Search
  • Follow NativePlanet
Share
» »ఇండియాలో ప్రసిద్ధిగాంచిన యోగా ఆశ్రమాలు !

ఇండియాలో ప్రసిద్ధిగాంచిన యోగా ఆశ్రమాలు !

By Mohammad

యోగా పురాతనమైనది. దీనిని ప్రపంచానికి తెలియజేసింది మన దేశమే ! యోగా అనేది వ్యాయామ సాధనాల సమాహారాల ఆధ్యాత్మిక రూపం. ఇది హిందూత్వ ఆధ్యాత్మిక సాధనాల్లో ఒకటి. గత కొద్ది సంవత్సరాల నుండి పాశ్చాత్య దేశాల, మన దేశంలో కూడా యోగా పాటిస్తున్నావారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

పూర్వం యోగాలు యోగులు/ ఋషులు/మునులు చేసేవారు. వారు గంటలు కాదు .. రోజులు, సంవత్సరాల తరబడి ధ్యాన ముద్ర లో ఉండి, భగవంతున్ని ప్రసన్నం చేసుకొనేవారు. క్రీ. పూ. 200 వ సంవత్సర ప్రాంతానికి చెందిన వాడుగా పతంజలిని ఆదునిక పాశ్చాత్య చారిత్రకారులు భావిస్తున్నప్పటికీ, భారతీయ పంచాగం ప్రకారం ఈయన కృష్ణుడు జీవించిన కాలానికి కొద్దిపాటి అటుఇటు జీవించినాడు. ఈయనె యోగా శాస్త్రాన్ని, యోగా సూత్రాలను మానవాళికి అందించిన గొప్ప యోగి.

యోగా డే స్పెషల్

చిత్ర కృప : The Yoga People

ప్రస్తుతం, యోగా నేర్చుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఇందులో భారతీయులకంటే పాశ్చాత్య దేశాలేవారే అధికం. అమెరికా, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్ ఇలా ప్రపంచంలో ఏ మూలనైనా యోగా ఇప్పటికీ ఉందంటే అది భారతీయుల గొప్పతనం.

భారతదేశంలో సంప్రదాయ యోగా నేర్చుకోవటానికి ప్రపంచంలో చాలా మంది ఆసక్తిని కనబరుస్తుంటారు. యోగాను ప్రపంచానికి అందించిన ఇండియాలో యోగా సెంటర్ లు చాలానే ఉన్నాయి. లోతైన సమాచారాన్ని, సంప్రదాయ యోగా ను అందించే కొన్ని యోగా స్థలాలు ..

1. అయ్యంగర్ యోగాశ్రయ

అయ్యంగర్ యోగాశ్రయ యోగా నేర్చుకోనేవారికి చక్కటి ప్రదేశం. బి కె ఎస్ అయ్యంగర్ ఆశ్రమం లో నిష్ణాత్తులైన శిక్షకులు యోగా విద్యార్థులకు నేర్పిస్తుంటారు. ఒక పెద్ద హాల్లో విద్యార్థులు కాస్త స్పేస్ ఇచ్చి ఒకరి వెనక ఒకరు కూర్చిని యోగాసనాలు వేస్తుంటారు.

యోగా దినోత్సవం

చిత్ర కృప : Jon Fife

చిరునామా : 126 ఎల్మాక్ హౌస్, సేనాపతి బాపట్ మార్గ్, లోయర్ పరేల్, ముంబై 400013

2. యోగా ఇన్స్టిట్యూట్

దేశంలోనే పురాతన యోగా స్కూల్ లలో ఒకటిగా భావించే యోగా ఇన్స్టిట్యూట్ 1918 లో శ్రీ యోగేంద్ర జీ స్థాపించారు. సుమారు ఎకరం విస్తీర్ణం లో ఏర్పాటు చేసిన ఈ యోగా స్కూల్ ను ప్రతి రోజు వెయ్యి మంది దాకా వస్తుంటారు.

చిరునామా : యోగా ఇన్స్టిట్యూట్ రోడ్, ప్రభత్ కాలనీ, సంతక్రుజ్ (E ), ముంబై 400055

3. కైవల్యధామ హెల్త్ అండ్ యోగా రీసర్చ్ సెంటర్

కైవల్యధామ కూడా భారతదేశంలో ఉన్న పురతన యోగా స్కూల్ లలో ఒకటి. దీనిని 1924 వ సంవత్సరంలో లోనవాలా లో ఏర్పాటు చేసారు. అందమైన ప్రకృతి మధ్యలో, నిర్మానుష్యమైన వాతావరణంలో విద్యార్థులు యోగా అభ్యసిస్తుంటారు. ఇక్కడి విద్యార్థులు జపాన్, చైనా, కంబోడియా, ధాయలాండ్, కెనడా, అమెరికా తదితర దేశాలలో యోగా ఈవెంట్ లలో హాజరవుతుంటారు.

యోగా ఆశ్రమాలు

చిత్ర కృప : Rishikesh Yoga

చిరునామా : స్వామి కువల్యనంద మార్గ్, లోనవాలా 410403

4. హిమాలయాల లోని ఆనంద ఆశ్రమం

ఆనంద ఆశ్రమం హిమాలయాలలోని గర్హ్వాల్ వద్ద కలదు. దీనిని స్థాపించి ఇప్పటికి 15 ఏళ్ళు గడిచింది. దేశంలోనే మొదటి లగ్జరీ సదుపాయాలు ఉన్న ఆశ్రమం గా దీనిని అభివర్ణించవచ్చు. ప్రపంచంలో పెరిన్నిక గల యోగా మాస్టర్లు అతిధి ఉపాధ్యాయులు గా వచ్చి విద్యార్థులకు యోగా శిక్షణ నేర్పిస్తుంటారు. యోగా తో పాటు ఆయుర్వేద శిక్షణ కూడా అందిస్తున్నది.

enriche travels

చిత్ర కృప : enriche travels

చిరునామా : ది పాలసు ఎస్టేట్, నరేంద్ర నగర్, తెహ్రి - గర్హ్వాల్ రోడ్, ఉత్తరాఖండ్ 249175

5. ఇషా యోగా సెంటర్

ఇషా ఫౌండేషన్ 1992 వ సంవత్సరంలో ఇషా యోగా సెంటర్ ను ప్రారంభించింది. ప్రభుత్వ అనుమతితో తమిళనాడు లోని కోయంబత్తూర్ జిల్లలో వెల్లింగిరి కొండ ల దిగువన ఇషా యోగా సెంటర్ ఉన్నది. ధ్యానలింగ యోగిక్ ఆలయం, నడవటానికి పెద్ద ప్రాంగణం, మెడిటేషన్ హాళ్ళు మొదలైనవి ఈ యోగా సెంటర్ కలిగి ఉంది. కేవలం యోగా ఒక్కటే కాకుండా గ్రామీణ ప్రాంతంలో పర్యావరణాన్నిరక్షించడం, ఆక్షరాస్యత ను పెంపొందించడం, అక్కడి ప్రజలను చైతన్యవంతులను చేయటం కొరకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది.

isha foundation

చిత్ర కృప : Brian Holsclaw

చిరునామా : 15, గోవింద స్వామీ నాయుడు లేఔట్, సింగనల్లుర్, కోయంబత్తూర్, తమిళనాడు 641005

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X