Search
  • Follow NativePlanet
Share
» »మంచు కొండల రాష్ట్రంలో పుణ్యం మూటగట్టుకోవాలంటే ఇక్కడకు వెళ్లండి

మంచు కొండల రాష్ట్రంలో పుణ్యం మూటగట్టుకోవాలంటే ఇక్కడకు వెళ్లండి

హిమాలయాల్లో దేవతలు నివశిస్తుంటారని భారతీయులు ముఖ్యంగా హిందువులు ఇప్పటికీ నమ్ముతుంటారు. ముఖ్యంగా శివుడు ఈ పర్వత ప్రాంతాల్లో కొలువై ఉన్నాడని చెబుతారు. అందువల్లే ఇక్కడ శైవ దేవాలయాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రస్తుతం ఈ జమ్ముకాశ్మీర్ బాంబుల తీవ్ర వాదులకు అడ్డాగా మారిపోయింది.

ఎప్పుడు ఏ వైపు నుంచి బాంబులు దూసుకువచ్చి మన పై పడుతాయో అని భయమేస్తూ ఉంది. ముఖ్యంగా దేవాలయాలను, మసీదులను సందర్శించే భక్తులనే లక్ష్యంగా చేసుకొని ఉగ్రమూకలు రెచ్చిపోతున్నారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం అమాయకులను బలి తీసుకొంటున్నారు.

అయితే ఇంతటి స్థితిలోనూ స్థానిక ప్రభుత్వం పర్యాటకానికి పెద్ద పీఠ వేస్తోంది. తమ రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాల సందర్శనకు వచ్చే భక్తుల రక్షణ కోసం ఎన్నో ఎన్నో జాగ్రత్తలు తీసుకొంటోంది. దీంతో ఇక్కడి పుణ్యక్షేత్రాలను సందర్శించే భక్తుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో జమ్మకాశ్మీర్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల గురించి క్లుప్తంగా ఈ కథనంలో మీ కోసం

రఘునాథ దేవాలయం

రఘునాథ దేవాలయం

P.C: You Tube

దీనిని ఒక దేవాలయం అన్నడం కంటే దేవాలయాల సమూహం అని అనవచ్చ. ముఖ్యంగా ఈ దేవాలయ సమూహంలో ఏడు గర్భగుడులు ఏడు గోపురాలు ఉంటాయి. ఒక్కొక్క గర్భగుడిలో ఒక్కొక్క దేవుడు కొలువై ఉంటాడు. ఈ ఏడు మంది దేవతలే కాకుండా ఇంకా అనేక మంది దేవుళ్లకు ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ అన్నింటి కంటే ముఖ్యమైన దైవం శ్రీరాముడు. ఈ దేవాలయం గోడలను బంగారంతో తాపడం చేయించారు.

అన్నింటికంటే ముఖ్యంగా హిందువులు పరమ పవిత్రంగా భావించే సాలగ్రామలు ఇక్కడ లక్షల సంఖ్యలో ఉంటాయి. ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో ఇక్కడకు భక్తులు వస్తూ ఉంటారు. ఈ దేవాలయాన్ని జమ్ము కాశ్మీర్ సామ్రాజ్య నిర్మాత గులాబ్ సింగ్ నిర్మించినట్లు చారిత్రాత్మక ఆధారాలను అనుసరించి తెలుస్తోంది.

ఆది శంకరాచార్య దేవాలయం

ఆది శంకరాచార్య దేవాలయం

P.C: You Tube

శైవ ధర్మాన్ని దేశం నలు దిశలా వ్యాపింపజేస్తూ ఆది శంకరాచార్యులు కాశ్మీరు వచ్చినప్పుడు ప్రస్తుతం ఆలయం ఉన్న చోటే ఎక్కువ కాలం గడిపినట్లు చెబుతారు. ఈ దేవాలయం ఒక శివాలం కూడా. కాశ్మీర్ లోని జబర్వాన్ పర్శత శిఖరం పై భాగంలో సముద్ర మట్టానికి దాదాపు 1100 అడుగుల ఎత్తులో ఈ దేవాలయం ఉంటుంది.

ఈ దేవాలయం పురాణ ప్రాధాన్యత కలిగినదే కాకుండా ఈ దేవాలయ నిర్మాణ కౌశలం మనలను అబ్బురపరుస్తుంది. అష్టభుజి ఆకారంలోని వేదిక పై ఈ దేవాలయాన్ని క్రీస్తు పూర్వం 371 ఏడాదిలోనే నిర్మించారని చెబుతారు. ప్రస్తుతం అత్యాధునిక ఇంజనీరింగ్ పరిజ్జానం గా చెప్పబడే ఈ టెక్నాలజీని ఆ కాలంలోనే ఎలా వినియోగించారన్న విషయం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక ఈ దేవాలయం చేరుకోవడానికి దాదాపు 100 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.

జామియా మసీదు

జామియా మసీదు

P.C: You Tube

భారత దేశంలో అత్యంత పవిత్రమైన మసీదుల్లో శ్రీనగర్ లోని జామియా మాసీదు ముందు వరుసలో ఉంటుంది. విశాలమైన ప్రాంగణం కల ఈ మసీదులో ఒకేసారి లక్షమంది ముస్లీం సోదరులు ప్రార్థనలు చేయడానికి అవకాశం ఉంటుంది.

ఈ మసీదు నిర్మాణ కౌశలాన్ని మెచ్చుకోకుండా ఉండలేము. క్రీస్తు శకం 1400 ఏడాదిలో నిర్మించిన ఈ కట్టడం భారత దేశంలోని పర్యాటక స్థలాల్లో ఒకటిగా పేరు సంపాదించుకొంది. ముఖ్యంగా ముస్లీ మతంలో అత్యంత పవిత్రమైన రోజుగా భావించే శుక్రవారం రోజున ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఇక్కడ చేరి సామూహిక ప్రార్థనలు చేస్తారు. రంజాన్ మాసంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు ఎక్కువ సంఖ్యలో ముస్లీం సోదరులు చేరుకొంటారు.

అమర్నాథ్ గుహ

అమర్నాథ్ గుహ

P.C: You Tube

ప్రముఖ శైవ క్షేత్రమైన ఈ గుహ శ్రీనగర్ కు దాదాపు 141 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మిగిలిన పుణ్యక్షేత్రాల వలే ఈ దేవాలయం ఎల్లప్పుడూ భక్తులకు అందుబాటులో ఉండదు. కేవలం వేసవి కాలంలో అందులోనూ వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ అమర్నాథ్ గుహలో దైవాన్ని దర్శం చేసుకోవడానికి వీలవుతంది.

అమర్నాథ్ యాత్ర పేరుతో సాగే ఈ పర్యటన కోసం ముందుగా మనం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పరమశివుడు ఇక్కడే పార్వతీ దేవికి సృష్టి రహస్యాన్ని చెప్పాడని చెబుతారు. ఇక్కడ మనకు కనిపించే రెండు పావురాలు వయస్సు కొన్ని లక్షల సంవత్సరాలు ఉంటుందని భక్తుల నమ్మకం.

వైష్ణోదేవి ఆలయం

వైష్ణోదేవి ఆలయం

P.C: You Tube

సముద్ర మట్టానికి దాదాపు 5200 అడుగుల ఎత్తులో వైష్ణోదేవి ఒక గుహలో ఉంటుంది. ‘మా' భక్తుల చేత పూజలందుకొంటున్న ఈ దేవత ఆది పరాశక్తికి ప్రతిరూపంగా భావిస్తారు. వైష్ణోదేవిని కొలిచిన వారికి కష్టాలన్నీ తీరుతాయని భక్తుల నమ్మకం. అందువల్లే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతి ఏడాలి లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారిని సేవించడానికి ఇక్కడికి వస్తుంటారు. జమ్మూ కాశ్మీర్ లోని త్రికూట పర్వత శిఖరం పై ఉన్న ఈ దేవాలయం చేరుకోవడానికి భక్తులు కొన్ని కిలోమీటర్లమేర నడవాల్సి ఉంటుంది. అయితే ఈ కష్టాలను భక్తులు లెక్కచేయకుండా అమ్మ ఆశిర్వాదం పొందడానికి సుదూర ప్రాంతా ల నుంచి ఇక్కడికి వస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X