Search
  • Follow NativePlanet
Share
» »తిరుపతికి వెళ్ళి అక్కడకు వెళ్ళకుండా వచ్చేస్తున్నారా? ఐతే మీరు చాలా మిస్ అవుతారు

తిరుపతికి వెళ్ళి అక్కడకు వెళ్ళకుండా వచ్చేస్తున్నారా? ఐతే మీరు చాలా మిస్ అవుతారు

శ్రీ కాళహస్తి వెళుతున్నారా? అయితే ఆ చుట్టుపక్కల ఉండే ఈ జలపాతాలు కూడా సందర్శించండి

సెలవుల్లో లేదా వీకెండ్స్ ఏదైనా యాత్రా స్థలం సందర్శించాలంటే శ్రీకాళహస్తి బెస్ట్. శ్రీ కాళహస్తి ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉండే ఆధ్యాత్మిక దేవాలయం. శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ' అని కూడా పిలుస్తారు. శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది ఒడ్డున ఉంది. దక్షిణ భారత దేశంలో అతి ప్రాచీనమైన పంచభూతలింగాలలో నాల్గవదైన వాయు లింగము గల గొప్ప శైవ పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో ఉండే మూడు గోపురాలు భారతీయ వాస్తు, శిల్పకళలకు నిదర్శనం.

ఈ దేవాలయ ప్రాంగణంలో నిర్మించిన ఎత్తైన గాలి గోపురం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించినది. మరో ప్రధాన ఆకర్షణ వెయ్యి కాళ్ళ మంటపం.శ్రీకాల హస్తి కళంకారి కళకు ప్రసిద్ది. శ్రీ కాళహస్తికి వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల తప్పకుండా చూడాల్సినటువంటి 8 అద్భుతమైన ప్రదేశాలున్నాయి. అవి

శ్రీ కాళహస్తి టెంపుల్:

శ్రీ కాళహస్తి టెంపుల్:

శ్రీకాళహస్తి ఆకర్షణలలో శ్రీకాళహస్తి టెంపుల్ చాలా ఫేమస్. ప్రపంచ ప్రసిద్దిగాంచిన తిరుపతి నుండి 36కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీకాళహస్తిలో పరమశివుడు ప్రధాన ఆకర్షణ. ఈ దేవాలయాన్ని 5వ శతాబ్ధకాలంలో చోళులు నిర్మించారు. అలాగే దేవాలయం బయటివైపున 10వ శతాబ్దంలో నిర్మించారు.

PC: Kalyan Kumar

శ్రీ కాళహస్తి టెంపుల్:

శ్రీ కాళహస్తి టెంపుల్:

మహా శివరాత్రి పర్వదినానా ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. శ్రీకాళహస్తికి రాహుకేతు దోషాల నుండి విముక్తిగి పొందడానికి, సంతానం కోసం, పెళ్ళి, విద్య ఇలా రకరకాల భక్తులు సందర్శిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. తిరుమల శ్రీవెంకటేశ్వరున్ని దర్శించిన వారు తప్పనిసరిగా శ్రీకాళహస్తి దేవాలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం.

Photo Courtesy: temples india

తలకోన వాటర్ ఫాల్:

తలకోన వాటర్ ఫాల్:

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జలపాతాల్లో అత్యంత ఎతైన జలపాతం తలకోన జలపాతం. ఇది 270అడుగుల ఎత్తు ఉంది. చిత్తూరు జిల్లాలోని శ్రీవెంకటేశ్వర నేషనల్ పార్క్ లో ఈ జలపాతం ఉన్నది. ఈ జలపాతానికి సమీపంలో శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయం ఉంది.

Photo Courtesy: VinothChandar

తలకోన వాటర్ ఫాల్:

తలకోన వాటర్ ఫాల్:

ఈ ప్రదేశం నిత్యం పర్యాటకులతో కళకళలాడుతుంటుంది. చుట్టూ దట్టమైన అడవి, ఎత్తైన కొండల మధ్య ఉన్న ఈ జలపాతాన్ని చూస్తే ప్రక్రుతి ప్రేమికులకు ఒక చిత్రమైన అనుభూతి కలుగుతుంది

Photo Courtesy: kiran kumar

 వేయిలింగలా కోన వాటర్ ఫాల్ :

వేయిలింగలా కోన వాటర్ ఫాల్ :

శ్రీకాళహస్తికి కాస్త దూరంలో వేయిలింగాల కోన ఉంది.శ్రీకాళహస్తి సమీపంలో ఉన్న ప్రత్యేక ఆకర్షణలలో ఒకటి వేయిలింగాల కోన. ఒక కొండ ఎక్కి దిగి తిరిగి మరో కొండ ఎక్కితే కనిపించేటటువంటి ఒక చిన్న ఆలయంలో ఒకే లింగంపై చెక్కిన వేయి శివలింగాలను (యక్షేశర లింగం)సందర్శించవచ్చు.

Photo Courtesy: go tirupati

 శ్రీ కాళహస్తిలో జరిగే బ్రహ్మోత్సవాల సమయంలో

శ్రీ కాళహస్తిలో జరిగే బ్రహ్మోత్సవాల సమయంలో

ప్రతి సంవత్సరం శ్రీ కాళహస్తిలో జరిగే బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు ఈ ప్రదేశానికి సందర్శనార్థం వస్తుంటారు. జ్ఝాన ప్రసూనాంబ ఇక్కడ దేవతలకు జ్జానోపదేశం చేస్తుందట. ఇక్కడి రమణీయ ప్రకృతి దృశ్యాల వల్ల ఈ ప్రాంతం ప్రసిద్ధ పర్యాటక కేంద్రం అయింది.

Photo Courtesy: go tirupati

ఉబ్బలమడుగు ఫాల్స్:

ఉబ్బలమడుగు ఫాల్స్:

కాళహస్తికి 35కిలోమీటర్ల దూరంలో సిద్దుల కోన అని పిలువ బడే అడవిలో ఉన్నది. ఈ వాటర్ ఫాల్ యొక్క అందాన్ని ఎట్టి పరిస్థితిలో మిస్ చేయకూడదు. ఈ జలపాతం కంబకం అడవిలో కనుగొనబడినది. వర్షకాలంలో అంటే అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకూ ఈ జలపాతం జలకళతో కళకళలాడుతుంటుండి.
Photo Courtesy: McKay Savage

ఉబ్బలమడుగు ఫాల్స్:

ఉబ్బలమడుగు ఫాల్స్:

ఈ ఉబ్బల మడుగు జలపాతం విహారయాత్రలకు ట్రెక్కింగ్ కు అందమైన ప్రదేశం. ఆకుపచ్చని ప్రదేశాల మద్య ఈ జలపాతాన్ని వీక్షించుటకు స్థానికులే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా పర్యాటకులు వస్తుంటారు
Photo Courtesy: McKay Savage

 గుడిమల్లం:

గుడిమల్లం:

రేణిగుంట రైల్వే స్టేషన్ దగ్గర్లో ఉన్నది. శ్రీకాళహస్తి కి 54 కి. మీ. దూరంలో ఉన్న గుడిమల్లంలో శాతవాహనుల కాలంలో నిర్మించిన పురాతన శివాలయం ఉంది. ఇక్కడే పరుశురామేశ్వర టెంపుల్ నిర్మతమైనది. ఇక్కడున్న శివలింగానికి ఎంతో విశిష్టత ఉంది. అదేమిటంటే ఇక్కడున్న శివలింగం లింగరూపంలో కాకుండా మానవ రూపంలో వేటగానివలె ఉంటుంది. పురుషాంగముతో పోలి ఉన్న ఈ లింగం ప్రపంచంలో అతి పురాతనమైన శివలింగంగా ఖ్యాతి గడించింది. దాదాపు 2300ఏళ్ళనాటిదని చెబుతుంటారు.
Photo Courtesy: Elvey

 సహస్రలింగ టెంపుల్ :

సహస్రలింగ టెంపుల్ :

శ్రీకాళహస్తి సమీపంలో ఉన్న ఆలయాల్లో ఒకటి సహస్ర లింగ దేవాలయం. ఒక అందమైన అడవి మధ్యలో ఉన్న గుడి పరిసరాల వల్ల కూడా ఎంతో మంది పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తుంటారు. ఇక్కడ వర్షాల కోసం మృత్యుంజయేశ్వరునికి సహస్రలింగాభిషేకం చేస్తారు. సహస్ర అంటే వేయి అని అర్థం.
Photo Courtesy: pponnada

 సహస్రలింగ టెంపుల్ :

సహస్రలింగ టెంపుల్ :

ఒకే ఒక శిలపై వేయి లింగాలు చెక్కిన శివలింగం వుండటం వల్ల ఈ గుడికి ఆ పేరు వచ్చింది. కాశీ విశ్వేశ్వరుడు కూడా మూర్తి స్వరూపుడై యున్నాడు.ఈ గుడిని సందర్శించడం వల్ల ఈ జన్మలో, పూర్వజన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
Photo Courtesy: pponnada

దుర్గాంభిక టెంపుల్ :

దుర్గాంభిక టెంపుల్ :

ఈ ఆలయం చాలా పురాతనమైనది. సముద్ర మట్టానికి 800 మీ ఎత్తున ఒక కొండపై వెలసిన కనక దుర్గమ్మ గుడే దుర్గాంబికా దేవాలయం. ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయం శ్రీకాళహస్తి ఆలయానికి ఉత్తరవైపున నిర్మితమైనది. ఈ ఆలయంలో వెలసిన అమ్మవారికి ఏటా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. ఈ తొమ్మిది రోజులపాటు కూడా భక్తులు విశేషంగా అమ్మవారిని దర్శించుకుంటారు.ఈ ఆలయ రమణీయ దృశ్యాల వల్ల స్థానికులే కాక పర్యాటకులు కూడా ఈ క్షేత్రాన్ని తప్పకుండా దర్శిస్తుంటారు.
Photo Courtesy: Shanbhag

భరద్వాజ తీర్థం:

భరద్వాజ తీర్థం:

శ్రీ కాళహస్తి ఆలయానికి తూర్పు దిక్కున మూడు కొండల మధ్యన భరద్వాజ తీర్థం ఉంది. ఈ ప్రదేశంలో భరద్వాజ మహర్షి ద్యానం చేయడం వల్ల ఆ పేరు వచ్చిందని అంటారు. ఈ భరద్వాజ తీర్థం మద్య ధ్యానముద్రలో ఉన్న తపో వినాయకుడి అద్భుతమైన విగ్రహం ఆధ్యాత్మికతకు మరో నిదర్శనం. ఈ ప్రదేశంలో నెలకొనివున్న అందమైన లోయ పచ్చటి కొండలు, నిర్మలమైన సెలయేళ్లతో ఉండి ఈ ప్రాంతాినకి ఒక దైవికమైన వాతావరణాన్ని తీసుకువచ్చింది.
Photo Courtesy: NsChandru

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X