Search
  • Follow NativePlanet
Share
» »నదీ జలాల పై సయ్..సయ్ మంటూ దూసుకు పోదాం

నదీ జలాల పై సయ్..సయ్ మంటూ దూసుకు పోదాం

బెంగళూరుకు దగ్గరగా ఉన్న రివర్ రాఫ్టింగ్ ప్రదేశాలకు సంబంధించిన కథనం.

ఉరిమే ఉత్సాహం యువత సొంతం. అందువల్లే యువత మిగిలిన వయస్సుల వారితో పోలిస్తే కొంత భిన్నంగా ఆలోచిస్తారు. అంతే కాకుండా కొంత తెగువ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ విషయం పర్యాటకంలో కూడా కనిపిస్తుంది. అందుకే మిగిలిన వయస్సుల వారు శారీరక శ్రమ లేకుండా మనసుకు ఉత్సాహం కలిగించే ప్రదేశాలను సందర్శించడానికి ఇష్టపడితే యువత మాత్రం శరీరాన్ని కష్టపెడుతూ ప్రయాణాలు చేయడానికి ఇష్టపడుతారు. ఇందు కోసం క్లిష్టమైన దారులను కూడా వెదుక్కొంటారు. ఆ దారులు నీటి పై ఉన్నా కూడా లెక్కచేయరు. ఇటువంటి సాహస వీరుల కోసమే ఈ కథనం. ఇందులో నదీ జలాల పై సర్రున దూసుకుపోతే రివర్ రాఫ్టింగ్ ఇందుకు అనుకూలమైన ప్రాంతాల గురించి వివరించాము. మరెందుకు ఆలస్యం.

బారాపోలే, కూర్గ్

బారాపోలే, కూర్గ్

P.C: You Tube

కూర్గ్ రివర్ ర్యాఫ్టింగ్ కు అనువైన ప్రాంతం. ముఖ్యంగా బారాపోలే నదీ జలాల్లో తొంబై నిమిషాల పాటు నదీ జలాల పై పడవులో దూసుకు పోవడం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకూ రివర్ రాఫ్టింగ్ అందుబాటులో ఉంటుంది. దాదాపు 4 కిలోమీటర్ల దూరం ఇక్కడ రివర్ రాఫ్టింగ్ అందుబాటులో ఉంటుంది. బెంగళూరు నుంచి 270 కిలోమీటర్ల దూరంలో బారాపోలే ఉంటుంది.

దండేలి

దండేలి

P.C: You Tube

సాహస యాత్రలంటే ఇష్టపడే పర్యాటకులకు దండేలి స్వర్గధామం. ఇక్కడ కేవలం జలక్రీడలే కాకుండా ట్రెక్కింగ్, కేవింగ్, రాక్ క్లైంబింగ్ వంటి ఎన్నో క్రీడలకు ఇది అనువైన ప్రాంతం. ఇక రివర్ రాఫ్టింగ్ విషయానికి వస్తే దండేలి ప్రాంతంలో ప్రవహించే కాళీ నదిలో రివర్ రాఫ్టింగ్ మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. రివర్ ర్యాఫ్టింగ్ పై ఇప్పుడిప్పుడే ఇష్టం పెంచుకొంటున్నవారికి ఇది అనువైన ప్రాంతమని నిపుణులు చెబుతారు. బెంగళూరు నుంచి 461 కిలోమీటర్ల దూరంలో దండేలి ఉంటుంది.

చిక్కమగళూరు

చిక్కమగళూరు

P.C: You Tube

బెంగళూరుకు అత్యంత తక్కువ దూరంలో ఉన్న చిక్కమగళూరు అంటే అందరి నోట వచ్చే మొట్టమొదటి సమాధానం బెస్ట్ హిల్ స్టేషన్. అయితే చిక్కమగళూరు కూడా అనేక సాహసక్రీడలకు ఆతిథ్యమిస్తున్న సంగతి చాలా మందికి తెలియదు. ముఖ్యంగా ఇక్కడ ప్రవహించే భద్రా రివర్ లో రివర్ ర్యాప్టింగ్ కు అవకాశం ఉంది. జూన్ నుంచి అక్టోబర్ మధ్య ఎప్పుడైనా ఈ భద్రా రివర్ లో రివర్ ర్యాఫ్టింగ్ చేయవచ్చు.

భీమేశ్వరి

భీమేశ్వరి

P.C: You Tube

బెంగళూరు నుంచి కేవలం మూడు గంటల ప్రయాణం అంటే 100 కిలోమీటర్ల దూరంలోనే మనం భీమేశ్వరిని చేరుకోవచ్చు. భీమేశ్వరి సహసక్రీడలకు నిలయం. కావేరి నదీ జలాల్లో రివర్ రాఫ్టింగ్ తో పాటు కయాకింగ్ కు కూడా అవకాశం ఉంది. బెంగళూరు యువత తమ వీకెండ్ ను ఎక్కువగా గడపడానికి భీమేశ్వరినే ఎంచుకొంటారు. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో భీమేశ్వరిని సందర్శించడానికి అనుకూలంగా ఉంటుంది.

కబిని

కబిని

P.C: You Tube

బెంగళూరు నుంచి 220 కిలోమీటర్ల దూరంలో కబిని ఉంటుంది. ఒకప్పుడు మైసూరు మహారాజులకు హంటింగ్ స్పాట్ ఈ కబిని నదీ పరివాహక ప్రాతం. ప్రస్తుతం సాహస క్రీడలకు నిలయం. చుట్టూ పచ్చటి అడవుల మధ్య ప్రవహించే కబిని నదిలో రబ్బరు బోటులో సయ్ మంటూ దూసుకువెళ్లడం ఎవరికి ఇష్టముండదు చెప్పండి. ఈ ప్రయాణంలో మీకు అరుదైన జంతువులను, పక్షులను కూడా చూసే సదుపాయం కలుగుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X