Search
  • Follow NativePlanet
Share
» »మనాలిలోని ఈ పవిత్రమైన పర్యాటక ప్రాంతాలన్నింటినీ చూశారా?

మనాలిలోని ఈ పవిత్రమైన పర్యాటక ప్రాంతాలన్నింటినీ చూశారా?

మనాలిలో ఉన్న దేవాలయాల గురించి కథనం.

భారత దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో మనాలి మొదటి వరుసలో ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. బియాస్ నది ఒడ్డున ఉన్న పర్యాటక కేంద్రం సోలాంగ్, గులాబ్ తదితర ప్రాంతాల్లో జరిగే వివిధ అడ్వెంచర్ టూర్స్ కు ప్రవేశద్వారమని పేరు. మనాలిలో ఎన్నో ప్రాంతాలు నిత్యం పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటాయి. అయితే మొదటిసారిగా మనాలి వెళ్లేవారు కొన్ని ప్రాంతాలను తప్పక సందర్శించాల్సి ఉంటుంది. అటువంటి ముఖ్యమైన ప్రాంతాల సమహారం మీ కోసం ఈ కథనంలో అందిస్తున్నాం. ఈ స్థలాలను చేరుకోవడం ప్రధాన పట్టణ ప్రాంతం నుండి ఒక గంట సమయం కూడ పట్టదు.

హిడంబా దేవాలయం

హిడంబా దేవాలయం

P.C: You Tube

సమయం....వారంలో అన్ని రోజులూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ

పంచపాండవుల్లో ఒకడైన భీముడి భార్య పేరు హిడంబ. మనాలిలో చూడదగిన పర్యాటక స్థలాల్లో హిడంబా దేవాలయం మొదటి వరుసలో ఉంటుంది. ఈ దేవాలయ నిర్మాణం పగోడ ఆకారంలో ఉండి చూడటానికి ముచ్చటగొలుపుతుంది. ఇక్కడి హిడంబి విగ్రహం కంచుతో చేయబడి ఉంటుంది.

మ్యూజియం

మ్యూజియం

P.C: You Tube

సమయం....వారంలో అన్ని రోజులూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ ప్రవేశ రుసుం... పెద్దలకు ఒక్కొక్కరికి రూ.10

ఈ మ్యూజియం హిడంబ దేవాలయానికి కూత వేటు దూరంలోనే ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ సంస్క`తి సంప్రదాయాలకు అద్దం పట్టే ఎన్నో వస్తువులు ఈ మ్యూజియంలో భద్రపరిచారు. ముఖ్యంగా అప్పటి కాలంలో స్థానిక రాజులు వినియోగించిన ఆభరణాలు, ఆయుధాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఉన్న కొన్ని వస్తువులను ఇప్పటికీ స్థానికులు పూజిస్తుంటారు.

మను దేవాలయం

మను దేవాలయం


P.C: You Tube
సమయం... ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ

హిందు పురాణాల ప్రకారం ఈ భూమండలం పైకి వచ్చిన మొదటి మానవుడే మనువు. ఈయన ప్రస్తావన అనేక పురాణాల్లో ఉంది. ఈయనకు కేవలం మనాలీలో మత్రమే దేవాలయం ఉంది. ఇక్కడ ధ్యానం చేయడానికి స్వదేశీయులతో పాటు విదేశీయులు కూడా ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. మాల్ రోడ్డు నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఈ ఆలయానికి నడుచుకొంటూ వెళితే చుట్టు పక్కల ఉన్న ప్రక`తి అందాలను చూడవచ్చు.

వశిష్ట వేడినీటి బుగ్గ

వశిష్ట వేడినీటి బుగ్గ

P.C: You Tube

సమయం... ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ అటు పై మధ్యాహ్నం 2 గంటల నుంచి 10 గంటల వరకూ

మనాలి పట్టణానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఈ వశిష్ట వేడినీటి బుగ్గ ఉంది. భారతీయ పురాణాల్లో తరుచుగా వినిపించే వశిష్టమహర్షి ఆలయం ఈ వేడినీటి బుక్క పక్కనే ఉంటుంది. ఈ ఆలయం పిరమిడ్ ఆకారంలో ఉండటం గమనార్హం. ఇక ఈ వేడినీటి బుగ్లోని నీటికి వివిధ రకాల వ్యాధులను నయం చేసే శక్తి ఉందని నమ్ముతారు. అందువల్లే మనాలి వెళ్లిన వారు తప్పక ఈ వేడినీటి బుగ్గలో మునక వేయకుండా బయటికి రారు.

శర్వాణి దేవి దేవాలయం

శర్వాణి దేవి దేవాలయం

P.C: You Tube

సమయం.... ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ అటు పై సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ

దుర్గాదేవి ప్రతి రూపంగా శర్వాణిని భావిస్తారు. కులు రాజుల కులదైవం కూడా శర్వాణి దేవి. ఆలయం చిన్నదైనా చూడముచ్చటగా ఉంటుంది. మనాలి శివారులోని శమినాల్హా గ్రామంలో ఉన్న ఈ దేవాలయానికి చేరుకోవడానికి నడక ఉత్తమం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X