Search
  • Follow NativePlanet
Share
» »ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేశారా?

ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేశారా?

ఆంధ్రప్రదేశ్ లో ట్రెక్కింగ్ కు అనుకూలమైన ప్రాంతాలకు సంబంధించిన కథనం.

ఆంధ్రప్రదేశ్ లో ట్రెక్కింగ్ ఇప్పుడిప్పుడే ప్రాచూర్యంలో వస్తోంది. ముఖ్యంగా యువత ఈ సాహస క్రీడ పై మక్కువ పెంచుకొంటూ ఉన్నారు. అదే విధంగా కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు కూడా వారాంతాల్లో ట్రెక్కింగ్ వెళ్లడానికి ఉవ్వళ్లూరుతున్నరు. ఇందుకోసం వివిధ ప్రాంతలను ఎంపిక చేసుకొంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ట్రెక్కింగ్ కు అనుకూలమైన ప్రాంతాలకు సంబంధించిన వివరాలు ఈ కథనంలో మీ కోసం వివరిస్తున్నాం. ఇందులో నాగలాపురం, గండికోట, శ్రీశైలం, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, అహోబిలం ఉన్నాయి. ఇదిలా ఉండగా ట్రెక్కింగ్ ఒంటరిగా కాకుండా గుంపుగా వెళ్లాల్సిన అవసరం ఉంది. అంతే కాకుండా నిపుణుడైన గైడ్ తప్పక అవసరం. స్థానిక పోలీసు, అటవీ అధికారులకు ముందుగా సమాచారం ఇవ్వడం ఉత్తమం.

అహోబిలం

అహోబిలం

P.C: You Tube

ఆంధ్రప్రదేశ్ లోని నల్లమలా అడవుల్లో అహోబిలం ఉంది. ఇది ప్రముఖ ధార్మిక ప్రాంతం కూడా. కర్నూలు జిల్లాలో భాగమైన ఈ అహోబిలం బెంగళూరు నుంచి 407 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 350 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దట్టమైన అడవిలో ఎతైన చెట్లు, గతుకుల రోడ్ల పై నడుచుకొంటూ చుట్టూ ఉన్న ప్రక`తి అందాలను చూస్తూ నడుచుకొంటూ పోతే ఇట్టే సమయం గడిచిపోతుంది. ట్రెక్కింగ్ దారిలో మీకు చిన్న చిన్న గుహలు, జలపాతాలు పలకరిస్తాయి.

శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్

శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్

P.C: You Tube

ఆంధ్రప్రదేశ్ లోని కడప, చిత్తూరు జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ వంటి సాహస క్రీడలను ఇష్టపడేవారికి స్వర్గధామం. తిరుమల నుంచి 15 కిలోమీటర్ల దూరంలోనే ఈ నేషనల్ పార్క్ ఉంటుంది. ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికి చాలా ఓపిక కావాలి. దాదాపు అర రోజులో ముగిసే ట్రెక్కింగ్ ఒక్కొక్కసారి మూడు రోజుల వరకూ పడుతుంది. ఇందుకు అనుగుణంగా మీరు ప్రణాళికలు రచించుకోవాల్సి ఉంటుంది. ట్రెక్కింగ్ మార్గంలో గుండలకోన, తదితర ఎన్నో జలపాతాలు ఎదురవుతాయి.

నాగలాపురం

నాగలాపురం

P.C: You Tube

బెంగళూరు నుంచి 288 కిలోమీటర్లు, చెన్నై నుంచి 87 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నాగలాపురం ట్రెక్కింగ్ లవర్స్ కు స్వర్గధామం అని చెప్పవచ్చు. తిరుపతి నుంచి ఈ నాగలాపురం చాలా దగ్గర. ఇక్కడకు ఎక్కువగా చెన్నై యువత ట్రెక్కింగ్ కోసం వస్తుంటారు. నాగలాపురం ట్రెక్కింగ్ మార్గంలో ఎదురయ్యే కొలనులు, జలపాతాలు అప్పటి వరకూ మన కష్టాన్ని మైమరిపింపజేస్తాయనడం అతిశయోక్తి కాదు.

శ్రీశైలం

శ్రీశైలం

P.C: You Tube

శ్రీశైలానికి దగ్గరగా ఉన్న కడలివనం గుహలయాల వద్దకు దాదాపు 12 కిలోమీటర్ల మేర ట్రెకింగ్ మార్గం ఉంది. కడలివనం పులుల అభయారణ్యం కూడా. అందువల్ల గైడ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. మార్గమధ్యలో మీకు అనేక జంతువులు కూడా తారసపడుతాయి. క`ష్ణానది ఒడ్డున ఉన్న కడలివనం ట్రెక్కింగ్ తో పాటు బోటు ప్రయాణం కూడా మీకు అందుబాటులో ఉంటుంది.

గండికోట

గండికోట

P.C: You Tube

పెన్నానది ఒడ్డున ఉన్న గండికోట ట్రెక్ ఒక విభిన్నమైన అనుభూతిని మిగులుస్తుంది. పచ్చటి అడవితో పాటు ఎర్రని కొండ, గుట్టల వెంబడి కూడా ఈ ట్రెక్ సాగుతుంది. గండికోట చారిత్రాత్మక ప్రదేశం కూడా. హైదరాబాద్ నుంచి 350 కిలోమీటర్ల దూరంలో గంటికోట ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X