Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ మీ అందాలను మీరే ఆరబోస్తారు

ఇక్కడ మీ అందాలను మీరే ఆరబోస్తారు

భారత దేశంలోని జలపాతాలకు సంబంధించిన కథనం.

By Kishore

భారతదేశం ప్రకృతి సంపదలకు నిలయంలో ఇందులో జలపాతాలు ముందు వరుసలో ఉంటాయి. ఈ జలపాతాల దగ్గరకు వెళ్లిన తక్షణం ప్రతి ఒక్కరూ తమ వయస్సును మరిచిపోయి ఆ నీటితో ఆడుకోవడం మొదలుపెడుతారని చెప్పడంలో సందేహం లేదు. ఇక సినీ ప్రపంచానికి వాటర్ ఫాల్స్ కు మించిన రొమాంటిక్ ప్రాంతం మరొకటి లేదని చెప్పవచ్చు. ఇక్కడ హీరోయిన్ అందాలను మరింత విప్పార బోస్తారు. వారు కూడా అందుకు తగ్గట్టుగానే ప్రవర్తిస్తారు. ఇక మీలో చాలా మంది ముఖ్యంగా సిని మాడలింగ్ రంగాల్లో వెలిగిపోవాలనుకునే వారు ఈ వాటర్ ఫాల్స్ దగ్గర తప్పక ఫొటో షూట్ పెట్టుకుంటారనడంలో సందేహం లేదు. అప్పడు వద్దన్నా అందంగా కనిపించడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో మీతో పోటీ పడే అందాలు కలిగిన జలపాతాలు వివరాలు మీ కోసం

1. జోగ్ జలపాతం

1. జోగ్ జలపాతం

Image Source:

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఈ జల పాతం ఉంది. దాదాపు 253 మీటర్ల ఎత్తు నుంచి పడే నీటిని చూడటానికి మనోహరంగా ఉంటుంది. ఈ జోగ్ జలపాతం రాజా, రాణి, రాకెట్, రోవెర్ అనే నాలుగు పాయలుగా విడిపోయి మరలా కలిసి కిందికు దుముకుతుంది. భారత దేశంలో రెండో అతి ఎతైన జలపాతం జోగ్ జలపాతం

2. దూద్ సాగర్ వాటర్ ఫాల్

2. దూద్ సాగర్ వాటర్ ఫాల్

Image Source:

కర్నాటక, గోవా రాష్ట్ర సరిహద్దులో ఉన్న మంథోవి నది పరివాహ ప్రాంతంలో దూద్ సాగర్ జలపాతం ఉంది. ఇక్కడ నీళ్లు పాల వలే తెల్లగా ఉంటాయి కాబట్టి దీనిని దూద్ సాగర్ వాటర్ ఫాల్ అని అంటారు.

3. ఆ ధ్వని వినడానికి

3. ఆ ధ్వని వినడానికి

Image Source:

ఈ దూద్ సాగర్ జలపాతం ముందు నుంచి రైలులో ప్రయాణం చేయడం మరిచిపోలేని అనుభూతి. ఇక్కడ దాదాపు 310 మీటర్ల ఎత్తునుంచి నీరు కిందికి పడేటప్పుడు చేసే చేసే ధ్వని మనసుకు ఆహ్లాదం కలిగిస్తుంది. గోవా రాజధాని పానాజి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఈ దూద్ సాగర్ వాటర్ ఫాల్ ఉంటుంది.

4. నోషింగ్ థాన్ వాటర్ ఫాల్స్, మేఘాలయ

4. నోషింగ్ థాన్ వాటర్ ఫాల్స్, మేఘాలయ

Image Source:

మేఘాలయలోని మాస్ మోయి గ్రామానికి దగ్గరగా ఉన్న నోషింగ్ థాన్ వాటర్ ఫాల్స్ ను సెవెన్ సిస్టర్ జలపాతం అని కూడా పిలుస్తారు. దాదాపు 340 మీటర్ల ఎత్తు నుంచి కిందికి దుముకే ఈ జలపాతం ఏడు పాయలుగా విడిపోతుంది. భారత దేశంలోని నాలుగో అతి పెద్ద జలపాతం ఇదే. శీతా కాలంలో నీలి రంగులో, వేసవిలో ఆకుపచ్చ రంగులోకి మారిపోవడం ఈ జలపాతం ప్రత్యేకత.

5.సొచిపారా ఫాల్స్, కేరళ

5.సొచిపారా ఫాల్స్, కేరళ

Image Source:

పర్యాటక రంగానికి సంబంధించి గాడ్స్ ఓన్ కంట్రీగా పిలువ బడుతున్న కేరళలో జలపాతాలకు కొదువులేవు. కేరళలోని వయనాడ్ జిల్లాలోని మెప్పడి పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంటుంది. ఈ జలపాతం నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది.

6. బాగ్ సునాగ్ వాటర్ ఫాల్, హిమాచల్ ప్రదేశ్

6. బాగ్ సునాగ్ వాటర్ ఫాల్, హిమాచల్ ప్రదేశ్

Image Source:

హిమాచల్ పరదేశ్ లోని ధర్మశాల నుంచి దాదాపు 11 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంటుంది. ఇది మరీ ఎత్తుగా ఏమి ఉండదు. నీళ్లు కిందకు పడే సమయంలో చేసే సవ్వడులు వినసొంపుగా ఉంటాయి. ట్రెక్కింగ్ ను ఇష్టపడే వారు ఎక్కువగా ఈ జలపాతాన్ని చూడటానికి వెలుతుంటారు.

7. హెబ్బే ఫాల్స్, కర్ణాటక

7. హెబ్బే ఫాల్స్, కర్ణాటక

Image Source:

కర్నాటకలోని చిక్కమగళూరు జిల్లాలో హిల్ స్టేషన్ అయిన కెమ్మనగుడి నుంచి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఈ వాటర్ ఫాల్స్ ఉంటుంది. కాఫీ, టీ తోటల మధ్య ఉన్న ఈ జలపాతాన్ని చూడటానికి బెంగళూరు నుంచి వారాంతాల్లో ఎక్కువ మంది వెలుతుంటారు. ఇక్కడి ప్రక`తి సహజ అందాలు కూడా మనలను రారమ్మని పిలుస్తుంటాయి.

8.భీమ్ లత్ ఫాల్, రాజస్థాన్

8.భీమ్ లత్ ఫాల్, రాజస్థాన్

Image Source:

ఎడారి రాష్ట్రంగా పిలువబడే రాజస్థాన్ లో ఈ వాటర్ ఫాల్ ఉంటుంది. రాజస్థాన్ రాజధాని జై పూర్ నుంచి సుమారు 472 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం పర్యాటకులను ఆకర్షిస్తోంది. సుమారు 60 మీటర్ల ఎత్తు నుంచి పడే నీటి తుంపరులు మనస్సును తుళ్లింతలు చేస్తాయి.

9.కెమ్ థేఫాల్, ఉత్తరాఖండ్

9.కెమ్ థేఫాల్, ఉత్తరాఖండ్

Image Source:

ముస్సోరికి అతి సమీపంలో ఉన్న ఈ జలపాతం సముద్ర మట్టానికి దాదాపు 1371 మీటర్ల ఎత్తు నుంచి కిందికి పడుతుంది. ఈ క్రమంలో ఐదు ఉప పాయలుగా విడిపోయి చూడటానికి మనోహరంగా ఉంటుంది. మనస్సు బాగాలేకపోయిన సమయంలో ఇక్కడికి వెలితే తేలికపడుతుంది.

10.అథిరపిళై వాటర్ ఫాల్, కేరళ

10.అథిరపిళై వాటర్ ఫాల్, కేరళ

Image Source:


ప్రక`తి సహజ సౌదర్యాలకు పెట్టింది పేరైన కేరళలో అందమైన నదీ, సముద్ర తీరాలతో పాటు జలపాతాలకు కూడా కొదువులేదు. అందులో అథిరపిళై వాటర్ ఫాల్ ముందు వరుసలో ఉంటుంది. కేరళలోని త్రిస్సూర్ కు సమీపంలో ఉన్న ఈ జలపాతం వీకెండ్ స్పాట్ గా కూడా పేరుగాంచింది.

11.శిశుఫాల్, హిమాచల్ ప్రదేశ్

11.శిశుఫాల్, హిమాచల్ ప్రదేశ్

Image Source:

మనాలి నుంచి లెహ్ కు వెళ్లే మార్గ మధ్యలో ఈ జలపాతం వస్తుంది. సముద్ర మట్టం నుంచి 3051 మీటర్ల ఎత్తులో ఉండే ఈ జలపాతాన్ని చూడటానికి రెండు కళ్లు చాలవు. చుట్టూ ఉన్న పచ్చటి నదీ లోయల మధ్య పరుగులు పెట్టే ఈ వాటర్ ఫాల్ జలాలలో ఒక్కసారైనా తడవాలని అనిపించకమానదు.

12.థోసెగర్స్ ఫాల్, మహారాష్ట్ర

12.థోసెగర్స్ ఫాల్, మహారాష్ట్ర

Image Source:

ముంబై, పూనే బిజీ లైఫ్ నుంచి తాత్కాలికంగా బయటపడాలను కొనే వారికి వెంటనే గుర్తుకు వచ్చేది థోసెగర్స్ వాటర్ ఫాల్, పశ్చిమ కనుల్లో ఉన్న ఈ జలపాతం సతారా నగరానికి దగ్గరల్లో ఉంటుంది. దాదాపు 500 మీటర్ల ఎత్తు నుంచి పడే ఈ జలపాతం హోయలు హాలివుడ్ జేమ్స్ బాండ్ సినిమాలోని హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

13.థూర్ ఫాల్, మధ్యప్రదేశ్

13.థూర్ ఫాల్, మధ్యప్రదేశ్

Image Source:

నర్మదా నది పరివాహక ప్రాంతంలోని ఈ జలపాతం జబల్పూర్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ జలపాతం పై నుంచి కిందికి పడే సమయంలో దట్టమైన పొగమంచు వలే నీటి బిందువులు కనిపిస్తాయి. అందువల్లే దీనిని స్మోక్ క్యాస్కేడ్ అని పిలుస్తారు.

14.క్యాన్ రిమ్ ఫాల్, మేఘాలయ

14.క్యాన్ రిమ్ ఫాల్, మేఘాలయ


Image Source:

భారతదేశంలోనే అత్యంత ఎక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతంగా పేరుగాంచిన చిరపుంజి నుంచి ఈ జలపాతం కేవలం 16 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ జలపాతం మూడు భాగాలుగా కనిపిస్తుంది.
ఏడాది పొడుగునా దీనిలో నీరు దాదాపు ఒకే మట్టంలో ఉండటం గమనార్హం.

15. శివనసముద్ర ఫాల్, కర్నాటక

15. శివనసముద్ర ఫాల్, కర్నాటక

Image Source:

కావేరి నది ఒడ్డున మండ్యా కు సమీపంలో ఈ శివనసముద్ర ఫాల్స్ ఉంటుంది. ఎండాకాలంలో కంటే వర్షాకాలంలో ఈ వాటర్ ఫాల్ లో ఎక్కువ మొత్తం లో నీరు ఉంటుంది. కావేరి నదిని ఈ వాటర్ ఫాల్ రెండు భాగాలుగా చేస్తుంది.

16.కుర్తాలాం ఫాల్, తమిళనాడు

16.కుర్తాలాం ఫాల్, తమిళనాడు

Image Source:

కుర్తాలం జలపాతం పశ్చిమ కనుల్లో తమిళనాడులోని చిత్తార్ నదీ పరివాహక ప్రాంతంలో ఇది ఉంది. ఏడాది పొడవున ఈ వాటర్ ఫాల్ అందాలను మనం చూడవచ్చు. సుమారు 160 మీటర్ల ఎత్తు నుంచి పడే ఈ జలపాతం అందాలను చూడటానికి దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు నిత్యం వస్తుంటారు. తిరునల్వేలి జిల్లాలోని కుర్తాలాం పట్టణానికి సమీపంలో ఈ జలపాతం ఉంటుంది.

17.కూనే ఫాల్స్, పూనే

17.కూనే ఫాల్స్, పూనే

Image Source:

ఇది పూనే నగరానికి సమీపంలో ఉంటుంది. వేసవితో పోలిస్తే వర్షాకాలంలో ఎక్కువ మంది ఈ వాటర్ ఫాల్ ను చూడటానికి వస్తుంటారు. దాదాపు 100 మీటర్ల ఎత్తు నుంచి ఇక్కడ నీరు కిందికి పడుతుంది.
వీకెండ్ స్పాట్ గా కూడా ఇది పేరుతెచ్చుకుంది.

18.చిత్రకోటే ఫాల్స్, ఛత్తీస్ ఘడ్

18.చిత్రకోటే ఫాల్స్, ఛత్తీస్ ఘడ్

Image Source:

చిత్రకోటే వాటర్ ఫాల్ ను భారత దేశ నయాగర జలపాతాలు అని పిలుస్తారు. ఈ జలపాతం ఛత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లాలో జగద్ పూర్ లో ఉంది. భారత దేశంలో పెద్ద జలపాతం దాదాపు 150 మీటర్ల ఎత్తు నుంచి ఇక్కడ నీళ్లు కిందకు పడుతాయి. చిత్రకూట్ హిందూ పుణ్యక్షేత్రంగా కూడా విరాజిల్లుతోంది.

19.హొగనేకల్ వాటర్ ఫాల్, తమిళనాడు

19.హొగనేకల్ వాటర్ ఫాల్, తమిళనాడు

Image Source:

తమిళనాడులో హోగనేకల్ జలపాతం ఉంటుంది. ఈ జలపాతం పై నుంచి కిందికి పడే సమయంలో పొగమంచు వలే నీటి బిందువులు కనిపిస్తాయి. ఇక్కడ బోటింగ్ కు కూడా అవకాశం ఉంది. బెంగళూరు నుంచి చాలా మంది వారాంతపు సెలవును ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వెలుతుంటారు.

21.రుద్రనాగ వాటర్ ఫాల్, హిమాచల్ ప్రదేశ్

21.రుద్రనాగ వాటర్ ఫాల్, హిమాచల్ ప్రదేశ్

Image Source:

రుద్రనాగ్ హిమాచల్ ప్రదేశ్ లోని పార్వతీలోయలో కనిపిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం ఇక్కడే శివుడు ధ్యానం చేసినట్లు చెబుతారు. ఏడాది మొత్తం ఈ జలపాతం అందాలను మనం చూడటానికి అవకాశం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X