Search
  • Follow NativePlanet
Share
» »ఒంటరి ప్రయాణమా? ఒక్కసారి ఈ ప్రాంతాల్లో పర్యటిస్తే....

ఒంటరి ప్రయాణమా? ఒక్కసారి ఈ ప్రాంతాల్లో పర్యటిస్తే....

ఒంటరి ప్రయాణానికి అనువైన ప్రాంతాలకు సంబంధించిన కథనం

ఒంటరి ప్రయాణం కొందరికి మనసుకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఒకరకంగా వీరికి ఆ రెండే తోడు. అయితే అటువంటి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచే పర్యాటక ప్రాంతాలు కొంత అరుదుగానే దొరుకుతాయి. ముఖ్యంగా ప్రకతిలో మమేకం కావాలనుకొనేవారే ఇటువంటి ఒంటరి ప్రయాణాలకు సిద్ధమవుతూ ఉంటారు. మొదట్లో ఈ సోలో ట్రావెలింగ్ విదేశాల్లో మాత్రమే ఉండేది.

అయితే ఆ విదేశీయులు ఒంటరిగా భారత దేశం వచ్చి ఎంచక్కా తమకు కావాల్సిన ప్రదేశాలను తక్కువ ఖర్చుతో చూసి ఎన్నో ఆనందాలను మూట గట్టుకొని తిరిగి తమ దేశాలకు వెలుతున్నారు.

ఇప్పుడు భారత దేవంలోని యువత కూడా ఇదే విధానాన్ని ఫాలో అవుతున్నారు. ఈ నేపథ్యంలో భారత దేశంలో సోలో టూరిస్టులకు అనువైన పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన వివరాలు క్లుప్తంగా మీ కోసం. ఇందులో లడక్, పాండిచ్చేరి, కులుమనాలి, కేరళ, ఉదయ్ పూర్ లు ఉన్నాయి.

లడక్

లడక్

P.C: You Tube

ఒంటరిగా ప్రయాణం చేయాలనుకొనేవారు భారత దేశంలో మొదట ఎంచుకునే ప్రాంతం లడక్ అంటే ఆతిశయోక్తి కాదు. ఇక్కడ గుంపులు గుంపులుగా కంటే ఒంటరిగానే ఈ ప్రాంతంలో ప్రక`తి అందాలను బాగా ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా లాంగ్ బైక్ రైడ్ ను ఇష్టపడే వారు సముద్ర మట్టానికి దాదాపు 3,000 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ లడక్ కు మొదట తమ ఓటును వేస్తారు. లడక్ లో చాలా మంది క్యాబ్ లు, బస్సులు బుక్ చేసుకునే బదులు అక్కడి లోకల్ గా లభించే బైక్ లనే అద్దెకు తీసుకుంటారు. ఒంటరి ప్రయాణాకులను చాలా సురక్షితమైన ప్రదేశం కూడా.

పాండిచ్చేరి

పాండిచ్చేరి

P.C: You Tube

పాండిచ్చేరి చుట్టి రావడానికి మనకు ఇక్కడ అద్దె సైకిళ్లు దొరుకుతాయి. ముఖ్యంగా ఇక్కడి ఎం.జీ రోడ్డు, మిషన్ స్ట్రీట్ లో దొరికే అత్యాధునిక సైకుళ్ల ప్రయాణం మనకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాస మిగల్చదు. అందువల్లే సోలో గా ప్రయాణాలను ఇష్టపడే వారి జాబితాలో పాండిచ్చేరి తప్పక ఉంటుంది.

 ఉదయ్ పూర్

ఉదయ్ పూర్

P.C: You Tube

భారత దేశంలోని పర్యాటక ప్రాంతాలను చూడాలని వచ్చేవారిలో అధిక శాతం ఒంటరి వారే. అందుకే వారు ప్రయాణ సదుపాయాలతోపాటు సురక్షితమైన ప్రదేశాలను ముందుగా ఎంపిక చేసుకొంటారు. ఆ జాబితాల్లో ఉదయ్ పూర్ తప్పక ఉంటుంది. ఇక్కడి కోటలు, దేవాలయాలు, సరస్సు వంటి ఎన్నో పర్యాటక ప్రాంతాలు పర్యాటకుల మదిని దోస్తూ ఉంటాయి. ఇక్కడి ఒంటె పై ప్రయాణం జీవితంలో కొత్త అనుభూతిని మిగులుస్తుంది.

కులు-మనాలి

కులు-మనాలి

P.C: You Tube

భారత దేశంలోని భూతల స్వర్గంగా పేర్కొనే కులు మనాలిని చాలా మంది హనిమూన్ హాట్ స్పాట్ గా పేర్కొంటారు. అయితే సోలో ట్రావెలర్స్ కూడా ఇది సరికొత్త అనుభూతిని మిగులుస్తుంది. ఎతైన హిమాలయాలు, వాటి మధ్య ప్రవహించే బియాస్ నది జలాల అందాలు మనకు కనివిందును కలిగిస్తాయనడంలో అతిశయోక్తి లుండదు.

కేరళ

కేరళ

P.C: You Tube

పర్యాటకాన్ని ఇష్టపడేవారు జీవితంలో ఒక్కసారైన కేరళలో పర్యటించాలని భావిస్తూ ఉంటారు. ప్రక`తి అందాలతో పాటు ప్రశాంత వాతావరణానికి పేరెన్నికగన్న ఈ రాష్ట్రం ఒంటరి ప్రయాణికులకు ఎంతో అనువైనది. ఇక్కడి బీచ్ లు బ్యాక్ వాటర్ జలాశయాలు, టీ తోటలు మనలను ఇట్టే కట్టిపడేస్తాయి. ఒంటరి ప్రయాణికులకు సురక్షితమైనది కూడా.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X