Search
  • Follow NativePlanet
Share
» »దక్షిణ భారతదేశంలోని టాప్ 5 కృష్ణ జింక అభయారణ్యాలు !

దక్షిణ భారతదేశంలోని టాప్ 5 కృష్ణ జింక అభయారణ్యాలు !

By Mohammad

కృష్ణ జింక శాఖాహార వన్య జంతువు. అతి వేగంగా పరిగెత్తగలే జంతువులలో ఇది ఒకటి. ఇవి ముఖ్యంగా గడ్డిని, పండ్లను తింటుంటాయి మరియు ఎప్పుడు బయటకు వెళ్లినా ఒంటరిగా వెళ్లవు వెంట మంద వేసుకొని వెళతాయి. మందలో 15-20 వరకు కృష్ణ జింకలు మరియు ప్రతి మందలోనూ ఒక బలిష్టమైన మగ కృష్ణ జింక ఉంటుంది.

కృష్ణ జింక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జంతువు. ఒకానొకప్పుడు ఇవి సువిశాల మైదానాలలో స్వేచ్ఛగా తిరిగేవి కానీ నేడు ఇవి కనుమరుగవుతున్నాయి. వినోదం కోసం, మందులో మంచింగ్ ల కోసం, చర్మం కోసం వెంటాడి మరీ చంపుతున్నారు. అనేక జంతువుల వలె కృష్ణ జింక రక్షిత జంతువు. వీటిని పట్టుకోవడం, చంపడం చరిత్యా నేరం.

ఇది కూడా చదవండి : ఏపీలోని 3 పక్షి అభయారణ్యాలు !

భారతదేశంలో కృష్ణ జింకల పార్క్ లు అనేకం ఉన్నాయి. దాదాపు ప్రతి నేషనల్ పార్క్ లో, స్యాంక్చురీలలో వీటిని అబ్సర్వ్ చేస్తుంటారు. దక్షిణ భారతదేశంలో కూడా కృష్ణ జింకల ఉనికిని కాపాడేందుకు కొన్ని స్యాంక్చురీ లను ఏర్పాటుచేశారు. అవెక్కడ ఉన్నాయో ? ఎలా వెళ్లాలో తెలుసుకుందాం పదండి !

అభయారణ్యంలో కృష్ణ జింక

అభయారణ్యంలో కృష్ణ జింక

చిత్ర కృప : Chinmayisk

01. రాణిబెన్నూర్ కృష్ణ జింకల అభయారణ్యం, కర్ణాటక

రాణిబెన్నూర్ అభయారణ్యం కర్ణాటక లోని హవేరి జిల్లాలో కలదు. అంతరించిపోతున్న కృష్ణ జింకలను కాపాడేందుకు ఈ అభయారణ్యం ఏర్పాటు చేశారు. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ మరియు తోడేలు లకు కూడా ఇది నివాసంగా ఉంది. చుట్టూ అడవులు, దుర్భేద్యమైన చెట్లతో నిండిన ఈ ప్రాంతంలో దాహార్తి తీర్చుకోవటానికి వచ్చే కృష్ణజింకల మంద తప్పక చూడదగినది.

సందర్శించు కాలం : అక్టోబర్ నుండి మర్చి వరకు

ఎలా చేరుకోవాలి ?

బళ్లారి ఎయిర్ పోర్ట్ మరియు హవేరి రైల్వే స్టేషన్ లు సమీపాన కలవు.

జయమంగళి బ్లాక్ బక్ రిజర్వ్

జయమంగళి బ్లాక్ బక్ రిజర్వ్

చిత్ర కృప : Chesano

02. జయమంగళి బ్లాక్ బక్ రిజర్వ్, కర్ణాటక

జయమంగళి బ్లాక్ బక్ రిజర్వ్ కర్ణాటక రాష్ట్రంలోని తుంకూర్ జిల్లాలో కలదు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న అతి పెద్ద కృష్ణ జింకల అభయారణ్యం ఇది. స్యాంక్చురీ, అకేసియా మరియు యూకలిఫ్టస్ చెట్లతో, గడ్డి మైదానాలతో కప్పబడి ఉంటుంది. కృష్ణ జింకలతో పాటు తోడేలు, కోతులు, ముంగీసలు, కుందేళ్లు, ఉడుతలు చూడదగ్గవి.

ఎలా చేరుకోవాలి ?

కర్ణాటకలోని మధుగిరి టౌన్ కు 23 కిలోమీటర్ల దూరంలో మరియు ఆంధ్రాలోని హిందూపూర్ టౌన్ కు 20 కిలోమీటర్ల దూరంలో జయమంగళి స్యాంక్చురీ కలదు.

ఆడ, మగ కృష్ణ జింకలు

ఆడ, మగ కృష్ణ జింకలు

చిత్ర కృప : Mr Raja Purohit

03. వల్లనాడు బ్లాక్ బక్ స్యాంక్చురీ, తమిళనాడు

తిరునెల్వేలి-తూథుకుడి రోడ్డులో ఉన్న ఈ సాంచురీ తూథుకుడి నుండి 35 కిలో మీటర్ల దూరం లో ఉంది. ఇది 64 ఎకరాల మేరకు విస్తరించింది. ఫారెస్ట్ డిపార్టుమెంటు చేత ఈ ప్రాంతం సంరక్షింపబడుతుంది. కొండల పైన మేత మేస్తూ ఎన్నో జింకలు కనిపిస్తాయి.

ఎలా చేరుకోవాలి ?

వగైకులం సమీప ఎయిర్ పోర్ట్ మరియు తూథుకుడి సమీప రైల్వే స్టేషన్ గా కలదు. తిరునల్వేలి జంక్షన్ గా కలదు.

పాయింట్ కాలిమెర్ స్యాంక్చురీ

పాయింట్ కాలిమెర్ స్యాంక్చురీ

చిత్ర కృప : Thorsten Mohr

04. పాయింట్ కాలిమెర్ వైల్డ్ లైఫ్ అండ్ బర్డ్ స్యాంక్చురీ, తమిళనాడు

పాయింట్ కాలిమెర్ స్యాంక్చురీ తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్టినం సమీపాన కలదు. ఇందులో అంతరించిపోతున్న కృష్ణ జింకలను రక్షితున్నారు. నీటి పక్షులకు మరియు వలస పక్షులకు - ఫ్లెమింగో కూడా ఆవాసంగా ఉంది. మతపర, సాంస్కృతిక మరియు చరిత్రక ప్రాధాన్యత కలిగిన ఎన్నో సైట్ లు ఇక్కడ కలవు.

ఎలా చేరుకోవాలి ?

సమీపాన నాగపట్టినం రైల్వే స్టేషన్ మరియు తిరుచిరాపల్లి విమానాశ్రయం కలదు.

గిండి నేషనల్ పార్క్ ప్రధాన ద్వారం

గిండి నేషనల్ పార్క్ ప్రధాన ద్వారం

చిత్ర కృప : abhidg

05. గిండి నేషనల్ పార్క్, తమిళనాడు

గిండి నేషనల్ పార్క్, చెన్నై నడిబొడ్డున గిండి ప్రదేశంలో కలదు. ఇది ఇండియాలో ఉన్న 8 వ చిన్న నేషనల్ పార్క్. పర్యాటకులు పార్క్ లో జింకలు, నక్కలు, పాములు, తాబేలు మొదలైనవి చూడవచ్చు.

ఎలా చేరుకోవాలి ?

చెన్నై నుండి నేషనల్ పార్క్ కు సిటీ బస్సులు తిరుగుతాయి. సమీపాన కిలోమీటర్ దూరంలో గిండి లోకల్ రైల్వే స్టేషన్ కలదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X