Search
  • Follow NativePlanet
Share
» »హైద్రాబాద్ లోని ఈ కోటలను సందర్శించడం మరపురాని అనుభవం

హైద్రాబాద్ లోని ఈ కోటలను సందర్శించడం మరపురాని అనుభవం

తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాంటి అద్భుతమైన కోటలు ఎన్నో వున్నాయి. శాతవాహనులు, చాళుక్యులు, విష్ణుకుండినులు, కాకతీయుల కాలం నాటి కోటలు శిథిలావస్థలో పడివున్నాయి. ఆ కోటలను చూసి అలనాటి మన వైభవాన్ని తెలుసుకోవాల

చారిత్రక ప్రదేశాలు, సందర్శనా స్థలాలు భారతదేశానికే గర్వకారణమని చెప్పవచ్చు. తెలంగాణలో చారిత్రక ప్రదేశాలు, వారసత్వ కట్టడాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. గత వైభవాలకు తార్కాణంగా భారతదేశ చరిత్రకు ప్రత్యక్ష నిదర్శనంగా, నేటికి ఎన్నెన్నో కోటలు దేశమంతా మనకు కనబడుతాయి. అలాంటి కోటలను మనం చూసినప్పుడు నాటి రాజుల వైభవం కళ్ళ ముందు కదలాడుతుంది. అనాటి సంస్కృతికి దృష్టాంతంగా మిగిలిన శిథిలాలు, అనాటి పాలనా విధానానికి సాక్ష్యంగా నిలిచిన శిలాశాసనాలు మనల్ని ఉత్తేజితులను చేస్తాయి.

కొన్ని కోటలను చూసినపుడు కోటల అద్భుతమైన శిల్పసంపదను, చాతుర్యాన్ని కలిగి అలనాటి శిల్పుల అద్భుత ప్రతిభతో పాటు, అడుగడుగునా అబ్బురపరిచే నాటి నిర్మాణశైలి మనల్ని గత కాలపు వైభవంలోకి తీసుకువెళతాయి. రాజులు పోయినా, రాజ్యాలు పోయినా కోటల శిథిలాలు మాత్రం మిగిలాయి. మనుష్యులు చేసే యుద్దాల నుండి ప్రక్రుతి వైపరీత్యాల వరకు అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కొని నిలబడేలా పటిష్టంగా నిర్మించారు.

తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాంటి అద్భుతమైన కోటలు ఎన్నో వున్నాయి. శాతవాహనులు, చాళుక్యులు, విష్ణుకుండినులు, కాకతీయుల కాలం నాటి కోటలు శిథిలావస్థలో పడివున్నాయి. ఆ కోటలను చూసి అలనాటి మన వైభవాన్ని తెలుసుకోవాలన్న ఆరాటం అందరికీ వుంటుంది. కాబట్టి, ఈ కోటలను దర్శించడానికి ముందు కోటల గురించి కాస్త తెలుపుకుని వెళితే మరింత ఉత్సాహాంగా ఉంటుంది. ఒక్కొక్క కోటను ఒక్కొక్క రోజు సందర్శించడం ఒక మరపురాని అనుభవం.

గోల్కొండ కోట:

గోల్కొండ కోట:

హైదరాబాద్ నగరానికి సుమారు 11 కిలో మీటర్ల దూరంలో ఉన్న గొల్కండ కోట ఉంది. 15 వ శతాబ్దంలో గోల్కొండ ఎంతో కళకళ లాడేది, కానీ ఇప్పుడు శిధిలమవుతున్న పురాతణ వైభవం మాత్రమే కనిపిస్తుంది. 1512 నుండి నగరాన్ని పాలించిన ఖుతుబ్ షా వంశీకుల చేత గోల్కొండ కోట నిర్మింపబడినది. ఈ కోటకున్నలో ఒక విశేషం ఉంది. అదే శబ్ద లక్షణ శాస్త్రం. ఈ కోట వరండాలో నిలుచుని చప్పట్లు కొడితే ఆ శబ్దం ప్రధాన రహదారి నుండి 91 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రదేశానికి స్పష్టంగా వినబడుతుంది. ఒక రహస్య సొరంగ మార్గం ఈ గోల్కొండ కోటని చార్మినార్ తో కలుపుతుందని నమ్ముతారు. అయితే, ఎటువంటి ఆధారాలు ఈ సొరంగ మార్గం గురించి దొరకలేదు.
Photo Courtesy: Smkeshkamat

 గద్వాల కోట:

గద్వాల కోట:

గద్వాల కోట మహబూబ్ నగర్ జిల్లాలోని కోటలన్నిటిలోకి ప్రసిద్ధి చెందినది. గద్వాల పట్టణం నడి బొడ్డున ఈ కోట ఉంది. ఇది వలయాకారంలో ఉన్న మట్టికోట. కోట బయటి వైపు ఎత్తైన పెద్ద పెద్ద బురుజులతో మట్టితో నిర్మించారు. వీటిలో మూడు ఆలయాలు చెప్పుకోదగినవి. వాటిలో ప్రధానమైనది. గద్వాల సంస్థాన ప్రభువుల ఇలవేల్పైన శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం. ఇది మిగిలిన ఆలయాలకు మధ్యలో ఉండి, ఎత్తైన వేదిక మీద నిర్మించబడి ఉంది. ఈ ఆలయానికి ఇరువైపుల మరో రెండు ఆలయాలు ఉన్నాయి. వీటిలో ఒకటి శివాలయం. ఈ ఆలయాలలోని శిల్పాలు ఆకట్టుకుంటాయి. ఈ మూడు అలయాలు ఒకే ఆవరణలో ఉన్నాయి. ఈ కోటను రాజా పెద్ద సోమభూపాలుడు క్రీ.శ.1662లో నిర్మించాడు.
Photo Courtesy: Gadwal Fort

చంద్రగఢ్ కోట:

చంద్రగఢ్ కోట:

మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల కు సమీపంలో 20 కిలోమీటర్ల దూరంలో, ఆత్మకూరు పట్టణానికి పశ్చిమాన 12 కిలోమీటర్ల దూరంలో, జూరాల ప్రాజెక్ట్ కు ఉత్తరాన 5 కిలోమీటర్ల దూరంలో చంద్రఘడ్ గ్రామానికి ఉత్తరదిశలో ఎత్తైన మీద రెండు అంచెలుగా ఈ కోటను నిర్మించారు. చుట్టు పక్కల పది కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ నుండి చూసినా ఈ కొండ, కొండ మీది కోట కనిపిస్తాయి. ఈ కోట మొత్తం నిర్మాణమంతా రాతితోనే నిర్మించడం విశేషం. ఈ నాటికి చెక్కుచెదరని రాతికట్టడం చూపరులను ఆకట్టుకుంటుంది. కోట లోపల శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. అలయం చుట్టూ 8 ఊట బావులున్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికీ స్వచ్ఛమైన నీటి ఊటతో తాగునీరును అందిస్తున్నాయి.
Photo Courtesy: Naidugari Jayanna

వంరంగల్ కోట్:

వంరంగల్ కోట్:

వరంగల్ నగరంలో అందరిని ఆకర్షించే వాటిలో ఒకటి వరంగల్ కోట. దక్షిణ భారత దేశంలో శిల్ప కళకు ఉదాహరణ ఈ కోట. గణపతిదేవుడు 1199వ సంవత్సరంలో కోట భవనం నిర్మాణం ఏర్పాటు చేసాడు మరియు 1261 వ సంవత్సరంలో అతని కుమార్తె రాణి రుద్రమ దేవి దానిని పూర్తి చేసింది. ప్రస్తుతం శిధిలావస్థలో ఉంది. ఈ కోట రెండు గోడలతో ఉన్న నాలుగు పెద్ద ప్రవేశ ద్వారాలను సంచి శైలిలో కలిగిఉంది. ఎవరైతే నిర్మాణ ఆసక్తి కలిగి ఉన్నారో, చరిత్ర మరియు పురాతన కట్టడాల మీద ఆసక్తి కలిగి ఉన్నారో ఈ కోటను సందర్శించి ఆ విజ్ఞానాన్ని పొందుతారు మరియు అన్ని వయస్సుల సందర్శకుల ఆదరణ పొందటంలో నిదర్శనంగా ఈ కోట ఉంది.
Photo Courtesy:abhinaba

ఖమ్మం ఖిల్లా:

ఖమ్మం ఖిల్లా:

ఖమ్మం కోట ఖమ్మం నగరంలో ఉంది. ఖమ్మం కోటను క్రీ.శ. 950 సంవత్సరంలో కాకతీయ రాజుల పాలనలో ఉన్నపుడు నిర్మాణంను ప్రారంభించారు. అయితే, ఈ కోట వారి కాలంలో పూర్తి కాలేదు, ముసునూరి నాయక్ లు, వెలమ రాజులు ఈ కోట నిర్మాణంను వారి ఆధీనంలోకి తీసుకున్నారు. 1531 లో కుతుబ్ షాహీల పాలనలో నూతన భవంతులు, గదులతో ఈ కోట మరింత అభివృద్ది చెందింది. హిందూ, ముస్లింల నిర్మాణ శైలికి చక్కటి ఉదాహరణ ఈ కోట, దీని నిర్మాణంలో ఇద్దరి శైలి, పాలకులు ప్రమేయం ప్రభావితం చేసింది. నేడు ఈ కోట ఉనికి 1000 సంవత్సరాలు పూర్తి చేసి గర్వంగా నిలబడి ఉంది. ఇది తెలంగాణ అలాగే ఖమ్మం చరిత్రలో గొప్ప స్థానాన్ని పొందిన ప్రధాన పర్యాటక ప్రదేశం.
Photo Courtesy: Shashank.u

 ఆదిలాబాద్ కోట :

ఆదిలాబాద్ కోట :

అదిలాబాద్ ఒక చారిత్రక కోటని కలిగి ఉంది. ఇది ఆనాటి చారిత్రక సంఘటనలను గుర్తుకు తెస్తుంది. ఇది అదిలాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉంది. ఈ కోట కొంచెం శిధిలావస్థ దశలో ఉంది. అయినప్పటికీ ఇక్కడికి పర్యాటకులు తరచూ వస్తుంటారు. సాయంత్రం వేళలో కోట చుట్టూ ప్రక్కల స్థానికులు, పర్యాటకులు ఈ కోటను నిత్యం సందర్శిస్తుంటారు. ఈ కోటని అప్పటి బీజాపూర్ సుల్తానులు కట్టించినారు. ఇది అప్పటి బీజాపూర్ సుల్తానుల కట్టడాలకి చారిత్రక నిదర్శనం.
Photo Courtesy: Nishant88dp

ఖిలాషాపూర్ కోట:

ఖిలాషాపూర్ కోట:

సాధారణంగా మహారాజులు కోటలు కడతారు. కానీ ఖిలాషాపూర్ కోట అలా కాదు , కల్లు గీసే సాధారణ వ్యక్తి కట్టిన అసాధారణమైన కోట. అదే దీని ప్రత్యేకత. ఖిలాషాపూర్ కోటని కట్టించిన ఆ అసమాన్యుడే సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్. ఖిలాషాపూర్ కోట ఊరి మద్యలో నిర్మించారు. చుట్టూ ప్రహరీ గోడ రాతితో లోపలి గోడ మాత్రం మట్టితో కట్టడం విశేషం. ఈ కోట నిర్మాణానికి డంగు సున్నం, గ్రానైట్ రాళ్లను కూడా ఉపయోగించారు. పాపన్న కట్టిన కోటకు గ్రామం చుట్టూ ఉన్న కొండలు పెట్టని కోటగోడలాగా తొలి రక్షణ కవచంలా ఉన్నాయి. కోట ప్రాంగణంలో నలువైపులా నాలుగు పెద్ద బురుజులు, మధ్యలో ఒక పెద్ద బురుజు ఉంది. మూడు దిక్కుల్లో మూడు ప్రవేశ ద్వారాలున్నాయి. అయితే ఈ కోట ద్వారాలు చాలా చిన్నగా నిర్మించడం వల్ల శత్రుసైనికులు కోటలోనికి రావడాినకి ఎక్కువ సమయం పడుతుంది. కోటపై భాగంలో శత్రువులపై ఫిరంగులు గురిపెట్టేందుకు తగిన ఏర్పాట్లున్నాయి. అత్యవసర సమయాల్లో అవసరమైతే అక్కడి నుండి బయటికి వెళ్ళేందుకు వీలుగా సొరంగాలున్నాయి. ఈ కోట గోడలు , బురుజులు, ద్వారాలు నిర్మించిన విధానం పాపన్న గౌడ్ యుద్ద వ్యూహ నైపుణ్యానికి నిదర్శనాలని చెప్పవచ్చు. ఒక్కసారి కోటని మొత్తం పరిశీలించి చూస్తే పాపన్న ముద్ర ఈ కోటలో అడుగడుగునా అణువణువునా కనబడుతుంది. పాపన్న యుద్దం తంత్రం ఎలా ఉండేదో మనకు అర్థం అవుతుంది.

 కోయిలకొండ కోట:

కోయిలకొండ కోట:

కోయిలకొండ కోట మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. ఒకప్పటి ఆంధ్రరాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన 7 గిరిదుర్గాలలో ఇది ఒకటి . కొండపై వెలిసిన దుర్గం కాబట్టి కోవెలకొండ అని పేరు. కోవెల అనగా దేవాలయం. కోయిలకొండ గ్రామానికి దక్షిణ దిశలో ఎత్తయిన గుట్టపై కోటను నిర్మించారు. చరిత్ర ప్రకారం 14 వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు అల్లుడైన అళియరామరాయలు కాలంలో వడ్డెరాజులు ఈ కోటను నిర్మించారు. తర్వాత ఈ కోట వెలమ రాజుల హస్తగతమైంది. ఈ కోటను ప్రస్తుతం కీలగుట్టగా పిలుస్తారు. కోట చుట్టూ శ్రీరామకొండ, వీరభద్రస్వామి, వడెన్న దర్గాలు కలవు.
Photo Courtesy: koil

రాయగిరి ఖిల్లా

రాయగిరి ఖిల్లా

భువనగిరి జిల్లాకి సుమారు 8 కిలోమీటర్ల దూరంలోని మల్లన్న గుట్టపై రెండు వేల సంవత్సరాల క్రితం ఎంతో వైభవాన్ని చవిచూసిన ఈ కోటలో నేడు శిధిలాలు మాత్రమే నాటి వైభవానికి ఆనవాళ్ళుగా ఉన్నాయి. చరిత్ర కారుల పరిశోధనలను అనుసరించి బహుశా ఈ కోట శాతవాహనుల కాలంలోనే నిర్మాణం జరిగి ఉంటుందని భావన. అనంతరకాలంలో విష్ణు కుండినులు కొంత కాలం ఈ కోట కేంద్రంగా ఈ ప్రాంతాన్ని పాలించి ఉంటారని, వారి తర్వాత రాష్ట్ర కూట రాజులు ఈ కోటను ప్రధాన కేంద్రంగా చేసుకుని ఈ ప్రాంతాన్ని ఏలి ఉంటారని అంచనా. రాయగిరి కోట సుమారు 28 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండటం వల్ల కోటను పూర్తిగా తిరిగి చూడాలంటే కనీసం 3 రోజులు పడుతుంది. అది కూడా ఒక్కరు, ఇద్దరు కోట ప్రాంతానికి వెళ్ళలేరు. ఒక బృందంగా వెళితే మంచిది. కోట ప్రాంతంలో అడుగుడుగునా శిధిల ఆలయాల అవశేషాలు మనకు కనిపిస్తాయి. వినాయక విగ్రహాలు, నంది విగ్రహాలు, శివలింగాలు, దేవాలయ మంటపాల శిల్పాలు చెల్లా చెదురుగా అక్కడక్కడా పడిపోయి కనిపిస్తాయి.

భువనగిరి కోట:

భువనగిరి కోట:

తెలంగాణ రాష్ట్రములోని నల్గొండ జిల్లాకు చెందిన భువనగిరి ఒక ముఖ్య పటణం. భువనగిరిలో ఉన్న కోట కాకతీయుల కాలంలో మిక్కిలి ప్రసిద్ధి చెందినది. ఈ కోట పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన పాలకుడైన త్రిభువన మల్ల విక్రమదిత్య చే ఏకశిలారాతి గుట్టపై నిర్మించబడింది. భువనగిరికోట ప్రవేశద్వారం గోల్కొండకోటలోని ‘బాలాహిస్సార్' మొదటిద్వారం ఫతే దర్వాజా లాగే వుంటుంది. రెండోద్వారం గుళ్ళోని చౌకోటులెక్క వుంటుంది. మూడోద్వారం సాధారణం. నాలుగోద్వారం కూడా సామాన్యంగానే వుంది. పై ఎత్తుకి శిఖరానికి చేరినపుడు అక్కడ రాజభవనాలు, అంతఃపురం కనిపిస్తాయి. ఎత్తైనగోడలు, విశాలమైన గదులు, ఇస్లాం సంస్కృతి నిర్మాణశైలిలో వున్నాయి. పరిసరాలను పరిశీలిస్తే బారాదరికి ఉత్తరాన ఒక నల్లని నంది విగ్రహం వుంది. అంతదూరాన ఆంజనేయుని శిల్పం వుంది. రాజప్రాసాదాల కింద ఎన్నో అంతుతెలియని రహస్య శిలాగర్భ మార్గాలున్నాయి.

పెనుగొండ కోట

పెనుగొండ కోట

పెనుగొండ కోట అనంతపురం జిల్లాలో కలదు. ఈ కోట అంతపురం - బెంగళూరు జాతీయ రహదారి మధ్యలో కలదు. ఈ కోటను మొదటగా హోయసలలు పాలించారు. శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో పెనుగొండ వారి రాజ్యానికి రెండవ రాజధానిగా వర్థిల్లినది. అదేవిదంగా వారికి ఇది వేసవి విడిదిగా కూడ సేవలందించింది. పెనుకొండ కోట బుక్కరాయుడు కట్టించిన ఈ కోటలో ఎన్నో పురాతన శాశనాలు ఉన్నాయి. ఇందులోని కట్టడాలు శత్రుదుర్బేద్యంగా ఉంటాయి. యెర్రమంచి గేటులో 1575లో నిర్మించిన 11 అడుగుల ఆంజనేయుని విగ్రహం ఉంది. విజయనగరపు రాజులు యుధ్ధానికి వెళ్ళేముందు ఇక్కడే పూజలు జరిపేవారట. పెనుకొండ లొ 365 దేవాలయాలు కలవు. వీటిని కృష్ణదేవరాయలు నిర్మించాడు.
Photo Courtesy: Chittichanu

కొండారెడ్డి బురుజు

కొండారెడ్డి బురుజు

కొండారెడ్డి బురుజును కర్నూల్ కోట కోటి అని కూడా పిలుస్తారు. కర్నూల్ నగరంలో ఎంతో ముఖ్యమైన ప్రాంతం. విజయనగర రాజు అచ్యుత దేవరాయలు నిర్మించిన ఒక ప్రధాన పర్యాటక ప్రదేశం. ఈ కోట నగర౦ నడిబొడ్డున ఉంది. ఈ అద్భుతమైన కట్టడంలో మిగిలిన భాగం కొండ రెడ్డి బురుజు మాత్రమే. ఈ కోటలో ఉన్న కారాగారంలోనే కొండ రెడ్డి తుది శ్వాస వదలడం వలన ఈ స్తంభానికి ఆయన పేరు పెట్టారు. ఈ కోట చాల వరకు శిధిలావస్థలో ఉన్నప్పటికీ, కొన్ని భాగాలు ఇంకా బలంగా ఉన్నాయి. వీటిలో ఒకటి ఎర్ర బురుజు. ఈ బురుజు క్రింది భాగంలో రెండు చిన్న పురాతన ఆలయాలు ఉన్నాయి. ఇవి ఎల్లమ్మ తల్లికి చెందినవి.ఈ కోటలో అనేక అధ్భుతమైన శాసనాలు ఉన్నాయి.

Photo Courtesy: RaghukiranBNV

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X