Search
  • Follow NativePlanet
Share
» »మన ఇండియాలో భారతీయులతో పాటు, విదేశీయులు కూడా అమితంగా ఇష్టపడుతున్న టాప్ 12 ప్రదేశాలు

మన ఇండియాలో భారతీయులతో పాటు, విదేశీయులు కూడా అమితంగా ఇష్టపడుతున్న టాప్ 12 ప్రదేశాలు

మన ఇండియాలో భారతీయులతో పాటు, విదేశీయులు కూడా అమితంగా ఇష్టపడుతున్న టాప్ 12 ప్రదేశాలు

మన భారత దేశం అనేక పర్యాటక ప్రదేశాలకు నెలవు. భారతదేశం పర్యాటక ప్రదేశాల సమాహారం. దేశంలో చూడటానికి ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వీటిని చూడటానికి తరచూ వేలల్లో, సీజన్ లలో అయితే లక్షల్లో పర్యాటకులు వస్తుంటారు. కేవలం పర్యాటకం మీదనే ఆధారపడి ఆదాయాన్ని ఆర్జించే రాష్ట్రాలు, దీవులు మన దేశంలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఉదాహరణకు కేరళ, గోవా, అండమాన్ నికోబార్ దీవులు, లక్షదీవులు వాటిలో కొన్ని. ఇలా దేశవ్యాప్తంగా విదేశీ పర్యాటకులను ఆకర్షించే సామర్థ్యం కూడా ఉంది.

చాలా మంది చనిపోయేలోపు ఆ ప్రదేశం చూసిరావాలి, ఈ ప్రదేశం చూసిరావాలి అని ఇతరులతో అంటుంటారు. కనీసం బయటి దేశాల పర్యాటనకు వెళ్ళకపోయిన, మన దేశంలోనే ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు, చూడచక్కని ప్రదేశాలు, ఆధ్యాత్మిక, ఆహ్లాదం కలిగించే ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈ ప్రదేశాలు కేవలం మన భారతీయులను మాత్రమే కాదు, విదేశీయలను కూడా అమితంగా ఆకట్టుకుంటున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మఖ్యంగా విదేశీయులు మన భారతదేశంలో ప్రదేశాలను ఇష్టపడటానికి ముఖ్యమైన కారణం భారతీయ సంస్కృతి మరియు సంప్రదాయాలు. అలాంటి ప్రదేశాలు మన దేశంలో ఎక్కడ ఉన్నాయి ? అక్కడ నిజంగా అంత బాగుంటుందా ? అనేదే ప్రస్తుత ఈ వ్యాసం. మరి విదేశీయులతో పాటు మన దేశీయులును కూడా ఆకర్షిసిస్తూ అత్యంత ప్రాచుర్యం పొందిన పది పర్యాటక ప్రదేశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం...

1. మేహ్రాన్ ఘర్ కోట: జోధ్పూర్

1. మేహ్రాన్ ఘర్ కోట: జోధ్పూర్

మేహరంగర్ కోట జోద్పూర్ లో ఉంది. ఈ కోట పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది.ఇండియాలో అత్యంత ప్రసిద్ది చెందిన పర్యాటక ప్రదేశాలలో ఇది ఒకటి. ప్రతి సంవత్సరం అనేక మంది విదేశీ పర్యాటకులు ఈమేహెరంగర్ కోటను సందర్శిస్తుంటారు. ఇది ఒక అసాధారణమైన కోటి. ఈ కోటను సందర్శిస్తున్నంత సేపు ఉత్తేజంతో పాటు ఆశ్చర్యం కలుగుతుంది. ఇండియాలో ఉన్న అతి పెద్ద కోటల్లో ఇంది ఒకటి. విదేశీ పర్యాటలకుతో ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ కోట చుట్టూ ఉన్న గోడ శత్రువల నుండి రక్షక కవచంగా ఉంది.

2. ఖజురాహో టెంపుల్స్ -ఖజురాహో

2. ఖజురాహో టెంపుల్స్ -ఖజురాహో

మన దేశంలోని నలుమూల నుండే కాదు, విదేశీయులను కూడా అమితంగా ఆకర్షించే ప్రదేశాల్లో ఖజురహో . ఎక్కువగా విదేశీలయు ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ఎక్కువగా వస్తుంటారు. ఇది భక్తి, రక్తికి ప్రసిద్ది చెందిన శిల్పకళా దేవాలయం. ఈ ఖజురహో ఆలయాన్ని మధ్యయుగపు వారసత్వం చిహ్నంగా భావిస్తారు. ఇటువంటి శిల్పకళా ఆలయాలు నగరం మొత్తంలో దాదాపు 80ఆలయాలకు పైగానే ఉండేవి. అయితే ప్రస్తుతం ఇవి 22 మాత్రమే సందర్శన ప్రదేశాలుగా ఉన్నాయ. మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ నగరంకు సమీపంలోఖజురాహో ఉంది. ఖజురాహో వింధ్య సాత్పూర్ పర్వత శ్రేణుల నేపథ్యంలో అద్భుతంగా ఉంది.

3. అంబర్ (అమెర్) ఫోర్ట్ మరియు ప్యాలెస్ -జైపూర్

3. అంబర్ (అమెర్) ఫోర్ట్ మరియు ప్యాలెస్ -జైపూర్

విదేశీయుల పర్యటనకు బాగా ప్రసిద్ది చెందిన నగరం జైపూర్. దీన్నే పింక్ సిటీ అని కూడా పిలుస్తారు. అంబెర్లో ఉన్న అమెర్ ఫోర్ట్ , ఇది జైపూర్ నగరం నుండి సుమారు 26కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజా మాన్ సింగ్ నిర్మించిన పురాతన కోటలలో ఇది ఒకటి. ఎర్ర ఇసుకరాయి, పాలరాయి వంటి రెండు రాళ్ల కలయికతో ఎంతో కళాత్మకంగా నిర్మించిన ఈ కోట భారతీయ శిల్పకళకు అద్భుత నిదర్శనాలు. ఈ కోట సమీపంలో మాథ లేక్ ఉండటం ఈ కోటకు మరింత అదనపు ఆకర్షణ పెరిగింది.

4. తాజ్ మహాల్ - ఆగ్రా

4. తాజ్ మహాల్ - ఆగ్రా

ప్రపంచ వారసత్వ స్మారకం తాజ్ మహాల్. ఇది యమునా నది ఒడ్డున ఆగ్రాలో ఉంది. ఈ అద్భుతమైన కట్టడాన్ని మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ ప్రేమకు గుర్తుగా నిర్మించబడింది. ఈ స్మారక కట్టడం యొక్క నిర్మాణానికి సుమారు పది సంవత్సరాలు పట్టింది. ఈ కట్టడానికి తన భార్య పేరుతో తాజ్ హాల్ పేరు పెట్టడం జరిగింది. తాజ్ మహాల్ మన భారత దేశంలో అత్యంత ప్రసిద్ది చెందిన విదేశీ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక మంది పర్యాటకులు ఈ అద్భుతమైన అందమైన ప్రదేశాన్ని సందర్శించడానికి భారతదేశానికి వస్తుంటారు.

5. మైసూర్ మహారాజన్ ప్యాలెస్-మైసూర్

5. మైసూర్ మహారాజన్ ప్యాలెస్-మైసూర్

దక్షిణ భారత దేశంలో అత్యంత ప్రసిద్ది చెందిన పర్యాటక ప్రదేశాల్లో మైసూర్ మహారాజ్ ప్యాలెస్ ఒకటి. ఇది 20వ శతాబ్దంలో హెన్నీ ఇర్వింగ్ రూపొందించిన అందమైన ప్రదేశం. ఈ అద్భుతమైన స్మారక నిర్మాణం దాదాపు 15సంవత్సరాల కాల పట్టింది. ఈ ప్యాలెస్ ఎంతో అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ తో ఎంతో సృజనాత్మకతతో పూర్తి చేశారు. ప్యాలెస్ పైకప్పులు ఇటాలియన్ క్రిస్టల్ , చాండెలియర్స్ తో టేక్ నిర్మించారు. పాలరాయి హ్యాండిల్స్, బంగారు పూత గల గదులు మరియు గ్లాస్ విండోస్ ప్యాలెస్ మొత్తం దగదగ మెరిసిపోయేలా చేస్తుంది.

6. సిటీ ప్యాలెస్ -ఉదయ్ పూర్ :

6. సిటీ ప్యాలెస్ -ఉదయ్ పూర్ :

ఉదయ్ పూర్ లోని సిటీ ప్యాలెస్ పిచోలా సరస్సు ఒడ్డున ఉంది. రాజస్తాన్ లో తప్పక సందర్శించవల్సిన ప్రదేశాల్లో ఇది ఒకటి. రాష్ట్రంలో అతి పెద్ద ప్యాలెస్ లో ఇది ఒకటి.. ఈ ప్యాలెస్ చుట్టూ అద్భుతమైన లేక్ ఉంది. అలాగే ప్యాలెస్ సమీపంలో నీమచ్ మాత టెంపుల్ మరియు జగ్ మందిర్ లు ప్రసిద్ది చెందిన పర్యాటక ఆకర్షణలు.

7. కుతుబ్ మీనార్ -ఢిల్లీ:

7. కుతుబ్ మీనార్ -ఢిల్లీ:

ఇండియాలో అతి పెద్ద టవర్ ఉన్నంది మరియు భారతదేశ రాజధాని ఢిల్లీలో ఉంది. అనేక మంది దేశీ,విదేశీ పర్యాటకులను ఆకర్షించే పర్యాటక కేంద్రాలలో ఒకటి గా కుతుబ్ మినార్ ఉంది.మరియు మరెన్నో ఇతర ప్రామాణిక చారిత్రక స్మారకాలకి నిలయం. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ( వరల్డ్ హెరిటేజ్ సైట్) గా ప్రకటించబడిన ఈ ప్రాంతం లో అనేక బానిస రాజవంశానికి చెందిన కట్టడాలు ఉన్నాయి. చాలా చక్కగా నిర్వహించబడుతున్న ఈ ప్రదేశం, ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ మరియు ఢిల్లీ లోని ఒక మంచి విహార ప్రదేశం.

8. జైసల్మేర్ ఫోర్ట్ -జైసల్మేర్ :

8. జైసల్మేర్ ఫోర్ట్ -జైసల్మేర్ :

నగరం నడిబొడ్డున వుండే జైసల్మేర్ కోట ను జైసల్మేర్ కు గర్వ కారణంగా భావిస్తారు. పసుపు రంగు ఇసుకరాయి తో నిర్మించిన ఈ కోట సూర్యాస్తమయం లో బంగారంలా మెరిసిపోవడంతో దీన్ని సోనార్ ఖిల్లా లేదా బంగారు కోట అని కూడా అంటారు. త్రికురా కొండ మీద 1156లో భాటి రాజపుత్ర రాజు జైసల్ దీన్ని నిర్మించాడు. జైసల్మేర్ కోటలో చాల అందమైన భవంతులు, దేవాలయాలు, సైనికులు, వ్యాపారుల నివాస భవనాల సముదాయాలు వున్నాయి. ఈ కోట చుట్టూ 30అడుగుల ఎత్తైన గోడ వుంది. 99 బురుజులు వున్న పెద్ద కోట ఇది.

9. స్వామినారాయణ్ అక్షరధాం - న్యూ ఢిల్లీ

9. స్వామినారాయణ్ అక్షరధాం - న్యూ ఢిల్లీ

ఢిల్లీ లోని స్వామి నారాయణ్ అక్షరధాం టెంపుల్ భారతీయ సంస్కృతి ని, శిల్పశైలిని, ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తుంది. ఈ టెంపుల్ సముదాయాన్ని 5 సంవత్సారాల పాటు నిర్మించారు. ప్రాముఖ్ స్వామి మహారాజ్ ఆధ్వర్యంలో దీనిని నిర్మించారు. ఈయన బొచాసన్వాసి శ్రీ అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్తా వారసులు. అక్షర ధాం దేవాలయ సముదాయం లో సుమారు 11,000 మంది కళాకారులు పనిచేసారు. ఈ కాంప్లెక్స్ ను అధికారికంగా 6 నవంబర్, 2005 నాడు ఆవిష్కరించారు.

10. ఆగ్రా ఫోర్ట్ - ఆగ్రా

10. ఆగ్రా ఫోర్ట్ - ఆగ్రా

కొన్నిసార్లు ఎర్ర కోటగా పిలిచే ఆగ్రా కోట నిర్మాణ శైలి, రూపకల్పన, ఎరుపురంగు వంటి విషయాలలో ఢిల్లీ దిగ్గజ౦, చిహ్నమైన ఎర్ర కోటకు అగ్రగామిగా నిలిచింది. ఈ రెండు కట్టడాలను ఎరుపు ఇసుక రాయితో నిర్మించారు. దీనికి దగ్గరగా రాగానే పర్యాటకులకు ఢిల్లీ ఎర్ర కోట గుర్తుకు రావడాన్ని ఇది వివరిస్తుంది. ఆగ్రాలోని మొదటి ప్రపంచ వారసత్వ ప్రదేశం తాజ్ మహల్ కాగా ఇది రెండవది. దీనిని మొఘల్ చక్రవర్తి అక్బర్ 1565 లో నిర్మించాడు. ఆసక్తికరమైన అంశం, ఈ కోట ద్వారం వద్ద ఉన్న ఒక ఫలకం వాస్తవానికి ఈ కోట క్రీ.శ. 1000 కంటే ముందు నిర్మించారని తెలియచేస్తుంది, అక్బర్ చక్రవర్తి దీనిని కేవలం పునరుద్ధరించాడు.

11. గోవా

11. గోవా

ఇండియా లోని పడమటి తీరంలో గోవా ఎంతో కాలంగా ఒక ఆకర్షణీయ విహార స్ధలంగా పేరుగాంచింది. గోవా అత్యంత అందమైన ప్రదేశం.భారతదేశంలో అనేకమంది యువకులు ఎక్కువగా గోవాకి వెళ్ళటానికి ఇష్టపడతారు.ఈ గోవాకి హాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకూ అనేక సినిమాలు వచ్చాయి.ఈ ప్రదేశం అత్యంత అద్భుతంగా వుంటుంది.దాని యొక్క రమణీయమైన పరిసరాలచే పర్యాటకులను మైమరపిస్తుంది.

12. హంపి

12. హంపి

తుంగభద్ర నది ఒడ్డున ఉన్న హంపి విజయనగర పాలన కాలంలో అత్యంత దేదీప్యమానంగా వెలుగొందింది. ఆ సమయంలో ఇక్కడ అనేక అద్భుత దేవాలయాలు నిర్మించబడ్డాయి. వాటిలోని శిల్పకళ భారత శిల్పకళకు నిదర్శనం. అంతేకాకుండా ఇక్కడ ఆలయాల్లోని కొన్నిరహస్యాలు ఇప్పటికీ మర్మంగానే ఉండిపోయాయి. ఈ మర్మాలు భారతీయ వాస్తు శిల్పకళకు నిదర్శనం. కేవలం ఆలయాలే కాకుండా చుట్టు పక్కల ప్రదేశాలు ప్రకతి ప్రేమికులను రారమ్మని ఆహ్వనిస్తుంటాయి. ఫొటోగ్రఫీ అంటే ఇష్టమున్నవారికి ఈ చారిత్రాత్మక నగరం ఎప్పుడూ ఎర్ర తివాచిని పరుస్తూ ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X