Search
  • Follow NativePlanet
Share
» » చెట్టులెక్కి చిటారు కొమ్మునున్న గూడులో ‘గువ్వలాట’కు సిద్దమా?

చెట్టులెక్కి చిటారు కొమ్మునున్న గూడులో ‘గువ్వలాట’కు సిద్దమా?

భారతదేశంలోని ట్రీ హౌస్ రిసార్ట్స్ గురించి కథనం.

బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి కాంక్రీట్ నగరాల్లో జీవితం వారంలో మొదటి ఐదు రోజులూ రంగుల రాట్నం వలే ఒకే రకంగా తిరుగుతూ ఉంటుంది. ఉదయం లేవడం... టిఫిన్ బాక్స్ సర్దుకోవడం... ల్యాప్ లాప్ బుజాన వేసుకొని పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్ ని ఛేదించుకొని ఆఫీసుకు వెళ్లడం. అక్కడ ఇచ్చే టార్గెట్లను ఛేదించలేక, సతమవుతూనే రాబోయే వీకెండ్ కోసం ఎదురు చూస్తూ పని చేయడం. ఇవన్నీ మనలో చాలా మందికి రోజూ ఎదురవుతున్న అనుభవాలు. లేదా మన స్నేహితులో, బంధువులో 'సిట్టింగ్స్' సమయంలో చెప్పుకొన్న బాధలే.

అయితే వీకెండ్ మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటారు. అటువంటి 'వీకెండ్ బర్డ్స్' కోసమే ఈ కథనం. ఈ కథనంలో అక్షరాలు మీతో పాటు మీ సోల్ మేట్ ను అదేనండి హృదయంలో ఉన్నవారిని స్వర్గపుటంచులదాకా తీసుకెళ్లుతాయి. రొటీన్ రెస్టోరెంట్లు, రిసార్టుల్లో కాక ట్రీ హౌస్ లు సహజమైన ప్రకృతి అందాల మధ్య వీకెండ్ ను గడపేలా చేస్తాయి.

అందుకు దేశంలో అత్యుత్తమమైన ట్రీ హౌస్ ల క్లుప్త సమాచారం మీ కోసం అందిస్తున్నాం. ప్రకృతిలో భాగమైన పచ్చని చెట్ల కొమ్ముల్లో నిర్మించిన ఈ రెస్టోరెంట్లు చాలా కాలం క్రితమే అందుబాటులోకి వచ్చినా ఇప్పుడిప్పుడే ఈ సంస్కతి పట్ల 'వీకెండ్ బర్డ్స్'ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. మరెందుకు ఆలస్యం చెట్టు చిటారు కొమ్మున ఉండే ఈ రెస్టోరెంట్లలో వీకెండ్ రెండు రోజులూ 'గువ్వలాట'కు సిద్దమవ్వండి.

ది మచ్చన్ ట్రీ హౌస్, లోనావాలా

ది మచ్చన్ ట్రీ హౌస్, లోనావాలా

P.C: You Tube

ముంబై, పూనా వాసులకు లోనావాలా చాలా పరిచయమైన పేరు. అక్కడ ఉన్న అక్కడే మచ్చన్ ట్రీ హౌస్ ఉంది. దాదాపు 30 అడుగుల ఎతైన చెట్ల కొమ్మల చిటారునా చిన్నచిన్న చెక్కగదులు ఉంటాయి. ఆ గదులకు ఉన్న గాజు కిటికీల్లో చుట్టూ ఉన్న అటవి అందాలను చూస్తూ కాలాన్ని ఇట్టే మరిచిపోవచ్చు. ఈ రెస్టోరెంట్ చేరుకోవడానికి దాదాపు 5 కిలోమీటర్లు కాళ్లకు పనిచెప్పాల్సి ఉంటుంది.

పర్యవరణ ప్రేమికులు ఎక్కువగా ఇక్కడికి వెళుతుంటారు. ముంబై నుంచి 83 కిలోమీటర్ల దూరంలో ఈ ట్రీ హౌస్ రిసార్ట్ కం రెస్టోరెంట్ ఉండగా ఇక్కడి నుంచి పూనేకు కేవలం 66 కిలోమీటర్లు మాత్రమే.

ట్రీ హౌస్ రిసార్ట్, జైపూర్

ట్రీ హౌస్ రిసార్ట్, జైపూర్

P.C: You Tube

రాజస్థాన్ లోని పింక్ సిటీగా పేరొందిన జైపూర్ నుంచి కేవలం 30 నిమిషాల ప్రయాణంతో ట్రీ హౌస్ రిసార్టును చేరుకోవచ్చు. అటవి మధ్య భాగంలో చెట్ల కొమ్ముల చివరి భాగంలో ఏర్పాటు చేసిన రెస్టోరెంట్లు ఎకో టూరిజం పెంపునకు దోహదం చేస్తున్నాయి. ఈ ట్రీ హౌస్ ను ఒకసారి బుక్ చేసుకొంటే నైట్ సఫారీ, బర్డ్ వాచింగ్, క్యామెల్ రైడ్ తదితరాలన్నీ మనకు అందుబాటులో ఉంటాయి.

వైతిరీ రిసార్ట్, వయనాడ్

వైతిరీ రిసార్ట్, వయనాడ్

P.C: You Tube

వైతిరీ రిసార్ట్ కు భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాపంగా పేరుంది. కేరళలోని వాయనాడ్ కు దగ్గర్లోని అటవీ ప్రాంతంలో ఈ రిసార్ట్ ఉంది. సతత హరితారణ్యాల్లో అంటే నిత్యం పచ్చగా ఉండే అటవీ ప్రాంతంలో ఈ రిసార్ట్ ను ఏర్పాటుచేశారు. చెట్టు కొమ్మల చిటారున స్థానికంగా దొరికే కలప, ఆకులు, చెట్టు బెరడు, వేళ్లతోనే ఇక్కడి రిసార్ట్ లోని ట్రీ హౌస్ లను నిర్మించారు. గలగల పారే నది, కుహు...కుహు అంటూ వింతైన శబ్ధం చేసే పక్షుల ధ్వనుల మధ్య మన వారంలోని మొదటి ఐదు రోజుల అలసటను ఇట్టే మరిచిపోతామనడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ మనకు ఆయుర్వేద స్పా కూడా అందుబాటులో ఉంటుంది.

ట్రీ హౌస్ కాటేజ్, మనాలి

ట్రీ హౌస్ కాటేజ్, మనాలి

P.C: You Tube

మనాలి అంటేనే ప్రక`తి అందాలకు నిలయం. ఇక్కడికి దగ్గర్లోని కట్రియన్ గ్రామంలో ట్రీ హౌస్ కాటేజ్ ఉంది. ఈ ట్రీ హౌస్ కాటేజ్ లో ఒకే ఒక ట్రీ హౌస్ ఉంటుంది. రెండు సాధారణ కాటేజీలు ఉంటాయి. అంతే కాకుండా చుట్టూ పచ్చదనంతో నిండిన గార్డెన్ మనకు బోనస్. ఓక్ చెట్టు చిటారున ఉన్న ట్రీ హౌస్ తో పాటునచ్చిన నెచ్చలితో గడపడం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ ట్రీ హౌస్ కాటేజీలో ఇష్టమైతే మనమే మనకు కావాల్సిన వంటలను వండుకోవచ్చు. లేదంటే మనకు నచ్చిన వంటలను వండిపెట్టే నలభీములు కూడా ఇక్కడ ఉంటారు. కుటుంబ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ట్రీ హౌస్ కాటేజీలో ఉంటే మన ఇంటిలోనే ఉన్న ఫీలింగ్ ఉంటుంది.

రైన్ ఫారెస్ట్ బొటిక్ రిసార్ట్, అత్తిరపిల్లై

రైన్ ఫారెస్ట్ బొటిక్ రిసార్ట్, అత్తిరపిల్లై

కేరళలోని అతి ఎత్తైన జలపాతంగా పేరుగాంచిన అత్తిరపిల్లై వద్ద ఈ ట్రీ హౌస్ రిసార్ట్ ఉంది. దాదాపు ఏడు ఏడు చదరపు అడుగుల విస్తీర్ణంలోని అడవిలోని ఎతైన చెట్ల చిటారు కొమ్మలు మధ్య ఈ రిసార్ట్ ను ఏర్పాటు చేశారు. జల జల పారే సెలయేటి జలపాత అందాలను చూస్తూమనకున్సన మస్యలను కొద్ది సేపు పక్కన పెట్టి వీకెండ్ లో సేదతీరడానికి దీనికి మించిన మరో ప్రదేశం లేదని చెప్పవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X