Search
  • Follow NativePlanet
Share
» »దేవాలయాల రాజస రాష్ట్రం...రాజస్థాన్

దేవాలయాల రాజస రాష్ట్రం...రాజస్థాన్

రాజస్థాన్ లో ఉన్న ప్రముఖ దేవాలయాలకు సంబంధించిన కథనం

రాజస్థాన్ అన్న వెంటనే మనకు గుర్తుకు వచ్చేది ఇసుక తిన్నెలతో కూడిన ఎడారి. అక్కడి ఒంటె ప్రయాణం. మరికొంతగా ఆలోచిస్తే ఆకాలంలో నిర్మించిన ప్యాలెస్ లు. అయితే రాజస్థాన్ లో దాదాపు రెండు వేల సంవత్సరాలకు పూర్వం నిర్మించిన బ్రహ్మ దేవాలయం నుంచి బిర్లా కుటింబీకులు నిర్మించిన బిర్లా టెంపుల్ కూడా ఉంది.

అంతేకాకుండా దెయ్యాలను విడిపించడానికి దేశప్యాప్తంగా పేరుగాంచిన మోహందీపూర్ దేవాలయం కూడా రాజస్థాన్ లోనే ఉంది. మరోవైపు జైనులకు అత్యంత పవిత్రమైన రనక్ పూర్, దిల్వార జైన మందిరాలు ఈ ఇసుక తిన్నెల రాష్ట్రానికి ప్రత్యేకం. అదే విధంగా ముస్లీం సోదరులు పవిత్ర యాత్రా స్థలమైన ఆజ్మీర్ దర్గా కూడా రాజస్థాన్ లో నే ఉంది. ఈ నేపథ్యంలో ఈ రాజస్థాన్ లో ఉన్న ముఖ్యమైన దేవాలయాలకు సంబంధించిన సమాచారం కుప్లంగా మీ కోసం.

జగదీష్ దేవాలయం

జగదీష్ దేవాలయం

P.C: You Tube

రాజస్థాన్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఉదయ్ పూర్ లో ఈ జగదీష్ దేవాలయం ఉంది. ఇండో ఆర్యన్ వాస్తు శైలిలో నిర్మించిన ఈ దేవాలయంలో మూలవిరాట్టు విష్ణువు. ఉదయ్ పూర్ లోని సిటీ ప్యాలెస్ లోపల ఉన్న ఈ అద్భుతమైన దేవాలయాన్ని రాజ జగదీష్ నిర్మించాడు.

మోతీ డ్రోంగ్రీ దేవాలయం

మోతీ డ్రోంగ్రీ దేవాలయం

P.C: You Tube

రాజస్థాన్ లోని మోతీ డ్రోంగ్రీ పర్వత శిఖరం పై ఉన్న గణపతి దేవాలయం మోతీ డ్రోంగ్రీ పేరుతో ప్రఖ్యాతి గాంచింది. స్థానికులతో పాటు రాజస్థాన్ కు చెందిన రాజకీయ నాయకులు ముఖ్యమైన కార్యక్రమలు ప్రారంభించే సమయంలో ఈ దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. 18వ శతాబ్దంలో జై రామ్ ఈ దేవాయాన్ని నిర్మించారు.

 రనక్ పూర్ దేవాలయం

రనక్ పూర్ దేవాలయం

P.C: You Tube

జైనులకు అత్యంత పవిత్రమైన ఐదు పుణ్యక్షేత్రాల్లో రనక్ పూర్ దేవాలయం కూడా ఒకటి. ఈ దేవాలయం కొన్ని ఉప దేవాలయాల సమూహం అని చెప్పపడం సబబుగా ఉంటుంది. ఇది ఉదయ్ పూర్ కు 95 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాలరాతితో నిర్మించిన ఈ దేవాలయం నిర్మాణశైలి విభిన్నంగా ఉంటుంది. రనక్ పూర్ దేవాలయ సముదాయంలో పార్శనాథ దేవాలయం, అంబా మాతా దేవాలయం, చౌముఖ దేవాలయం, సూర్య దేవాలయం తదితర ఆలయాలు ఎన్నో ఉన్నాయి.

గోవింద్ దేవ్ జీ దేవాలయం

గోవింద్ దేవ్ జీ దేవాలయం

P.C: You Tube

ఇక్కడ శ్రీ క`ష్ణుడు ప్రధాన దైవం. చంద్రమహల్, బాదల్ మహల్ మధ్యన ఈ దేవాలయం ఉంటుంది. ఔరంగజేబు సమయంలో మూలవిరాట్టు అయిన శ్రీ క`ష్ణ విగ్రహాన్ని మధురకు దగ్గర్లో ఉన్న ను బ`ందావన్ నుంచి ఇక్కడికి తీసుకువచ్చారు.

రిషభనాథ దేవాలయం

రిషభనాథ దేవాలయం

P.C: You Tube

ఉదయ్ పూర్ కు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న థూలేవ్ గ్రామంలో ఈ రిషభనాథ దేవాలయం ఉంది. ఈ దేవాలయం జైనులకు పరమ పవిత్రమైనది. జైనుల తీర్థాంకరుల్లో మొదటివాడైన రిషభనాథుడు ఇక్కడ పూజలందుకొంటాడు.

బిర్లా దేవాలయం

బిర్లా దేవాలయం

P.C: You Tube

మోదీ దుర్గా దేవాలయం పర్వత పాదాల వద్ద ఉన్న బిర్లా దేవాలయంలో ప్రధాన దైవం లక్ష్మీనారాయణ స్వామి. ఈ దేవాలయాన్ని బిర్లా కుటుంబ సభ్యులు 1988లో నిర్మించారు. జైపూర్లోని ఈ దేవాలయం నిర్మాణంలో మొత్తం గ్రానైట్ ను వాడారు. ఈ దేవాలయంలోని శిల్ప సంపద కూడా భారతీయ శిల్ప శైలికి అద్దం పడుతుంది.

జరత్ దేవాలయం

జరత్ దేవాలయం

P.C: You Tube

ఉదయ్ పూర్ కు కేవలం 58 కిలోమీటర్ల దూరంలోనే జరత్ దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని రాజస్థాన్ ఖజురహో దేవాలయం అని పిలుస్తారు. ఆలయం గోడల పై శృంగార భరితమైన శిల్పలు ఉండటమే ఇందుకు కారణం. ఇక్కడ ప్రధాన దైవం అంబికా మాత. అందువల్లే ఈ దేవాలయాన్ని అంబికా మాత దేవాలయం అని కూడా అంటారు.

గల్తా జీ దేవాలయం

గల్తా జీ దేవాలయం

P.C: You Tube

గల్తాజీ భారత దేశంలోని అతి ప్రాచీన దేవాలయాల్లో ఒకటి. ఇక్కడ ప్రక`తి సిద్ధంగా ఏర్పడిన పుష్కరిణిలో స్నానం చేస్తే సర్వపాపాలు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ఆంజనేయుడు ప్రధానంగా పూజలు అందుకొంటాడు. జైపూర్-ఆగ్రా హైవే మార్గంలో ఈ దేవాలయం ఉంది.

ఏక లింగ దేవాలయం

ఏక లింగ దేవాలయం

P.C: You Tube

ఉదయ్ పూర్ కు 22 కిలోమీటర్ల దూరంలోని కైలాస్ పూర్లోనే ఏక లింగ దేవాలయం ఉంది. అత్యంత ప్రాచీనమై ఈ దేవాలయాన్ని క్రీస్తు పూర్వం 734 లో బాపా ఏవాల్ నిర్మించినట్లు చెబుతారు. ఇక్కడ ప్రధాన దైవం శివుడు.

బ్రహ్మ దేవాలయం

బ్రహ్మ దేవాలయం

P.C: You Tube

భారత దేశంలో అతి ప్రాచీన దేవాలయల్లో రాజస్థాన్ లోని పుష్కర్ లోని బ్రహ్మ దేవాలయం కూడా ఒకటి. దీనిని దాదాపు 2వేల సంవత్సరాల క్రితం నిర్మించినట్లు చెబుతారు. ఈ దేవాలయంలోకి బ్రహ్మచారుల ప్రవేశం నిశిద్ధం.

కంక్రోలి దేవాలయం

కంక్రోలి దేవాలయం

P.C: You Tube

ఉదయ్ పూర్ కు 65 కిలోమీటర్ల దూరంలోని కంక్రోలి అనే చిన్న పట్టణంలో ఈ దేవాలయం ఉంది. ఇక్కడ శ్రీ శ్రీ కృష్ణుడిని ద్వారకాధీశుడనే పేరుతో కొలుస్తారు. ఈ దేవాలయం రాజ్ సమంద్ అనే సరస్సు ఒడ్డున ఉంటుంది.

మొహందిపూర్ బాలాజీ

మొహందిపూర్ బాలాజీ

P.C: You Tube

ఈ దేవాలయంలో ప్రధానంగా హనుమంతుడిని పూజిస్తారు. జైపూర్-ఆగ్రా రహదారిలో మనకు ఈ దేవాలయం కనిపిస్తుంది. దెయ్యాలు పట్టిన వారిని ఇక్కడికి తీసుకువస్తే మంచి ఫలితం ఉంటుందని వేల ఏళ్లుగా ఇక్కడి ప్రజలు నమ్ముతున్నారు.

నాథ్ ద్వారా దేవాలయం

నాథ్ ద్వారా దేవాలయం

P.C: You Tube

ఇది కూడా శ్రీ క`ష్ణ దేవాలయం. ఉదయ్ పూర్ కు కేవలం 48 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంటుంది. బానస్ నది ఒడ్డున ఉన్న ఈ దేవాలయాన్ని నిత్యం వేల మంది సందర్శిస్తూ ఉంటారు.

దిగంబర్ జైన్ దేవాలయం

దిగంబర్ జైన్ దేవాలయం

P.C: You Tube

అజ్మీర్ లో ఉన్న జైన పున్యక్షేత్రంలో జైనుల గురువైన అధినాథ్ ప్రధాన దైవం. దీనిని నాషియన్ జైన్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. క్రీస్తు శకం 1865లో ఈ దేవాలయాన్ని నిర్మించారు. దేవాలయం నిర్మాణంలో ఎర్రటి గ్రానైట్ ను వినియోగించడం వల్ల దీనిని లాల్ దేవాలయం అని కూడా పిలుస్తారు.

దిల్వార దేవాలయం

దిల్వార దేవాలయం

P.C: You Tube

రాజస్థాన్ లోని మౌంట్ అబు పర్వత శిఖరం పై ఈ దిల్వారా దేవాలయం ఉంది. జైనుల పుణ్యక్షేత్రమైన ఈ దేవాలయంలోని అద్భుత శిల్ప సంపద ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ దేవాలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించినట్లు చెబుతారు.

ఆజ్మీర్ దర్గా

ఆజ్మీర్ దర్గా

P.C: You Tube

ఈ దర్గా ముస్లీం సోదరులకే కాకుండా హిందువులకు కూడా పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఆజ్మీర్ లోని ఈ దర్గాలో ప్రతి సంవత్సరం జరిగే ఉర్సుకు ప్రపంచంలోని నలుమూలల నుంచి ఇక్కడకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X