Search
  • Follow NativePlanet
Share
» »హైదరాబాద్ లో వీటిని చూడగానే పరవశించిపోతారు!

హైదరాబాద్ లో వీటిని చూడగానే పరవశించిపోతారు!

ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాంతాలలో తప్పక సందర్శించవలసిన ప్రదేశం, ప్రపంచం నలుమూల ఉండే వారు ఇష్టపడే ప్రదేశం హైదరాబాద్. ముఖ్యంగా హైద్రాబాద్ అంటానే చాలామందికి హైద్రాబాదీ బిర్యానీనే గుర్తుకు వస్తుంది. హైద్రాబ

ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాంతాలలో తప్పక సందర్శించవలసిన ప్రదేశం, ప్రపంచం నలుమూల ఉండే వారు ఇష్టపడే ప్రదేశం హైదరాబాద్. ముఖ్యంగా హైద్రాబాద్ అంటానే చాలామందికి హైద్రాబాదీ బిర్యానీనే గుర్తుకు వస్తుంది. హైద్రాబాదీ బిర్యానీ టేస్ట్ చూడటానికైనా హైద్రాబాద్ కు వెళుతుంటాము అని చెప్పేవారు చాలా మంది. హైద్రాబాద్ కు ప్రత్యేకంగా బిర్యానీ మాత్రమే కాదు, కొన్ని ప్రదేశాలు మనస్సును హత్తుకొనేలా చేస్తాయి. గోల్కొండ నుండి చార్మినార్ వరకు ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలున్నాయి. హైద్రాబాద్ లో అనేక పర్యాట ప్రదేశాలు, రామోజీఫిల్మ్ సిటీ, జూపార్క్ లు ఆలయాలు, రాజభవనాలు, నిజాం కాలం నాటి ప్యాలెస్ లు ముగ్థమనోహరంగా కనబడుతాయి.

దక్షిణ భారతదేశంలో హైద్రాబాద్ అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక కేంద్రంగా ఉన్నప్పటికీ, ఈ చారిత్రాత్మక నగరం తన సంప్రదాయాలు మరియు సంస్కృతులకు బలమైన మరియు దృఢమైన మూలాలను కలిగి ఉంది.ఈ ప్రదేశాన్ని సందర్శించే పర్యాటకులు అమితానంద చెందడమే కాదు, తర్వాత సంవత్సరానికి ఒక్కసారైనా హైద్రబాద్ కు ప్రయాణం చేయాలని కోరుకుంటారు. హైద్రాబాద్ లో షాపింగ్ కు పెట్టింది పేరు, ముఖ్యంగా హైద్రాబాద్ గాజులు, ముత్యాలు, స్ట్రీట్ ఫుడ్, మసీదులు, దేవాలయాలు, పురాతన కలళలకు, హస్తకళలు, న్యాట్యం ఇలా వేటికవి ప్రసిద్ది.

ఇంకా చెప్పాలంటే హైద్రాబాద్ అనగానే మనకు వెంటనే గుర్గొచ్చేవి చార్మినార్, హుస్సేన్ సాగర్ లోని బుద్దుడి విగ్రం, బిర్లా టెంపుల్. ఇవి బాగా ఫేమస్ అయినవి కాబట్టి, మనకు తెలుసు, కానీ, మనకు తెలియని మరికొన్నికొన్ని అందమైన ప్రదేశాలు హైద్రాబాద్ లో ఉన్నాయి. ఈ ప్రదేశాలను తప్పక సందర్శించాలి. ఆ ప్రదేశాలేంటో ఒక్కసారి తెలుసుకుందాం..

1. గోల్కొండ కోట:

1. గోల్కొండ కోట:

హైద్రాబాద్ మూసీ నది ఒడ్డున ఉంది. కుతుబ్ షాహీ వంశస్తుడైన మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించాడు. ఈ కోట నిర్మాణం ఎత్తు 400 అడుగులు.ఈ చారిత్రక, పురావస్తు కట్టడాలను చూడటానికి పర్యాటకులకు ప్రధానఆకర్షణగా నిలిచింది. ఈ గోల్కొండ కోటను షెపర్డ్స్ హిల్స్ అని కూడా పిలువడుతుంది. ఈ గోల్కొం కోట కేవలం పర్యాటక ఆకర్షణకే కాదు, చక్కటినిర్మాణ శైలికి మంచి ఉదాహరణ. ఈ కోట హైద్రాబాద్ కు 11కి.మీ దూరంలో ఉంది.

PC: Ritwick Sanyal

2.చౌమహల్లా ప్యాలెస్ :

2.చౌమహల్లా ప్యాలెస్ :

చౌమహల్లా ప్యాలెస్ (నాలుగు మహాళ్ళు)హైద్రాబాద్ రాష్ట్రంలోని నిజాం యొక్క నివాసం.చౌ అంటే నాలుగు, మహాల్లా అంటే రాజభవనాలు . నాలుగు రాజభవనాలు కలిగినది అని అర్థం. ఈ ప్యాలెస్ ఇరాన్ లోని ట్రెహ్రాన్ షా ప్యాలెస్ ను పోలి ఉంటుంది. ఈ ప్యాలెస్ లో ఆడుగు పెట్టగానే అందమైన తోటలు, ఆకుపచ్చని గడ్డితో స్వాగతం పలుకుతాయి. ఈ ప్యాలెస్ లో మరో ప్రత్యేకత ఉంది, ఈ ప్యాలెస్ నిర్మించనప్పుడు స్థాపించిన ఖివాత్ క్లాక్ టిక్కింగ్ శబ్ధం ఇప్పటికీ వినపడుతూనే ఉంటుంది. ఈ రాజభవనంలో ఆకుపచ్చని పచ్చిక మైదానం పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది. ప్యాలెస్‌లో కళాత్మకంగా చెక్కబడిని కళాస్తంభాలు, ప్యాలెస్‌ ముందు భాగంలో భారీ నీటి ఫౌంటెన్‌ చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి. రాజభవనం గోడలు, పై కప్పుపై గాజుతో సున్నితంగా చెక్కిన చెక్కడాలు చాలా కళాత్మకంగా వుంటాయి.

PC:NIKHIL JAIPURIA

3. చార్మినార్:

3. చార్మినార్:

హైద్రాబాద్ కు పర్యాటకులు వచ్చేవారికి చార్మినార్ మరియు బిర్యానీ రెండూ చూడకుండా టూర్ పూర్తికాదు. ఎలాంటి సందేహం లేకుండా హైద్రాబాద్ కు ఒక ప్రత్యేక స్థానం కల్పించని ప్రదేశాల్లో ముక్యమైన ల్యాండ్ మార్క్ కలిగి చార్మినార్. ఈ స్మారక చిహ్నాన్ని మహమ్మద్ కులి కుతుబ్ షా క్రీ.శ. 1591 నిర్మించారు. ఈ మ్యూజియం ఇండో-ఇస్లామిక్ శిల్ప శైలిలో మూసి నది ఒడ్డున నాలుగు ముఖద్వారాలతో నిర్మించబడింది. చార్మినార్ కు దగ్గర్లో లాడ్ బజార్ చాలా ఫేమస్ . ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. అలాగే మక్కా మసీద్ ను కూడా సందర్శించవ్చు.

PC: Drprashanthmada

4. పైగా టూంబ్స్ అద్భుతం:

4. పైగా టూంబ్స్ అద్భుతం:

పైగా రాజవంశీకులకు చెందిన టూంబ్స్ (పైగా సమాధులు) పాలరాతితో నిర్మించడం వల్ల అక్కడకు వచ్చే పర్యాటకులకు ఆకట్టుకుంటాయి. అంతే కాదు ఇక్కడ మలచిన సమాదులపై , గోడలపై చెక్కిన రేఖా గణిత రూపాలు, పొడవైన స్థంభాలపై ఏర్పాటు చేసిన జాలిపనులు చూస్తే పర్యాటకులు అబ్బురపోవడం కాయం.
PC: Arvind Ramachander

5. బిర్లా మందిరం:

5. బిర్లా మందిరం:

రామక్రిష్ణ మిషన్ కు సంబంధించిన స్వామి రంగనాథనంద బిర్లా మందిర్ ను నిర్మించారు. బిర్లా మందిర్ స్వామి విష్ణుమూర్తికి అంకితం చేయడం జరిగింది. ఈ మందిరాన్ని నౌబథ్ పహాడ్ అనే చిన్న కొండ మీద నిర్మించారు.మనస్సుకు ప్రశాంతత కలిగించే విధంగా తెల్లని చలువరాతి రాళ్లతో నిర్మించడం వల్ల పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది.
PC: steeliee

6. విసా బాలాజీ టెంపుల్:

6. విసా బాలాజీ టెంపుల్:

బాలాజీ వెంకటేశ్వరుని స్వామి నామాల్లో ఒకటి విసా బాలాజీ. అలాగే చిలుకూరు బాలాజీ అని కూడా పిలుస్తా. ఎందుకంటే ఇక్కడ మొక్కుకొంటే త్వరగా వీసా వస్తుందరి చాలా మంది భక్తుల నమ్మకం. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకవోడానికి అక్కడి స్థానికులు మాత్రమే కాదు, చుట్టు ప్రక్కల ప్రదేశాల వారు, పర్యాటకులతో నిత్యం రద్దీగా ఉంటుంది.

PC: Adityamadhav83

7.నెహ్రు జులాజికల్ పార్క్ లో జంగల్ సవారీ:

7.నెహ్రు జులాజికల్ పార్క్ లో జంగల్ సవారీ:

ఈ పార్క్ ను 1959లో ఏర్పడినది. ఈ పార్క్ అందమైన సృష్టి ప్రకృతి దగ్గరగా సమయం గడపడానికి ఒక గొప్ప మార్గం. హైద్రాబాద్ కు వచ్చే పర్యాటకులు సందర్శించే ప్రదేశాలలో నెహ్రూ జూలాజికల్ పార్క్ తప్పకుండా ఉంటుంది.ఈ భాగ్య నగరానికి తలమానికంగా నిలుస్తోన్న ఈ జూపార్క్ దేశంలోనే అతి పెద్ద పార్క్. ఈ పార్క్ లో దాదాపు పదిహేను జాతుల పక్షులు, జంతువులు ఆవాసం ఉంటున్నాయి. పిల్లలకు మరియు పెద్దలకు ఇది ఒక మంచి పర్యాటక ప్రదేశం.

PC: ManojKRacherla

8. హుసేన్ సాగర్ లేక్:

8. హుసేన్ సాగర్ లేక్:

మనస్సుకు ప్రశాంత కలిగించే ప్రదేశం హుసేన్ సాగర్ ? ప్రతి రోజూ సాయంత్రాల్లో ఇక్కడ వందల కొద్ది పర్యాటకులు, స్థానికులు ప్రశాంత వాతావరణం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఈ లేక్ ను హజ్రత్ హుసేన్ షా 1562లో నిర్మించడం వల్ల ఈ లేక్ కు ఆ పేరు వచ్చింది. ఇక్కడ లేక్ లో 32 అడుగులు పొడవున్న బుద్దుని విగ్రహం ఉంది. ఆ విగ్రం హుసేన్ సాగర్ కు అద్భుతమైన ఆకర్షణగా నిలించింది.

PC:Jagadeesh, Posni

9. లాడ్ బజార్ :

9. లాడ్ బజార్ :

హైద్రాబాద్ ఓల్డ్ సిటిలో ఉన్న లాడ్ బజార్ లేదా చూడి బజార్ షాపింగ్ చేయడానికి అందమైన డిజైన్లతో ముస్తాబయిన గాజులకి ప్రసిద్ధి. ఈ బజార్ చాలా పురాతనమైనది. ఈ ప్రదేశం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. చార్మినార్ మరియు చౌమఅల్లాహ్ ప్యాలెస్ కు సమీపంలో ఉండటం వల్ల ఈ ప్రదేశాన్ని సందర్శించడం చాలా సులభం. ఇక్కడ గాజులకే కాదు, ముత్యాలకు, అమెరికన్ వజ్రాలతో పొదగబడిని లాకెర్ లేదా లాడ్ గాజులకు ప్రసిద్ది. హైద్రాబాద్ పర్యటనకు వచ్చేవారు, ఈ ప్రాంతాన్ని సందర్శించకుండా వెళ్ళడం మాత్రం బాధాకరమైన విషయం.


PC: Abhinaba Basu

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X