Search
  • Follow NativePlanet
Share
» »ఉత్తర ఇండియాలో వెలుగుల దీపావళి !

ఉత్తర ఇండియాలో వెలుగుల దీపావళి !

దీపావళి పండుగను భారత దేశం అంతటా జరుపుకుంటారు. ఈ పండుగ సాధారణంగా, అన్ని మతస్తుల వారు అన్ని కులాల వారూ తమ తమ స్నేహితులు, బంధువులతో జరుపుకుంటారు. ఈ రోజున, వెలుగులు విరజిమ్మే, దీపాలను వెలిగిస్తారు. పెద్ద శబ్దాలు , వెలుగులు వచ్చే టపాసులను కాల్చి ఆనందిస్తారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలోను దీపావళిని జరుపుకొంటున్నప్పటికి, ఉత్తర భారత దేశంలోని కొన్ని రాష్ట్రాల వారు దీపావళి పండుగను మరింత అతి వైభవంగా జరుపుకుంటారు. తమ మతపర వేడుకలు చేసి ఆనందిస్తారు. దీపావళి అంటే, యువతకు, పిల్లలకు తమ తోటి వారితో కలసి వెలుగులు శబ్దాలతో ఆటలు ఆడటమే. దీపావళి ని అతి వైభవంగా జరుపుకునే ఉత్తర భారత దేశ రాష్ట్రాలు ఏవో ఇపుడు పరిశీలిద్దాం ...

ఉత్తర ఇండియాలో వెలుగుల దీపావళి !
దీపావళి గ్రాండ్ - 5 ఉత్తరాది రాష్ట్రాలు

దీపావళి గ్రాండ్ - 5 ఉత్తరాది రాష్ట్రాలు

ఢిల్లీ లో దీపావళి రోజు ఏమి చేస్తారు ? ఢిల్లీ నగరం లోని వివిధ ప్రదేశాలలో అంటే, రాం లీలా మైదానం వంటి విశాల బహిరంగ ప్రదేశాలలో శ్రీ రాముడి జీవితం ప్రతి బింమ్బించే చిత్రాలు, ప్రదర్శిస్తారు. కటౌట్లు నిలబెడతారు. స్టేజీ లు నిర్మిస్తారు. నిపుణులైన కళాకారులు తమ వేష భాషలతో శ్రీరాముడి జీవిత ఘట్టాలను ప్రదర్శిస్తారు. ఇక్కడి ప్రజలు వారి ఇరుగుపొరుగు వారితో, స్నేహితులతో, రామ లీలా మైదానం వంటి బహిరంగ ప్రదేశాలలో గుమిగూడి ఈ ప్రదర్శనలు తిలకిస్తారు.

దీపావళి గ్రాండ్ - 5 ఉత్తరాది రాష్ట్రాలు

దీపావళి గ్రాండ్ - 5 ఉత్తరాది రాష్ట్రాలు

ఢిల్లీ నగరం లోని వివిధ ప్రదేశాలలో అంటే, రాం లీలా మైదానం వంటి విశాల బహిరంగ ప్రదేశాలలో శ్రీ రాముడి జీవితం ప్రతి బింమ్బించే చిత్రాలు, ప్రదర్శిస్తారు. కటౌట్లు నిలబెడతారు. స్టేజీ లు నిర్మిస్తారు. నిపుణులైన కళాకారులు తమ వేష భాషలతో శ్రీరాముడి జీవిత ఘట్టాలను ప్రదర్శిస్తారు. ఇక్కడి ప్రజలు వారి ఇరుగుపొరుగు వారితో, స్నేహితులతో, రామ లీలా మైదానం వంటి బహిరంగ ప్రదేశాలలో గుమిగూడి ఈ ప్రదర్శనలు తిలకిస్తారు.

దీపావళి గ్రాండ్ - 5 ఉత్తరాది రాష్ట్రాలు

దీపావళి గ్రాండ్ - 5 ఉత్తరాది రాష్ట్రాలు

ఉత్తర ప్రదేశ రాష్ట్రం ప్రజలు ఏ పండుగను అయినా సరే అత్యంత భక్తి శ్రద్ధలతో, సంప్రదాయకంగా చేస్తారు. వారణాసి నగరం వీధులు ఈ సమయంలో పండుగకు అవసరమైన వస్తువులు, క్రాకర్లు, మొదలైన వస్తువులు షాపింగ్ చేసేవారితో కిక్కిరిసి వుంటాయి. ప్రతి ఇంటిలో రంగు రంగుల ప్రమిదలతో దీపాలు వెలిగిస్తారు. ప్రజలు తమ ఇండ్లను పూవులతో, మామిడి తోరణాలతో అలంకరిస్తారు.

దీపావళి గ్రాండ్ - 5 ఉత్తరాది రాష్ట్రాలు

దీపావళి గ్రాండ్ - 5 ఉత్తరాది రాష్ట్రాలు

వారణాసి లోని పవిత్ర ఘాట్ లు ఈ సమయంలో అనేక మంది భక్తులతో నిండి వుంటాయి. ఈ సమయంలో ఇక్కడ గంగా నది ఒడ్డు బారులు తీరిన జనాలతో కిక్కిరిసి వుంటుంది. ఘాట్ లలో దీపాలు వెలిగించి నదిలో వదులుతారు. ఈ దృశ్యం కన్నుల విందుగా కనపడుతుంది.

దీపావళి గ్రాండ్ - 5 ఉత్తరాది రాష్ట్రాలు

దీపావళి గ్రాండ్ - 5 ఉత్తరాది రాష్ట్రాలు

పంజాబ్ రాష్ట్రం లోని అమ్రిత్సర్ లో కూడా దీపావళి వేడుకలు ఘనంగా సాగుతాయి. అమ్రిత్సర్ లోని గోల్డెన్ టెంపుల్ ఈ రోజున మిరుమిట్లు కొలిపే కాంతులతో నిండి వుంటుంది. టెంపుల్ అలంకరణ వెలుపలి భాగాలలో పూర్తిగా దీపాలతో నిండి వుంటుంది. సాంప్రదాయక మట్టి ప్రమిదలు కూడా వెలిగించి ప్రతి ఇంటిలోనూ తమ తమ దైవాలను పూజించి భక్తి శ్రద్ధలను చాటుకొంటారు.

దీపావళి గ్రాండ్ - 5 ఉత్తరాది రాష్ట్రాలు

దీపావళి గ్రాండ్ - 5 ఉత్తరాది రాష్ట్రాలు

ఈ ప్రాంతంలోని సిక్కు మతస్తులు ఈ పండుగను తమ ఇండ్లను అందంగా అలంకరించటం, ఇంటి ముందు భాగాలలో రంగోలి ముగ్గులు వేయటం, మామిడి ఆకులు, పూవులు కట్టి, సిటీ మొత్తానికి పండుగ వాతావరణం తీసుకు వస్తారు. ఇండ్లలో స్వీట్ లు , ఇతర ప్రత్యేకత వంటకాలు తయారు చేసి తాము తిని, స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి పంచుతారు. పండుగ సందర్భంగా మిత్రుల ఇండ్లకు వెళ్లి కలసి ఆనందిస్తారు.

దీపావళి గ్రాండ్ - 5 ఉత్తరాది రాష్ట్రాలు

దీపావళి గ్రాండ్ - 5 ఉత్తరాది రాష్ట్రాలు

పింక్ సిటీ గా పిలువబడే జైపూర్ లో జరిగే దీపావళి వేడుకలు పేర్కొనకుండా ఉత్తర ఇండియా లోని దీపావళి పండుగ వైభవాలు పూర్తి చేయటం సరి కాదు. దీపావళి రోజున ఈ నగరం అంటా వెలుగులతో నిండి పోతుంది. నగరంలోని ప్రతి ఇల్లు లెక్కలేనన్ని విద్యుత్ బల్బులతో, ప్రమిదల దీపపు కాంతులతో నిండి వుంటుంది.

దీపావళి గ్రాండ్ - 5 ఉత్తరాది రాష్ట్రాలు

దీపావళి గ్రాండ్ - 5 ఉత్తరాది రాష్ట్రాలు

దీపావళి పండుగకు ఇక్కడకు వచ్చే పర్యాటకులకు నగరం అంతా వెలుగులతో నిండి ఆనందభారితంగా వుంటుంది. ప్రతి ఇంటికి రంగులు వేస్తారు. వీరు వెలిగించే మట్టి ప్రమిదలు, టెర్రా కోట దీపాలు వివిధ సైజు లలో వుండి వివిధ ఆకారాలు కలిగి వెలుగులు జిమ్ముతూ ఆసక్తి కరంగా వుంటాయి.

దీపావళి గ్రాండ్ - 5 ఉత్తరాది రాష్ట్రాలు

దీపావళి గ్రాండ్ - 5 ఉత్తరాది రాష్ట్రాలు

ఉత్తర భారత దేశంలో కలకత్తా నగరంలో జరిగే దీపావళి వేడుకలు ఇతర రాష్ట్రాలలోని వాటి కంటే విభిన్నంగా, ప్రత్యేకంగా వుంటాయి. ఇక్కడ ఈ పండుగను కాళి పూజ అని నిర్వహిస్తారు.కాళి మాతను శక్తి వంతమైన దేవతగా పరిగణించి పూజలను అతి వైభవంగా చేస్తారు. దేవాలయాలలో పూజలు, నైవేద్యాలు వీరు అర్ధ రాత్రి సమయంలో నిర్వహిస్తారు.

దీపావళి గ్రాండ్ - 5 ఉత్తరాది రాష్ట్రాలు

దీపావళి గ్రాండ్ - 5 ఉత్తరాది రాష్ట్రాలు

ఈ పండుగకు ఇక్కడి ప్రజలు ఒక రోజు ముందే తమ తమ ఇండ్లను దీపాలతో, మట్టి ప్రమిదలతో, కేండిల్స్ తో వెలుగులు జిమ్మేలా అలంకరిస్తారు. ప్రతి ఇల్లు రంగు రంగుల కాంతులతో నిండి వుంటుంది. ఇండ్ల అలంకరణలలో పూవులను, మామిడి తోరణాలను విరివిగా ఉపయోగిస్తారు.ప్రతి ఇంటిలోనూ కుటుంబ సభ్యులు నూతన దుస్తులు ధరిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X