Search
  • Follow NativePlanet
Share
» » ధోని హీల్స్ లో ట్రెక్ చేశారా? రాజ్ మలై లో జంతు ప్రపంచం చూస్తారా?

ధోని హీల్స్ లో ట్రెక్ చేశారా? రాజ్ మలై లో జంతు ప్రపంచం చూస్తారా?

కేరళలో ట్రెక్కింగ్ కోసం అనేక మార్గాలు ఉన్నాయి. అందులో అగస్తకోడం, ధోనీ హిల్స్, రాజ్ మలై ముఖ్యమైనవి.

గాడ్స్ ఓన్ కంట్రీగా పేరుగాంచిన కేరళ ప్రకృతి సందపకు నిలయం. పిల్లకాలువులు, సముద్రాన్ని తలపించే సరస్సులు, ఎతైన పర్వత శిఖరాలు, అత్యంత అరుదైన జంతువులు, పచ్చటి మైదానాలు, జలజలా పారే జలపాతాలు ఇలా ఒక్కటేమిటి అనేక ప్రకృతి అందాలన్నీ ఇక్కడే ఉంటాయి. అందువల్లే ఈ రాష్ట్రాన్ని గాడ్స్ ఓన్ కంట్రి అంటారు.

ఇక ప్రకృతి అందాలను చూసుకొంటూ వీకెండ్ లో అలా నడుచుకొని వెలుతూ కిలోమీటర్ల మేర నడవడం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. అందువల్లే కేరళలో ట్రెక్కింగ్ కోసం చాలా మంది ఉవ్విళ్లూరుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో కర్నాటకలో ట్రెక్కింగ్ కోసం అనుకూలమైన 5 పర్వత శిఖరలకు సంబంధించిన కథనం.

అగస్తకోడం పర్వత శిఖరం

అగస్తకోడం పర్వత శిఖరం

P.C: You Tube

సముద్రమట్టానికి 1868 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వత శిఖరం ప్రకృతి సౌదర్యంతో విరాజిల్లుతోంది. ఈ పర్వత శిఖరాన్ని చేరుకోవడానికి నడక తప్ప మరో మార్గం లేదు. మహాముని అగస్తుడి ప్రతి రూపంగా ఈ పర్వత శిఖరాన్ని భావిస్తారు. ఇప్పటికీ ఇక్కడ మహిళలను ట్రెక్కింగ్ కోసం అనుమతించరు. ఈ పర్వత శిఖరం మొత్తం ఔషద మొక్కలతో నిండి ఉంటుంది. ఈ పర్వత శిఖరం పై కి చేరుకొంటూ ఔషద మొక్కల నుంచి వచ్చే గాలిని పీల్చినా ఎన్నో వ్యాధులు నయవుతాయని చెబుతారు.

చాంబ్రా పర్వత శిఖరం

చాంబ్రా పర్వత శిఖరం

P.C: You Tube

సముద్రమట్టానికి 2100 మీటర్ల ఎత్తులో ఉన్న బాంబ్ర పర్వత శిఖరం పైకి ట్రెక్కింగ్ ద్వారా వెళ్లడం సర్గంలో నడిచినట్లు ఉంటుందనడంలో సందేహం లేదు. దాదాపు 14 కిలోమీటర్లు సాగే ఈ ట్రెక్కింగ్ మార్గం పూర్తి చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఈ పర్వత శిఖరం పై హ`దపు ఆకారంలో ఉన్న సరస్సును చూడటానికే చాలా మంది ఇక్కడికి వస్తుంటారు.

రాజ్ మలై

రాజ్ మలై

P.C: You Tube

కేరళలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఎరవికులం నేషనల్ పార్క్ లో రాజ్ మలై పర్వత శిఖరం ఉంటుంది. ఈ నేషనల్ పార్క్ లో అంతరించె స్థితికి చేరుకొన్న నిలగిరి థార్ ను సంరక్షిస్తున్నారు. ఈ రాజ్ మలై పర్వత శిఖరం పై కి ట్రెక్కింగ్ మార్గం ద్వారా చేరుకోవడం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. నిలగిరి థార్ తో పాటు ఇక్కడ మనం చిరుతలు, సింహపు తోక కలిగిన కోతులు తదితరాలను చూడవచ్చు. ఈ నేషనల్ పార్క్ లో జీప్ సఫారీ అందుబాటులో ఉంటుంది.

అనముడి పర్వత శిఖరం

అనముడి పర్వత శిఖరం

P.C: You Tube

సముద్రమట్టానికి 2,695 మీటర్ల ఎత్తున ఉండే పర్వత శిఖరం కూడా ఎరవికుల నేషనల్ పార్క్ లోనే ఉంది. హిమాలయ పర్వత పంక్తులల్లోని పర్వత శిఖరాల తర్వాత భారత దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఉన్న పర్వత శిఖరాల పైకి అత్యంత ఎతైన పర్వత శిఖరం ఇదే. ఈ పర్వత శిఖరం పై భాగం చేరే క్రమంలో మనం పచ్చటి మైదానాలను, టీ తోటలను, సుగంధ ద్రవ్యాల తోటలను పలకరించవచ్చు.

ధోని హిల్స్

ధోని హిల్స్

P.C: You Tube

కేరళలోనే కాక దక్షిణ భారత దేశంలోనే ప్రాచూర్యం చెందిన మలపుంజ రిజర్వాయర్ కు కూతవేటు దూరంలోనే ధోని హిల్స్ ఉంటుంది. ఈ పర్వత శిఖరం చుట్టూ అనేక జలపాతాలను చూడవచ్చు. అందువల్లే ఇక్కడ ట్రెక్కింగ్ లో జలపాతాలను చూస్తూ ముందుకు సాగుతాం. ఈ మార్గంలో క్రీస్తుశకం 1857 నిర్మించిన భవనాన్ని కూడా మనం చూడవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X