Search
  • Follow NativePlanet
Share
» »పూణె వెళితే ఆ సమయంలో ఇక్కడకు మాత్రం వెళ్లకండి

పూణె వెళితే ఆ సమయంలో ఇక్కడకు మాత్రం వెళ్లకండి

పూనేలో దెయ్యాలు ఉన్న ప్రాంతాలకు సంబంధించిన కథనం.

By Kishore

భారత దేశంలో ప్రముఖ నగరాల్లో పూణే కూడా ఒకటి. ఇది చారిత్రాత్మకంగా ఎంతో ప్రాముఖ్యం చెందినది. అంతేకాకుండా ఇక్కడ చూడదగిన పర్యాటక ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయి. దీంతో చాలా మంది తమ పర్యాటకంలో పూణేకు కూడా వెళ్లి వస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న కోటలు ప్రపంచ ప్రఖ్యాతి చెందినవి. మరాఠాల యుద్ధనిరతికి, ముందు చూపుతో పాటు శాస్త్ర సాంకేతికతకు ఈ కోటలు ప్రతిబింబాలు. అయితే వీటిలో కొన్ని ఇప్పుడు దెయ్యాల దిబ్బలుగా మారాయని చెబుతుంటారు. కేవలం కోటలే కాకుండా పూణే నగరంలో మరికొన్ని ప్రాంతాలు కూడా రాత్రి సమయాల్లో దెయ్యాలు తిరుగుతుంటాయని స్థానికులు కథలు కథలుగా చెబుతుంటారు. సో ఫ్రెండ్స్ దెయ్యాల పై నమ్మకం ఉన్నవారు రాత్రి సమయంలో పూణేలో అటు వైపు వెళ్లకండి.

విగ్రహం ఉండదు...అయినా కళ్లు మూసుకొనే నమస్కారం చెయ్యాలి లేదంటేవిగ్రహం ఉండదు...అయినా కళ్లు మూసుకొనే నమస్కారం చెయ్యాలి లేదంటే

1. శనివార వాడ

1. శనివార వాడ

P.C: YouTube

పూణేలో శనివారవాడ ప్రముఖ పర్యాటక కేంద్రం. ప్రతి రోజూ ఉదయం సమయంలో ఇక్కడకు వేలాది మంది పర్యాటకులు వస్తారు. మారాఠా నిర్మించిన ఈ కోట ప్రస్తుతం దెయ్యాలు, పిశాచాలకు నిలయంగా మారిందని స్థానికులు నమ్ముతున్నారు. ఇప్పటికీ రాత్రి సమయంలో బాజీరావ్ కుమారుడైన నారాయణ రావ్ ఆక్రందనలు ఇక్కడ వినిపిస్తుంటాయని చెబుతారు. కాకా మలా బచావ్ ధ్వనులతో ఆ ప్రాంతం రాత్రి సమయాల్లో దద్దరిల్లిపోతుంది. అందువల్ల రాత్రి సమయంలో ఇక్కడ ఉండటానికి ఎవరూ సాహసించరు.

2. విక్టరీ చిత్రమందిరం

2. విక్టరీ చిత్రమందిరం

P.C: YouTube

ఉదయం సమయంలో వేలాది మంది వీక్షులతో కిటకిటలాడే ఈ చిత్రమందిరం రాత్రి సమయంలో మాత్రం ఒంటరిదైపోతుంది. ఈ సినిమా హాల్ లోని సీట్ల నుంచి రాత్రి సమయంలో విచిత్రమైన శబ్దాలు రావడమే ఇందుకు ప్రధాన కారణం. ఆ శబ్దాలు చాలా భయంకరంగా ఉంటాయని స్థానికులు చెబుతారు.

3. చందన నగర

3. చందన నగర

P.C: YouTube

పుణేలో దెయ్యాలు తిరిగే మరొక ప్రాంతం చందన నగర. చాలా కాలం క్రితం ఇక్కడ ఒక భవన నిర్మాణం సమయంలో ప్రమాద వశాత్తు ఇక చిన్న పిల్ల చనిపోయిందని స్థానికులు చెబుతుంటారు. ఇప్పటికీ ఆ పాప రాత్రి సమయంలో తెల్లటి ప్రాక్ ను ధరించి చేతిలో చిన్న బొమ్మను పట్టుకొని రాత్రి పూట ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉంటుందని చెబుతారు. అయితే ఇప్పటి వరకూ ఆ చిన్న పాప వల్ల ఎటువంటి అపాయం జరగక పోవడం గమనార్హం.

4. ఖడ్కీ యుద్ధ స్మారకం

4. ఖడ్కీ యుద్ధ స్మారకం

P.C: YouTube

మరాఠాలు, బ్రిటీష్ మధ్య ఖడ్కీ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వారి గౌరవార్థం ఖడ్కి అనే చోట యుద్ధ స్మారకాన్ని నిర్మించారు. ఆ యుద్ధంలో చనిపోయిర వారి ఆత్మలు ఇక్కడే ఉన్నాయని చెబుతారు. రాత్రి సమయంలో వారి అక్రందనలు అక్కడ ఉన్నవారు చాలా సార్లు విన్నట్లు చెబుతుంటారు.

5. సింహఘడ్ కోట

5. సింహఘడ్ కోట

P.C: YouTube

పూణే నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సింహఘడ్ ప్రముఖ పర్యాటక కేంద్రం. ఉదయం పూట చాలా మంది సందర్శిస్తూ ఉంటారు. అయితే రాత్రి సమయంలో మాత్రం ఇక్కడికి వెళ్లడానికి చాలా మంది సందేహిస్తూ ఉంటారు. రాత్రి సమయంలో సైనికులు యుద్ధం చేసే సమయంలో కత్తి వెలువడే కత్తి శబ్దాలు ఇప్పటికీ ఇక్కడ వినిపిస్తూ ఉంటాయని స్థానికులు చెబుతుంటారు. అదే విధంగా కొద్ది సంవత్సరాల క్రితం ఇక్కడ జరిగిన ప్రమాదంలో ఇద్దరు చిన్నపిల్లలు చనిపోయారు. వారు అప్పుడప్పుడు స్థానికులకు కనిపిస్తుంటారని కథనం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X