Search
  • Follow NativePlanet
Share
» » ఈ దేవాలయాల్లో మంత్ర, తంత్రాలనూ నేర్చుకోవచ్చు

ఈ దేవాలయాల్లో మంత్ర, తంత్రాలనూ నేర్చుకోవచ్చు

భారత దేశంలో మంత్ర, తంత్ర విద్యలకు ప్రాచూర్యం పొందిన దేవాలయాల గురించి కథనం.

భారత దేశంలో దైవ దర్శనం సర్వ సాధారణం. ముఖ్యంగా హిందూ మతంలో దైవ దర్శనం కోసం దేవాలయాలకు వెలుతారు. అయితే కొన్ని దేవాలయాలు మంత్ర, తంత్రాల పై నమ్మకం ఉన్నవారికి, ఆ
విద్యను నేర్చుకునేవారిని విశేషంగా ఆకర్షిస్తాయి. ఈ మంత్ర తంత్రాలకు సంబంధించిన వివరాలు మన పురాణాల్లో, వేదాల్లో కూడా వివరించారు. అటువంటి మంత్ర తంత్రాలకు ప్రాచూర్యం చెందిన కొన్నిదేవాలయాల వివరాలు మీ కోసం...

వైద్యనాథ మందిరం, హిమాచల్ ప్రదేశ్

వైద్యనాథ మందిరం, హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube

హిమాచాల్ ప్రదేశ్ లోని వైద్యనాథ మందిరంలో ప్రధాన దైవం శివుడు. ఇక్కడ నిత్యం అఘోరాలు పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా శివలింగాన్ని అభిషేకం చేసిన నీటికి అతీత శక్తులు వస్తాయని ఇక్కడి వారు భావిస్తుంటారు.

ఏకలింగ మందిరం, రాజస్థాన్

ఏకలింగ మందిరం, రాజస్థాన్

P.C: You Tube

ఇక్కడ కూడా శివుడినే ఆరాధిస్తారు. ఈ దేవాలయం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఉంది. ఇక్కడ శివుడికి నాలుగు ముఖాలు ఉంటాయి. దీనిని నల్లని రంగు గ్రానైట్ తో నిర్మించారు.

వేతాల్ మందిరం ఒడిషా

వేతాల్ మందిరం ఒడిషా

P.C: You Tube

8వ శతాబ్దంలో నిర్మించిన ఈ దేవాలయం ఒడిషాలోని భువనేశ్వర్ లో ఉంది. ఇక్కడ ప్రధాన దైవం చాముండి మాత. కాళీమాతకు ప్రతి రూపంగా ఈ దేవతను కొలుస్తారు. ఇక్కడ ప్రతి నిత్యం అఘెరాలు తాంత్రిక
పూజలు నిర్వహిస్తారు.

కామాఖ్యా దేవాలయం, అస్సాం

కామాఖ్యా దేవాలయం, అస్సాం

P.C: You Tube

శక్తిపీఠాల్లో ఒకటైన ఈ కామాఖ్య దేవాలయం తాంత్రి విధి విధానాలకు చాలా ప్రాచూర్యం చెందినది. ఇక్కడ సతీదేవి యోని పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారికి రుతుస్రావం జరుగుతుందని నమ్ముతారు.

కాళీఘాట్, కొలకత్తా

కాళీఘాట్, కొలకత్తా

P.C: You Tube

కొలకత్తాలోని కాలీఘాట్ తాంత్రిక పూజలకు చాలా ఫేమస్. అందువల్లే ఇక్కడ ఏడాదిలో ఏ సమయంలో చూసినా అఘోరాలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. పురాణాల ప్రకారం ఇక్కడ అమ్మవారి వేళ్లుపడ్డాయని చెబుతారు.

జ్వాలాముఖి దేవాలయం, హిమాచల్ ప్రదేశ్

జ్వాలాముఖి దేవాలయం, హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube

జ్వాలాముఖిలో ప్రతి నిత్యం ఒక జ్వల ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. కొన్ని వందల ఏళ్లుగా ఈ జ్వాల వెలుగుతూ ఉన్నట్లు చెబుతారు. ఇక్కడ ఉన్న ఒక తీర్థంలో నీరు చూడటానికి చాలా వేడిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే తాకితే మాములుగా చల్లగానే ఉంటాయి.

కాలభైరవ మందిరం, మధ్యప్రదేశ్

కాలభైరవ మందిరం, మధ్యప్రదేశ్

P.C: You Tube

మధ్యప్రదేశ్ లో కాలభైరవ మందిరం ఉంది. ఇక్కడ తాంత్రిక విద్యలు నిత్యం జరగుతూ ఉంటాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అఘెరాలు ఇక్కడికి వస్తుంటారు.

ఖజురహో మందిరం, మధ్యప్రదేశ్

ఖజురహో మందిరం, మధ్యప్రదేశ్

P.C: You Tube

మధ్యప్రదేశ్ లోని ఖజురహో దేవాలయం శిల్పకళాక`తికే కాకుండా తాంత్రిక విద్యలకు ప్రాచూర్యం చెందినది. అందువల్లే ఇక్కడికి తాంత్రిక విద్యను అభ్యసించేవారు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.

బాలాజీ మందిర రాజస్థాన

బాలాజీ మందిర రాజస్థాన

P.C: You Tube

మెహందిపుర బాలాజీ మందిరంలో ప్రధాన దైవం ఆ ఆంజనేయుడు. ఇక్కడ దెయ్యం ఒంటి పై వస్తే పాలదోలుతారని నమ్ముతారు. అందుకే నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

ముంబాదేవి మందిరం, ముంబై

ముంబాదేవి మందిరం, ముంబై

P.C: You Tube

మంత్ర, తంత్ర శక్తులను నేర్పించే దేవాలయాల్లో ముంబైలోని ముంబాదేవి దేవాలయం ముందు ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి 8 చేతులు ఉంటాయి. నిత్యం అఘోరాలు వస్తుంటారు.

అరుదైన 'సబ్బురాయి' తో నిర్మించిన దేవాలయాలు ఈ జంట నగరాల్లోఅరుదైన 'సబ్బురాయి' తో నిర్మించిన దేవాలయాలు ఈ జంట నగరాల్లో

జూనియర్ హంపిని చూశారా?జూనియర్ హంపిని చూశారా?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X