెంబానంద్ రైల్వే బ్రిడ్జ్

9. వెంబానంద్ రైల్వే బ్రిడ్జ్

Image Source:

భారత దేశంలో పొడవైన బ్రిడ్జ్ లలో ఇది మొదటి వరుసలో ఉంటుంది. కేరళలోని ఈ బ్రిడ్జ్ ఇడపల్లి వెల్లారపదమ్ మధ్య ఉంది. 4.6 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనను 11700 టన్నుల స్టీల్, 58 వేల టన్ సీమెంట్ ను వినియోగించి నిర్మించారు. ఈ బ్రిడ్జ్ ద్వారా రోజుకు 15 రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయి.

10. రామ్ జోలా, లక్ష్మణ జోలా వంతెనలు

10. రామ్ జోలా, లక్ష్మణ జోలా వంతెనలు

Image Source:

రిషికేష్ లోని గంగానది పైన ఈ రామ్ జోలా, లక్ష్మణ జోలా అనే వంతెనను నిర్మించారు. కొండ పై నుంచి నదీ లోయలు, పచ్చటి పరిసరాలను చూడటానికి వీలుగా ఈ వంతన నిర్మాణం కొనసాగింది. ఈ వంతెన పైకి కేవలం పాదచారులను మాత్రమే అనుమతిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X