Search
  • Follow NativePlanet
Share
» »భారత దేశంలోని అతి ఎత్తైన గోపురాలు ఉన్న హిందూ దేవాలయాలు ఇవే.

భారత దేశంలోని అతి ఎత్తైన గోపురాలు ఉన్న హిందూ దేవాలయాలు ఇవే.

భారత దేశంలో అత్యంత ఎతైన గోపురాలు కలిగిన దేవాలయాలకు సంబంధించిన కథనం.

భారత దేశంలో దేవాలయాల దర్శనం ఒక వైదిక ప్రక్రియ. దీని వల్ల తాము భగవంతుడి అత్యంత దగ్గరగా వెలుతున్నామని ప్రజలు భావిస్తారు. అంతేకాకుండా దేవాలయాల దర్శనం వల్ల పాపం పోయి పుణ్యం వస్తుందని చాలా మంది నమ్ముతున్నారు. ఇక ఆలయం అన్న తక్షణం మనకు గుర్తుకు వచ్చేది ఎతైన గోపురాలు.

ఈ గోపురాలు ఆ దేవాలయంలోని మూలవిరాట్టు పాదాలకు ప్రతీకలుగా చెబుతారు. అంతేకాకుండా చోళులు, పల్లవులు, పాండవులు నిర్మించిన దేవాలయాల్లోని గోపురాలు అత్యంత ఎత్తుగా ఉంటాయి.

ఈ నేపథ్యంలో భారత దేశంలో అత్యంత ఎతైన గోపురాలు కలిగిన దేవాలయాలకు సంబంధించిన కథనం మీకోసం. ఈ దేవాలయాల్లో శ్రీరంగం, మురుడేశ్వర, ఆనందమలియార్, శ్రీ వల్లీ ఆండాల్ పుత్తూర్, ఉలగనాథ పెరుమాల్ దేవాలయం తదితర దేవాలయాలు ఉన్నాయి.

 శ్రీరంగం

శ్రీరంగం

P.C: You Tube

భారతదేశంలోని ఎత్తైన గోపురాల్లో మొదటి స్థానంలో ఉన్నది శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం. ఈ గోపురం ఎత్తు 239.5 అడుగులు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు రంగనాథుడి రూపంలో అంటే ఆదిశేషుడి పై పవళించిన స్థితిలో కనిపిస్తాడు.

మురుడేశ్వర

మురుడేశ్వర

P.C: You Tube

కర్నాటకలోని ప్రముఖ శైవ క్షేత్రమైన మురుడేశ్వర ఆలయం ఎత్తు 237.5 అడుగులు. అందువల్ల ఇది ఎతైన గోపురాల్లో రెండోస్థానం ఆక్రమించింది. ఇక్కడ అతి పెద్దదైన శివుడి విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు. మురుడేశ్వర బీచ్ కూడా ప్రముఖ ఆకర్షణీయ పర్యాటక ప్రాంతం.

 ఆనందమలియార్ దేవాలయం

ఆనందమలియార్ దేవాలయం

P.C: You Tube

తిరువన్నామలై లోని ఆనందమలియార్ దేవాలయం గోపురం ఎత్తు 21.6 అడుగులు. దీనిని దేవరాయులు నిర్మించారని చెబుతారు. ఈ గోపురాన్ని అమ్మణి అమ్మాళ్ గోపురం అని అంటారు. అమ్మణి అమ్మాళ్ అనే మహిళ ఇంటిటా తిరిగి విరాళాలు సేకరించి ఈ గోపురం నిర్మించిందని చెబతారు.

శ్రీ వల్లీ పుత్తూర్ ఆండాల్ దేవాలయం,

శ్రీ వల్లీ పుత్తూర్ ఆండాల్ దేవాలయం,

P.C: You Tube

తమిళనాడులోని శ్రీ వల్లీ పుత్తూర్ లోని ఆండాల్ దేవాలయం ఎత్తు 193.5 అడుగులు. తమిళనాడులోని రాజముద్రలో ఈ దేవాలయం గోపురం మనకు కనిపిస్తుంది. దీన్నిబట్టి ఈ ఆలయ గోపురానికి ఉన్న ప్రాధాన్యతను తెలుసుకోవచ్చు.

ఉలగనాథ పెరుమాల్ దేవాలయం

ఉలగనాథ పెరుమాల్ దేవాలయం

P.C: You Tube

కాంచిపురంలో అమ్మవారి దేవాలయానికి ఎదురుగా ఉన్న ఆలయమే ఉలగనాథ పెరుమాల్ దేవాలయం. ఇక్కడ ప్రధాన దైవం వామనమూర్తి. మూల విరాట్టు 17 అడుగులు. ఇక ఆలయ గోపురం ఎత్తు 192 అడుగులు. ఈ దేవాలయం 108 విష్ణు దివ్యక్షేత్రాల్లో ఒకటి.

ఏకాంబరేశ్వర దేవాలయం

ఏకాంబరేశ్వర దేవాలయం

P.C: You Tube

కాంచిపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయం పంచభూత లింగాలల్లో ఒకటి. ఇక్కడి శివలింగాన్ని భూమికి ప్రతీకగా భావిస్తారు. ఇక్కడే పార్వతీదేవి ఓ మామిడి చెట్టు కింద తపస్సు చేసి శివుడిని వివాహం చేసుకొందని చెబుతారు. ఈ ఆలయ గోపురం ఎత్తు 190 అడుగులు.

అజగర్ ఆలయం మధురై

అజగర్ ఆలయం మధురై

P.C: You Tube

108 వైష్ణవ క్షేత్రాల్లో అజగర్ ఆలయం కూడా ఒకటి. ఇక్కడ స్వామివారు మొలలో కత్తిని ధరించి ఉంటారు. ఇటువంటి విగ్రహం మనకు మరెక్కడా కనిపించదు. ఇక ఆలయం గోపురం ఎత్తు 187 అడుగులు.

మీనాక్షి అమ్మవారి దేవాలయం

మీనాక్షి అమ్మవారి దేవాలయం

P.C: You Tube

మధురై లో ఉన్న మీనాక్షి అమ్మవారి ఆలయం రాజగోపురం ఎత్తు 170 అడుగులు. కాగా మధులరై ఆలయంలో 14 ఎత్తైన గోపురాలు ఉండటం విశేషం. ఈ ఆలయంలోని గోపురాల పై పురాణ ప్రాధాన్యతమైన శిల్పాలు వివిధ రంగుల్లో కనువిందు చేస్తాయి.

 సారంగపాణి దేవాలయం

సారంగపాణి దేవాలయం

P.C: You Tube

కుంభకోణంలోని సారంగపాణి ఆలయం 108 వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి. ఇది కుంభకోణంలో ఉంది. ఈ ఆలయ గోపురం ఎత్తు 164 అడుగులు. ఈ ఆలయాన్ని చోళులు నిర్మించినట్లు చెబుతారు.

రాజగోపాల స్వామి దేవాలయం

రాజగోపాల స్వామి దేవాలయం

P.C: You Tube

తమిళనాడులోని రాజగోపాలస్వామి దేవాలయాన్ని విజయరాఘవ నాయక్ నిర్మించాడు. ఈ ఆలయం ప్రపంచంలోనే తొమ్మిదవ అతి పెద్ద హిందూ దేవాలయం కాగా గోపురం ఎత్తు 154 అడుగులు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X