Search
  • Follow NativePlanet
Share
» »కేరళలో అత్యంత రొమాంటిక్ హనీమూన్ ప్రాంతాలను చూశారా?

కేరళలో అత్యంత రొమాంటిక్ హనీమూన్ ప్రాంతాలను చూశారా?

కేరళలో అత్యంత అందమైన హనీమూన్ ప్రాంతాలకు సంబంధించిన కథనం

పెళ్లైన కొత్తలో ఇద్దరి మనస్సులు, శరీరం ఏకం కావడానికి జరుపే పర్యాటక ప్రాంతాన్నే హనీమూన్ అని సింపుల్ గా చెప్పవచ్చు. కొత్త వాతావరణంలో సరికొత్త ఆలోచనలతో జీవితాన్ని ప్రారంభించాలనుకునేవారు తప్పకుండా హనీమూన్ కు వెళుతారు. అటువంటి వారి మొదటి ఛాయిస్ ప్రకతి అందాలకు నెలవైన కేరళ అని చెప్పడం అతిశయోక్తి కాదు.

ఇక్కడ ఎతైన పర్వత శిఖరాలు నిత్యం పచ్చగా ఉండే మైదాలను మనమనస్సులను ఉత్తేజం వైపు నడిపిస్తాయనడంలో సందేహం లేదు. అందుకే చాలా మంది ఈ హనీమూన్ కోసం కేరళనే ఎంపిక చేసుకుంటారు. అటు వంటి కేరళలో హనీమూన్ కోసం ప్రఖ్యాతి గాంచిన ఐదు పర్యాటక స్థలాల గురించి క్లుప్తమైన వివరాలు మీ కోసం...

మున్నార్

మున్నార్

P.C: You Tube

కేరళలో హనీమూన్ ప్రాంతాలన్న తక్షణ మన మనసులో మెదిలేది మున్నార్. తెల్లటి పొగమంచుల మధ్య తోయాకు తోటల్లో నెచ్చెలి నడుమును పట్టుకొని నడుస్తూ ఉంటే సమయం ఇట్టే గడిచిపోతుంది. ఇక్కడ ఉన్న జలపాతాలు, అభయారణ్యాలు మరికొన్ని ప్రధాన ఆకర్షణలు. ఎత్తైన పర్వత శిఖరాల పై సైక్లింగ్ కూడా చేసుకొని వెళ్లవచ్చు. తమ హనీమూన్ ను ప్రత్యేకంగా గడపాలనుకొనేవారికి ఈ ప్రాంతం ఖచ్చితంగా నచ్చి తీరుతుంది.

ఛాంమ్రాశిఖరం

ఛాంమ్రాశిఖరం

P.C: You Tube

కేరళలోని వాయినాడ్ జిల్లాలో అత్యంత ఎత్తైన శిఖరం ఛాంమ్రా. ఏడాదిలో ఏ సమయంలోనైనా ఇక్కడ పచ్చని చెట్లు హనిమూన్ జంటలను రారమ్మని ఆహ్వానిస్తూ ఉంటాయి. ఈ శిఖరం పై భాగంలో ఉన్న హ`దయపు ఆకారపు సరస్సు కూడా ఒక ఆకర్షణీయ పర్యాటక స్థలమే. ఈ సరస్సులో కూడా ఏడాదిలో ఏ రోజైనా నీళ్లు ఉంటాయి. ఇక చలికాలంలో అయితే మంచుతో గడ్డకట్టుకుపోయి కొత్త అందాలతో కనువిందును చేస్తుంది.

కుమారకోం

కుమారకోం

P.C: You Tube

కేరళలో బ్యాక్ వాటర్ టూరిజానికి అలెప్పి ఎంత ప్రాచూర్యం పొందిందో కుమరకోం కూడా అంతే ప్రాచూర్యం పొందింది. ఇక్కడ బోట్ హౌస్ ప్రయాణం హనీమూన్ జంటల కోసం ప్రత్యేకంగా తయారుచేసి ఉంటారు. ఆగస్టు నుంచి ఫిబ్రవరి వారకూ ఇక్కడ ఉన్న వాతావరణం రారమ్మని కొత్తగా పెళ్లైన జంటలను ఆహ్వానిస్తూ ఉంటుంది.

అత్తిరపిళ్లై

అత్తిరపిళ్లై

P.C: You Tube

కేరళలో అంతగా ప్రాచూర్యంలోకి రాని హనీమూన్ హాట్ స్పాట్ అత్తిరపిళ్లై. ఇక్కడ చాలా తక్కువ మంది పర్యాటకులు కనిపిస్తారు. హనీమూన్ జంటలకు ఇటువంటి ప్రాంతాలే కాదా కావాల్సింది. ఇక్కడ ట్రీ హౌస్ ప్రత్యేకం. ట్రీ హౌస్ లో నెచ్చెలితో ఉంటూ దగ్గరగా ఉన్న సముద్ర కెరటాలను చూడటం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

కుండల

కుండల

P.C: You Tube

కేరళలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మున్నార్ నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మాత్రమే కుండల ఉంది. ఇక్కడ ఉన్నటు వంటి డ్యాంలో బోటింగ్ మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందనడంలో సందేహం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X