Search
  • Follow NativePlanet
Share
» »ఖమ్మం ఒక కోటల నగరం !!

ఖమ్మం ఒక కోటల నగరం !!

దక్షిణ భారత దేశంలోని తెలంగాణ రాష్ట్రంలో వున్న ఖమ్మం నగరం ఖమ్మం జిల్లాకు ప్రధాన కేంద్రం. కృష్ణా నదికి ఉపనది అయిన మున్నేరు ఒడ్డున అందమైన ఖమ్మం నగర౦ వుంది. చరిత్ర లో ఖమ్మం ఒక ప్రముఖ స్థానాన్ని కలిగి వుంది. ఇక్కడి సుప్రసిద్ధ ఖమ్మం కోట కేవలం ఈ జిల్లాకే గాక, రాష్ట్రం మొత్తానికి చాలా ముఖ్యమైనది. ఖమ్మం నుంచి 120 కి.మీ. దూరంలో ఉన్న భద్రాచలం పట్టణంలో దేశంలోనే ప్రసిద్ధి చెందిన రామాలయం ఉంది. గోదావరి తీరాన ఉన్న భద్రాచలం పట్టణంలో దర్శనీయ స్థలాలు అనేకం ఉన్నాయి. ప్రతి ఏటా జరిగే శ్రీరాముడి కల్యాణ వేడుకలు ప్రసిద్ధి. ఇలా చెప్పుకుంటూ పోతే ఖమ్మం జిల్లాలో అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి. వీటిలో కొన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి.

ఖమ్మం హోటళ్ళ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ఖమ్మం గురించి పురాణాలలో ప్రస్తావిస్తూ..

ఖమ్మంను పూర్వ కాలంలో స్తంభాద్రి అనే పిలిచేవారు. ఖమ్మం పట్టణం నడిమధ్యలో నరసింహస్వామి గుట్ట ఉంది. నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకు వచ్చి హిరణ్యకశిపుడిని సంహరించింది ఇక్కడే అనే ప్రచారం ఉంది. అందువలనే ఆ కొండకు స్తంభాద్రి అనే పేరు వచ్చిందంటారు. స్తంభాద్రి పేరు కాలక్రమంలో కంబాద్రిగా... అది ముస్లిముల వాడుకలో ఖమ్మం మెట్టుగా మారింది. ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా పర్యటించవలసిన ప్రదేశ వివరాలకొస్తే ..

ఖమ్మం కోట / ఖమ్మం ఖిల్లా

ఖమ్మం కోట / ఖమ్మం ఖిల్లా

ఖమ్మం కోట ను క్రీ.శ. 950 సంవత్సరంలో కాకతీయ రాజుల పాలనలో ఉన్నప్పుడు నిర్మాణాన్ని ప్రారంభించారు. అయితే, 1531 లో కుతుబ్ షాహీల పాలనలో నూతన భవంతులు, గదులతో ఈ కోట మరింత అభివృద్ది చెందింది. హిందూ, ముస్లింల నిర్మాణ శైలికి చక్కటి ఉదాహరణ ఈ కోట. ఖిల్లా వైశాల్యం 4 చదరపు మైళ్లు. దీని ప్రహరీ ఎత్తు 40 నుంచి 80 అడుగులు. వెడల్పు 15 నుంచి 20 అడుగులు. మొత్తం10 ద్వారాలు. కోట చుట్టూ 60 ఫిరంగులు మోహరించే వీలుంది. కోట లోపల ఒక పాత మసీదు, మహల్ ఉన్నాయి. 60 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు ఉన్న బావి ఉంది. కోటపై ముట్టడి జరిగినప్పుడు తప్పించుకునేందుకు ఒక రహస్య సొరంగం కూడా ఉంది. నేడు ఈ కోట ఉనికి 1000 సంవత్సరాలు పూర్తి చేసి గర్వంగా నిలబడి ఉంది. ఇది ఆంద్ర ప్రదేశ్ అలాగే ఖమ్మం చరిత్రలో గొప్ప స్థానాన్ని పొందిన ప్రధాన పర్యాటక ప్రదేశం.నాటి కోటల నిర్మాణంలో మనిషితోపాటు సమానపాత్రధారిగా శ్రమించిన ఏనుగులు, గుర్రాల నమూనాలు కోటలముందు నేటికీ కన్పిస్తాయి.

Photo Courtesy: Pavithrans

జమలాపురం ఆలయం

జమలాపురం ఆలయం

జమలాపురం ఆలయం ఖమ్మ౦ ప్రధాన నగరం నుండి 124 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే, ఈ ఆలయాన్ని ఖమ్మం చిన్న తిరుపతి అంటారు.అనేక శతాబ్దాల క్రితం విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. హిందువులకు ఎంతో ప్రధానమైన ఈ ఆలయం కనీసం 1000 సంవత్సరాల నాటిదని భావిస్తున్నారు. ఈ ఆలయాన్ని అనేకమంది భక్తులు సందర్శిస్తారు. ఈ ఆలయం ముఖ్యంగా శనివారం రోజు పూజారులచే నిర్వహించబడే పూజలు, ప్రార్ధనలతో సందడిగా ఉంటుంది. ఈ ఆలయంలో ప్రార్ధన చేస్తే వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి అతి దగ్గరలో జాబాలి మహర్షి కి సంబంధించిన సూసి గుట్ట అనే కొండ ఉంది. ఈ మహర్షి ఇక్కడ తీవ్రంగా తపస్సు చేయడం వల్ల వెంకటేశ్వర స్వామి దర్శన మిచ్చి ఆయనను దీవించారని భావిస్తారు.

Photo Courtesy: రహ్మానుద్దీన్

లక్ష్మీ నరసింహ ఆలయం

లక్ష్మీ నరసింహ ఆలయం

లక్ష్మీ నరసింహ ఆలయం ఖమ్మం నుండి కేవలం 46 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం ఖమ్మం నగరానికి అభిముఖంగా కొండపై నిర్మించ బడింది. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఖమ్మంలో, నగరంలోని చుట్టుపక్కల ప్రాంతాలలో ఖ్యాతి పొందింది. అన్ని రోజుల్లో ఈ ఆలయం తెరిచే ఉంటుంది ఈ కారణంగా, అనేక మంది ప్రతి రోజు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ఆలయంలోని నరసింహ స్వామి విగ్రహం విష్ణు మూర్తి అవతారం అంటారు. నరసింహస్వామి విగ్రహం సగం సింహం ఆకారంలో, సగం మనిషి శరీరంతో ఉన్నట్లు రూపొందించడం వల్ల భక్తులు ‘గొప్ప రక్షకుడు' గా భావిస్తారు. ఈ కారణంగా, ఈ ఆలయంలో ఏర్పాటు చేయబడిన నరసింహస్వామిని పంచ నరసింహ మూర్తిగా పిలుస్తారు. అలాగే ఆలయం వెలుపల ఉన్న దేవుని విగ్రహం భక్తులను యోగ ముద్రలో ఆశీర్వదిస్తారు.

Photo Courtesy: Pranayraj1985

పలైర్ సరస్సు

పలైర్ సరస్సు

ఖమ్మం జిల్లాలో ఉన్న పలైర్ సరస్సు , భారతదేశం లోని అందమైన సరస్సులలో ఒకటి. ఈ సరస్సు ఖమ్మం జిల్లాలో కూసుమంచి మండల౦లో ఉన్న పలైర్ గ్రామంలో భాగం. ప్రధాన నగరం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సరస్సుని రోడ్డు ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఈ సరస్సు నీటిని నీటిపారుదల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు, చేపల పెంపకానికి ప్రసిద్ధ ప్రదేశం. జల క్రీడలు అలాగే సాహస చర్యలు అందించడం వల్ల ఈ పలైర్ సరస్సు ఖమ్మం జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా నిలిచింది. ఈ సరస్సు అనేక రకాల రొయ్యలను కలిగి ఉండి, మంచి నీటి చేపల సాగుకు మాత్రమే కాకుండా, పర్యాటకులకు పదార్ధాలను తయారుచేస్తుంది. పలైర్ సరస్సుకు చాలా దగ్గరలో ఉన్న వైరా సరస్సు మరొక మంచి విహార స్థలం. ఖమ్మం వచ్చే పర్యాటకులు వారి యాత్రలో ఎక్కువగా అన్ని ప్రదేశాలూ కలిసి ఉండేటట్లు చూసుకుంటారు.

Photo Courtesy: telugu nativeplanet

వైరా పర్యాటక కేంద్రం

వైరా పర్యాటక కేంద్రం

వైరాలోని రిజర్వాయర్‌ గుట్టలపై పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ రెస్టారెంట్లు, బోటింగ్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. చిన్నారులు ఆడుకొనేందుకు ఆటవస్తువులు ఏర్పాటు చేశారు. ఎంట్రీప్లాజా ఉంది. వీటితో పాటు లైటింగ్‌ సౌకర్యం ఉంది. పచ్చదరం, మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతాయి. జలాశయం ఆనుకొని ఉండటంతో ఇది పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. వైరా నుంచి సుమారు రెండున్నర కిలోమీటర్ల లోపలకు ఈ పర్యాటక కేంద్రం ఉంది. బారుగా వున్న ఆనకట్ట చూపరులను ఆకర్షిస్తుంది. చిన్నారులు, మహిళలు, విద్యార్థులు, యువత, పలువురు కుటుంబ సమేతంగా వస్తుండటంతో పర్యాటక కేంద్రంగా అభివృద్ది చెందింది.

Photo Courtesy: Satyamisno1

పాపి కొండలు

పాపి కొండలు

ఖమ్మంలోని మరొక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ పాపి కొండలు. దక్షిణాది లోని ఈ లోయ అత్యద్భుతమైన అందాన్ని కాశ్మీర్ ప్రకృతి సౌందర్యంతో సమానమైనదని పలువురు విశ్వసిస్తారు. ఈ ప్రాంతాన్ని విహంగ వీక్షణం చేస్తే ఒక స్త్రీ తన జుట్టులో తీసే పాపిట ను పోలి వుండడం వల్ల ఈ శ్రేణులకు ఆ పేరు వచ్చిందని కొంతమంది నమ్మకం. పాపి కొండల పర్వత శ్రేణులు మునివాటం అనే అందమైన జలపాతాలకు చాలా ప్రసిద్దమైనవి. ఇది తప్పనిసరిగా ప్రశాంతమైన, నిర్మలమైన వాతావరణం కలిగిన గిరిజన ప్రాంతం. చాలామంది ప్రకృతితో మమేకం అవడానికి ఈ జలపాతాలు సందర్శిస్తారు.

Photo Courtesy: Vamsi Mohan Reddy Pulagam

విహారయాత్ర

విహారయాత్ర

160 కి.మీ. 12 గంటలు నౌకా విహారం ఈ ప్రయాణంలో ప్రత్యేకత. జాతీయ స్థాయిలో పర్యాటకులను విశేషంగా ఆకర్షించిన అంశం కూడా ఇదే. భద్రాచలం నుంచి పేరంటాలపల్లికి వెళ్లగలిగితే అక్కడి నుంచి పర్యాటకులను పాపికొండల యాత్రకు తీసుకెళ్లేందుకు లాంచీలు సిద్ధంగా ఉంటాయి. 12 గంటల పాటు సాగే ఈ లాంచీ ప్రయాణంలో ప్రయాణికులు ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. ప్రత్యేక ప్యాకేజీల ద్వారా జిల్లా పర్యాటక శాఖ ఖమ్మం నుంచి పాపికొండలు విహారయాత్రను అందుబాటులో ఉంచింది. పెద్దలకు రూ.400, పిల్లలకు రూ.300 లాంచీలు రుసుముగా తీసుకుంటాయి.

Photo Courtesy: Vamsi Mohan Reddy Pulaga

పర్ణశాల

పర్ణశాల

భద్రాచలం పట్టణం నుంచి 36 కి.మీ. దూరంలో ఉన్న పర్ణశాలలో రామాయణ కాలం నాటి చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయని భక్తుల నమ్మకం. మారీచుడుని వధించిన స్థలంగా పేర్కొంటారు. బంగారు లేడి ఉదంతం జరిగిన ప్రదేశం కూడా ఇదేననే ప్రచారం ఉంది. ఇక్కడి గోదావరి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

Photo Courtesy: Adityamadhav83

కిన్నెరసాని అభయారణ్యం

కిన్నెరసాని అభయారణ్యం

భద్రాచలం పట్టణం నుంచి 35 కి.మీ. దూరంలో.. కొత్తగూడెం నుంచి 24 కి.మీ. దూరంలో కిన్నెరసాని అభయారణ్యం ఉంది. ఇక్కడి విద్యుత్తు ప్రాజెక్టు కోసం నిర్మించిన కిన్నెరసాని డ్యామ్‌, రిజర్వాయర్‌ ప్రధాన ఆకర్షణ. ఇక్కడ జింకల అభయారణ్యం ఉంది. కిన్నెరసాని రిజర్వాయర్‌ మొసళ్లకు ప్రసిద్ధి. ఇక్కడ పర్యాటక శాఖ అద్దాల మేడ, కాఫిటేరియా వంటి సదుపాయాలను పర్యాటకుల కోసం తీర్చిదిద్దింది.

Photo Courtesy: ravindra_s_1999

నేలకొండపల్లి బౌద్ధస్తూపం

నేలకొండపల్లి బౌద్ధస్తూపం

ఖమ్మం పట్టణం నుంచి 21 కి.మీ. దూరంలో ఉన్న నేలకొండపల్లి గ్రామంలో బౌద్ధస్తూపం ఉంది. 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్తూపం పరిసరాలు ఆక్రమించి ఉండడం విశేషం. దీనినే బౌద్ధులు మహాస్తూపంగా వ్యవహరిస్తారు. 3వ శతాబ్దంలో ప్రారంభించి నాలుగో శతాబ్దంలో ఈ స్తూప నిర్మాణం పూర్తి చేశారు. విరాటరాజు కాలంలో ఈ స్తూప నిర్మాణం జరిగినట్లు అప్పట్లో ఈ ప్రాంతాన్ని విరాట నగరంగా పిలిచినట్లు ప్రచారం ఉంది.

Photo Courtesy: Moinuddin10888

అన్నపురెడ్డిపల్లి దేవాలయం

అన్నపురెడ్డిపల్లి దేవాలయం

ఖమ్మం పట్టణం నుంచి 75 కి.మీ. దూరంలో చంద్రుగొండ మండలం అన్నపురెడ్డిపల్లిలో వేంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది. 700 సంవత్సరాల పురాతన దేవాలయం... పక్కనే ఉన్న అడవి ప్రాంతం... దేవాలయ నిర్మాణంలో ఉపయోగించిన శిల్పాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి.

Photo Courtesy: wikimedia

కూసుమంచి శివాలయం

కూసుమంచి శివాలయం

ఖమ్మం పట్టణం నుంచి 20 కి.మీ. దూరంలో ఉన్న కూసుమంచి మండల కేంద్రంలో కాకతీయులు నిర్మించిన అతి పురాతన శివాలయం ఉంది. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద శివలింగం ఉన్న గుడిగా దీనికి పేరుంది.

Photo Courtesy: paramesh

భద్రాచలం

భద్రాచలం

భారత దేశపు దక్షిణ భాగం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని ఖమ్మం జిల్లాలో భద్రాచలం ఒక చిన్న గ్రామం మరియు గోదావరి నది ఒడ్డున కలదు. ఈ ప్రాంతం శ్రీరాముడు మరియు ఆయన సాధ్వి సీతా నివసించిన ప్రదేశం గా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినది. ఇది శ్రీరాముడు నివసించిన ప్రదేశం కనుక హిందూ యాత్రికులు దీనిని ఎంతో పవిత్ర భూమిగా భావిస్తారు. రాముడి పేరు చెపితే చాలు ఆంధ్రులకు భద్రాచలం గుర్తుకు వస్తుంది. రాముడి భక్తులకు అయోధ్య తర్వాత భద్రాచలం రెండవ స్థలం గా భావిస్తారు.

Photo Courtesy: Prashanth.286

దుమ్ముగూడెం

దుమ్ముగూడెం

దుమ్ముగూడెం గ్రామం భద్రాచలానికి సుమారు 25 కి. మీ. ల దూరం లో వుంటుంది. ఈ ప్రదేశం కాకర కాయ ఆకారం లో ఒక చిన్న ద్వీపం గా వుంటుంది. ఈ ప్రదేశంలో రాముడు ఖర , దూషణ అనబడే రాక్షసుల నేతృత్వం లో వచ్చిన సుమారు 14000 మంది రాక్షసులను వధించాడని చెపుతారు. ఈ గ్రామం వధించ బడిన రాక్షసుల బూడిద పై నిర్మించారని చెపుతారు. ఆ బూడిదనే తెలుగు లో దుమ్ము అని అంటారు. ఈ ప్రదేశ ప్రజలు రాముడి అవతారమైన ఆత్మా రాముడిని పూజిస్తారు. ఈ ద్వీపం 100 సంవత్సరాల నాటి బలమైన బ్రిడ్జి తో ప్రధాన భూభాగానికి కలుపబడింది.

Photo Courtesy: Adityamadhav83

జటాయు పాక

జటాయు పాక

జటాయు పాక ప్రదేశాన్ని ఏట పాక అని కూడా అంటారు, ఇది భద్రాచలానికి రెండు కి. మీ.ల దూరం లో కలదు. సీతాపహరణ సమయం లో ఆమె కేకలు విన్న జటాయువు రావణుడి తో ఈ ప్రదేశం లో యుద్ధం చేసాడని ఇక్కడే తన ప్రాణాలు కోల్పోయాడని, అయితే, తన ఒక రెక్క మాత్రం విరిగి ఎగిరి వెళ్లి ఇక్కడకు 55 కి. మీ. ల దూరం లో కల రెక్కపల్లి లో పడిందని చెపుతారు.తర్వాత రాముడు జటాయువు ద్వారా సీతాపహరణను తెలుసుకున్నాడని చెపుతారు. ఈ ప్రదేశం వేలాది భక్తులను ఆకర్షిస్తుంది.

Photo Courtesy: rajesh

గుణదల

గుణదల

ఈ ప్రదేశం భద్రచలానికి సుమారు 5 కి. మీ. ల దూరం లోను, హైదరాబాద్ కు 258 కి. మీ. ల దూరం లోను కలదు. చల్లగా వుండే శీతాకాలం లో ఇక్కడ కల వేడి నీటి బుగ్గలలో హిందువుల ఆరాధ్య దైవాలయిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇక్కడకు వచ్చి స్నానాలు ఆచరిస్తారని చెపుతారు. కనుక, ఈ ప్రదేశం హిందువులకు తప్పక దర్శించ దగినది. ఇక్కడ కల వేడి నీటి బుగ్గలలో స్నానాలు చేస్తే, చాలా వ్యాధులు పోతాయని, మోక్షం కూడా వస్తుందని విశ్వసిస్తారు. గోదావరి నది ఒడ్డున అనేక వేడి నీటి బుగ్గలు కలవు. ఇవి దెస వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తాయి.

Photo Courtesy: ch chowdary

బోగత జలపాతం

బోగత జలపాతం

బోగత జలపాతం ఖమ్మం జిల్లా, వాజేడు మండలంలోని బోగత గ్రామంలో ఈ జలపాతం ఉంది . దీన్ని చేరుకునే ప్రయత్నంలో పదిహేను కిలోమీటర్ల మేర ఆవరించి ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని చూసి పరవశించవచ్చు, ఆస్వాదించొచ్చు. దట్టమైన పచ్చని అడవుల మధ్య, కొండకోనల నుంచి హోరెత్తే నీటి హోయలతో నిండిన జలపాతం ఇది.. ఖమ్మంజిల్లా భద్రాచలం రెవెన్యూ డివిజన్ పరిధిలోని వాజేడు మండలం కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ బోగత జలపాతం. జూలై నుంచి నవంబర్ వరకు భారీగా నీటి దూకుడు కనిపిస్తుంది ఇక్కడ. కొండకోనలనుంచి జాలువారే నీటి పొంగు బోగత జలనిధిగా సాక్షాత్కరిస్తుంది.

Photo Courtesy: Chatwithmahesh

ఖమ్మం ఎలా చేరుకోవాలి ??

ఖమ్మం ఎలా చేరుకోవాలి ??

రోడ్డు ద్వారా

రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం నగరానికి తేలికగా చేరుకోవచ్చు. ఖమ్మం నుండి ప్రభుత్వ మరియు అనేక ప్రైవేట్ బస్సులు అటు-ఇటు ప్రతిరోజూ నడపబడతాయి. అనేక డీలక్స్, అలాగే వాల్వో బస్సులు కూడా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల నుండి ఖమ్మం కి బైల్దేరతాయి. ఖమ్మం నగరం గుండా జాతీయ రహదారులు 5 మరియు 7 రెండు జాతీయ రహదారులు ఉంటాయి.

రైలు ద్వారా

ఖమ్మం నగరం దక్షిణ రైల్వే వారి మంచి నెట్వర్క్ ద్వారా భారతదేశం లోని ఇతర నగరాలకు, పట్టణాలకు అనుసంధానించబడి ఉంది. ఈ పట్టణం హైదరాబాద్-విజయవాడ లైన్ లో వస్తుంది. ఈ లైన్ ద్వారా వరంగల్, విశాఖపట్టణం, తిరుపతి, చెన్నై, న్యూ డిల్లీ, ముంబై, బెంగళూర్ వంటి ఇతర పట్టణాలకు ఈ నగరం అనుసంధానించబడి ఉంది. ఇక్కడ అనేక సూపర్ ఫాస్ట్, పాసెంజర్, ఎక్స్ప్రెస్ రైళ్ళు ఖమ్మలో ఆగుతాయి.

వాయు మార్గం ద్వారా

ఖమ్మంలో విమానాశ్రయం లేదు. గన్నవరం ఖమ్మం కి దగ్గర విమానాశ్రయ౦, ఇది ఒక దేశీయ విమానాశ్రయం. ఖమ్మం నగరం నుండి 298 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీప విమానాశ్రయ౦. ఖమ్మంలో విమానాశ్రయ నిర్మాణ౦ ప్రతిపాదన పరిశీలనలో ఉంది. విమానం ద్వారా హైదరాబాద్ వచ్చిన వారు అద్దె టాక్సీలలో లేదా బస్సులలో ఖమ్మం చేరుకోవచ్చు.

Photo Courtesy: flickr

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X