Search
  • Follow NativePlanet
Share
» »అంత ఎత్తులో మీ ‘పక్క’ పైన ఉన్నవారిని కెవ్వు మని కేక పెట్టించకమానరు

అంత ఎత్తులో మీ ‘పక్క’ పైన ఉన్నవారిని కెవ్వు మని కేక పెట్టించకమానరు

దక్షిణ భారత దేశంలో ఉన్న ప్రముఖ హిల్ స్టేషన్స్ విషయమై కథనం.

By Kishore

ఈ విశాలమైన భారత దేశంలో అనేక రొమాంటిక్ ప్రదేశాలు ఉన్నాయి. ఆ విషయంలో హిల్ స్టేషన్లు మొదటి వరుసలో నిలబడుతాయనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఎందు కంటే అక్కడ వాతావరణ పరిస్థితులు అలా ఉంటాయి. ఎటువంటి వారికైనా శృంగారపరమైన ఆలోచనలు రేకెత్తించి వారికి పడక గదికి తీసుకుని వెలుతాయి. అందువల్లే హిల్ స్టేషన్లు, హనీమూన్ డెస్టినేషన్లుగా కూడా పేరుగాంచాయి. అందులో ఊటి, కొడైకెనాల్, కూర్గ్, అనంతగిరి, మున్నార్, నందిహిల్స్, కూర్గ్ వంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ అటు ఉక్కపోత ఎక్కువగా ఉండే సమయమైన వేసవిలో చల్లటి వాతావరణం కలిగిన వేసవి విడుదులుగానే కాకుండా ప్రేమికులకు, దంపతుల్లో వెచ్చటి కోరికలను రెచ్చగొట్టే ప్రాంతాలుగా కూడా పేరుగాంచాయి. ఈ నేపథ్యంలో దక్షిణ భారత దేశంలో ఉన్న ప్రముఖ హిల్ స్టేషన్స్ వివరాలు మీ కోసం

ఆ అనంత నిధి వెనక ఓ రాజు పశ్చాత్తాపం..స్వామిని దర్శించుకుంటేఆ అనంత నిధి వెనక ఓ రాజు పశ్చాత్తాపం..స్వామిని దర్శించుకుంటే

1. మున్నార్, కేరళ

1. మున్నార్, కేరళ

Image Source:

దక్షిణ భారతదేశంలో అత్యంత అందమైన హిల్ స్టేషన్ మున్నార్. కేరళ లోని పచ్చని ప్రదేశాలలో ఉన్న ఈ హిల్ స్టేషన్ హనిమూన్ డెస్టినేషన్ కూడా అందమైన తోటలు, సుందరమైన జలపాతాలు, పచ్చని చెట్లు, అందమైన లోయలతో ఈ మున్నార్ నిండి ఉంటుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మధురైకు దగ్గరగా ఉంటుంది. మధురై నుంచి నేరుగా బస్సు సౌకర్యం కూడా ఉంది.

మున్నార్ ఎలా చేరాలి?

విమానం
కొచ్చిలో 130 కిలోమీటర్లు మరియు మధురై (142 కిలోమీటర్లు)

రైలు ద్వారా
సమీప రైల్వే స్టేషన్లు కొచ్చి మరియు కొట్టాయంలో ఉన్నాయి.

సందర్శించడానికి ఉత్తమ సమయం:
సెప్టెంబరు నుండి మే వరకు

2. కూర్గ్

2. కూర్గ్

Image Source:

దక్షిణ భారత దేశంలో అత్యంత సుందరమైన హిల్ స్టేషన్స్ లలో కూర్గ్ ముందు వరుసలో ఉంటుంది. పచ్చటి పర్వతాల్లో గలగల పారే సెలయేరుల సవ్వడులు వింటుంటే సమయాన్ని కూడా మర్చిపోతాం. ట్రెక్కర్స్ కు ఇది స్వర్గధామం.

కూర్గ్ చేరుకోవడం ఎలా

విమానం ద్వారా
సమీప విమానాశ్రయం బెంగళూరు 260 కిలోమీటర్ల దూరంలో ఉంది

రైలు ద్వారా
సమీప రైలు స్టేషన్ మైసూరు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైసూరులో ఉంది

సందర్శించడానికి ఉత్తమ సమయం:
అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు

 3. ఊటి, తమిళనాడు

3. ఊటి, తమిళనాడు

Image Source:

ఊటిని 'రాణి అఫ్ హిల్ స్టేషన్' లేదా ఊటీ ఒక ప్రసిద్ధ హిల్ స్టేషన్స్ అని అంటారు. చుట్టూ పచ్చటి అడవులు, తెల్లవారుజామున పొగమంచు, కనుచూపు మేరలో టీ ఎస్టేట్స్ ఇంత కంటే మనస్సుకు ఆహ్లాద పరిచే ద`ష్యాలు ఇంకా ఏమికావాలి. అందుల్లే ఇది అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే ప్రముఖ హిల్ స్టేష్టన్స్ లో ఒకటిగా ఉంది.
ఎలా చేరాలి?

విమానం ద్వారం
ఊటీకి 105 కిలోమీటర్ల దూరంలో కోయంబత్తూర్ సమీప విమానాశ్రయం.

రైలు ద్వారా
ఊటీ మెట్టుపాలయం (47 కిమీ) కి అనుసంధానించబడింది. ఇది కోయంబత్తూర్ మరియు చెన్నై లకు నేరుగా అనుసంధానించబడి ఉంది. ప్రసిద్ధ బొమ్మ రైలు ఊటీని మేట్టుపాలయం మరియు కూనూర్ తో కలుపుతుంది.

సందర్శించడానికి ఉత్తమ సమయం:
సంవత్సరం మొత్తం

4. వైత్రి - కేరళ

4. వైత్రి - కేరళ

Image Source:

కాలుష్య రహిత హిల్ స్టేషన్స్ లలో కేరళలోని వైత్రి భారత దేశంలోని టాప్ 10లో ఒకటిగా నిలుస్తుంది. ఇక్కడ సహజమైన ప్రక`తి అందాలు ఎటువంటి వారికైనా మై మరిపింప జేస్తాయి. అందువల్లే ఈ హిల్ స్టేషన్ కొత్తగా పెళ్లైన జంటలకు స్వర్గధామం.

వైత్రి చేరుకోవడం ఎలా:

విమానం ద్వారా
85 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం

రైలులో
- కాలికట్ నుండి 60 కి.మీ.
- మైసూరు నుండి కాలికట్ కు 150 కిలోమీటర్లు

సందర్శించడానికి ఉత్తమ సమయం:
సెప్టెంబరు నుండి మే వరకు

5. దేవికులం, కేరళ

5. దేవికులం, కేరళ

Image Source:

మున్నార్ నుండి 16 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ అందమైన హిల్ స్టేషన్ పురాణ ప్రాధాన్యతను కలిగి ఉంది. ఇక్కడ ఉనన సరస్సులో సీతా దేవి స్నానం చేసినట్లు చెబుతారు. ఇక్కడ మనం స్నానం చేస్తే అన్ని రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం.

దేవికులం చేరుకోవడం ఎలా:

విమానం ద్వారా
149 కిలోమీటర్ల దూరంలోని కొచ్చిన్ సమీప విమానాశ్రయం

రైలులో
కొట్టాయం స్టేషన్ దేవికులానికి 132 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

సందర్శించడానికి ఉత్తమ సమయం:
సెప్టెంబరు నుండి మే వరకు

6. కొన్నూరు, తమిళనాడు

6. కొన్నూరు, తమిళనాడు

Image Source:

కూనూర్ సముద్ర మట్టానికి 1,858 మీటర్ల ఎత్తులో ఉంటుంది. నీలగిరి పర్వత శ్రేణుల్లో రెండో అతి పెద్ద హిల్ స్టేషన్ ఇదే. ఇక్కడి ప్రక`తి అందాలను చూడటానికి విదేశీయులు సైతం ఇక్కడకు తరుచుగా వస్తుంటారు.

కూనూర్ చేరుకోవడం ఎలా:

విమానం ద్వారం
సమీప విమానాశ్రయం కోయంబత్తూర్. 68 కిలోమీటర్ల దూరంలో ఉంది

రైలు ద్వారా
కూనూర్ మెట్టుపాలయం (28 కిలోమీటర్లు) మరియు ఊటీ మధ్య బొమ్మ రైలు మార్గంలో ఉంది.

సందర్శించడానికి ఉత్తమ సమయం:
నవంబర్ నుంచి ఫిబ్రవరి

7. హార్ల్సీ హిల్స్

7. హార్ల్సీ హిల్స్

Image Source:

సముద్ర మట్టానికి 1,265 మీటర్ల ఎత్తులో హార్ల్సీ హిల్స్ ఆంధ్రప్రదేశంలో ఉన్న అతి తక్కువ హిల్ స్టేషన్స్ లలో ఒకటి. ఇక్కడకు హనీమూన్ జంటలు ఎక్కువగా వస్తుంటారు. వేసవిలో కుటుంబ సభ్యలతో కలిసి వెళ్లడానికి ఇది అత్యంత అనువైన హిల్ స్టేషన్.

ఎలా చేరుకోవాలి

వివమానం ద్వారా
ఇక్కడకు దగ్గర్లో అంటే 160 కిలోమీటర్ల దూరంలో తిరుపతి విమానాశ్రయం ఉంది. అదేవిధంగా 165 కిలోమీటర్ల దూరంలో బెంగళూరు ఉంది.

రైలు ద్వారా
సమీప స్టేషన్ మదనపల్లె. ఇది 43 కిలోమీటర్ల దూరంలో ఉంది

సందర్శించడానికి ఉత్తమ సమయం:
సెప్టెంబరు నుండి మే వరకు

8. ఎర్కాడ్, తమిళనాడు

8. ఎర్కాడ్, తమిళనాడు

Image Source:

సముద్ర మట్టానికి 1500 మీటర్ల ఎత్తులో ఉన్న అద్భుతమైన హిల్ స్టేషన్ ను పేదల ఊటి అని కూడా అంటారు. కాఫీ తోటలకు, నారింజ తోటలకు ఈ ప్రదేశం చాలా ప్రసిద్ధి గాంచింది.

ఎర్కాడ్ చేరుకోవడం ఎలా:

విమానం ద్వారా
సమీప విమానాశ్రయం త్రిచి, ఎర్కాడ్ నుండి 163 కిలోమీటర్ల దూరం.

రైలు ద్వారా
సమీప స్టేషన్ 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న సేలం జంక్షన్

సందర్శించడానికి ఉత్తమ సమయం:
సెప్టెంబరు నుండి మే వరకు

9. పోన్ముడి, కేరళ

9. పోన్ముడి, కేరళ

Image Source:

ఇది కేరళలోని త్రివేండ్రం నుంచి 61 దూరంలో ఉంటుంది. సముద్ర మట్టానికి దాదాపు 100 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ హిల్ స్టేషన్ పరిధిలోనే నయ్యార్ అభయారణ్యం కూడా ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించడానికి అనువైన హిల్ స్టేషన్.

పొన్ముడి చేరుకోవడం ఎలా
దీనికి దగ్గర్లో చెప్పకోదగ్గ విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు లేవు. త్రివేండ్రం నుంచి బస్సు సర్వీసులు ఉన్నాయి. పొన్ముడి త్రివేండ్రం నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది.

సందర్శించడానికి ఉత్తమ సమయం:
సంవత్సరం మొత్తం

10. అనంతగిరి హిల్స్, తెలంగాణ

10. అనంతగిరి హిల్స్, తెలంగాణ

Image Source:

తెలంగాణలో ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్న హిల్ స్టేషన్స్ లలో అనంతగిరి కూడా ఒకటి. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం కూడా ఉంది. చుట్టు పచ్చని చెట్లతో ఉన్న ఈ ప్రాంతం ట్రెక్కర్స్ ను ఎక్కువగా ఆకర్షిస్తోంది.

అనంతగిరి చేరుకోవడం ఎలా:

రైలు ద్వారా
సమీప రైలు స్టేషన్ 10 కి.మీ.ల దూరంలో వికారాబాద్ ఉంది

సందర్శించడానికి ఉత్తమ సమయం:
సంవత్సరం మొత్తం

11. కొడైకెనాల్

11. కొడైకెనాల్

Image Source:

తమిళనాడు రాష్ట్రములో దిండిగల్ జిల్లాలో ఉన్న కొడైకెనాల్ దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన, బాగా పాపులర్ అయిన హిల్ స్టేషన్లలో ఒకటి. పచ్చిక మైదానాలు, జలపాతాలు, లోయలు, సరస్సులు కొడైకెనాల్ హిల్ స్టేషన్ కు ప్రత్యేకతను తీసుకువచ్చాయి. కొడైకెనాల్ సరస్సు మరియు ట్రెక్కింగ్ లో బోటింగ్ వెళ్ళి మంత్రముగ్దులను చేస్తుంది. బెంగళూరు వాసుల వీకెండ్ డెస్టినేషన్స్ లలో ఇది మొదటి స్థానంలో ఉంటుంది.

కొడైకెనాల్ చేరుకోవడం ఎలా:

విమానం ద్వారా
కొడైకెనాల్ కు సమీపంలో అంటే 120 కిలోమీటర్ల దూరంలో మధురై విమానాశ్రయం ఉంటుంది.

రైలు ద్వారా
సమీప రైల్వే స్టేషన్లు కోడై రోడ్ రైల్వే స్టేషన్ (80 కిలోమీటర్లు) మరియు పళని రైల్వే స్టేషన్ (64 కి.మీ)

సందర్శించడానికి ఉత్తమ సమయం:
ఏప్రిల్ నుండి జూన్ వరకు మరియు అక్టోబరు నుండి అక్టోబరు వరకు

12.అరకు వ్యాలీ, ఆంధ్రప్రదేశ్

12.అరకు వ్యాలీ, ఆంధ్రప్రదేశ్

Image Source:

దక్షిణ భారత దేశంలో అతి తక్కువ కలుషితమైన హిల్ స్టేషన్స్ లలో అరకు కూడా ఒకటి. ఇక్కడ కాఫీ తోటలతో పాటు సుంగధ ద్రవ్యాలు కూడా పండుతాయి. ముఖ్యంగా ఇక్కడ బొర్రా గుహలు చూడ దగిన ప్రదేశాలు. ఇక్కడ నిత్యం ఏదో ఒక సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంటుంది.

అరకు వాలీ చేరుకోవడం ఎలా:

గాలి ద్వారా
సమీపంలోని విమానాశ్రయం విశాఖపట్నం. 112 కిలోమీటర్ల దూరంలో ఉంది


సందర్శించడానికి ఉత్తమ సమయం:
సంవత్సరం మొత్తం

13. నంది హిల్స్, కర్నాటక

13. నంది హిల్స్, కర్నాటక

Image Source:

నిద్రిస్తున్న ఎద్దు ఆకారంలో నంది హిల్స్ ఉంటుంది. దీనిని ఆనంద హిల్స్ లేదా ఆనంద గిరి అని కూడా పిలుస్తార. ఇది సముద్ర మట్టానికి 1478 అడుగుల ఎత్తులో ఉండటం వల్ల ఎప్పుడూ చల్లగానే ఉంటుంది.

నంది హిల్స్ చేరుకోవడం ఎలా:

విమానం ద్వారా
సమీప విమానాశ్రయం బెంగుళూరు. 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.

రైలు ద్వారా
చిక్కబల్లాపూర్ సమీప రైల్వే స్టేషన్

సందర్శించడానికి ఉత్తమ సమయం:
సంవత్సరం మొత్తం

14. ఇడుక్కి, కేరళ

14. ఇడుక్కి, కేరళ

Image Source:

ప్రక`తి రమణీయతకు ఇడుక్కి నిలయం. ఇక్కడ కాఫీ, టీ తోటలు కూడా పర్యాటకులను రారమ్మని ఆహ్వనిస్తుంటాయి. ఈ ప్రాంతం సుగంధ ద్రవ్యాలకు కూడా చాలా ఫేమస్.

ఇడుక్కి చేరుకోవడం ఎలా:

గాలి ద్వారా
సమీపంలోని విమానాశ్రయం కొచ్చి. ఇది ఇడుక్కికి 132 కిలోమీటర్ల దూరంలో ఉంది

రైలు ద్వారా
సమీప రైల్వే స్టేషన్ కొట్టాయం వద్ద ఉంది. ఇది ఇడుక్కికి 133 కిలోమీటర్ల దూరంలో ఉంది

ఉత్తమ సమయం:
అక్టోబర్ నుండి జూన్ వరకు

15. కుద్రేముఖ్, కర్నాటక

15. కుద్రేముఖ్, కర్నాటక

Image Source:

కర్నాటకలోని ఈ ప్రముఖ హిల్ స్టేషన్ గుర్రపు మొహం ఆకారంలో ఉంటుంది. అందువల్లే దీనికి కుద్రేముఖ్ అని పేరు వచ్చింది. ఇక్కడి రమణీయమైన ప్రక`తి వల్ల మనం ఎంతో సేద దీరుతాం.

కుద్రేముఖ్ చేరుకోవడం ఎలా:

విమానం ద్వారా
సమీప విమానాశ్రయం మంగుళూరులో 99 కిలోమీటర్ల దూరంలో ఉంది

రైలులో
సమీప స్టేషన్ మంగుళూరు 99 Km దూరంలో ఉంది

సందర్శించడానికి ఉత్తమ సమయం:
సంవత్సరం మొత్తం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X