Search
  • Follow NativePlanet
Share
» »హైదరాబాద్ లో ఉండి ఈ ఫేమస్ టెంపుల్ చూడకపోతే ఎలా..?

హైదరాబాద్ లో ఉండి ఈ ఫేమస్ టెంపుల్ చూడకపోతే ఎలా..?

తెలంగాణ ప్రాతం డెక్కన పీటభూమిపై ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాలు, ఆకర్షణీయ ప్రదేశాలు, వారసత్వపు ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు మరియు పురాతన ఆలయాలున్నాయి. తెలంగాణాలో అత్యంత ప్రసిద్ది చెందిన ఆలయాల్లో యాదగిరి గుట్ట ఆలయం, భద్రాచల ఆయలం, హైదరాబాద్ లోని బిర్లామందిర్, వేయి స్తంభాల గుడి, భద్రకాళీ ఆలయం మరియు మీనాక్షీ అగస్తేశ్వర ఆలయం. వీటితో పాటు మరికొన్ని ప్రసిద్ద ఆలయాలు కూడా ఉన్నాయి. అవి..

భద్రకాళీ ఆలయం:

భద్రకాళీ ఆలయం:

హనుమకొండపై కొలువుతీరన అమ్మ భద్రకాళీ అమ్మ. హనుమకొండ మరియు వరంగల్ రెండు నగరాలకు మద్యను వెలసిన అమ్మ భద్రకాళీ అమ్మ. ఇండియాల్లో భద్రకాళీ ఆలయాల్లో అతి పురాతనమైన ఆలయాల్లో ఇది ఒకటి. అంతే కాదు అత్యంత ప్రసిద్ది చెందిన దేవాలయం.

P.C: You Tube

యాదగిరి గుట్ట:

యాదగిరి గుట్ట:

తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ది చెందిన దేవాలయాల్లో ఒకటి యాదగిరి గుట్ట దేవాలయం. ఈ ఆలయం నరసింహా స్వామివారికి అంకితం చేయబడినది. విష్ణువుకు మరో రూపమే నరసింహ స్వామి. నగరంలో అందమైన మరియు ఆహ్లాదకరమైన పర్వత ప్రాంతంలో నిర్మితమైన ఈ దేవాలయానికి నిత్యం భక్తులతో సందడిగా ఉంటుంది.హైదరాబాద్ నుంచి 66 కిలోమీటర్ల దూరం, నల్గొండ నుంచి 85 కిలోమీటర్ల దూరం, వరంగల్ నుంచి 91 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది.

P.C: You Tube

భద్రాచలం ఆలయం:

భద్రాచలం ఆలయం:

తెలంగాణలో అత్యంత ప్రసిద్ది చెందిన దేవాలయాల్లో భద్రాచలం ఒకటి. భద్రాచలం ఆలయంలో సీతారామచంద్ర స్వామి కొలువై ఉన్నారు. గోదావరి నది ఒడ్డున భద్రాచలం ఆయలం ఉంది. శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు రూపంలో ఉన్న ఏకైక ఆలయం ఇది. ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతాయి.

P.C: You Tube

Most Read: 6000 సంవత్సరాల నుండి పూజలు స్వీకరిస్తున్న ఆది భిక్షువు...

వేయి స్తంభాల గుడి:

వేయి స్తంభాల గుడి:

వరంగల్ సిటీలో ఒక భాగం హనుమకొండ, హనుమకొండలో వేయిస్తంభాల గుడి చాలా ప్రసిద్ది చెందినది. ఈ ఆలయాన్ని శివుడు, విష్ణువు మరియు సూర్యదేవునికి అంకితం చేయబడినది. ఈ ప్రసిద్ది చారిత్ర ఆలయాన్నిరుద్ర దేవ రాజుతే చాళుక్యుల నిర్మాణ శైలిలో నిర్మింపబడినది.

P.C: You Tube

కీసరగుట్ట టెంపుల్:

కీసరగుట్ట టెంపుల్:

కీసరగుట్ట ఆలయాన్ని శివుడు, భవానీదేవి మిరయు శివదుర్గలకు అంకితం చేయబడినది. ఈ ఆలయం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఉంది. శ్రీరాముడు ఇక్కడ శివలింగమును స్థాపించడం వల్ల ఈ దేవాలయానికి రామలింగేశ్వర స్వామి ఆలయం అని కూడా అంటారు. త్రేతాయుగంలో అయోధ్యను పాలించిన శ్రీరాముడు సీతాదేవి, హనుమంతులతో వన విహారానికై ఇక్కడికి వచ్చి, ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి మంత్రముగ్ధులై, ఆనందభరితులై ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి నిశ్చయించారు. ఈ విషయమై అరణ్య ప్రాంతములోని మహర్షులను సంప్రదించగా వారు సంతోషించి శివలింగ ప్రతిష్ఠాపన కోసం సుముహూర్తాన్ని నిర్ణయించారు.

pc: J.M.Garg

రామప్ప ఆలయం :

రామప్ప ఆలయం :

రామలింగేశ్వర ఆలయం అని కూడా పిలిచే ఈ రామప్ప ఆలయం వరంగల్ నుండి సుమారు 77కిలోమీల దూరంలో పాలం పేట్ గ్రామంలో ఉంది. ఈ ఆలయం నిర్మాణం శిల్పకళకు, తేలియాడే ఇటుకలు మరియు కాకతీయుల శిల్పకళలకు చెప్పుకోదగ్గ సాక్ష్యంగా ప్రసిద్ది చెందింది. ఈ ఆలయం 800ఏళ్ల నాటి రామప్ప ఆలయంలో అడుగడుునా అద్భుతాలే. రామప్ప అంటే ఆలయంలో దైవం పేరు కాదు, ఈ ఆలయాన్ని అద్భుత కళాఖండంగా మలచిన ప్రధాన శిల్పి పేరు.

PC: Vikram Katta

Most Read: తిరుపతికి వెళ్ళి అక్కడకు వెళ్ళకుండా వచ్చేస్తున్నారా? ఐతే మీరు చాలా మిస్ అవుతారు

సంగమేశ్వర ఆలయం:

సంగమేశ్వర ఆలయం:

మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్లో ఉన్న సంగమేశ్వర ఆలయం చాళుక్యయాన్ వైభవానికి మరో చక్కని ఉదాహరణ. తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాల్లో ఆలంపూర్ ను ఒక టెంపుల్ టౌన్ గా ప్రసిద్ది చెందినది. ఆలంపూర్ లో జోగులాంబ దేవాలయం భారత దేశంలోని శక్తి పీఠాల్లో ఒకటి. ఈ ఆలయ ప్రాంగణంలోనే నవ బ్రహ్మ ఆలయాన్ని కూడా దర్శించవచ్చు.

P.C: You Tube

బాసర జ్ఝాన సరస్వతి ఆలయం:

బాసర జ్ఝాన సరస్వతి ఆలయం:

బాసర గోదావరి నదీ ఒడ్డున జ్ఝాన సరస్వతి ఆలయం ఉంది. ఆ ఆలయం చదువుల తల్లి సరస్వతి దేవికి అంకితం చేయబడినది. ఇండియాలో అత్యంత ప్రసిద్ది చెందిన రెండు దేవాలయాల్లో బాసర జ్ఝాన సరస్వతి ఆలయం ఒకటి. మరొకటి కాశ్మీర్ లో కలదు. వేదవ్యాస మహర్షి సరస్వతి దేవికై తపస్సు చేసి మహాభాగవతం రచించిన ప్రాంతం.

P.C: You Tube

కర్మంఘాట్ హనుమాన్ టెంపుల్ :

కర్మంఘాట్ హనుమాన్ టెంపుల్ :

నగరంలో అతి పురాతన ఆలయాల్లో ఒకటి కర్మంఘాట్ హనుమాన్ టెంపుల్. హైదరాబాద్ సమీపంలో మూడు ఎకరాలలో నిర్మింపబడిన ఆ హనుమాన్ దేవాలయం అత్యంత ప్రసిద్ది చెందినది.

P.C: You Tube

Most Read: హనీమూన్ కు సరసమైన ప్రదేశం-ప్రకృతి సౌందర్యానికి సొంతం కేరళ

బిర్లా మందిరం:

బిర్లా మందిరం:

ఇండియాలో ప్రసిద్ది చెందిన 18 బిర్లా మందిరాల్లో ఒకటి అందమైనది హైదరాబాద్ లో ఉన్న బిర్లా మందిర్. ఆహ్లాదపరిచే ఈ ఆలయం 280 అడుగుల ఎత్తైన కొండపై నిర్మించబడినది. హైదరాబాద్ లో అత్యంత ప్రసిద్ది చెందిన ఆలయాల్లో, ఆయర్షణల్లో ఈ ఆలయం ఒకటి.

కొండగట్టు ఆలయం

కొండగట్టు ఆలయం

కొండగట్టు ఆలయం ఆంజనేయస్వామికి అంకితమివ్వబడినది. ఈ ఆలయం కరీంనగర్ కు 35కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కరీంనగర్ లో అత్యంత ప్రసిద్ది చెందిన దేవాలయాల్లో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఒకటి. శ్రీరాముడు నడియాడిన ప్రదేశం కనుక అమితానందంతో ఆంజేనేయుడు సంజీవని పర్వతంలో ఓ భాగాన్ని వదిలిన ప్రాంతం. జగిత్యాల నుంచి 14 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 39 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 178 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది.

P.C: You Tube

మీనాక్షీ అగస్తీశ్వర స్వామి ఆలయం:

మీనాక్షీ అగస్తీశ్వర స్వామి ఆలయం:

మీనాక్షీ అగస్తేశ్వర స్వామి ఆలయం వాడేపల్లిలో ఉంది. శివ భక్తులకు ఈ ఆలయం అత్యంత ప్రసిద్ది చెందిన ప్రదేశం. ఇక్కడ శివలింగం నీటి మట్టమునకు 120మీటర్ల ఎత్తులో ఉంది. కానీ శివలింగం ఎల్లప్పుడు నీటిలో మునిగి ఉంటుంది.

P.C: You Tube

Most Read: రామాయణానికి కేరాఫ్ అడ్రస్.. గ్రేప్ సిటీగా ప్రకృతి సంపదకు లోటులేదు..

రాజ రాజేశ్వర దేవాలయం

రాజ రాజేశ్వర దేవాలయం

వేములవాడాలో శ్రీ రాజ రాజేశ్వర ఆలయం ఉంది, ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడినది. రాజరాజేశ్వర ఆలయాన్ని రాజరాజ చోళులలో నిర్మింపబడినది. ఈ ఆలయంలో చాలా ప్రత్యేకత ఉంది. అహల్య విషయంలో పాపం చేసిన దేవేంద్రుడు (దేవరాజు)శాప పరిహారానికై శివుడి కోసం తపస్సు చేశాడు. ఇక్కడి శివుడి నామదేయం రాజరాజేశ్వరుడు(రాజులకే రాజు ఆయన)

P.C: You Tube

 ఛాయ సోమేశ్వర స్వామి ఆలయం:

ఛాయ సోమేశ్వర స్వామి ఆలయం:

చారిత్రక ఛాయ సోమేశ్వర స్వామి ఆలయం పనంగల్లో ఉంది,. ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడినది. శివరాత్రి సమయంలో ఈ ఆలయం అత్యంత శోభాయమానంగా వెలుగుతుంది. ఇక్కడ రెండు ఆలయాలు ప్రసిద్ది. ఒకటి ఛాయ సోమేశ్వర స్వామి ఆలయం, మరొకటి పచల సోమేశ్వార స్వామి ఆలయం .నల్గొండ బస్ స్టాండ్ నుంచి ఇక్కడకు 4కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదే విధంగా హైదరాబాద్ నుంచి ఇక్కడకు 104 కిలోమీటర్లు. దేవాలయంలోని ఒక స్తంభం నీడ ఉదయం నుంచి సాయంకాలం వరకూ మూలవిరాట్టైన శివలింగం పై పడుతూ ఉండటం వల్ల ఈ దేవాలయాలయానికి ఛాయా సోమేశ్వర దేవాలయం అని పేరు వచ్చింది.

P.C: You Tube

వేములవాడ నరసింహ ఆలయం

వేములవాడ నరసింహ ఆలయం

కరీంనగర్ కు సుమారు 32కిలోమీటర్ల దూరంలో నాంపల్లి గుట్ట లో లక్ష్మీ నరసింహ ఆలయం ఉంది. ఈ ఆలయం వేములవాడలో చిన్న గుట్టపై ఉంది. ఈ ఆలయం లక్ష్మీ నరసింహ స్వామికి అంకితం చేయబడినది. ఈ ఆలయంను పాము రూపంలో నిర్మించబడినది. ఇండియాలోనే అత్యంత పొడవైన పాము విగ్రహం ఉన్న ప్రదేశం. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ది చెందిన పర్యాటక ప్రదేశాల్లో ఇది ఒకటి.వేముల వాడకు 4.5 కిలోమీటర్ల దూరంలోనే దూరంలోనే ఈ నాంపల్లి గుట్ట ఉంటుంది. కరీంనగర్ కు ఇక్కడి నుంచి 32 కిలోమీటర్ల దూరం.

P.C: You Tube

Most Read: ఈ సాక్షి గణపతి లేదా వ్రాతపతిని దర్శిస్తే గొప్ప విద్యావంతులవుతారు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more