Search
  • Follow NativePlanet
Share
» »డార్జిలింగ్ లో ఈ అందాలను చూడటం మరిచిపోకండి

డార్జిలింగ్ లో ఈ అందాలను చూడటం మరిచిపోకండి

డార్జిలింగ్ లో చూడదగిన పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన కథనం.

డార్జిలింగ్, హనీమూన్ ఈ రెండింటికీ విడదీయలేని బంధం ఉంది. పశ్చిమ బెంగాల్ లోని ఈ డార్జిలింగ్ నే భారత దేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన నూతన దంపతులైనా తమ హనిమూన్ డెస్టినేషన్ కోసం ఎంపిక చేసుకొంటారు. అక్కడ అందుకు తగ్గ వాతావరణం ఉండటమే కారణం. నిర్మలమైన మేఘాలు, చుట్టూ పచ్చదనం, కనుచూపుమేర తెల్లటి మంచు పర్వత శిఖరాలు ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల పరిస్థితులు కొత్త దంపతులను డార్జిలింగ్ వైపు తీసుకెలుతాయి. ఒక్క కొత్త దంపతులకే కాకుండా సాహసక్రీడలను ఇష్టపడేవారికి, ప్రకృతి ఆరాధకులకు కూడా డార్జిలింగ్ రారమ్మని ఆహ్వానం పలుకుతోంది. ఈ నేపథ్యంలో డార్జిలింగ్ లో చూడదగిన పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన కథనం మీ కోసం..

హిమాలయన్ మౌంటనీరింగ్ ఇన్ స్టిట్యూట్ అండ్ డార్జిలింగ్ జూ

హిమాలయన్ మౌంటనీరింగ్ ఇన్ స్టిట్యూట్ అండ్ డార్జిలింగ్ జూ

P.C: You Tube

మొదటిసారిగా హిమాలయాల్లోని ఎవరెస్ట్ శిఖారాన్ని అధిరోహించిన తెంగ్సింగ్ నార్కే, ఎడ్మండ్ హిల్లరీల సంస్మరణార్థం ఈ ఇన్ స్టిట్యూట్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడ మౌంటనీరింగ్, రాక్ క్లైంబింగ్ వంటి సాహసయాత్రలు చేసే సమయంలో వినియోగించే వస్తువులకు సంబంధించిన మ్యూజియం ఉంది. ఈ ఇన్ స్టిట్యూట్ ప్రాంగణంలోనే ఉన్న జూలో అంతరించే స్థితికి చేరుకొన్న అత్యంత అరుదైన మంచుచిరుత, రెడ్ పాండ, గోరల్ గా పిలిచే పర్వతపు మేక, సైబేరియన్ టైగర్, టిబేటియన్ నక్క తదితర జంతువులనెన్నింటినో చూడవచ్చు.

టైగర్ హిల్స్

టైగర్ హిల్స్

P.C: You Tube

డార్జిలింగ్ లో చూడదగిన పర్యాటక కేంద్రాల్లో టైగర్ హిల్స్ మొదటి స్థానంలో ఉంటాయి. సముద్ర మట్టానికి దాదాపు 2,590 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ టైగర్ హిల్స్ చేరుకొంటే దూదెపింజెల్లాంటి మేఘాల్లో తేలిపోతున్న అనుభూతి కలుగుతుంది. పర్యావరణ ప్రేమికులు ఎక్కువగా ట్రెక్కింగ్ ద్వారా ఇక్కడికి చేరుకొంటారు. ఇక్కడి నుంచి దూరంగా కనిపించే కాంచన్ జంగా శిఖరం వద్ద సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూడటం చాలా అద్భుతంగా ఉంటుంది. డార్జిలింగ్ నగరం నుంచి 40 నుంచి 45 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్న ఈ టైగర్ హిల్స్ ప్రాంతానికి చేరుకోవడానికి నిత్యం ప్రభుత్వ, ప్రైవేటు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి.

రాక్ గార్డెన్

రాక్ గార్డెన్

P.C: You Tube

ఇక్కడ పెద్ద బడ్డరాళ్లు వాతావరణం వలో జరిగిన మార్పుల వల్ల వివిధ ఆకారాలకు మారి చూపరులను అకట్టుకొంటున్నాయి. ఇందులో కొన్ని జంతువులను పోలి ఉంటే మరికొన్ని దేవతలను పోలి ఉంటాయి. ఇక ఇదే ఆవరణంలో ఉన్న మయా పార్క్ లో వివిధ రకాల ఔషద గుణాలున్న మొక్కలను చూడవచ్చు. అదే విధంగా విభిన్న రూపాల్లో ఉన్న పుష్పాలు కూడా ఈ ఉద్యానవనంలో పర్యాటకులను ఆకర్షిస్తాయి.

డార్జిలింగ్ రోప్ వే

డార్జిలింగ్ రోప్ వే

P.C: You Tube

డార్జిలింగ్ లో ఉన్న ప్రక`తి అందాలన్నింటినీ ఒకేసారి చూడాలనుకునేవారికి ఈ డార్జిలింగ్ రోప్ వే చక్కటి వేదిక. దీనిని రంగీత్ వ్యాలీ ప్యాసింజర్ కేబుల్ కార్ సర్వీస్ అని కూడా అంటారు. భూమికి అంతెత్తులో ప్రయాణం చేస్తూ కింద ఉన్న టీ తోటలను చూడటం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. అదేవిధంగా నదీ లోయలు, తెల్లటి దూదె పింజల్లాంటి మేఘాలతో కూడిన హిమాలయ పర్వత శ్రేణులు కూడా ఈ రోప్ వే మార్గంలో కనువిందును చేస్తాయి.

సెంచాల్ అభయారణ్యం, సరస్సు

సెంచాల్ అభయారణ్యం, సరస్సు

P.C: You Tube

భారత దేశంలోని అత్యంత ప్రాచీన అభయారణ్యాల్లో సెంచాల్ అభయారణ్యం కూడా ఒకటి. దీనిని 1915లో ఏర్పాటు చేశారు. డార్జిలింగ్ పట్టణం నుంచి కేవలం 11 కిలోమీటర్ల దూరంలో ఈ పర్యాటక కేంద్రం ఉంది. ఈ సెంచాల్ అభయారణ్యంలో అత్యంత అరుదైన జంతువులు, చెట్లను చూడవచ్చు. ముఖ్యంగా హిమాలయన్ ఎగిరే ఉడత, హిమాలయన్ ఎలుగుబంటి వంటివి ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఫొటోగ్రఫీని ఎక్కువగా ఇష్టపడే వారు ఇక్కడికి వెలుతుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X