Search
  • Follow NativePlanet
Share
» »హరిద్వార్ లో ఈ ప్రాదేశాలను చూడకపోతే మీరు అక్కడి వెళ్లి ప్రయోజనం శూన్యం

హరిద్వార్ లో ఈ ప్రాదేశాలను చూడకపోతే మీరు అక్కడి వెళ్లి ప్రయోజనం శూన్యం

హరిద్వార్ లో చూడదగిన పర్యాటక స్థలాలకు సంబంధించిన కథనం.

అయోద్య, మధుర, ద్వారక, ఉజ్జయినీ, హరిద్వార్, వారణాసి, కాంచిపురాలను కలిపి సప్తపురి క్షేత్రాలు అని అంటారు. హిందువులు తమ జీవిత చరమాంకంలో ఈ క్షేత్రాలను సందర్శించాలని భావిస్తారు. తద్వారా అప్పటి వరకూ తాము చేసిన పాపాలన్నీ సమసిపోతాయనేది వారి నమ్మకం. ఇందులో హరిద్వార్ విశిష్టమైనది.

అమతాన్ని గరుక్మంతుడు తీసుకువెళ్లే సమయంలో అందులో ఒక చుక్క ఇక్కడ పడిపోయిందని హిందూ పురాణాలు చెబుతాయి. ఆ ప్రాంతమే హరి కి పురి. ఈ హరి కి పురితో పాటు ఎన్నో చూడదగిన ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి. ఈ నేపథ్యంలో హరిద్వార్ టూర్ వెళ్లినప్పుడు అక్కడ తప్పకుండా సందర్శించాల్సిన ఐదు పర్యాటక స్థలాల వివరాలు మీ కోసం.

హరి కి పురి

హరి కి పురి

P.C: You Tube

హరిద్వార్ లో చూడదగిన ముఖ్యమైన పర్యాటక కేంద్రాల్లో హరి కి పురి ఒకటి. హరి కి పురి అనేది ఒక ఘాట్. దీనిని విక్రమాదిత్యుడు నిర్మించాడని చెబుతారు. ఇక్కడి బ్రహ్మకుండంలో స్నానం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.

సాయంకాలపు హారతి

సాయంకాలపు హారతి

P.C: You Tube

హరి కి పురిలో ప్రతి రోజూ సాయంకాలం ఇచ్చే హారతి కూడా చాలా ప్రాచూర్యం చెందింది. దీనిని చూడటానికి భక్తులు దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వస్తుంటారు. హారతి తర్వాత భక్తులు చిన్న చిన్న దివ్వెలను గంగా నదిలో వదులుతారు. ఆ దివ్వెల వెలుగులో గంగా నదితో పాటు, హరిద్వార్ లో అనిర్వచనీయ ధార్మిక వాతావరణం కనిపిస్తుంది.

భారత్ మాతా దేవాలయం

భారత్ మాతా దేవాలయం

P.C: You Tube

హరిద్వార్ లో చూడదగిన మరో ముఖ్యమైన పర్యాటక కేంద్రం భారత్ మాతా మందిర్. స్వామి సత్యమూర్తి ఈ దేవాలయం నిర్మాణానికి ఎంతగానో పాటుపడ్డాడు. ఈ దేవాలయం 8 అంతస్తులతో ఉంటుంది. ఒక్కొక్క అంతస్తులో హిందూ పురాణాలకు సంబంధించిన ఒక్కొక్క దేవత విగ్రహాలు ఉంటాయి.

ఒక్కొక్క అంతస్తులో

ఒక్కొక్క అంతస్తులో

P.C: You Tube

మొదటి అంతస్తులోనే మనకు భారత మాత నిలువెత్తు విగ్రహం కనిపిస్తుంది. రెండో అంతస్తులో భారత పురాణాల్లోని సావిత్రి, రాధ, మీరా తదితర మహిళామణుల విగ్రహాలు ఉంటాయి. మూడో అంతస్తులు భారత దేశంలోని వివిధ మతాలకు సంబంధించిన వివరాలు శిల్పాలు, పెయింటింగ్ రూపంలో ఉంటాయి. ఇలా ఒక్కొక్క అంతస్తు విభిన్నంగా ఉండి చూపరులను ఆకట్టు కొంటూ ఉంటుంది.

చండీ దేవి దేవాలయం

చండీ దేవి దేవాలయం

P.C: You Tube

నీల పర్వతం పై చండీ దేవి దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని చేరుకోవడానికి 3 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. లేదా కేబుల్ కార్ కూడా అందుబాటులో ఉంటుంది. పురాణాల ప్రకారం ఇక్కడ శుంభ, నిశుంభ అనే రాక్షసుల సైన్యాధిపతులైన చండ, ముండలను ఇక్కడే శక్తి స్వరూపమైన చండీ దేవి సంహరించిందని చెబుతారు.

సుచాత్ సింగ్

సుచాత్ సింగ్

P.C: You Tube

ఈ దేవాలయాన్ని సుచాత్ సింగ్ నిర్మించారు. ఇక విగ్రహ ప్రతిష్టాపన 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యల చేతుల మీదుగా జరిగిందని చెబుతారు. సాధారణంగా హరిద్వార్ ను సందర్శించిన వారు ఈ చండీ దేవాలయన్ని తప్పక సందర్శిస్తారు.

బారాబజార్

బారాబజార్

P.C: You Tube

హరిద్వార్ ధార్మిక కేంద్రంగానే కాకుండా స్ట్రీట్ మార్కెట్ కు కూడా ప్రాచూర్యం చెందింది. ఇక్కడి రైల్వే రోడ్డులో బారా బజార్ పేరుతో ఉన్న స్ట్రీట్ మార్కెట్ పర్యాటకులకు సరసమైన ధరల్లో వివిధ రకాల వస్తువులను అందుబాటులో ఉంచుతుంది.

హాండిక్రాఫ్ట్ వస్తువులు

హాండిక్రాఫ్ట్ వస్తువులు

P.C: You Tube

ఇక్కడ వివిధ రకాల హాండీక్రాఫ్ట్ వస్తువుల, రుద్రాక్షలు, వీభూతి, స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన స్వీట్స్, ఆయుర్వేద ఔషదాలు వంటివి ఎన్నో దొరుకుతాయి. అందువల్లే హరిద్వార్ ను సందర్శించే ప్రతి ఒక్కరూ ఇక్కడ షాపింగ్ చేయకుండా వెనుదిరగరు.

భీమ్ గోడ

భీమ్ గోడ

P.C: You Tube

భీమ్ గోడ హరి కి పురి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది. హిందూ పురాణాలను అనుసరించి పాండవులు హిమాలయాలకు వెళ్లే సమయంలో వారికి దప్పిక వేస్తుంది. అప్పుడు ఇక్కడ భీముడు ఒక రాతి పై తన మోకాలితో గట్టిగా మోది భూమి లోపల ఉన్న నీటిని పైకి తెప్పిస్తాడు.

మిగిలిన వారు

మిగిలిన వారు

P.C: You Tube

దీంతో మిగిలిన వారు ఆ నీటిని తాగా తమ దాహం తీర్చుకొంటారు. అందువల్ల ఇది అత్యంత పవిత్రమైన ప్రాంతంగా భావిస్తారు. హరిద్వార్ ను సందర్శించే వారిలో చాలా మంది ఈ భీమ్ గోడ ను తప్పక సందర్శిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X