Search
  • Follow NativePlanet
Share
» »దక్షిణ భారత దేశంలోని ఈ దేవాలయాను ఒక్కసారైనా దర్శించుకోవాల్సిందే

దక్షిణ భారత దేశంలోని ఈ దేవాలయాను ఒక్కసారైనా దర్శించుకోవాల్సిందే

దక్షిణ భారత దేశంలోని ఐదు ముఖ్యమైన దేవాలయాలకు సంబంధించిన సమాచారం.

దక్షిణ భారత దేశం అద్భుత ఆలయాల నిలయం. ఇక్కడ పురాణ ప్రాధాన్యత కలిగిన ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఇక కొన్ని దేవాలయాలలు భారత శిల్పకళకు నిలువుటద్దాలు. ద్రావిడ శైలి శిల్ప సౌదర్యం నుంచి దేవరాయల కాలం నాటి వాస్తు శిల్పి వరకూ ఎన్నో అద్భుత శిల్పాలను మనం ఈ దేవాలయాల్లో చూడవచ్చు.

ఇక కొన్ని దేవాలయాల గోపురాలు అంతెత్తున ఉండి భారతతీయ వాస్తు కళకు, ఇంజనీరింగ్ ప్రతిభకు అద్ధం పడుతాయి. ఇక ఆలయానికే కాకుండా అందులో ఉన్న ప్రతి స్తంభానికి వాటి పై ఉన్న ఒక్కొక్క శిల్పానికి కూడా ప్రత్యేక కథ ఉంటుంది. ఈ నేపథ్యంలో దక్షిణ భారత దేశంలో అత్యంత ప్రాచూర్యం పొందిన ఐదు దేవాలయాలకు సంబంధించిన క్లుప్త సమాచారం మీ కోసం

విరూపాక్ష దేవాలయం

విరూపాక్ష దేవాలయం

P.C: You Tube

కర్నాటకలోని తుంగభద్ర నది ఒడ్డున ఉన్న విరూపాక్ష దేవాలయం విజయనగర సామ్రాజ్య అద్భుత నిర్మాణం. ఇక్కడ శివుడు విరూపాక్షుడి పేరుతో కొలువై ఉన్నాడు. ఇక్కడ శిల్ప సంపద అద్భుతం. అందువల్లే యునెస్కో ఈ దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి సంరక్షణ చర్యలు చేపడుతోంది.

మీనాక్షి దేవాలయం

మీనాక్షి దేవాలయం

P.C: You Tube

తమిళనాడులోని వైగై నది ఒడ్డున మధురై పట్టణంలో ఉన్న ఈ దేవాలయంలో ప్రధాన దైవం మీనాక్షి అమ్మవారు. ఈ ఆలయాన్ని మీనాక్షి సుందరేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ప్రపంచంలో ఓ ధార్మిక ప్రాంతానికి సంబంధించి ఈ దేవాలయంలో ఉన్న శిల్ప సంపద మరెక్కడా కనిపించదు. దక్షిణ భారత దేశంలో ఎక్కువ మంది సందర్శించే ఆలయాల్లో ఇది కూడా ఒకటి.

తిరుమల ఆనంద నిలయం

తిరుమల ఆనంద నిలయం

P.C: You Tube

ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల కొండపై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం ప్రపంచ ప్రఖ్యాతి చెందినది. ముఖ్యంగా ఇక్కడ లడ్డు ప్రసాదం చాలా ప్రాచూర్యం పొందింది. ఈ దేవాలయాన్ని సాదారణంగా ఆనంద నిలయం అని పిలుస్తారు. ద్రావిడ శైలిలో నిర్మించిన ఈ దేవాలయం క్రీస్తు పూర్వం 300 ఏళ్ల నాటిదని చెబుతారు.

ఐరావతేశ్వర దేవాలయం

ఐరావతేశ్వర దేవాలయం

P.C: You Tube

తమిళనాడులోని కుంభకోణం సమీపంలో ఉన్న దురాసుర పట్టణ సమీపంలో ఐరావతేశ్వర దేవాలయం ఉంది. ఇక్కడ శిల్ప సంపద ప్రపంచ ప్రఖ్యాతి చెందినది. అందువల్లే మునెస్కో సంస్థ వరల్డ్ హెరిటేజ్ జాబితాలో ఈ ఐరావతేశ్వర దేవాలయం స్థానం సంపాదించుకుంది. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. ఇంద్రుడి వాహనం ఐరావతం తన శాపాన్ని ఇక్కడ పోగొట్టుకొంది కాబట్టి ఈ ఆలయాన్ని ఐరావతేశ్వరాలయం అని పిలుస్తారు.

బృహదీశ్వర దేవాలయం

బృహదీశ్వర దేవాలయం

P.C: You Tube

తమిళనాడులోని తంజావూరులో ఉన్న బృహదీశ్వర దేవాలయం నిర్మించి దాదాపు వెయ్యి సంత్సరాలవుతోంది. ఇక్కడ చోళ సంప్రదాయ శిల్ప కళ ప్రపంచ పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తోంది. ఈ దేవాలయం గోపురం నీడ భూమిని తాకక పోవడం విశేషం. ఈ దేవాలయం కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో ఒకటి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X