Search
  • Follow NativePlanet
Share
» »ఇండియాలో ఉండి ఈ దేవాలయాలు చూడకపోతే ఇక మీరు వేస్ట్!

ఇండియాలో ఉండి ఈ దేవాలయాలు చూడకపోతే ఇక మీరు వేస్ట్!

దక్షిణ భారత దేశంలో అతిముఖ్యంగా సందర్శించాల్సిన హిందుదేవాలయాల్లో 15 ముఖ్యమైన దేవాలయాల గురించి తెలపడం జరిగింది. వీటి గురించి చదువుతున్నప్పుడు మీరు ఈ దేవాలయను ఎందుకు మిస్ చేయకూడదన్న విషయం మీకు తెలుస్తుంద

భారత దేశంలో దక్షిణ భారత దేశానికి చాలా ప్రత్యేక ఉంది, దక్షిణ భారత దేశంలోని ఆలయ నిర్మాణాలు చూస్తే మనస్సు తన్మయత్వం చెందుతుంది. పురాతన కాలం నాటి ఆచారాలకు నిదర్శనంగా నిర్మించిన ఆలయాలు చారిత్రక ఔచిత్యానికి నిదర్శనం. అటువంటి దేవాలయాలను సందర్శించడం ఒక మంచి అనుభూతి కలిగిస్తుంది.

అందుకే దక్షిణ భారత దేశంలో ఉన్న దేవాలయలు టూరిస్టులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. ప్రపంచం నలుమూలల నుండి వచ్చే పర్యాటకులను ఈ దేవాలయాలను ఆకర్షించడం వెనుక కొన్ని ఇతిహాసాలు కూడా ఉన్నాయి. ఈ రహస్య ఇతిహాసాలు పర్యాటకుల్లో ఆసక్తిని కలిగిస్తాయి. అందువల్లే దక్షిణ భారత దేశంలోని ఈ ఆలయాలు పర్యాటక ప్రదేశాలుగా చోటు సంపాదించుకున్నాయి. మదుర మీనాక్షి నుండి తిరుపతి వరకూ దక్షిణ భారత దేశంలోని దేవాలయాల జాబితా చాలా పెద్దదిగా ఉంది. పర్యాటకులు సందర్శించాల్సిన దేవాలయాల చిట్టా పెద్దదైనా, వాటిన్నింటిని ఒకే సారి సందర్శించలేరు కాబట్టి, కొన్ని ముఖ్యమైన దేవాలయాల గురించి మీకు తెలపడం వల్ల మీరు ఆయా ప్రదేశాలకు వెళ్ళినప్పడు మర్చిపోకుండా ఆయా దేవాలయాలను సందర్శించడానికి వీలుంటుంది.

దక్షిణ భారత దేశంలో అతిముఖ్యంగా సందర్శించాల్సిన హిందు దేవాలయాల్లో 15 ముఖ్యమైన దేవాలయాల గురించి ఇక్కడ తెలపడం జరిగింది. వీటి గురించి చదువుతున్నప్పుడు ఈ ఆలయాలను ఎందుకు మిస్ చేయకూడదన్న విషయం మీకు తెలుస్తుంది. మరి ఆ దేవాలయాలేంటో..వాటి ప్రత్యేకతలేంటో ఒకసారి తెలుసుకుందామా..

మీనాక్షి అమ్మ టెంపుల్ మదురై:

మీనాక్షి అమ్మ టెంపుల్ మదురై:

ఇండియాలో బెస్ట్ టెంపుల్స్ లో మీనాక్షి అమ్మ టెంపుల్ మొదటిది. దాపు 17 ఎకారాల స్థలంలో నిర్మితమైనది. నగరం నడి బొడ్డున మీనాక్షి అమ్మ టెంపుల్ నిర్మించబడినది. ఈ దేవాలయం దాదాపు 2600 ఏళ్ళ నాటిదని అక్కడివారు చెబుతుంటారు.

Photo Courtesy: Jorge Royan

మీనాక్షి అమ్మ టెంపుల్ మదురై:

మీనాక్షి అమ్మ టెంపుల్ మదురై:

శివుని భార్య అయిన పార్వతి దేవికి ఈ గుడి అంకితం చేయబడినది. ఇంకా ఇక్కడే లార్డ్ శివ మరియు మీనాక్షి అమ్మవార్ల వివాహం జరిగినట్లు చెబుతుంటారు.

P.C: Suresh

విరూపాక్ష టెంపుల్ , హంపి:

విరూపాక్ష టెంపుల్ , హంపి:

విరూపాక్ష దేవాలయంను హంపిలో కనుగొన్నారు, హంపి బెంగళూరు నుండి 350కిమీ దూరంలో ఉంది, ఇండియాలో చూడదగ్గ ముఖ్యమైన దేవాలయాల్లో ఇది ఒకటి
PC: SOMA PAUL DAS

విరూపాక్ష టెంపుల్:

విరూపాక్ష టెంపుల్:

విజయనగ సామ్రాజ్య ఉత్తమ నిర్మాణాలలో ఇది ఒకటి. ఈ దేవాలయంను అనేక మంది పాలకులు అనేక సవరణలు చేసి, వివిధ రూపాల్లో అద్భుతంగా నిర్మించారు. అత్యంత శక్తివంతమైన దేవాలయాల్లో ఇది ఒకటి.
PC: Jean-Pierre Dalbéra

తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం, తిరుపతి:

తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం, తిరుపతి:

ఏడు కొండల మద్య కొలువై ఉన్న ఈ దేవాలయంను చేరుకున్న వెంటనే ద్రావిడ శైలి నిర్మాణాలు మన దృష్టిని ఇట్టే ఆకర్షిస్తాయి.
PC: Kalyan Kanuri

తిరుమల వెంకటేశ్వర టెంపుల్:

తిరుమల వెంకటేశ్వర టెంపుల్:

తిరుమల శ్రీ వెంటకశ్వరుని ఆశీస్సులు పొందడానికి భక్తులు దాదాపు 4000 మెట్లను ఎక్కుతుంటారు. తిరుమలకొండపై భక్తుకుల అందించే లడ్డు ప్రసాదం చాలా ఫేమస్ .
PC: Dinesh Kumar (DK)

పట్టడకాల్ :

పట్టడకాల్ :

చాళుక్యుల కాలం నాటి మహిమాన్వితమైన ప్రదేశం. ఈ ప్రదేశంలోని దేవాలయం గురించి ఒక ఆసక్తిరమైన విషయం ఏంటంటే, దేవాలయ నిర్మాణం ఉత్తర భారతీయ నిర్మాణ శైలితో కట్టినట్లు కనబడుతుంది.
PC: Manjunath Doddamani Gajendragad

పట్టడకల్: పట్టాడకాల్ దేవాలయం

పట్టడకల్: పట్టాడకాల్ దేవాలయం

పట్టడకల్ లోని ఆలయాలు 7వ మరియు 8వ శతాబ్దాలలో నిర్మించబడ్డాయి.
PC: Sanyam Bahga

రామనాథస్వామి టెంపుల్, రామేశ్వరం:

రామనాథస్వామి టెంపుల్, రామేశ్వరం:

శివుడి యొక్క జోతిర్లింగాల్లో రామేశ్వరంలోని రామనాథస్వామి టెంపుల్ ఒకటి. అత్యంత ప్రసిద్ధి చెందిన శివుని ఆలయం. ఈ ఆలయం శివుడికి అంకితం చేశారు.
PC: www.wikipedia.org

రామనాథస్వామి టెంపుల్:

రామనాథస్వామి టెంపుల్:

ఈ ఆలయంలో రెండు శివలింగాలున్నాయి. వీటిలో ఒకటి లార్డ్ సీత, మరొకటి లార్డ్ హనుమాన్ నిర్మించారు. ఈ దేవాలయంలోని కారిడార్(నడవ ప్రాంతం)మరే దేవాలయంలో లేనంత పెద్దగా ఉంది.
PC: www.wikipedia.org

హంపిలోని విటల్ టెంపుల్:

హంపిలోని విటల్ టెంపుల్:

హంపిలోని ప్రతి ఆలయానికి ఒక పురాణ కథ ఉంది. విటల్ ఆలయం లేదా విటలాలయం. ఇది హంపి యొక్క ఈశాన్య భాగంలో తుంగభద్ర నది ఒడ్డున ఉంది. హంపిలో సందర్శించదగ్గ ప్రముఖ ఆలయం ఇది.
PC: Anuragphotography

హంపి:

హంపి:

ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది, ఆలయంలోని నిర్మాణ శైలిలోని స్తంభాల నుండి సంగీతం వినుపిస్తుందని అంటారు. హంపిలోని అన్నిదేవాలయ నిర్మాణాలలోకి ఈ ఆలయ నిర్మాణశైలి విభిన్నంగా.. గొప్పగా ఉంటుంది.
PC: Nvamsi76

ఐరావతేశ్వర టెంపుల్, కుంబక్కోణం:

ఐరావతేశ్వర టెంపుల్, కుంబక్కోణం:

తమిళనాడులోని ఈ అందమైన దేవాలయం చూస్తే దక్షిణ భారత దేశంలోనే అద్భుతంగా నిర్మించబడినదిగా చెప్పవచ్చు. ఈ ఆలయ నిర్మాణంలో రాతి శిల్పాలకు మరియు ఉత్కంఠభరితమైన నిర్మాణాలకు ప్రసిద్ధి.
P C:Varun Shiv Kapur

ఐరావతేశ్వర టెంపుల్

ఐరావతేశ్వర టెంపుల్

ఐరావతేశ్వర టెంపుల్ 12వ లేదా 13వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ దేవాలయం భారతదేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటి.
PC: Karthikeyan.raghuraman

బ్రహదేశ్వర ఆలయం, తంజావూరు తమిళనాడు:

బ్రహదేశ్వర ఆలయం, తంజావూరు తమిళనాడు:

తంజావూరులో ఉన్న బ్రహదేశ్వర దేవాలయం ప్రపంచంలోని మొట్టమొదటి ఆలయం, ఇది పూర్తిగా గ్రానైట్ తో నిర్మించబడింది.
PC: Nara J

బ్రహదేశ్వర ఆలయం,

బ్రహదేశ్వర ఆలయం,

ఇండియాలోనే అతి పెద్ద ఆలయం, ప్రపంచంలో ఉన్న ఆలయాలలో ఇది అతిపెద్ద వారసత్వపు దేవాలయం. ఈ దేవాలయంలోని నంది విగ్రహం ఒకే రాయి నుండి చెక్కబడింది, ఇదే ఈ దేవాలయం యొక్క ప్రధాన ఆకర్షణ.
PC: Hari Shankar05

శ్రీ కృష్ణ టెంపుల్

శ్రీ కృష్ణ టెంపుల్

కేరళలో ఉన్న గురువాయూర్ శ్రీ కృష్ణ టెంపుల్ కృష్ణుడికి అంకితం చేసిన ఆలయం.

గురువాయురప్పన్ ఆలయం అని కూడా పిలుస్తారు.

గురువాయురప్పన్ ఆలయం అని కూడా పిలుస్తారు.

గురువాయురప్పన్ ఆలయం అని కూడా పిలుస్తారు. కేరళ యొక్క కళా రూపమైన కృష్ణనట్టం కాళి ఇక్కడ నుండి కనుగొనబడినది.
PC: RanjithSiji

ఛాముండేశ్వరీ టెంపుల్, మైసూర్

ఛాముండేశ్వరీ టెంపుల్, మైసూర్

చాముండేశ్వరి దేవాలయం మైసూర్ లోని చాముండి కొండలపై ఉంది. హొయసల రాజవంశం నిర్మించిన ఈ ఆలయం కోసం మైసూర్ మహారాజుల విరాళాలు అందచేసినట్లు పురాణాలు తెలుపుతున్నాయి.
PC: Sanjay Acharya

చాముండేశ్వరి ఆలయం

చాముండేశ్వరి ఆలయం

ఈ ఆలయం యొక్క తలుపులు వెండి, బంగారంతో తయారు చేశారు. ఈ కొండ మీద దాదాపు 3000 మెట్లను నిర్మంచబడ్డాయి, మైసూర్ లోని ప్రధాన ఆకర్షణలలో ఇది ఒకటి.
PC: MADHURANTHAKAN JAGADEESAN

మూకాంభిక టెంపుల్ కొల్లూరు:

మూకాంభిక టెంపుల్ కొల్లూరు:

సౌత్ ఇండియాలో అతి పెద్ద దేవాలయం మూకాంబిక దేవాలయం. ఈ దేవాలయం శక్తికి స్వరూపమైన అమ్మ మూకాంభిక దేవికి అంకితం ఇవ్వబడింది.
PC: Premkudva

మూకాంభిక టెంపుల్, కొల్లూర్:

మూకాంభిక టెంపుల్, కొల్లూర్:

సౌత్ ఇండియాలో మూకాంబిక టెంపుల్ చాలా ప్రసిద్ది. ఈ ఆలయంలోని మూకాంభికా దేవికి మూడు కళ్ళు ఉన్నాయి, ఈ విగ్రహానికి ఎదురుగా శివలింగంను ప్రతిస్ఠించారు. ఈ ఆలయంలో నవరాత్రి మరియు సరస్వతి పూజలను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు.
PC: http://www.kollurmookambika.co.in/

షోర్ టెంపుల్ మహాబలిపురం:

షోర్ టెంపుల్ మహాబలిపురం:

ఇండియాలో ముఖ్యంగా చూడదగ్గ దేవాలయాల్లో ఒకటి షోర్ టెంపుల్ అత్యంత పురాతన దేవాలయాల్లో వారసత్వ దేవాలయంగా ప్రసిద్ది చెందినది.
PC: Gopinath Sivanesan

షోర్ టెంపుల్:

షోర్ టెంపుల్:

బంగాళాఖాతం నేపథ్యంలో సూర్యాస్తసమయాలలో ఈ ఆలయం యొక్క గ్రానైట్ నిర్మాణం సుందరంగా కనబడుతుంది. అనేక మంది దేవతలు ఇక్కడ ఆరాధించబడ్డారని పురాణాలో లికించబడనిది.
Photo Courtesy: Thamizhapparithi Maari

పద్మనాభస్వామి టెంపుల్ , తిరువనంతపురం:

పద్మనాభస్వామి టెంపుల్ , తిరువనంతపురం:

తిరువనంతపురంలో ప్రసిద్ది చెందినటువంటి ఆలయం పద్మనాభస్వామి టెంపుల్. ఇండియాలోని ఆలయాలన్నింటిలోకి అత్యంత ధనిక దేవాలయంగా ప్రసిద్ది చెందినది.

Photo Courtesy: Ashcoounter

పద్మనాభస్వామి ఆలయంలో విష్ణువు కొలువుదీరి ఉన్నాడు.

పద్మనాభస్వామి ఆలయంలో విష్ణువు కొలువుదీరి ఉన్నాడు.

పద్మనాభస్వామి ఆలయంలో విష్ణువు కొలువుదీరి ఉన్నాడు. ఈ ఆలయంలో విష్ణువు ‘అనంత శయనమ్' స్థితిలో ఉన్న విగ్రహాన్ని మీరు చూడవచ్చు.
PC: Kerala Tourism

సుచింద్ర టెంపుల్, సుచింద్రం

సుచింద్ర టెంపుల్, సుచింద్రం

సుచింద్రం టెంపుల్ లేదా తనుమలయన్ టెంపుల్ తమిళనాడులోని సుచింద్రంలో ఉంది. ఈ ఆలయ గోపురం 134 అడుగుల ఎత్తులో ఉంటుంది, ఇది సుదూరం నుండి కూడా కనపిస్తుంది.
PC: Vinayaraj

ఈ దేవాలయ గోపురంపై దేవతల

ఈ దేవాలయ గోపురంపై దేవతల

ఈ దేవాలయ గోపురంపై దేవతల మరియు హిందూ పురాణాలకు సంబంధించిన విగ్రహాలున్నాయి.
PC: Ganesan

రంగనాథస్వామి దేవాలయం, శ్రీరంగం

రంగనాథస్వామి దేవాలయం, శ్రీరంగం

రంగనాథస్వామి దేవాలయం లేదా తిరువరంగం, సౌత్ ఇండియాలోనే బాగా ప్రసిద్ది చెందిన దేవాలయం . ఈ దేవాలయంలో విష్ణు భగవానుడు శయనస్థితిలో ఉండటాన్ని మనం చూడవచ్చు.

Photo Courtesy: Jean-Pierre Dalbera

రంగనాథస్వామి టెంపుల్:

రంగనాథస్వామి టెంపుల్:

ఈ ఆలయం తమిళ నిర్మాణ శైలితో నిర్మించబడింది, మరియు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం అని చెప్పబడుతోంది.
PC: Sissssou2

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X