Search
  • Follow NativePlanet
Share
» »ఈ జలపాతాల్లో కేరింతలు కొడితే మీరు చిన్నపిల్లలైపోతారు

ఈ జలపాతాల్లో కేరింతలు కొడితే మీరు చిన్నపిల్లలైపోతారు

కేరళలో అందమైన జలపాతాలకు సంబంధించిన కథనం.

కేరళ ప్రకృతి సంపదలకు నిలయం. ఈ దక్షిణాది రాష్ట్రంలో గాలి తెమ్మరలు మనకు ప్రకృతి పాఠాలను బోధిస్తూ మనలను మైమరిపింపజేస్తుంటాయి. పిల్ల కాలువలు మనలను సర్గపు అంచుల వరకూ తీసుకువెలుతాయి. నదీ, పర్వత లోయలు మనలను పక్కకు కూడా చూపు తిప్పుకోనివ్వవు. ఇంతటి అందమైన కేరళ ఎన్నో జలపాతాల నిలయం. అందువల్లే సినిమా చిత్రీకరణకు ఈ రాష్ట్రంలోని జలపాతాలకే ఎక్కువ మంది దర్శకులు ఓటు వేస్తారు. అటు వంటి జలపాతాల్లో కీజార్ కుత్తూ వాటర్ ఫాల్స్, పాలరూవి జలపాతం, తొమ్మన్ కుట్టూ వాటర్ ఫాల్, మీన్ ముట్టి వాటర్ ఫాల్, అత్తిరపిళ్లై జలపాతం. అతి ముఖ్యమైనవి. ఈ జలపాతాలు ఎక్కడ ఉన్నాయి. దగ్గర్లో ఉన్న నగరాలు, వాటి మధ్యదూరం, ఎన్ని రోజులు పర్యటన, ఏ సమయంలో అక్కడికి వెళ్లడం మంచిది తదితర వివరాలన్నీ నేటివ్ ప్లానెట్ పాఠకులైన మీ కోసం ప్రత్యేక కథనం. మరెందుకు ఆలస్యం చదవండి.

అత్తిరపిళ్లై జలపాతం

అత్తిరపిళ్లై జలపాతం

P.C: You Tube

రావణ సినిమాలో ఈ జలపాతం అందాలనే మనం చూశాం. కేరళలో అత్యంత ఎతైన జలపాతం ఇదే. ఈ జలపాతం అంతెత్తు నుంచి కిందికి దుమికే సమయంలో చేసే శబ్దం చెవులకే కాదు మనసుకు కూడా ఇంపుగా ఉంటుంది.

ఎన్ని రోజుల పర్యాటకం ఒక రోజు

దగ్గర్లోని నగరాలు త్రిషూర్ (47 కిలోమీటర్ల), కొచ్చి (70 కిలోమీటర్లు)

జలపాతం చూడటానికి అనువైన సమయం ఆగస్టు నుంచి జనవరి

మీన్ ముట్టి వాటర్ ఫాల్

మీన్ ముట్టి వాటర్ ఫాల్

P.C: You Tube

కేరళలో అత్యంత అందమైన జలపాతాల్లో మీన్ ముట్టి వాటర్ ఫాల్ ముందు వరుసలో ఉంటుంది. దాదాపు 300 మీటర్ల ఎత్తు నుంచి కిందికి పడే సమయంలో అనేక పాయలుగా చీలిపోయి చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కేరళలో ఎత్తు పరంగా రెండోది.

ఎన్ని రోజుల పర్యాటకం ఒక రోజు

దగ్గర్లోని నగరాలు కాల్ పేట నుంచి 28 కిలోమీటర్లు

జలపాతం చూడటానికి అనువైన సమయం ఆగస్టు నుంచి జనవరి

తొమ్మన్ కుట్టూ వాటర్ ఫాల్

తొమ్మన్ కుట్టూ వాటర్ ఫాల్

P.C: You Tube

జలపాతాలకు సంబంధించిన సీన్ సినిమాలో వచ్చిందంటే అది తొమ్మన్ కుట్టూ వాటర్ ఫాల్ అని గుడ్డిగా చెప్పేయవచ్చు. మీరు 10 సార్లు ఈ సమాధానం చెబితే 8 సార్లు కరెక్ట్ అవుతుంది. దీని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ తొమ్మన్ కుట్టూ జలపాతం అందాలను, ఆ నందాలను కెమరాల బంధించడానికి చిత్రసీమ ఎంతగా ఇష్టపడుతోందో.

ఎన్ని రోజుల పర్యాటకం ఒక రోజు

దగ్గర్లోని నగరాలు ఇడుక్కి నుంచి 25 కిలోమీటర్లు, మున్నార్ నుంచి 48 కిలోమీటర్లు

జలపాతం చూడటానికి అనువైన సమయం సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ

పాలరూవి జలపాతం

పాలరూవి జలపాతం

P.C: You Tube

భారత దేశంలో ఎత్తు పరంగా పాలరూవి జలపాతం 40 వస్థానంలో నిలుస్తుంది. అయితే అందమైన జలపాతాల విషయంలో మాత్రం దీనికి సరిసాటి లేదనే చెప్పవచ్చు. మలయాలంలో పాలరూవి అంటే పాలధార అని తెలుగులో అర్థం. తెల్లని పాలనుగుల వంటి ఈ జలపాతాన్ని చూస్తూ సమయాన్ని ఇట్టే గడిపేయవచ్చు.

ఎన్ని రోజుల పర్యాటకం ఒక రోజు

దగ్గర్లోని నగరాలు కొల్లాం నుంచి 72 కిలోమీటర్లు

జలపాతం చూడటానికి అనువైన సమయం జూన్ నుంచి జనవరి

కీజార్ కుత్తూ వాటర్ ఫాల్స్

కీజార్ కుత్తూ వాటర్ ఫాల్స్

P.C: You Tube

కేరళలోనే కాకుండా దక్షిణ భారత దేశ వ్యాప్తంగా అత్యంత ప్రాచూర్యం పొందిన జలపాతాల్లో కీజార్ కుత్తూ జలపాతం కూడా ఒకటి. దాదాపు 1500 మీటర్ల ఎత్తు నుంచి ఈ జలపాతం కిందికి పడుతూ తరుచుగా ఇంద్ర ధనస్సును ఏర్పాటు చేస్తుంది. అందువల్లే కీజార్ కుత్తూ జలపాతాన్ని ఇంద్ర ధనస్సు జలపాతం అని కూడా పేర్కొంటారు.

ఎన్ని రోజుల పర్యాటకం ఒక రోజు

దగ్గర్లోని నగరాలు ఇడుక్కి నుంచి 30 కిలోమీటర్లు

జలపాతం చూడటానికి అనువైన సమయం ఏడాది మొత్తం ఎప్పడైనా సందర్శించవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X